శాంతి సందేశం

విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) వారి ప్రభవన కాలానికి ప్రజలు సృష్టికర్త, విశ్వప్రభువును కాదని సృష్టితాలను విగ్రహాలను పూజించేవారు. బహుదైవారాధనకు సంబంధించిన మూఢనమ్మకాలు, ఆచారాలు పెచ్చరిల్లి ఉండేవి. మహిమల ప్రదర్శన పేరుతో బూటకపు స్వాములు సామాన్య ప్రజల్ని మోసం చేసేవారు. మరణానంతరం విశ్వ ప్రభువు సన్నిధిలో తాము చేస్తున్న కర్మల విచారణ జరుగుతుందని విశ్వసించేవారు కారు. ఫలితంగా నీతిబాహ్యత అన్ని వైపులా విస్తరించి ఉండేది. మద్యపాన సేవనం, వ్యభిచారం, జూదం విం వ్యసనాల మూలంగా కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమయి ఉండేది. సమాజంలో అన్యాయం, అక్రమాలు, అరాచకత్వం రాజ్యమేలేవి. ధనవంతులు పేదవారిని దోచుకునేవారు. బలవంతులు బలహీనుల్ని పీడించేవారు. కసాయి తండ్రులు తమ ఆడబిడ్డల్ని సజీవంగా మట్టిలో పూడ్చిపెట్టే వారు. జనుల్లో సహనం ఓర్పు ఉండేది కాదు. ఎవరో ఏదో అన్నారని కసిని పెంచుకునే వారు. ప్రతీకార భావంతో ఒక తెగ మరో తెగ వారి పై దాడులు జరిపేవారు. వారి సంపదను దోచుకునేవారు. వారి స్త్రీలను దాసీలుగా చేసుకునేవారు.

.ఈ విశ్వం యావత్తూ ఇందులో ఉన్న సమస్తమూ విశ్వప్రభువు అయిన అల్లాహ్‌దే. ఆయనే సృష్టికర్త, పోష కుడు, పాలకుడు, నిజప్రభువు. ఆయన ముందరే అందరూ తల వంచాలి. ఆయననే ప్రార్థించాలి. ఆయనకే విధేయులై ఉండాలి. ఆయననే ఆరాధించాలి. ఆయన ఆజ్ఞల్నే పాలించాలి.

అలాంటి పరిస్థితిల్లో కారుణ్య ప్రభువు అల్లాహ్‌ అరబ్బు దేశంలోని పవిత్ర మక్కా నగరంలో అనాధగా పుట్టి అనాధగానే పెరిగి మానధనుడిగా పేదల పెన్నిధిగా అనాధలను ఆదరించే వారిగా సమాజ శ్రేయోభిలాషిగా పేరు పొంది, సత్య సంధుడు (సాదిఖ్‌) విశ్వసనీ యుడు (అమీన్‌)గా బిరుదులు పొందిన ముహమ్మద్‌ (స)ను తన అంతిమ సందేశహరుడిగా ప్రవక్తగా చేసి పంపాడు. ఆయన (స)పై తన దివ్యవాణి ఖుర్‌ఆన్‌ను అవతరింప జేశాడు. అల్లాహ్‌ా ప్రవక్త ముహమ్మద్‌ (స) దివ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ వచనాలను పఠిస్తూ జనులకు ఇస్లాం(శాంతి) సందేశం ఇచ్చారు. ఆయన (స) ఇచ్చిన సందేశం కొత్తది ఎంత మాత్రం కాదు. గతంలో హజ్రత్‌ నూహ్‌ (అ) హజ్రత్‌ ఇబ్రాహీం (అ) హజ్రత్‌ మూసా (అ) హజ్రత్‌ ఈసా (అ)- వీరందరిపై శాంతి శుభాలు వర్షించుగాక! మొదలగు దైవ సందేశహరులు ప్రపంచమానవులకు ఇదే సందేశం ఇచ్చారు.

1) సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి; సృష్టితాలను కాదు:

అల్లాహ్‌ ప్రవక్త ముహమ్మద్‌ (స) విగ్రహారాధన, బహుదైవారా ధనను ఖండిస్తూ ముక్కలైన మానవ సమాజాన్ని ఏకం చేయడానికి ఏక దైవారాధనా సందేశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సందేశం ఏమి టంటే; ఓ దైవదాసులారా! సృష్టితాలను ఆరాధించడం, విగ్రహాలను పూజించడం మానివేయండి. ఈ విశ్వం యావత్తూ ఇందులో ఉన్న సమస్తమూ విశ్వప్రభువు అయిన అల్లాహ్‌దే. ఆయనే సృష్టికర్త, పోష కుడు, పాలకుడు, నిజప్రభువు. ఆయన ముందరే అందరూ తల వంచాలి. ఆయననే ప్రార్థించాలి. ఆయనకే విధేయులై ఉండాలి. ఆయననే ఆరాధించాలి. ఆయన ఆజ్ఞల్నే పాలించాలి.
ఆయనపైనే ఆశలుపెట్టుకోవాలి. ఆయనకే భయపడాలి. దాస్యానికి విధేయతకు అర్హుడు ఆయన ఒక్కడే. కనుక ఆయనకు సాటి సమానులుగా ఎవరినీ నిలబెట్టకండి. ఆయన్ని కాదని ఎవరి దాస్యమూ చేయ కండి. సృష్టికర్తను విస్మరించి సృష్టితాలను పూజించడం సృష్టికర్తకు సృష్టితాలలో నుండి ఎవరినైనా భాగస్వామిగా ఎంచడం క్షమించరాని నేరం.

2) పాపాలను విడనాడండి, పరిశుద్ధ జీవితం గడపండి:

అల్లాహ్‌ ప్రవక్త ముహమ్మద్‌ (స) మానవుల తప్పుడు జీవన సిద్ధాంతాలను ఖండించారు. వారి జీవితాలను సంస్కరించడానికి, జనుల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి ప్రయత్నించారు. ఆయన ఇచ్చిన సందేశాన్ని గమనించండి. ప్రజలారా! నిత్యం సత్యమే పల కండి. న్యాయానికి కట్టుబడి ఉండండి. దాతృగుణం అలవరచుకోండి. పీడితుల పట్ల దయ సానుభూతి చూపండి. పాపకార్యాలకు దూరంగా ఉంటూ పరిశుద్ధమయిన జీవితం గడపండి. అన్యాయాలు అక్రమాలు, హత్యాకాండలు, శీలాపహరణాలు, మద్యపానం, వడ్డీవ్యాపారం, జూదం, వ్యభిచారం, దొంగతనాలు – ఇవన్నీ సమాజంలో అశాంతికి మానవ వినాశానికి దారి తీస్తాయి. మీ ప్రభువు అల్లాహ్‌ా వీటన్నిం నీ అసహ్యించుకుాండు. కనుక వీటిని విడనాడండి. ప్రశాంతంగా జీవించండి. తోటి మానవుల్ని కూడా ప్రశాంతంగా జీవించనివ్వండి.

3) బంధుత్వసంబంధాలను బలపరచండి; సత్‌ సమాజ నిర్మాణానికి పునాది వేయండి:

అల్లాహ్‌ా ప్రవక్త ముహమ్మద్‌ (స) తన బోధనల ద్వారా మానవుల మధ్యన సంబంధాలను బలపరిచారు. ఉత్తమ సమాజ నిర్మాణానికి పునాది వేశారు. ఆయన (స) ఏమన్నారో గమనించండి. జనులారా! తల్లిదండ్రులను గౌరవించండి. వారికి విధేయత చూపండి. ముసలిత నంలో వారి సేవ చేయండి. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది. తండ్రి స్వర్గానికి ద్వారం. వారిని బాధ పెట్టకండి. వారు మీ ఎడల సంతుష్టు లయితే మీ ప్రభువు అల్లాహ్‌ా ప్రసన్నతను పొందగలరు. బంధువులు, బాట సారులు, అనాధల హక్కులను నెరవేర్చండి. అల్లాహ్‌ అనుగ్రహిం చిన ధనాన్ని దూబారా ఖర్చు చేయకండి. సమాజంలోని నిరు పేదలకు, వితంతువులకు, అనాథలకు, అగత్య పరులకు, బాటసారు లకు ఇవ్వండి. నిష్కారణంగా ఎవరినీ హత్య చేయకండి. తోటి మానవులను ఆదరించండి. వారిని గౌరవంగా, సురక్షితంగా బ్రతకనివ్వండి.

4) అంటరానితనం అమానుషం; మానవులందరూ అల్లాహ్‌ దాసులే:

అల్లాహ్‌ ప్రవక్త ముహమ్మద్‌ (స) సమాజంలో మనిషి మనిషికీ మధ్య ఉన్న ఉచ్చ నీచ తారతమ్యానికి, నిమ్నోన్నతా భావాలకు అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వర్గ వర్ణ భాష ప్రాంతీయ దురభిమానాలు కేవలం మూర్ఖత్వమని మానవతకే ఓ కళంకమని నిరసించి వాిని రూపు మాపానికి పూనుకున్నారు. ఆయన ఇచ్చిన సందేశాన్ని ఆలకించండి. జనులారా! మీరంతా ఆదం సంతానమే.
మీరంతా అల్లాహ్‌ దృష్టిలో సమానులే. ఎవరిదీ తుచ్ఛమైన పుట్టుక కాదు, ఎవరూ అంటరానివారు కారు. ఇంకా పుట్టుక రీత్యా ఎవరూ ఉత్తములూ పావనులూ కారు. అల్లాహ్‌ా పట్ల విశ్వాసం, అల్లాహ్‌ా ఎడల భయభక్తులు కలవారు, మాటల్లో చేతల్లో నిజాయితీ పరులైన వారే అల్లాహ్‌ా దృష్టిలో గౌరవనీయులు, ఉత్తములు, ప్రశంసనీయులు. కనుక సాటి మనిషిని ప్రేమించండి. సమాజంలోని పెద్దలను ఆదరించండి. పసి పిల్లలపై మహిళామణులపై కనికరం చూపండి. మావారు మీవారు అన్న తార తమ్యాన్ని విడనాడండి. సమాజంలో శాంతి సామరస్యాలకు పునాది వేయండి.

5) మరణానంతరం దైవసన్నిధిలో మీ కర్మలను గురించి విచారణ జరుగుతుంది:

అల్లాహ్‌ా ప్రవక్త ముహమ్మద్‌ (స) దుర్మార్గం దౌర్జన్యాలతో, అవినీతి అక్రమాలతో, మతోన్మాదం మారణహోమాలతో, త్రాగుడు జూదాలతో, అశ్లీలత అసభ్యతతో, వ్యభిచారం లైంగిక విచ్చలవిడితనాలతో కంపుకొడుతున్న సమాజాన్ని పరిశుద్ధపరచడానికి పరలోకంలో జవాబుదారీ భావనను జనింపజేశారు.
ఆయన (స) ఇలా బోధించారు: జనులారా! ఈ ప్రాపంచిక జీవితం శాశ్వతం కాదు. మరణానంతరం ఒక నిర్ణీత దినాన మీరంతా మీ నిజ ప్రభువు అల్లాహ్‌ా ముందు హాజరు కావలసి ఉంది. ఆయన న్యాయస్థానంలో మీ కర్మల విచారణ జరుగుతుంది. అదే తీర్పు దినం. ఆ రోజు మీరు ఏదీ దాచడానికి వీలుపడదు. ఎందుకంటే అల్లాహ్‌ా అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన దూతలు మీ ప్రతి కర్మను నమోదు చేస్తూ ఉన్నారు. మీ జీవితపు కర్మల పత్రం మొత్తం ఆయన ముందు ప్రత్యక్షంగా ఉంటుంది. మీరు చేసిన సత్కార్యాలు, మీరు చేసిన దుష్కార్యాల ఆధారంగా మీ భవితవ్యం నిర్ణయించ బడుతుంది. పరమ న్యాయశీలుడైన అల్లాహ్‌ా న్యాయస్థానంలో వ్యాపార లావాదేవీలు పనికిరావు. స్నేహబంధాలు ఉపయోగపడవు. సిఫారసులు చెల్లవు. కేవలం నిష్కల్మష మైన దైవ విశ్వాసం, చిత్తశుద్ధిగల సత్కర్మలే మీకు ఉపయోగ పడతాయి. తీర్పుదినాన విశ్వప్రభువు అల్లాహ్‌ా విశ్వాసులను, సదాచార సంపన్నులను మాత్రమే ఇష్టపడతాడు. వారిని శాశ్వత సుఖాలకు నిలయమయిన తన స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. అవిశ్వాసులను, పాపాత్ములను భగభగమండే నరకంలో పడవేస్తాడు.

ప్రతిఘటన – శాంతి స్థాపన:

అల్లాహ్‌ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇస్లామీయ సందేశ ప్రచారం ప్రారంభించగానే పూర్వం తనను ఎంతగానో అభిమానించే బంధుమిత్రులు, గౌరవించే తెగ ప్రజలు, వీధివాళ్ళు తనకు శత్రువులయిపోయారు.అడుగడు గునా ఆయనకు ఇబ్బందులే ఎదురయ్యాయి. కడకు సత్య తిరస్కారులు ఆయన్ను అంతమొందించి సమాజంలో తమకు ఉన్న బూటకపు గౌరవోన్న తులను కాపాడుకోవాలనుకున్నారు. అల్లాహ్‌ా ప్రవక్త ముహమ్మద్‌ (స) పవిత్ర మక్కా పురంలో 13 ఏండ్లు, మదీనాలో 10 ఏండ్లు తీవ్రమయిన పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారే కాని సత్యసందేశ ప్రచారం మాత్రం మానుకోలేదు. చివరకు సత్యమే గెలిచింది. అసత్యం ఓడి పోయింది. శాంతి స్థాపన జరిగింది. జనుల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లభించింది. అల్లాహ్‌ ప్రవక్త ముహమ్మద్‌ (స) అనుయాయులు ప్రపంచ నలుమూలల్లో వ్యాపించారు. లోకవాసులకు శాంతి (ఇస్లాం) సందేశం ఇచ్చారు. వారు చేసిన త్యాగాల ఫలితమే నేడు ప్రపంచ దేశాలలో సృష్టికర్త, విశ్వప్రభువు అయిన అల్లాహ్‌ాను ఆరాధించేవారు, అంతిమదైవ ప్రవక్త, మానవమహోపకారి ముహమ్మద్‌ (స) వారిని అనుసరించేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు.

Related Post