అర్థం చేసుకోవాలి; అపార్థం కాదు!

Originally posted 2014-05-15 20:03:04.

"భారతదేశం వైపు సృష్టికర్త యొక్క ఏ దివ్యసందేశం పంపబడింది, వేదాలను మరియు హిందూ ధర్మ దివ్యగ్రంథాలను మనం సృష్టికర్త యొక్క దివ్యసందేశాలుగా పరిగణించవచ్చా లేదా?" అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతున్నది. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో భారతదేశం వైపు పంపబడిన దివ్యసందేశం పేరు తెలిపే ఒక్క వచనం కూడా పేర్కొనబడలేదు. వేదాల మరియు ఇతర హిందూ ధర్మ దివ్యగ్రంథాల పేర్లు ఖుర్ఆన్ లో మరియు సహీహ్ హదీథులలో ఎక్కడా పేర్కొనబడక పోవటం వలన, ఖచ్ఛితంగా అవి కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలే అని ఎవ్వరూ చెప్పలేరు. అవి సృష్టికర్త యొక్క దివ్యసందేశాలు కావచ్చు, కాకపోవచ్చు.

“భారతదేశం వైపు సృష్టికర్త యొక్క ఏ దివ్యసందేశం పంపబడింది, వేదాలను మరియు హిందూ ధర్మ దివ్యగ్రంథాలను మనం సృష్టికర్త యొక్క దివ్యసందేశాలుగా పరిగణించవచ్చా లేదా?” అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతున్నది. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో భారతదేశం వైపు పంపబడిన దివ్యసందేశం పేరు తెలిపే ఒక్క వచనం కూడా పేర్కొనబడలేదు. వేదాల మరియు ఇతర హిందూ ధర్మ దివ్యగ్రంథాల పేర్లు ఖుర్ఆన్ లో మరియు సహీహ్ హదీథులలో ఎక్కడా పేర్కొనబడక పోవటం వలన, ఖచ్ఛితంగా అవి కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలే అని ఎవ్వరూ చెప్పలేరు. అవి సృష్టికర్త యొక్క దివ్యసందేశాలు కావచ్చు, కాకపోవచ్చు.

ప్రశ్న : ముస్లింలు, ముస్లిమేతరుల్ని “కాఫిర్” అనే చెడ్డ పేరుతో ఎందుకు పిలుస్తారు?
జవాబు : “కాఫిర్” అనే పదానికి అర్ధం నిరాకరించేవాడు :
“కాఫిర్” అనేది అరబ్బీ భాషలోని “కుఫర్” అనే పదంతో ఏర్పడింది .

“కూఫ్ర్” అంటే దాచేయటం లేక నిరాకరించటం అని అర్ధం. ఇస్లామియా పరిభాషలో ఇస్లాం సత్యతను, దాని వాస్తవికతను దాచేసే లేక నిరాకరించే వ్యక్తి “కాఫిర్” అనబడతాడు. ఆంగ్లంలో ఈ నిరాకరించే వ్యక్తి కోసం (ముస్లిమేతరుడు) non muslim అనే పదం వాడుకలో ఉంది.

ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆరాధిస్తారనేది నిజమేనా?
కాదు, ముమ్మాటికీ కానే కాదు. క్రైస్తవులు ఏసుక్రీస్తును ఆరాధిస్తారు. కాబట్టి వారు క్రైస్తవులని పిలవబడుతున్నారు. ముస్లింలు కేవలం ఏకైకుడు, అద్వితీయుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంత మాత్రమూ ఆరాధించరు. అందువలన వారు ముహమ్మదీయులు అని పిలవబడరు. ముస్లింలు అల్లాహ్ ఆజ్ఞలను పూర్తిగా శిరసావహిస్తారు. అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా, అల్లాహ్ కు విధేయత చూపుతూ, అల్లాహ్ అభీష్టానికి మనస్పూర్తిగా తమ ఇచ్ఛను సమర్పించుకుని జీవితపు ప్రతి అడుగూ వేస్తారు. కాబట్టి వారు ముస్లింలని పిలవబడతారు. (భాషాపరంగా ముస్లింలంటే సమర్పించుకున్నవారు).

ప్రతి కాలంలో అల్లాహ్ తన దివ్యసందేశాన్ని పంపి ఉంటే, మరి భారతదేశానికి ఏ దివ్యసదందేశం పంపబడింది ? వేదాలను మరియు ఇతర హిందూ దివ్యగ్రంథాలను మనం అల్లాహ్ యొక్క దివ్యసందేశాలుగా పరిగణించవచ్చా ?
ప్రతి కాలంలో దివ్యసందేశం పంపబడింది
13వ అధ్యాయమైన రాద్ సూరహ్ లోని 38వ వచనంలో ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది

“ప్రతి కాలం కొరకు ఒక దివ్యసందేశం పంపబడింది. [దివ్యఖుర్ఆన్ 13:38]

ఖుర్ఆన్ లో నాలుగు దివ్యసందేశాల పేర్లు పేర్కొనబడినాయి.
ఖుర్ఆన్ లో అల్లాహ్ కేవలం నాలుగు దివ్యసందేశాల పేర్లను మాత్రమే పేర్కొన్నాడు, అవి తౌరాహ్, జబూర్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్.

తౌరాహ్ దివ్యసందేశం మోసెస్ (మూసా అలైహిస్సలాం) పై అవతరించబడింది. జబూర్ దివ్యసందేశం డేవిడ్ (దాఊద్ అలైహిస్సలాం) పై అవతరించబడింది. ఇంజీల్ దివ్యసందేశం జీసస్ (ఈసా అలైహిస్సలాం) పై అవతరించబడింది. మరియు చిట్టచివరి మరియు అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్, చిట్టచివరి మరియు అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడింది.
పూర్వ దివ్యసందేశాలన్నీ ఆయా ప్రజల కొరకు మాత్రమే పంపబడినాయి.
ఖుర్ఆన్ కు పూర్వం అవతరించబడిన దివ్యసందేశాలన్నీ ఆయా ప్రజల కొరకు మాత్రమే పంపబడినాయి మరియు వారు నిర్ణీత కాలం వరకు మాత్రమే వాటిని అనుసరించడం జరిగింది.
మొత్తం మానవజాతి కొరకు దివ్యఖుర్ఆన్ పంపబడింది
ఖుర్ఆన్ చిట్టచివరి మరియు అంతిమ దివ్యసందేశం కావటం వలన, అది ముస్లింలు మరియు అరబ్బుల కొరకు మాత్రమే కాకుండా, మొత్తం మానవజాతి కొరకు పంపబడింది. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా పేర్కొనబడింది:
సూరహ్ ఇబ్రాహీం, 14వ అధ్యాయం 1వ వచనం.
“అలిఫ్, లామ్, రా. మేము అవతరింపజేసిన ఈ గ్రంథం మానవజాతిని అజ్ఞానపు అంధకారం నుండి బయటపడి వెలుగు వైపు వెళ్ళే దారి చూపుతుంది…” [Al-Qur’an14:1]
ఇలాంటి మరో సందేశం ఇదే అధ్యాయంలోని 52వ వచనంలో ఉన్నది
“ఇది మానవజాతి కొరకు పంపబడిన సందేశం: దీనిలోని హెచ్చరికలను వారు గ్రహించాలి మరియు ఆయన ఏకైక దైవమని వారు తెలుసుకోవాలి: అర్థం చేసుకున్నవారు కాపాడుకోవాలి.” [దివ్యఖుర్ఆన్ 14:52]
2వ అధ్యాయం అయిన సూరహ్ అల్ బఖరహ్ లోని 185వ వచనంలో ఇలా పేర్కొనబడింది
“రమదాన్ నెలలో మేము మానవజాతి కోసం, స్పష్టమైన మార్గదర్శకంగా మరియు (మంచి చెడుల మధ్య సరిగ్గా) తీర్మానం చేసిదిగా ఖుర్ఆన్ గ్రంథాన్ని పంపాము. ” [దివ్యఖుర్ఆన్ 2:185]

ఇలాంటి సందేశమే 39వ అధ్యాయం అయిన సూరహ్ అజ్జుమర్ లోని 41వ వచనంలో పేర్కొనబడింది.
“నిస్సందేహంగా, మా
భారతదేశం వైపు ఏ దివ్యసందేశం పంపబడింది?
“భారతదేశం వైపు సృష్టికర్త యొక్క ఏ దివ్యసందేశం పంపబడింది, వేదాలను మరియు హిందూ ధర్మ దివ్యగ్రంథాలను మనం సృష్టికర్త యొక్క దివ్యసందేశాలుగా పరిగణించవచ్చా లేదా?” అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతున్నది. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో భారతదేశం వైపు పంపబడిన దివ్యసందేశం పేరు తెలిపే ఒక్క వచనం కూడా పేర్కొనబడలేదు. వేదాల మరియు ఇతర హిందూ ధర్మ దివ్యగ్రంథాల పేర్లు ఖుర్ఆన్ లో మరియు సహీహ్ హదీథులలో ఎక్కడా పేర్కొనబడక పోవటం వలన, ఖచ్ఛితంగా అవి కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలే అని ఎవ్వరూ చెప్పలేరు. అవి సృష్టికర్త యొక్క దివ్యసందేశాలు కావచ్చు, కాకపోవచ్చు.

ఒకవేళ వేదాలు కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలైనా, ఈనాడు మనం తప్పకుండా ఖుర్ఆన్ ను మాత్రమే అనుసరించవలసి ఉంది.
ఒకవేళ వేదాలు మరియు ఇతర హిందూ ధర్మ దివ్యగ్రంథాలు కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలైనా, అవి ఆనాటి ప్రజల కోసం పంపబడినవే. వాటిని ఆ కాలంలో మాత్రమే అనుసరించవలసి ఉంది. ఈనాడు, భారతదేశంతో యావత్తు ప్రపంచంలోని మొత్తం ప్రజలందరూ సృష్టికర్త యొక్క చిట్టచివరి మరియు అంతిమ దివ్యగ్రంథం అయిన ఖుర్ఆన్ ను మాత్రమే అనుసరించవలసి ఉంది. అనంత కాలం కొరకు పంపబడక పోవటం వలన సృష్టికర్త ఆ ప్రాచీన దివ్యగ్రంథాలను వాటి అసలు రూపంలో భద్రంగా ఉండేలా కాపాడలేదు. దివ్యసందేశం అనే దావా చేస్తున్న ఏ ఒక్క దివ్యగ్రంథం కూడా అది ఏ ధర్మానికి చెందినదైనా, ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా దాని అసలు అవతరించిన రూపంలో ఈనాడు మిగిలి లేదు – ఒక్క ఖుర్ఆన్ తప్ప. అంతిమ దినం వరకు మార్గదర్శకత్వంగా పంపబడిన చిట్టచివరి దివ్యసందేశం కావడం వలన, ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా అవతరించబడిన అసలు రూపంలోనే భద్రంగా కాపాడే బాధ్యతను సృష్టకర్త తనే స్వయంగా తీసుకున్నాడు.

సూరహ్ అల్ హిజ్ర్ 15వ అధ్యాయం, 9వ వచనం.
“నిస్సందేహంగా, మేము సందేశాన్ని పంపాము; మరియు దానిని తప్పకుండా కాపాడతాము.” [ఖుర్ఆన్ 15:9]

ఇస్లాం ధర్మం ప్రకారం ప్రపంచంలోని ప్రతి జాతి కొరకు సందేశహరులు లేదా ప్రవక్త పంపబడితే, మరి భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడినారు ? శ్రీరామ్ మరియు శ్రీకృష్ణ లను అల్లాహ్ యొక్క ప్రవక్తలుగా మనం భావించవచ్చా?
ప్రతి జాతి కొరకు ప్రవక్తలు పంపబడినారు
35వ అధ్యాయమైన సూరతుల్ ఫాతిర్ లోని 24వ వచనంలో ఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది

“వారి మధ్య నివసిస్తూ, వారిని హెచ్చరించే ప్రవక్తను పంపని జాతి లేదు.” [దివ్యఖుర్ఆన్ 35:24]

అలాగే, 13వ అధ్యాయమైన సూరతుల్ రాద్ లోని 7వ వచనంలో ఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది

” మరియు ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక మార్గదర్శకత్వం.” [దివ్యఖుర్ఆన్ 13:7]

 

కొందరు ప్రవక్తల వృత్తాంతాలు మాత్రమే ఖుర్ఆన్ లో పేర్కొనబడినాయి.
దీని గురించి 4వ అధ్యాయమైన సూరతున్నిసా లోని 164వ వచనంలో అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు,

“కొందరు ప్రవక్తల వృత్తాంతం మేము పేర్కొన్నాము మరియు మరి కొందరు ప్రవక్తల వృత్తాంతం పేర్కొనలేదు” [దివ్యఖుర్ఆన్ 4:164]

40వ అధ్యాయమైన సూరతుల్ గాఫిర్ లోని 78వ వచనంలో ఇలాంటి సందేశమే మరలా ఇవ్వబడింది,
“మీ కంటే పూర్వం కూడా మేము ప్రవక్తలను పంపాము: వారిలో కొందరి గురించి ప్రస్తావించాము మరియు మరికొందరి గురించి ప్రస్తావించలేదు…”[దివ్యఖుర్ఆన్ 40:78]

 

అల్లాహ్ తన అంతిమ సందేశమైన ఖుర్ఆన్ లో 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే పేర్కొన్నాడు:
ఖుర్ఆన్ లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే పేర్కొనబడినాయి. ఉదాహరణకు ఆదమ్, నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్, ముహమ్మద్ ….

అల్లాహ్ యొక్క ప్రవక్తల సంఖ్య 1,24,000 కంటే ఎక్కువ :
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దాని ప్రకారం 124,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఈ ప్రపంచానికి పంపబడినారు.
అంతకు పూర్వం పంపబడిన ప్రవక్తలందరూ కేవలం తమ జాతి ప్రజల కొరకు మాత్రమే పంపబడినారు
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్వం పంపబడిన ప్రవక్తలందరూ కేవలం వారి స్వంత జాతి ప్రజల కొరకు మాత్రమే పంపబడినారు మరియు ఒక నిర్ణీత సమయం వరకే వారు అనుసరించబడినారు.
3వ అధ్యాయమైన సూరతుల్ ఆలే ఇమ్రాన్ లోని 49 వ వచనంలో ఇలా పేర్కొనబడింది

“మరియు ఇజ్రాయీల్ సంతతి కొరకు ఒక సందేశహరుడిగా, …” [దివ్యఖుర్ఆన్ 3:49]

 

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క చిట్టచివరి మరియు అంతిమ ప్రవక్త. 33వ అధ్యాయమైన సూరతుల్ అహజాబ్ లోని 40వ వచనంలో ఈ విషయం పేర్కొనబడింది,

“ముహమ్మద్ మీలో ఏ పురుషుడికీ తండ్రి కాదు, కానీ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తల పరంపర ముగించే సీలు వంటి వారు. మరియు అల్లాహ్ అన్నీ ఎరుగును.” [దివ్యఖుర్ఆన్ 33:40]

 

మొత్తం మానవజాతి కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడినారు
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త కావటం వలన, ఆయనను కేవలం అరబ్బుల కోసం లేదా కేవలం ముస్లింల కోసం మాత్రమే ప్రవక్తగా చేసి పంపలేదు. ఆయనను మొత్తం మానవజాతి కొరకు ప్రవక్తగా చేసి పంపడం జరిగింది.
ఖుర్ఆన్ లోని 21వ అధ్యాయమైన సూరతుల్ అంబియాలోని 107వ వచనంలో దీని గురించి ఇలా పేర్కొనబడింది

“సృష్టి మొత్తం కొరకు పంపబడినదే మీ కోసం కూడా పంపాము.” [దివ్యఖుర్ఆన్ 21:107]
ఇలాంటి సందేశమే 34వ అధ్యాయమైన సబా సూరహ్ లోని 28వ వచనంలో మరలా పేర్కొనబడింది
“మేము యావత్తు ప్రపంచం కోసం సందేశహరుడిని పంపాము. వారికి శుభవార్తనివ్వమనీ మరియు హెచ్చరించమనీ, కానీ అనేక మంది గ్రహించరు.” [దివ్యఖుర్ఆన్ 34:28]
సహీహ్ బుఖారీలో ఈ హదీథు నమోదు చేయబడింది
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా పలికారు,

“ప్రతి ప్రవక్త అతడి జాతి కొరకు మాత్రమే పంపబడినాడు, కానీ నేను మొత్తం మానవజాతి కొరకు ప్రవక్తగా పంపబడినాను.”
మరి భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడినారు ?
భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడినారు, శ్రీరామ్ లేదా శ్రీకృష్ణ లు కూడా అల్లాహ్ యొక్క ప్రవక్తలేనని పరిగణించవచ్చా అనే ప్రశ్నలకు ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలలో) భారతదేశానికి పంపబడిన ప్రవక్త పేరు పేర్కొనబడిన వచనం ఏదీ లేదు. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో శ్రీరామ్ మరియు శ్రీకృష్ణ పేర్లు పేర్కొనబడటం వలన వారు నిజంగా అల్లాహ్ యొక్క ప్రవక్తలేనా కాదా అనే విషయం గురించి ఎవ్వరూ నిర్ధారించలేరు. కొందరు ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం రాజకీయ నాయకులు హిందువుల మెప్పు సంపాదించడానికి శ్రీరామ్ అలైహిస్సలాం అంటే అల్లాహ్ యొక్క శాంతి ఆయనపై కురుయుగాక అని అంటున్నారు. ఇలా పలకడం తప్పు, ఎందుకంటే ఆయన ప్రవక్త అని నిర్ధారించే ఎలాంటి ఋజువులూ ఖుర్ఆన్ లో మరియు సహీహ్ హదీథులలో లేవు. కాబట్టి, వారు అల్లాహ్ యొక్క ప్రవక్తుల కావచ్చు లేదా కాకపోవచ్చు. అయితే వారు కూడా అల్లాహ్ యొక్క ప్రవక్తలు అయి ఉండవచ్చేమో అని ఊహించడంలో ఎలాంటి తప్పూ లేదు.
ఒకవేళ శ్రీరామ్ మరియు శ్రీకృష్ణ కూడా ప్రవక్తలేనని భావించినా, మనం ఈనాడు అంతిమ ప్రవక్త అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మాత్రమే అనుసరించవలసి ఉంది. ఒకవేళ శ్రీరామ్ మరియు శ్రీకృష్ణ కూడా ప్రవక్తలే అయినా, వారు అప్పటి ప్రజల కొరకు మాత్రమే పంపబడినారు మరియు కేవలం ఆనాటి ప్రజలు మాత్రమే వారిని అనుసరించవలసి ఉంది. ఈనాడు, భారతదేశంతో పాటు యావత్తు ప్రపంచంలోని మొత్తం మానవజాతి, ఇహపరలోకాల సాఫల్యం కోసం మనందరి సృష్టికర్త యొక్క చిట్టచివరి మరియు అంతిమ ప్రవక్త అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మాత్రమే అనుసరించ వలసి ఉంది.
నమాజు కొరకు పిలిచే అదాన్ పిలుపులో ముస్లింలు అక్బర్ చక్రవర్తి పేరు ఎందుకు పేర్కొంటారు?
అదాన్ పిలుపులో అక్బర్ చక్రవర్తి పేరు పేర్కొనబడుతుందని ముస్లిమేతరులు అపార్థం చేసుకున్నారు.
ఒకసారి నేను కేరళ రాష్ట్రంలో ఒక కాన్ఫరెన్సులో హాజరయ్యాను. అక్కడ నా ప్రసంగం కంటే ముందు ఒక ముస్లిమేతర మినిష్టర్ గారు ప్రసంగించారు. భారత దేశంలో ముస్లింలు సాధించిన కార్యములు మరియు భారత ప్రగతిలో వారి పాత్ర గురించి ప్రధానంగా పేర్కొన్నారు. అక్బర్ చక్రవర్తి భారతీయ రాజులలో అత్యంత గొప్పవాడు కావడం వలన ముస్లింలు ప్రతిరోజూ ఐదు సార్లు నమాజు కొరకు పిలిచే పిలుపులో ఆయన పేరు పేర్కొనడం అద్భుతమైన విషయం అని ఆయన చెప్పినారు. అయితే, ఆయన తర్వాత నేను ఇచ్చిన ప్రసంగంలో ఆయన యొక్క తప్పిదాన్ని సరిదిద్దగలిగాను మరియు ఆ అపార్థాన్ని దూరం చేయగలిగాను.
అదాన్ పిలుపులో వచ్చే ‘అక్బర్’ అనే పదానికీ, అక్బర్ చక్రవర్తికీ మధ్య ఎలాంటి సంబంధం లేదు.
అదాన్ పిలుపులో వచ్చే ‘అక్బర్’ అనే పదానికీ మరియు భారతదేశ చక్రవర్తి అక్బర్ కు మధ్య ఎలాంటి సంబంధం లేదు. అక్బర్ చక్రవర్తి పుట్టక ముందు ఎన్నో శతాబ్దాల నుండి అక్బర్ అనే పదం అదాన్ పలుకులలో పేర్కొనబడుతున్నది.
‘అక్బర్’ అంటే ‘మహా ఘనమైన వాడు’
అరబీ భాషా పదం ‘అక్బర్’ అంటే ‘మహా ఘనమైన వాడు’ అని అర్థం. అదాన్ పిలుపులో ‘అల్లాహు అక్బర్’ అని పలికినప్పుడల్లా, మేము ‘అల్లాహ్ యే అందరి కంటే మహా ఘనమైనవాడు’ లేదా ‘అల్లాహ్ యే అత్యంత ఘనమైన వాడు’ అని గొంతెత్తి ప్రకటిస్తున్నాము. ఇంకా అత్యంత ఘనమైనవాడు మరియు సాటిలేని ఏకైక ఆరాధ్యుడు అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని ప్రజలను పిలుస్తున్నాము.

ఎందుకు ముస్లిం వివాహిత మహిళలు, హిందూ మహిళల వలే తమ నుదుటి మీద బొట్టు, తిలకం పెట్టుకోరు మరియు మంగళ సూత్రాన్ని ధరించరు ?
‘బిందు’ అనే సంస్కృత పదం నుండి ‘బిందీ’ వచ్చింది, దీని అర్థం బొట్టు. సాధారణంగా ఇది కుంకుమ పౌడర్ నుండి తయారు చేయబడిన ఒక ఎర్రటి బొట్టు బిళ్ళ. హిందూ ధర్మానికి చెందిన మహిళలు దీనిని తమ నుదుటి మీద, రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు. దీనిని పార్వతీదేవి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ బొట్టు మహిళలను మరియు వారి భర్తలను కాపాడే స్త్రీ శక్తిని సూచిస్తుందని హిందువులు నమ్ముతారు. సాంప్రదాయకంగా ఇది పెళ్ళి అయిపోయిందని సూచించే ఒక చిహ్నం. దీనిని హిందూ వివాహిత స్త్రీలు పెట్టుకుంటారు. దీనిని టిక్క అని కూడా పిలుస్తారు.
ఈరోజుల్లో ఆకర్షణీయమైన బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా మారి పోయింది మరియు పెళ్ళికాని కన్యలు మరియు స్త్రీలు కూడా దీనిని పెట్టుకుంటున్నారు. ఈనాటి బొట్టు వృత్తాకారానికే పరిమితం కాకుండా అండాకారం, నక్షతాకారం, గుండె ఆకారం మొదలైన వివిధ ఆకారాల్లో లభిస్తున్నది. అంతేకాక, అది నీలిరంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు మొదలైన వివిధ రంగుల్లో కూడా లభిస్తున్నది. అలాగే కేవలం కుంకమ పౌడర్ తో మాత్రమే తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, ఈరోజుల్లో దీనిని రకరకాల పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇంకా ఇది రకరకాల డిజైన్లలో మరియు గాజు, తళతళలాడే ఇతర పదార్థాలతో తయారు అవుతున్నది.
మంగళసూత్రం
మంగళసూత్రం అంటే శుభాన్ని కలుగజేసే ఒక దారపు తాడు. ప్రత్యేకంగా దీనిని తమ పెళ్ళి అయిందని సూచించే చిహ్నంగా హిందూ ధర్మ స్త్రీలు మెడలో ధరిస్తారు. నల్లపూసలతో నిండిన రెండు దారపు తాళ్ళు కలిగి ఉండి మధ్యలో మామూలుగా ఒక బంగారం బిళ్ళ ఉంటుంది. చెడు నుండి కాపాడే రక్షణ కవచంగా నల్లపూసలు పనిచేస్తాయని వారి నమ్మకం. ఇంకా అవి ఆ స్త్రీ వివాహాన్ని మరియు ఆమె భర్త ప్రాణాన్ని కాపాడతాయని వారి నమ్మకం. దక్షిణ భారతదేశంలో, మంగళసూత్రాన్ని తాళి అని పిలుస్తారు. ఒక సన్నటి బంగారు ఛైను లేదా దారపు త్రాడుకు వ్రేలాడదీసిన ఒక చిన్న బంగారు నగ.
హిందూ వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ మంగళసూత్రాన్ని తొలగించకూడదు. ఆమె విధవరాలు అయినప్పుడు మాత్రమే అది కత్తిరించబడుతుంది.
కేవలం అల్లాహ్ మాత్రమే సంరక్షకుడు
మానవజాతిని సర్వలోక సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ కంటే ఉత్తమంగా ఎవ్వరూ రక్షించలేరు. చెడు నుండి కాపాడుకునేందుకు ఎర్రటి బొట్టు లేదా నల్లపూసల దారం మనకు అవసరం లేదు.
ఖుర్ఆన్ లోని 6వ అధ్యాయమైన సూరతుల్ అన్ఆమ్ లోని 14వ వచనంలో అల్లాహ్ యొక్క ప్రకటన ఇలా ఉంది.
“ప్రకటించు: నా సంరక్షణ కొరకు భూమ్యాకాశాల సృష్టికర్త అయిన అల్లాహ్ ను కాకుండా మరొకరిని తీసుకోవాలా?” [ఖుర్ఆన్ 6:14]
ఇంకా ఖుర్ఆన్ లోని అనేక చోట్ల ఇదే విషయం తెలుపబడింది.
“అల్లాహ్ యే నీ సంరక్షకుడు, మరియు ఆయన అత్యంత ఉత్తమంగా సహాయం చేస్తాడు.” 3:150 మరియు 22:78
బొట్టు పెట్టుకోవడం లేదా మంగళసూత్రాన్ని ధరించడ మనేది మనల్ని అత్యంత ఉత్తమంగా రక్షించే శక్తిగల ఆ సృష్టికర్త శక్తిసామర్ద్యాలపై నమ్మకం లేదని సూచిస్తుంది.
ఇస్లామీయ వస్త్రధారణకు వ్యతిరేకం
బొట్టు పెట్టుకోవడం లేదా మంగళసూత్రాన్ని ధరించడమనేది హిందువుల సాంప్రదాయం. ముస్లిమేతరులు ప్రత్యేకంగా ధరించే ఎలాంటి చిహ్నాలైనా, గుర్తులైనా, సంకేతాలైనా లేదా మచ్చలైనా ధరించేందుకు ఇస్లామీయ వస్త్రధారణ నియమాలు అనుమతించవు.
ఇస్లాం ధర్మంలో పెళ్ళైన స్త్రీలను మాత్రమే కాకుండా పెళ్ళికాని కన్యలను కూడా వేధించకూడదు.
ఒకసారి ఒక హిందూ స్నేహితుడు మంగళసూత్రం యొక్క లాభాల గురించి నాకు వివరిస్తూ, దాని ద్వారా పెళ్ళైన స్త్రీ సులభంగా గుర్తించబడుతుందని, తద్వారా పోకిరీగాళ్ళు ఆమెను వేధించకుండా మరియు ఆమెపై అత్యాచారం చేయకుండా వదిలి వేస్తారని పలికినాడు. అయితే ఇస్లాం ధర్మంలో ఏ స్త్రీ అయినా సరే – పెళ్ళైనా లేదా పెళ్ళి కాకపోయినా, ముస్లిం స్త్రీ అయినా లేదా ముస్లిమేతర స్త్రీ అయినా సరే – అస్సలు వేధించ బడకూడదు మరియు అత్యాచారానికి గురి కాకూడదు.

మృతదేహాలకు దహనసంస్కారాలు చేయకుండా ముస్లింలు ఎందుకు ఖననం చేస్తారు?
మానవశరీరంలో ఉన్న మూలకాలు మట్టిలో కూడా ఉన్నాయి.
మానవశరీరంలో ఉన్న మూలకాలు కొద్దో గొప్పో మట్టిలో కూడా ఉన్నాయి. కాబట్టి, త్వరగా శిధిలమయ్యే మరియు మట్టిలో కలిసిపోయే గుణం వలన మృతదేహాన్ని మట్టిలో ఖననం చేయడమనేదే ఎక్కువ సైంటిఫిక్ గా ఉంటుంది.
వాతావరణ కాలుష్యం ఉండదు
మృతదేహాన్ని దహనం చేయడం వలన వాతావరణంలో కాలుష్యం పెరుగుతుంది. తత్ఫలితంగా ప్రజల ఆరోగ్యం చెడి పోయే మరియు వాతావరణానికి హాని కలిగే ప్రమాదం ఉంది. మరి, దీనికి భిన్నంగా మృతదేహాన్ని ఖననం చేయడం వలన అలాంటి ప్రమాదాలు లేవు.
చుట్టుప్రక్కల ప్రాంతం పచ్చగా మిగిలి ఉంటుంది
ఒక మృతదేహాన్ని దహనం చేయడానికి, అనేక చెట్లు నరక వలసి ఉంటుంది. దాని వలన చుట్టుప్రక్కల పచ్చదనం నశించి, వాతావరణానికి మరియు పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉంది. మృతదేహాలను ఖననం చేయడం వలన, చెట్లు కాపాడబడటమే కాకుండా, చుట్టుప్రక్కల ప్రాంతం సారవంతమవుతుంది. వాతావరణం మంచిగా తయారవుతుంది.

ఆర్థికపరంగా

మృతదేహాన్ని దహనం చేసే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే అందులో టన్నుల కొద్దీ కలప వాడ వలసి ఉంటుంది. మృతదేహాలకు దహన సంస్కారం చేసే సాంప్రదాయం భారతదేశంలో ఉండటం వలన, ఆ ప్రక్రియలో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చవు తున్నాయి. దీనికి భిన్నంగా మృతదేహాలను ఖననం చేయడంలో చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని చోట్లయితే అసలేమీ ఖర్చు కాదు.
అదే సమాధిలో కొన్నేళ్ళ తర్వాత మరో మృతదేహాన్ని ఖననం చేయవచ్చు.
ఒక మృతదేహాన్ని దహనం చేయడంతోనే అక్కడ వాడిన కలప పని పూర్తయిపోతుంది. ఇక అది మరో మృతదేహాన్ని దహనం చేసేందుకు ఉపయోగపడదు. ఎందుకంటే కాలిన తర్వాత అది బూడిదగా మారిపోతుంది. దీనికి భిన్నంగా ఒక మృతదేహాన్ని ఖననం చేసిన సమాధిలోనే కొన్నేళ్ళ తర్వాత మరో మృతదేహాన్ని ఖననం చేయవచ్చు. ఎందుకంటే ఖననం చేయబడిన మృతదేహం కొన్నేళ్ళలో మట్టిలో కలిసి పోతుంది.
నవాళి కొరకు సత్యమైన గ్రంథాన్ని మేము అవతరింపజేసాము.” [ఖుర్ఆన్ 39:41]

అన్ని ధర్మాలలో అత్యంత ప్రాచీన ధర్మం హిందూ ధర్మం. కాబట్టి,

 
అది ప్రపంచంలోని అన్ని ధర్మాల కంటే అత్యంత స్వచ్ఛమైంది, ప్రామాణికమైంది మరియు ఉత్తమమైంది కాదా ?
ఇస్లాం ధర్మం ప్రపంచంలో అన్ని ధర్మాల కంటే అత్యంత ప్రాచీన ధర్మం.
అన్ని ధర్మాల కంటే ప్రాచీన ధర్మం హిందూ ధర్మం కాదు. ప్రపంచంలోని మొట్టమొదటి ధర్మం మరియు అన్ని ధర్మాల కంటే అత్యంత ప్రాచీనమైన ధర్మం ఇస్లాం ధర్మం. ఇస్లాం ధర్మం 1400 సంవత్సరాల పాతది మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ప్రారంభించారనే అనే ఒక అపోహ ప్రజలలో ఉన్నది. అనంత కాలం నుండి ఇస్లాం ధర్మం ఉనికిలో ఉన్నది అంటే మానవుడు ఈ భూమిపై తన మొట్టమొదటి అడుగు పెట్టినప్పటి నుండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మం యొక్క స్థాపకుడు కాదు. ఆయన అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడు. అంటే ఇస్లాం ధర్మం యొక్క చిట్టచివరి ప్రవక్త మరియు సందేశహరుడూను.
అత్యంత ప్రాచీన ధర్మమే అత్యంత స్వచ్ఛమైన మరియు అత్యంత ప్రామాణికమైన ధర్మం కానవసరం లేదు.
కేవలం అత్యంత ప్రాచీనమైన ధర్మం అనే ప్రాతిపదిక మీదే ఏ ధర్మమైనా అత్యంత స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ధర్మమని దావా చేయజాలదు. ఒక పరిశుభ్రమైన గ్లాసులో అప్పుడే పరిశుద్ధం చేసిన చోటు నుండి సేకరించిన గ్లాసులోని నీళ్ళ కంటే తన ఇంట్లో పైనేమీ కప్పకుండా మూడు నెలల క్రితం ఉంచిన గ్లాసులోని నీళ్ళు స్వచ్ఛమైనవి అనడం ఎంత వరకు సబబుగా ఉంటుంది ?
అలాగే అత్యంత లేటెష్ట్ ధర్మమే అత్యంత స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ధర్మం కానవసరం లేదు.
మరోవైపు ఏ ధర్మమైనా తను అన్నింటి కంటే క్రొత్త ధర్మం మరియు ఈ మధ్యనే మొదలైన ధర్మం కావటం వలన ఇతర ధర్మాలన్నింటి కంటే తమదే చాలా స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ధర్మం అవుతుందని దావా చేయలేదు. మూడు నెలల క్రితం మంచిగా సీలు వేయబడి, ప్యాక్ చేయబడి జాగ్రత్తగా ఫ్రిజ్ లో ఉంచబడిన స్వేదనజలం (డిస్టిల్ వాటర్) కంటే అప్పుడే సముద్రంలో నుండి ఫ్రెష్ గా పట్టిన నీరు అత్యంత స్వచ్ఛమైనది చెప్పడం ఎంతవరకు సబబు ?
ఏ ధర్మమైనా స్వచ్ఛమైనది మరియు ప్రామాణికమైనది అనడానికి, ఆ ధర్మంలో ఎలాంటి నూతన కల్పితాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు ఉండరాదు. అంతేగాక ఆ ధర్మం ప్రేరణ మరియు దిశ యొక్క మూలాధారం సర్వలోక సృష్టికర్త మాత్రమే అయి ఉండాలి. ఈ భూమండలంపై కేవలం ఖుర్ఆన్ మాత్రమే తను అవతరించినప్పటి అసలైన మరియు స్వచ్ఛమైన రూపంలో కొనసాగుతున్నది. ఇతర ధర్మాల దివ్యగ్రంథాలన్నీ నూతన కల్పితాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు గురి కాకుండా కాపాడుకోలేక పోయాయి. అవతరించిన నాటి నుండి ఎన్నో లక్షల మంది ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి, తమ మెదడులో జాగ్రత్తగా భద్రపరిచినారు. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసిన మిలియన్ల కొద్దీ ప్రజలు మన మధ్యన ఉన్నారు. అంతేగాక, అసలు ఖుర్ఆన్ నుండి ఖలీఫా ఉథ్మాన్ రదియల్లాహు అన్హు దాదాపు 14 శతాబ్దాల క్రితం తయారు చేయించిన ఖుర్ఆన్ కాపీలలో రెండు ఈనాటికి కూడా తాష్కెంట్ మ్యూజియంలోనూ మరియు టర్కీలోని కొప్టకీ మ్యూజియమ్ (Koptaki museum) లోనూ భద్రంగా ఉన్నాయి. వాటిలోనూ మరియు ఈనాడు మన ముందున్న ఖుర్ఆన్ లలోనూ ఒక్క అక్షరం మార్పు కూడా లేదు.
15వ అధ్యాయమైన సూరహ్ అల్ హిజ్ర్, 9వ వచనంలో అల్లాహ్ ఇలా వాగ్దానం చేసినాడు
“నిస్సందేహంగా మేము దివ్యసందేశాన్ని పంపాము; మరియు మేము తప్పకుండా దానిని కాపాడతాము (మార్చబడకుండా).”
అత్యంత ప్రాచీన ధర్మమే అత్యంత ఉత్తమమైన ధర్మం కానవసరం లేదు.
ఏ ధర్మమైనా అది అత్యంత ప్రాచీనమైన ధర్మమైనంత మాత్రాన అదే అత్యంత ఉత్తమమైన ధర్మం అని దావా చేయజాలదు. అది ఎలా ఉంటుందంటే, కేవలం పాతది కావటం వలన 19వ శతాబ్దపు పాత కారు ఈ మధ్యనే తయారైన టొయోటా కారు కంటే అత్యంత ఉత్తమమైందని చెప్పడం లాంటిదన్నమాట. వృత్తాకారంలో త్రిప్పటం ద్వారా స్టార్ట్ అయ్యే రాడ్ గల 19వ శతాబ్దపు పాత కారుని, కేవలం పాతది కావటం వలన అది కీ తో స్టార్ట్ అయ్యే ఈనాటి ఆధునిక టొయోటా కారు కంటే ఉత్తమమైనదని చెప్పడం ఎంత మూర్ఖత్వమో చూడండి.

అత్యంత అధునాతన ధర్మమే అత్యంత ఉత్తమమైన ధర్మం కానవసరం లేదు.
మరోవైపు ఏ ధర్మమైన కేవలం అత్యంత అధునాతనమైనది కావటం వలన మరియు ఇతర ధర్మాలన్నింటి కంటే చివరిలో రావడం వలన మాత్రమే అది అత్యుత్తమమైన ధర్మం అని దావా చేయజాలదు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడే తయారైన 800CC సుజుకీ కారు, పదేళ్ళకు పూర్వం తయారైన మెర్సిడస్ 5000CC 500SEL కారు కంటే ఉత్తమమైనది దావా చేయడం లాంటిదన్నమాట. ఏ కారు ఉత్తమమైనదో నిర్ణయించేందుకు ఆ కార్ల స్పెసిఫికేషన్లను పరిశీలించ వలసి ఉంటుంది. ఉదాహరణకు కారు యొక్క హార్స్ పవర్, భద్రత, సిలీండర్ల కెపాసిటీ, పికప్, స్పీడ్, సౌలభ్యం మొదలైనవి. పదేళ్ళ క్రితం తయారైన 500SEL మెర్సిడెస్ 5000CC కారు ఈ మధ్యనే తయారైన సుజుకీ 800CC కారు కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైంది కదా!
మానవజాతికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే ధర్మమే అత్యుత్తమమైన ధర్మం.
ఏ ధర్మమైనా అత్యుత్తమమైన ధర్మంగా పరిగణించబడాలంటే, దానిలో మానవజాతికి ఎదురయ్యే సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం ఉండాలి. అది సత్యమైన మరియు స్వచ్ఛమైన ధర్మమై ఉండాలి. ఆది నుండి అంతం వరకు, అన్ని కాలాలకూ వర్తించేలా ఉండాలి. నిస్సందేహంగా కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే మానవజాతికి ఎదురయ్యే సమస్యలన్నింటికీ సరైన పరిష్కారాలు కలిగి ఉన్నది. ఉదాహరణకు, మద్యపానం, పురుషుల సంఖ్యను మించి పోతున్న స్త్రీ జనాభా, మానభంగాలు మరియు అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, జాత్యహంకారం, కులాల పట్టింపులు మొదలైనవి.

ఇస్లాం ధర్మం ఒక సత్యధర్మము. దాని ధర్మాదేశాలు మరియు పరిష్కారాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి. 14 శతాబ్దాలుగా, అవతరించిన నాటి నుండి ఎలాంటి మార్పులు చేర్పులకు లోను కాకుండా స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన అంతిమ వాక్కుగా అంతిమ దినం వరకు రాబోయే అన్ని కాలాల కొరకు ఈ భూమండలంపై మిగిలి ఉన్న ఏకైక దివ్యగ్రంథం ఖుర్ఆన్. ఉదాహరణకు, పూర్వకాలం సాహిత్యం మరియు కవితలతో నిండిన మహిమల కాలంగా గుర్తించబడింది. మరి ఈనాటి కాలం ఆధునిక సైన్సు మరియు టెక్నాలజీలతో నిండిన మహిమల కాలంగా గుర్తించబడింది. మరి, ఈ మోడరన్ కాలంలో కూడా ఖుర్ఆన్ తనకు సాటి లేదని సమస్త మానవాళిని సవాలు చేస్తున్నది. ఇస్లాం ధర్మం మానవ నిర్మిత ధర్మం కాదు. కానీ అది సర్వలోక సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ మానవజాతి మార్గదర్శకత్వం కోసం అవతరింపజేసిన ధర్మం. ఆయన వద్ద కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే సమ్మతించబడుతుంది.

వేర్వేరు భాషలలో వేర్వేరు పేర్లతో నీరు పిలవబడు తున్నది: ఇంగ్లీషులో వాటర్, హిందీలో పానీ, తమిళంలో తన్నీ.

అలాగే దైవాన్ని అల్లాహ్ అని పిలిచినా, రామ్ అని పిలిచినా లేక జీసస్ అని పిలిచినా ఒకే దైవాన్ని పిలిచినట్లు కాదా?

మహోన్నతమైన దివ్యనామాలు అల్లాహ్ కే చెందుతాయి.
17వ అధ్యాయమైన సూరతుల్ ఇస్రా, 110వ వచనంలో ఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది
“ప్రకటించు: ‘అల్లాహ్ అని పిలవండి లేదా రహ్మాన్ అని పిలవండి: ఆయనను మీరే (ఉత్తమ) పేరుతో పిలిచినా, మహోన్నతమైన దివ్యనామాలన్నీ ఆయనకే చెందుతాయి.'” [దివ్యఖుర్ఆన్ 17:110]

అల్లాహ్ ను మీరు ఏ పేరుతోనైనా పిలవ వచ్చు. కానీ,

అది అత్యంత సుందరమైన పేరు అయి ఉండాలి,

మనస్సులో రూపాన్ని గుర్తుకు తెచ్చేలా ఉండకూడదు

మరియు కేవలం అల్లాహ్ మాత్రమే కలిగి ఉండే దివ్యలక్షణాలు కలిగి ఉండాలి.

వేర్వేరు భాషలలో నీటిని వేర్వేరు పేర్లతో పిలవవచ్చు. అయితే, నీరు కాని దానిని ‘నీరు’ అని ఏ భాషలోనూ పిలవ లేము కదా!

మీరు నీటిని వేర్వేరు భాషలలో వేర్వేరు పేర్లతో పిలవ వచ్చు. ఉదాహరణకు ఇంగ్లీషులో వాటర్, హిందీలో పానీ, తమిళంలో తన్నీ, అరబీలో మా, సంస్కృతంలో అపహ్, శుద్ధ హిందీలో జల్, గుజరాతీలో జల్ లేదా పానీ, మరాఠీలో పాండీ, కన్నడంలో నీర్, తెలుగులో నీరు, మలయాళంలో వెల్లం మొదలైనవి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగమని ఒక స్నేహితుడు తనకు సలహా ఇచ్చాడనీ, అయితే తను అలా త్రాగలేక పోతున్నాననీ, ఎందుకంటే అలా త్రాగగానే వాంతి వచ్చినట్లు ఉంటుందనీ ఒక వ్యక్తి నాతో చెప్పాడని అనుకుందాము. విచారించగా ఆ నీటిలో కంపు వాసన ఉందనీ, దాని రంగు పసుపు రంగులో ఉందనీ తెలియ వచ్చింది. అతడు ‘నీరు’ అని చెబుతున్నది వాస్తవానికి ‘మూత్రం’ అని నేను గ్రహించాను. కాబట్టి మీరు నీటిని వేర్వేరు భాషలలో వేర్వేరు పేర్లతో పిలవ వచ్చు. అయితే నీరు కాని దానిని నీరు అని పిలవ లేరు. ఈ ఉపమానం యదార్థానికి దగ్గరగా లేదని ప్రజలు భావించవచ్చు. నేను వారితో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఏమీ తెలియని వ్యక్తి కూడా నీటిని మరియు మూత్రాన్ని తేలిగ్గా గుర్తు పట్టగలడు. మూత్రాన్ని ‘నీరు’ అని పిలవటానికి అతడు ఒక మూర్ఖుడై ఉండాలి.

అలాగే ఎవరైనా వ్యక్తి సరైన దైవభావన అంటే దైవం అంటే ఎవరో, ఏమిటో ఖచ్ఛితంగా తెలిసి ఉన్నప్పుడు, ఇతరులు అసత్య దైవాలను పూజించడం చూస్తే, సహజంగానే అతడు ‘ఒక నిజమైన దైవానికి మరియు అసత్య దైవాలకూ మధ్య ఉండే భేదాన్ని’ వారెలా గుర్తించలేక పోతున్నారని ఆశ్చర్యపోతాడు.
వేర్వేరు భాషలలో వేర్వేరు పేర్లతో పిలవడం ద్వారా బంగారం యొక్క నాణ్యత ధృవీకరించబడదు. బంగారం నాణ్యత గుర్తించడానికి దానిని గీటురాయితో రుద్దవలసి ఉంటుంది.
అలాగే, బంగారాన్ని హిందీలో సోనా, ఇంగ్లీషులో గోల్డ్, అరబీలో దహబ అని పిలుస్తారు. బంగారానికి ఉన్న ఈ వివిధ పేర్లు తెలిసి ఉన్నా గానీ, ఒకవేళ ఎవరైనా వ్యక్తి తన వద్ద బంగారం 24 కారట్ల బంగారమని చెబుతూ మీకు అమ్మజూపితే, గోల్డ్ స్మిత్ వద్దకు వెళ్ళి దానిని పరీక్షించకుండానే మీరు అతడిని గ్రుడ్డిగా నమ్మరు. తన వద్దనున్న గీటురాయితో ఆ గోల్డ్ స్మిత్ అది అసలు బంగారమేనా కాదా అనేది నిర్ధారిస్తాడు. పసిడి రంగులో మెరిసి పోయే నగలన్నీ బంగారు నగలు కాజాలవు.
దైవత్వ సిద్ధాంతం యొక్క గీటురాయి – సూరతుల్ ఇఖ్లాస్. అలాగే, ఎవరైనా లేదా ఏదైనా దేవుడు అని దావా చేస్తున్నట్లయితే, దానిలోని సత్యాసత్యాలను దైవత్వ సిద్ధాంత గీటురాయితో పరీక్షించకుండా ఆ దావాను అంగీకరించకూడదు.

దైవత్వ సిద్ధాంతపు గీటురాయి అంటే దైవం గురించిన స్వచ్ఛమైన నిర్వచనం

దివ్యఖుర్ఆన్ లోని 112వ అధ్యాయం అయిన సూరతుల్ ఇఖ్లాస్ ఇలా ఇస్తున్నది:
“ప్రకటించు, ‘ఆయనే అల్లాహ్, ఏకైకుడు మరియు అద్వితీయుడు; స్వయం సమృద్ధుడు; ఆయన ఎవరికీ పుట్టలేదు మరియు ఆయనకు ఎవ్వరూ పుట్టలేదు; మరియు ఆయనను పోలినదేదీ లేదు.” [దివ్యఖుర్ఆన్ 112:1-4]
ఎవరైనా లేదా ఏదైనా సరే పై యాసిడ్ టెస్ట్ పాసైతే, ఆయనను లేదా దానిని దైవం అని పిలవవచ్చు.
నేను దైవాన్ని అని దావా చేసే మరియు పై నాలుగు వచనాల నిర్వచనాన్ని పూర్తి చేసేదే యాసిడ్ టెస్ట్ పాసవుతుంది, దైవం అని పిలవబడుతుంది మరియు దైవంగా ఆరాధింపబడుతుంది.

ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎవరో ఒక మతోన్మాది దేవుడని అన్నాడనుకుందాము (అల్లాహ్ క్షమించుగాక). అతడి మాటలలోని సత్యాసత్యాలను ధృవీకరించేందుకు ఆయనను పై సూరతుల్ ఇఖ్లాస్ యాసిడ్ టెస్ట్ తో పరీక్షించుదాము.

“ఖుల్ హు అల్లాహు అహద్” – ప్రకటించు, ఆయనే అల్లాహ్, ఏకైకుడు – అద్వితీయుడు;
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకైకుడు మరియు అద్వితీయుడా ? కాదు. కేవలం ఆయన ఒక్కడే ప్రవక్త మరియు సందేశహరుడు కాదు. ఆయనకు పూర్వం అనేక మంది ప్రవక్తలు మరియు సందేశహరులు వచ్చారు.
“అల్లాహు సమద్” – అల్లాహ్ నిరుపేక్షాపరుడు, స్వయం సమృద్ధుడు;
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక కష్టాలను ఎదుర్కొన్నారనే విషయం మనకు తెలుసు. ఆయన అల్లాహ్ యొక్క ఒక శక్తిమంతుడైన ప్రవక్త మరియు సందేశహరుడు అయినప్పటికీ, తన 63వ సంవత్సరంలో ఆయన చనిపోయారు మరియు మదీనాలో ఖననం చేయబడినారు.
“లమ్ యలిద్ వ లమ్ యూలద్”– ఆయన ఎవరికీ పుట్టలేదు మరియు ఆయనకెవరూ పుట్టలేదు;
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోని అబ్దుల్లాహ్ మరియు ఆమినా దంపతులకు జన్మించిన విషయం మనందరికీ తెలుసు. ఆయనకు అనేకమంది పిల్లలు కలిగారు కూడా. ఉదాహరణకు ఫాతిమహ్, ఇబ్రాహీమ్ …. రదియల్లాహు అన్హుమ్.
“వ లమ్ యకుల్లహు కుఫువన్ అహద్” – మరియు ఆయనను పోలినదేదీ లేదు.
ముస్లింలు అందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంతో ప్రేమిస్తారు మరియు గౌరవిస్తారు, వారు ఆయన యొక్క ప్రతి ఆదేశాన్ని తు.చ. తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అయినా, ఆయనే దేవుడు అని పలికే ఒక్క ముస్లిం కూడా మీకు ప్రపంచంలో కనబడడు.

ఇస్లామీయ మూలసిద్ధాంతం – “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్” అంటే అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు మరియు ముహమ్మద్ ఆయన యొక్క సందేశహరుడు. ఈ వచనం ప్రతిరోజు ఐదుసార్లు అదాన్ పలుకలలో అంటే నమాజు కొరకు పిలిచే పిలుపులో గొంతెత్తి ప్రకటించబడుతున్నది. తద్వారా ముస్లింలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంతో గౌరవిస్తున్నా మరియు విధేయత చూపుతున్నా, ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు దాసుడే గానీ స్వయంగా దేవుడు కాదు అని వారికి ప్రతిరోజూ జ్ఞాపకం చేయబడుతున్నది.
ఇక ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళను కూడా సూరతుల్ ఇఖ్లాస్ అనే ఆ స్వచ్ఛమైన దైవభావన గీటురాయితో ఒకసారి పరీక్షించండి. దైవభావన గీటురాయిని ఎలా ఉపయోగించాలో మీకు పైన వివరించినాము. తాము ఆరాధిస్తున్న దేవుళ్ళు సత్యమైన దేవుళ్ళా లేక అసత్యమైన దేవుళ్ళా అనే అసలు నిజాన్ని కనుక్కోవటం ప్రతి ఒక్కరి బాధ్యత.
వేదాలు మరియు ఇతర హిందూ మత గ్రంథాలు విగ్రహారాధనను నిషేధించాయని హిందూ ధర్మ పండితులు అంగీకరిస్తున్నారు. కానీ ఆరంభంలో మనస్సు పరిపక్వం చెందక పోవటం వలన ఆరాధనలో ఏకాగ్రత కోసం ఏదైనా విగ్రహం అవసరమవుతుందనీ, ఆధ్యాత్మికతలో మనస్సు ఉన్నత చైతన్య స్థాయికి చేరుకున్న తరువాత, ఆరాధనలో ఏకాగ్రత కోసం విగ్రహం అవసరం ఉండదనీ కొందరు హిందువులు అంటారు. దీని గురించి మీరేమంటారు ?

దైవారాధనలో చూపే ఏకాగ్రత విషయంలో ముస్లింలు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఒకవేళ ఆరంభంలో మాత్రమే దైవారాధనలో ఏకాగ్రత కోసం విగ్రహం కావలసి వచ్చి, తర్వాత దశలలో మనస్సు ఉన్నత స్థాయికి చేరుకున్నపుడు విగ్రహం యొక్క అవసరం లేకపోతున్నట్లయితే, ఇప్పటికే ముస్లింలు దైవారాధనలో మనస్సును కేంద్రీకరించడంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని నేను చెబుతున్నాను. ఎందుకంటే వారు అల్లాహ్ ను ఆరాధించేటప్పుడు దైవారాధనలో ఏకాగ్రత కోసం ఎలాంటి విగ్రహం లేదా ప్రతిమ యొక్క అవసరం వారికి కలగడం లేదు.
ఎందుకు ఆకాశంలో ఉరుములు వస్తాయని ఒక చిన్నపిల్లవాడు అడిగినప్పుడు చెప్పే జవాబు ఏమి?
మా సంస్థలో ఒకసారి నేను ఒక స్వామీజీతో చర్చిస్తుండగా, ఆయన ఇలా అన్నారు. ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాడు మనల్ని “ఆకాశం ఎందుకు ఉరుముతుంది?” అని అడిగినప్పపుడు, అతడికి మేమిలా జవాబిస్తాము “స్వర్గంలో తాతమ్మ పిండి రుబ్బుతున్నది”; ఎందుకంటే అసలు విషయం చెప్పినా అతడు అర్థం చేసుకోలేడు. అలాగే ఆరంభ దశలలో, దైవారాధనలలో ఏకాగ్రత కోసం ప్రజలకు విగ్రహాల, ప్రతిమల అవసరం కలుగుతుంది.
ఇస్లాం ధర్మంలో మేము అబద్ధం చెప్పడానికి అనుమతి లేదు. అది ఎంత చిన్నదైనా సరే. నా బిడ్డకు నేనెప్పుడూ అలాంటి తప్పుడు జవాబు ఇవ్వను. ఎందుకంటే పెరిగి పెద్దవాడై స్కూలు వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత, మెరుపుల తర్వాత ఆకాశంలో వినబడే ఉరుములకు కారణం అతి శీఘ్రంగా వేడెక్కిన వాయువుల వ్యాకోచం అని చదివినప్పుడు, అతడు టీచరు అబద్ధం చెబుతున్నాడని భావిస్తాడు. మరి కొన్నాళ్ళకు అసలు విషయం తెలిసిన తర్వాత తండ్రి తనతో అబద్ధం చెప్పాడని గ్రహిస్తాడు. ఒకవేళ పిల్లవాడు అర్థం చేసుకోలేడని మీరు భావిస్తే, విషయాలను వీలయినంత సులభం చేసి అతడికి చెప్పడానికి ప్రయత్నించాలి. అంతేగానీ విషయాన్ని దాటవేయడానికి అతడితో అబద్ధపు కథ చెప్పడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ స్వయంగా మీకు దాని జవాబు తెలియకపోతే, అతడితో ‘నాకు తెలియదు’ అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి. కానీ ఈ జవాబుతో నేటి చాలా మంది పిల్లలు సంతృప్తి చెందరు. ఒకవేళ ఇదే జవాబును నేను నా కుమారుడికి ఇస్తే, అతడు “అబ్బా (నాన్నా), నీకెందుకు తెలియదు?’ అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇది మంచిగా మీ హోమ్ వర్క్ చేయటం మరియు మీ పిల్లవానితో పాటు మీరు కూడా బాగా చదవుకోవటం తప్పనిసరి చేస్తున్నది.
ఒకటవ తరగతిలో ఉన్న విద్యార్థుల కొరకు దైవారాధనలో ఏకాగ్రత కోసం విగ్రహం, ప్రతిమ అవసరం కలుగుతున్నది –

(2+2=4 అనేది 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా మారకుండా ఒకేలా ఎందుకు ఉంటున్నది)
విగ్రహారాధన గురించి నన్ను ఒప్పించే ప్రయత్నంలో కొందరు హిందూ పండితులు ఇలా అన్నారు. 1వ తరగతిలో ఒక విద్యార్థికి ప్రాథమికంగా దైవారాధనలో ఏకాగ్రత ఎలా వృద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని బోధించేటప్పుడు, అతడికి విగ్రహం సహాయంతో ఏకాగ్రత వృద్ధి చేసుకోవాలని బోధించడం జరుగుతుంది. కానీ, ఆ తర్వాత అతడు డిగ్రీ స్థాయికి చేరుకున్నాక, అతడికి దైవారాధనలో ఏకాగ్రత కోసం విగ్రహం, ప్రతిమ అవసరం ఉండదు.
గుర్తించదగిన ఒక అత్యంత ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, ఏదైనా విషయం యొక్క మౌలికాంశాలపై గట్టి పట్టు ఉంటే, భవిష్యత్తులో అతడు దానిలో అందరి కుంటే ముందు నిలబడగలడు. ఉదాహరణకు, 1వ తరగతికి మ్యాథమెటిక్స్ బోధించే ఒక టీచరు తన విద్యార్థులకు 2+2=4 అని బోధిస్తాడు. విద్యార్థి పరీక్ష పాసవుతాడా, డిగ్రీలో చేరతాడా, మ్యాథమెటిక్స్ లో పి.హెచ్.డి చేస్తాడా అనే దానితో సంబంధం లేకుండా, 2+2=4 అనే ప్రాథమిక కూడికలో ఎలాంటి మార్పూ రాదు. అది ఎక్కడా 5 లేక 6గా మారదు. పైతరగతులలో విద్యార్థులు కూడికలతో పాటు అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లాగరిథమ్ మొదలైన వాటిని కూడా నేర్చుకుంటారు. అయినా 2+2=4 అనే ప్రాథమిక కూడికలో ఎలాంటి మార్పూ రాదు. ఒకవేళ 1వ తరగతిలోని టీచర్ ప్రాథమిక అంశాలను తప్పుగా బోధిస్తే, ఆ విద్యార్థులు భవిష్యత్తులో ముందుకు దూసుకు పోతారని మనమెలా ఊహించగలం?
వేదాలలోని దైవభావన గురించిన ప్రాథమిక నియమం ఏమిటంటే దైవానికి ప్రతిరూపం లేదు. మరి, ఈ వాస్తవం తెలిసిన తర్వాత కూడా ప్రజలు దారి తప్పడాన్ని చూస్తూ పండితులు ఎలా నిశ్శబ్దంగా ఉండగలుగు తున్నారు.
1వ తరగతిలో చదువుతున్న మీ కుమారుడికి రెండు రెళ్ళు నాలుగు కాదు, రెండు రెళ్ళు 5 లేక 6 అని చెప్పి, స్కూలు పాసైన తర్వాత రెండు రెళ్ళు నాలుగు అనే అసలు విషయం వాడికి చెప్పగలరా? ముమ్మాటికీ కాదు. వాస్తవానికి ఒకవేళ అతడు తప్పు చేస్తే సరిదిద్ది, రెండు రెళ్ళు నాలుగు అని చెబుతారే గానీ అతడు స్కూలు పాసై వరకు ఆగరు; ఒకవేళ చిన్నప్పుడే అలా సరిదిద్దక పోతే, మీరు చేతులారా అతడి భవిష్యత్తు నాశనం చేసినవారవుతారు.

ముస్లింలు విగ్రహారాధన చెయ్యరు కదా! మరి కాభా వైపు తిరిగి నమాజు ఎందుకు చేస్తారు.
దాని చుట్టూ ఎందుకు ప్రదక్షణలు చేస్తారు?

ముస్లింలు కాబాని దైవ స్వరూపంగా భావించి కాబావైపునకు ముఖము పెట్టి నమాజు చెయ్యరు. కాబాని దిక్కుగా మాత్రమె తలంచి అటువైపు తిరిగి నమాజు చేస్తారు. ఇదే విషయం ఖుర్ఆన్లో ఉంది.
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి మేము, నీవు పలుమార్లు నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తడం చూశాము. కావున మేము నిన్ను నీవు కోరిన ఖిబ్లావైపునకు త్రిప్పుతున్నాము. కావున నీవు మస్జిద్‌ అల్‌-‘హరామ్‌ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడ ఉన్నా సరే (నమా’జ్‌ చేసేటప్పుడు), మీ ముఖాలను ఆ వైపునకే త్రిప్పుకోండి. మరియు నిశ్చయంగా, గ్రంథం గలవారికి ఇది తమ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యమని బాగా తెలుసు.
(ఖుర్ఆన్ 2వ సూర బఖర 144 వ వాక్యం )
నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్తలోకాల ప్రజలకు మార్గదర్శ కత్వాన్ని ప్రసాదించేది.
(ఖుర్ఆన్ 3వ సూర ఆలె-‘ఇమ్రాన్ 96 వ వాక్యం )
ఇస్లాం అందరిని ఒకే సంఘంలా జీవించమంటుoది. సమూహికంగా నమాజు చదవడం తప్పనిసరి చేసింది. వారి దిక్కు ఒకటే చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ముస్లిం అనువాడు ప్రార్ధన చేయునప్పుడు అతని ముఖం కాబా వైపు త్రిప్పుట సరి. కాబా ప్రపంచానికి కేంద్ర బిందువై యున్నది.
ప్రముఖ హదీస్ గ్రంధాలలో ఇలా ఉంది.ఒకసారి ఉమర్ (రజి) వారు (ఈయన ప్రవక్త ముహమ్మద్ (స.అ.స) వారి సహచారులలో ఒకరు) ప్రవక్త వారి తరువాత అబుబకర్ (రజి) ఇస్లాo కు సారధ్యం వహించారు. ఆతరువాత ఉమర్ (రజి) ఇస్లాం సారధ్య బాధ్యతలు చేపట్టారు. ముహమ్మద్ (స.అ.స) ప్రవక్త సహచారులలో అగ్రగణ్యులలో ఈయన ఒకరు. కాగా వద్ద నల్లటి రాయి ఉంటుంది. దానిని హజారే అస్వాద్ అంటారు. కాబాకి ఎవరు వెళ్ళినా దాన్ని తాకుతారు. ఆరాయిని ఉమర్ (రజి), వారు తాకుతూ ఇలా అన్నారు.ఓ రాయి నివు నా దృష్టిలో ఓరాయివి మాత్రమే. నివు లాభ నష్టాలు చేయలేవు. ప్రియ ప్రవక్త నిన్ను తాకుట నేను చూసాను. అందుకే నేను నిన్ను తాకుతున్నాను.
(హదీస్, సాహిబుఖారి-2వ భాగం, 50వ ప్రకరణం హదీస్ నం. 594 పేజి నెం. 599)
ముస్లింలు పుణ్యక్షేత్రంగాభావించే మక్కాలో శివలింగం ఉందికదా అని అనేవారు మన దేశంలో బ్రహ్మకుమారీలు వున్నారు. ఇది కేవలం స్వార్గం నుండి ఆదాము వారు తెచ్చిన రాయి పలక మాత్రమే. ఇది దైవం మాత్రం కాదు. శివలింగం అసలే కాదు.
ముస్లింలు మక్కా జయించిన తరువాత ముహమ్మద్ (స.అ.స) వారు కాబాలో ప్రవేశించి బిలాల్ (రజి) గారికి కాబా మసీదు మీదకు ఎక్కి అజా(నమాజు కొరకు పిలిచే పిలుపు) ఇవ్వమన్నారు. ముస్లింలు కాబాను ఆరాదిన్చినట్లై తే దానిపైకి ఎక్కి తొక్కుతారా? ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. ఇది కేవలం ఇస్లంపై అవగాహన లేనివారు అన్నమాటలు మాత్రమే. చుడండి ఖుర్ఆన్ వచనాలు 2. 125

 

Related Post