వేదాలలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివ సల్లం)

Originally posted 2016-05-15 11:48:52.

మానవులను సృష్టించిన దేవుడు సృష్టించి వదిలి వేయక రుజుమార్గం చూపటానికి తన యొక్క ప్రవక్తల్ని ఈ మానవుల్లోనే పుట్టించాడు. వీరు తాము పుట్టిన జాతి యొక్క భాషల్లోనే సంచరిస్తూ దేవుని యొక్క ఏకత్వమును చాటి చెప్పారు. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది న్యాయం ఏది అన్యాయం అనే విషయాలను తన జాతి ప్రజలకు తెలియ పరచారు. ఇలాంటి ప్రవక్తలను దేవుడు అన్ని జాతుల్లోనూ పుట్టించాడు. ఈ విషయాన్ని గురించి దేవుడు దివ్య ఖుర్'ఆన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు.

మానవులను సృష్టించిన దేవుడు సృష్టించి వదిలి వేయక రుజుమార్గం చూపటానికి తన యొక్క ప్రవక్తల్ని ఈ మానవుల్లోనే పుట్టించాడు. వీరు తాము పుట్టిన జాతి యొక్క భాషల్లోనే సంచరిస్తూ దేవుని యొక్క ఏకత్వమును చాటి చెప్పారు. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది న్యాయం ఏది అన్యాయం అనే విషయాలను తన జాతి ప్రజలకు తెలియ పరచారు. ఇలాంటి ప్రవక్తలను దేవుడు అన్ని జాతుల్లోనూ పుట్టించాడు. ఈ విషయాన్ని గురించి దేవుడు దివ్య ఖుర్’ఆన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు.

అవతారం అంటే?

అవతారం అన్న పదానికి అర్ధం భూమండలానికి రావడం. ఈశ్వరుని అవతారం అంటే అర్ధం ఒక మహాత్ముడు ప్రజలందరికీ సందేశం అందించడానికి జన్మించడం. దేవుడు సమస్తాన్ని ఆవరించి ఉన్నాడు. దేవుడు ఒక ప్రదేశంలో ఉన్నాడని చెప్పడం, లేదా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడని చెప్పడం సర్వాంతర్యామిని పరిమితం చేయడం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో దేవుని కాంతి ప్రత్యేకంగా ప్రకాశిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అది దాగి ఉండవచ్చు. సూర్యుని కాంతి కొన్ని ప్రదేశాల్లో ప్రకాశించినట్లే ఇది కూడా. దేవుడు ఉండేది ఏడవ ఆకాశంలో. ఇది మన పై ఉన్న అన్ని ఆకాశాలపైన ఉన్న ఆకాశం. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేవి ఉండవు. అక్కడ దేవుని కాంతి ముందు సుర్ర్యచంద్రనక్షత్రాల కాటులు వెలవెల బోతాయి. సూర్యుని కాంతి గ్రహాలను ప్రకాశించేలా చేస్తుంది. అలాగే దేవుని కాంతి సమస్తాన్ని ప్రకాశించేలా చేస్తుంది. దేవుని ప్రసన్నత పొందిన ఒక మహాత్ముడు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి భూమిపై జన్మిస్తాడు. ఇక్కడి ప్రజలకు జన్మిస్తాడు, జ్ఞాన సంపన్నుడై వస్తాడు, అతను దేవుని కాంతిని చూడగలుగుతాడు, విద్యాభ్యాసం లేకుండానే జ్ఞానాన్ని పొందగలుగుతాడు, ఈశ్వరుని అవతారం అన్న పడసంబందంలో ‘ని’ అన్న అక్షరం దేవునికి అతనికి ఉన్న సంబందాన్నితెలుపుతుంది . ఆ మహాత్ముడు దేవునికి సంబంధించిన వాడు. ఆయన దేవుని విధేయుడు. ఋగ్వేదంలో అలాంటి వ్యక్తిని ‘కెన్’ అని పిలవడం జరిగింది. కెన్ అన్న పదానికి అర్ధం దేవుని స్తుతించే వాడు. అరబ్బీ లో ముహమ్మద్ (స.అ.సం) అన్న పదానికి అర్ధం కూడా ఇదే. అయితే దేవుని స్తుతించే వారందరూ ముహమ్మద్ (స.అ.సం) అవుతారా? అన్న సందేహం కలుగవచ్చు. కాని అలా జరుగదు. ముహమ్మద్ (స.అ.సం) లేదా కెన్ అన్న పదం ప్రత్యేకమైనది. దేవుని ప్రత్యేకంగా స్తుతించేవారిని ఉద్దేశించినది. ఈ పదం ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఉద్దేశించినది. ఇది ఆ వ్యక్తి గుర్తింపును సూచించేది. హజ్రత్ ఆదమ్ (అ.స) కూడా దేవుని స్తుతించేవారే కాని ఆయన పేరు ముహమ్మద్ (స.అ.సం) కాదు. కాబట్టి దువునికి సంబంధించిన ప్రతి వ్యక్తి ,దేవుని స్తుతించే ప్రతి వ్యక్తి కెన్ కాలేడు. ఇక్కడ మనం అవతారం గురించి మాట్లాడు తున్నాం. మనం ఆయన చరిత్ర గురించి చర్చించడం లేదు. లేదా మనం అవతారాల గురించి, ప్రవక్తల గురించి మాట్లాడడం లేదు. సంస్కృతంలో ఉన్న అవతార్ అన్న పదం ఇంగ్లీషులో ప్రవక్త అన్న పదం మాదిరిదే అన్న విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పదలిచాను. విభిన్న దేశాలకు భిన్న అవతారాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకే అవతారం అన్ని దేశాలకు మార్గదర్శనం చేయడం సాధ్యం కాదు. కాని చివరి అవతారం ప్రత్యేకమైనది. ఆయన అవతరించినప్పుడు ఆయన ధర్మం మిగిలిన ధర్మాల కన్నా ఉత్తమమైనదిగా మారుతుంది. ఇప్పుడు మనం చివరి అవతారం గురించిన కారణాల గురించి ఆలోచిద్దాం. (ఋగ్వేదం; 2:12:6, హిందూ ముస్లిం ఏక్తా మే సుందర్జీ పేజి; 26 -30)

అవతారాలకు కారణాలు
ప్రజలు ధర్మానికి దూరం కావడం, ప్రజలలో ధర్మం పట్ల ఆశక్తి లేకపోవడం.
స్వచ్చమైన ధర్మంలో మార్పులు చేర్పులు జరగడం.
మతం పేరుతొ మతానికి విరుద్ధంగా వ్యవహరించడం.
మతం పేరుతో మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం.
దైవదాసులను ఇబ్బందులకు, వేధింపులకు గురిచేయడం.
దౌర్జన్యాలు, పాపాలు పెరిగిపోవడం.
అరాచకం అలుముకోవడం, హింసాదౌర్జన్యాలు మితిమీరిపోవడం.
మతాన్ని వ్యక్తిగతానికి, కుటుంబానికి పరిమితం చేసుకోవడం.
దైవం ప్రసాదించిన వస్తు సంపదను దుర్వినియోగం చేయడం.
సాధువులు సంరక్షించడానికి, పాపులను తొలగించడానికి భూమిపైకి రావడం జరుగుతుంది.
మతం పతనమయ్యే పరిస్థితి తలెత్తినప్పుడు అవతారాలు భూమి పైకి రావడం జరుగింది.
హింసా, హత్యలు, దోపిడీలు అధికమైనప్పుడు అవతారాలు జన్మించడం జరిగింది.
యుగ ధర్మానికి అనుగుణంగా చోటుచేసుకొనే మార్పుల దృష్ట్యా మతంలో మార్పులకు అవతారాలు రావడం ధార్మిక నియమాలకు కొత్త రూపునివ్వడం జరిగింది.
పైన పేర్కొన్న కారణాలు ఎదురైనప్పుడు అవతార పురుషులు జన్మించారు.

ప్రవక్త అంటే ఎవరు?

మానవులను సృష్టించిన దేవుడు సృష్టించి వదిలి వేయక రుజుమార్గం చూపటానికి తన యొక్క ప్రవక్తల్ని ఈ మానవుల్లోనే పుట్టించాడు. వీరు తాము పుట్టిన జాతి యొక్క భాషల్లోనే సంచరిస్తూ దేవుని యొక్క ఏకత్వమును చాటి చెప్పారు. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది న్యాయం ఏది అన్యాయం అనే విషయాలను తన జాతి ప్రజలకు తెలియ పరచారు. ఇలాంటి ప్రవక్తలను దేవుడు అన్ని జాతుల్లోనూ పుట్టించాడు. ఈ విషయాన్ని గురించి దేవుడు దివ్య ఖుర్’ఆన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు.

(ఖుర్’ఆన్ ; 35 : 24) “హెచ్చరిక చేసేవాడు రాని జాతి అంటూ ఏదీ లేదు.”

(ఖుర్’ఆన్; 13 : 7) “ప్రతి యుగానికి ఒక మార్గదర్శకుడు ఉన్నాడు.”

(ఖుర్’ఆన్; 13 : 38) “ప్రతి యుగానికి ఒక గ్రంధం ఉన్నది.”

(ఖుర్’ఆన్; 16 : 36) “మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అల్లాహ్ ను ఆరాధించండి, ఇతర మిధ్యా దైవాలకు దూరంగా ఉండండి అని బోధ పరిచాము.”

అయితే భాషా భేదం వలన జాతి భేదం వలన మనం వీరిని గ్రహించ లేక పోతున్నాము.

ప్రవక్తలు అంటే ఒకే దేవుని గురించి బోధించే వారు. మంచి నడవడిక కలిగిన వారు. మరొకరికి సహాయ సహకారాలు అందించేవారు. ఆ దేవుని మార్గంలో ధన, మాన, ప్రాణాల నష్టానికి సిద్ధ పడేవారు. ఈ ప్రాపంచిక జీవితంలో లభించే విషయాల్ని ఆలోచించక, ఆ దేవుని మార్గంలో ఎదురయ్యే సమస్యల్ని లెక్క చెయ్యక సదా సన్మార్గం చూపుతూ శాంతి (ఇస్లాం) ను బోధించేవారు. వీరు ప్రతి జాతిలోనూ పుట్టి నాటి ఆ జాతి వేషభాషల్లో దైవ ధర్మాన్ని, దేవుని ఏకత్వాన్ని బోధించారు. భాష ఏదైనా వీరు బోధించిన ధర్మం మాత్రం ఒక్కటే. మరి ఇన్ని మతాలు ఎందుకు పుట్టుకొచ్చాయి?

ఎందుకంటే, దైవ ప్రవక్తల విషయంలో దైవానుగ్రహం వలన అనేక అద్భుతాలు ప్రవక్తల ద్వారా జరుగుతూ ఉండేవి. వీటి వలన విపరీత ఆకర్షణకు గురైన కొందరు ప్రజలు ప్రవక్తల బోధనలను విడిచి ప్రవక్తల తదనంతరం వీరినే దేవుళ్ళుగా భావించి, రాతి విగ్రహాలను మలచి షైతాన్ ప్రభావం వలన విగ్రహారాధనకు, వ్యక్తి ఆరాధనకు గురియై ప్రవక్తల బోధనలను, గ్రంధాలను తారుమారు చేసి అపమార్గానికి గురి అయ్యారు.

చివరి అవతార పురుషుని రాకకు కారణాలు

ఈ క్రింది కారణాలను పరిశీలిద్దాం

బర్బరిజం ప్రాబల్యం వహించడం, ప్రజలు వ్యక్తిగత స్వార్ధానికి ప్రాధాన్యం ఇచ్చి ఇతరుల జీవితాలకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వని దౌర్జన్యకర ధోరణి ప్రబలడం. పాలకులు, రాజుల్లో చెడు అలవాట్లు, శిస్తుల భారం పెంచడం, సత్య ధర్మ ప్రచారకులను రాళ్ళతో కొట్టి చంపడం.
చెట్లు, చేమలు వృద్ధి చెందక పోవడం, పండ్లు, ఫలాలు పుష్పాలు ఉన్నప్పటికీ అవి చాలా అరుదుగా లభ్యం కావడం.
నదీ జలాలు ఎండి పోవడం.
అన్యాయాలు ఎక్కువ కావడం, ఇతరులను చంపి వారి సంపద కాజేయడం, ఆడపిల్లలను అమ్మడం, కొనడం, వారిని సజీవంగా హతమార్చడం.
అసమానతలు పెరగడం, సమానత్వం కనుమరుగవడం. నిమ్నోన్నత భావాలు పెరగడం, అంటరాని తనం పెరగడం.
ఏక దేవుణ్ణి వదిలి ఇతరులను ఆరాధించడం, ఈ విశ్వానికి ఒక్కడే దైవం అన్న మాటలో ఎటువంటి సందేహం లేదు. కాని ఆ ఏకైక దేవుని ఆరాధనను వదిలి ఇతర దేవీ దేవతలను ఆరాధించడం. చెట్లను పుట్టలను, సూర్య చంద్ర నక్షత్రాలను, దేవుళ్ళుగా భావించడం.
చెడు మంచి రూపంలో ప్రజలను భ్రమలకు గురిచేసి చివరకు వారిని నాశనం చేయడం, ఈ దుష్ట శక్తి మానవాళికి రహస్య శత్రువు.
స్వార్ధం, కామం పెరగడం. పరస్పర సహకార భావం లోపించడం. ఒకరినొకరు శత్రువులుగా భావించడం. దేవునిపై విశ్వాసం సన్నగిల్లడం. దార్మికులుగా చెలామణి కావడానికి ప్రదర్శనాబుద్ధి పెరగడం.
న్యాయం పేరిట అన్యాయానికి పాల్పడడం. న్యాయానికి దూరమై అన్యాయాల పట్ల ఆశక్తి పెంచుకోవడం.
సాధువులు, మంచివాళ్ళను రక్షించడానికి చివరి అవతార పురుషుడు జన్మించాడు.
దైవాదేశాలను ఆచరించాలన్న స్పూర్తి ప్రజలలో కొరవడడం. వేదాల పట్ల గౌరవం తగ్గడం. ఆయా ఆదేశాలను లక్ష్య పెట్టకపోవడం, ఎప్పుడెప్పుడు ప్రపంచంలో అన్యాయం అధికమవుతుందో అప్పుడప్పుడు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అవతార పురుషుడు జన్మిస్తాడు. సత్య ధర్మ స్థాపనకు ఉపక్రమిస్తాడు. (భగవత్ పురాణం; 12 : 2 : 17) ఇప్పుడు పరిశీలించవలసినదేమిటంటే ఈ పరిస్థితులు ఈ యుగంలో గడిచి పోయాయా లేక గడుస్తున్నాయా? అన్నది.

మనిషి పుట్టినప్పటినుండి ఇప్పటి వరకు దాదాపు 1,24,000 మంది దైవ ప్రవక్తలు వివిధ కాలాలలో, వివిధ జాతుల వారికి దేవుడొక్కడే అనే సందేశాన్ని ఇచ్చారు. వారిలో చివరి వారే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం). ఆయన ద్వారా దేవుడు మానవాళికి అందజేసిన చివరి దైవ శాసనమే దివ్య ఖుర్’ఆన్ గ్రంధం.

చివరి అవతార పురుషుడు అని చెప్పే ఆధారాలు

పైన పేర్కొన్న వాస్తవాల వల్ల చివరి అవతార పురుషుడు గుర్రంపై ప్రయాణిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. గుర్రాలు, ఖడ్గాల కాలం నేడు గతించింది. ఇది విమానాలు, అణుబాంబుల కాలం. కాబట్టి చివరి అవతార పురుషుడు జన్మించిన కాలం గతించిన కాలమే అని తెలుస్తుంది. అలాగే ధార్మికత పతనమై హింసాదౌర్జన్యాలు ప్రబలమైన కాలంలో అవతార పురుషుడు జన్మిస్తాడని తెలుస్తుంది. కాబట్టి చివరి అవతార పురుషుడు ఎప్పుడు జన్మించి ఉంటాడో కాల నిర్ధారణ కూడా మనకు స్పష్టమైంది.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారి విశిష్టత

దేవుడు మొట్టమొదటి ప్రవక్త ఆదమ్ (అ.స) దగ్గర నుండి మహా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వరకు అనేక మంది ప్రవక్తల్ని ఈ భూమి పై పుట్టించాడు. ఇందులో ఆదమ్ (అ.స.) దగ్గరి నుండి ప్రవక్త యేసు వరకు వచ్చిన ప్రవక్తలు తమ తమ జాతుల్లో దేవుని ఏకత్వమును బోధించ వచ్చిన వారు. అంటే వీరు సర్వ మానవాళి కొరకు వచ్చిన వారు కారు. ఉదా: ప్రవక్త యేసునే తీసుకోండి ఆయన బైబిల్లో ఏం చెప్పారో చూడండి.

(మత్తయి; 15 : 24) “నేను నశించిన ఇస్రాయీలి గొర్రెల వద్దకే పంపబడితినని గాని మరి యెవని యొద్దకునూ నేను పంపబడలేదు.”

మరొక చోట బైబిల్లో యేసు వారు తన శిష్యులను దైవ వాక్య పరిచయ నిమిత్తం పంపుతూ యిట్లు చెప్పెను.

యేసు వారు ఆ పండ్రెండు మందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా:

(మత్తయి; 10 : 5) “మీరు అన్య జనుల దారిలోకి వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణములో నైనను ప్రవేశింపకుడి గాని, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి.”

దీన్ని బట్టి తెలిసేదేమిటంటే యేసు వారు కేవలం తన జాతి వారికి తప్ప సర్వ మానవాళికి ప్రవక్తగా పంపబడలేదు. ఇలా అన్ని కాలాల్లోను, ప్రపంచంలో అన్ని జాతుల్లోనూ దైవ ప్రవక్తలు జన్మించి ఆయా వేష భాషల్లోనే దేవుని ఏకత్వాన్ని బోధించారు. అయితే ఈ కలియుగంలో దేవుడు సర్వ సృష్టి కొరకు ఒక ప్రవక్తను పంపిస్తాడని సర్వ ధర్మ గ్రంధాలు చెప్పాయి. ఆ పరంపరలో సర్వ సృష్టి కొరకు వచ్చిన దైవ ప్రవక్తయే “ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)” వారు. అందుకే దేవుడు దివ్య ఖుర్’ఆన్ లో ఈ విధంగా సెలవిచాడు.

(ఖుర్’ఆన్; 21 : 107) “ఓ ముహమ్మద్! మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.”

(ఖుర్’ఆన్; 34 : 28) “ఓ ముహమ్మద్! మేము నిన్ను సమస్త మానవులకు శుభవార్తను అందజేసే వానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు.”

ముహమ్మద్ (స.అ.సం) అందరి ప్రవక్త:

గత ప్రవక్తలు ఒక ప్రత్యెక కాలానికో, ప్రత్యెక జాతికో పంపబడ్డారు. కానీ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) సకల మానవ జాతికై ప్రవక్తగా చేసి పంపబడ్డారు.

(ఖుర్’ఆన్; 4 : 79) “ఓ ప్రవక్తా! మేము నిన్ను సకల మానవ జాతి కొరకు ప్రవక్తగా చేసి పంపాము. దీనికి అల్లాహ్ సాక్ష్యం చాలు.”

ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) కేవలం ముస్లింల ప్రవక్త మాత్రమే కాదు. మనందరికోసం దైవ సందేశాన్ని తీసుకొచ్చిన మనందరి దైవ ప్రవక్త.

వివరణ: ఈ విధంగా భవిష్య వాణి ప్రకారం, వేద కాల మాస లెక్కల ప్రకారం కలియుగము 3,658 సం. నందు మహా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు జన్మించారు.

చివరి అవతార పురుషుని గుణగణాలు
గుర్రపు స్వారీ: చివరి అవతార పురుషుని గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఆయన ఆశ్వారూరుఢని, ప్రయాణ సాధనంగా గుర్రాన్ని వాడారని తెలుస్తుంది. ఆయన గుర్రాన్ని స్వారీ చేస్తూ వస్తారని ప్రస్తావనల్లో కనబడుతుంది. ఆ గుర్రం పేరు ‘దేవదత్’ గా కూడా ప్రస్తావనలలో ఉంది. ఆ పేరుకు అర్ధం దేవదూతలు ఇచ్చిన వాహనం అని అర్ధం.
కత్తిసాములో మేటి : చివరి అవతార పురుషుని గురించి కనబడే ప్రస్తావనలలో ఆయన కత్తి సాములో మేటి అనికూడా మనకు తెలుస్తుంది. శత్రువులు ఖడ్గ ప్రహారాలతో నిర్మూలించబడతారని ప్రస్తావనలలో ఉంది. అంతేతప్ప అణుబాంబుల వల్ల అని కాదు. అయితే ఈ విషయమై మనం ఆలోచించ వలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలం అణుయుగం అంతేగాని ఖడ్గయుద్ధాల కాలం కాదు. ఇంకా చివరి అవతార పురుషుని లక్షణాలు పరిశీలిస్తే ఆయన వస్త్ర ధారణ, ఆ కాలానికి, ప్రదేశానికి, అప్పటి సాంప్రదాయాలకు తగినట్లు ఉంటుందని తెలుస్తుంది. ఆయన తాను జన్మించిన సముదాయం వారి వ్యవహార శైలి కలిగి ఉంటారని కూడా తెలుస్తుంది.
మొత్తం ఎనిమిది గుణగణాలు కలిగి ఉండడం: పురాణాలు ఈ అవతార పురుషుని ఎనిమిది గుణగణాలు వర్ణించాయి. అవన్నీ చివరి అవతార పురుషునిలో కనబడతాయి.
ప్రపంచ పరిరక్షకుడు: జగత్ పతి అనగా ప్రపంచాన్ని రక్షించేవాడని అర్ధం.
దుర్గుణాలను అణచడం: చివరి అవతార పురుషుని గుణగణాలలో ముఖ్యమైనది ఆయన దుర్మార్గులను అణిచివేస్తాడు, మంచి వాళ్ళను రక్షిస్తాడు.
నలుగురు సహచరుల సహకారంతో పనిచేస్తాడు: భారత్ అనగా సహాయం చేసేవాడని అర్ధం. చివరి అవతార పురుషునికి నలుగురు సహాయకులు ఉంటారు. వారు ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు.
దేవతల సహాయం: స్వర్గం నుంచి దేవదూతలు దిగివచ్చి ధర్మ ప్రచారానికి, దుష్టశిక్షణకు సహాయపడతారు. (కల్కిపురాణం; అధ్యాయం 2, శ్లోకం 15)
కలిని నిరోధించడం: కలిని లేదా షైతాన్ ను నిరోదిస్తారు.
చివరి కాంతి: చివరి అవతార పురుషుని కాలంలో ఏ కాలంలోనూ లేనంత ప్రకాశవంతమైన కాంతి ఉంటుంది. అలాంటి ప్రకాశం మరే అవతార పురుషునికి లేదు.
రాజుల రూపంలో ఉన్న దోపిడీ దారులను నిర్మూలించడం: రాజుల రూపంలో ఉన్న దోపిడీ దారులందరినీ చివరి అవతార పురుషుడు నిర్మూలిస్తాడని భగవత్ పురాణం చెబుతుంది. (భగవత్ పురాణం; 12-2,16, ప్రపంచ పరిరక్షకుడు ఎనిమిది గుణగణాలను కలిగి ఉంటాడు. దేవతలు ఇచ్చిన శరవేగంగా వెళ్ళే గుర్రాన్ని స్వారీ చేయడం, తన కరవాలంతో దుర్మార్గులను అంతం చేయడం, రెండవ, నాల్గవ, ఐదవ గుణాలను భగవత్ పురాణం వర్ణించింది. కల్కి పురాణం అధ్యాయం, 2 శ్లోకం 5 ప్రకారం “ఓ దైవమా! నేను నలుగురు సహచరులతో కలిసి దుష్ట శక్తిని నాశనం చేస్తాను. (12-2,16)” భగవత్ పురాణం ; 12-2,20 శరవేగంగా పరుగెత్తే గుర్రంపై స్వారీ చేస్తూ ఆయన, సాటి లేని ప్రకాశం కలిగిన ఆయన రాజుల రూపంలో ఉన్న దోపిడీ గాళ్ళను నిర్మూలిస్తాడు.)
శరీర సువాసన: చివరి అవతార పురుషుని శరీర సువాసన వాతావరణాన్ని అలుముకుని ప్రజల హృదయాలలో పరివర్తన తీసుకువస్తుంది.
అతి పెద్ద సమాజానికి బోధకుడు: చివరి అవతార పురుషుడు అతి పెద్ద సమాజానికి, సముదాయానికి బోధకుడుగా ఉంటారు. ధర్మానికి దూరమైన వారిని శిక్షిస్తారు. వారిని సన్మార్గానికి తీసుకు వస్తారు.
మాఘ మాసం 12వ రోజున జన్మిస్తారు: చివరి అవతార పురుషుడు మాఘ మాసం శుక్ల పక్షం 12 వ తేదీన జన్మిస్తారని కల్కి పురాణం చెబుతోంది.
సంభల్ కు చెందిన అత్యున్నత పూజారి కుటుంబంలో జన్మిస్తారు: ఆయన జననం శంభల్ ప్రాంతంలో విష్ణుప్రకాశం కల్గిన ఒక పెద్ద పూజారి కుటుంబంలో సంభవిస్తుంది. ఆయన తల్లి పేరు సుమతి. ఈ లక్షణాలన్నీ చివరి అవతార పురుషునికి సరి పాలుపోతాయి.
(1.భగవత్ పురాణం 12, అధ్యాయం, 2, శ్లోకం 21, 2. కల్కి పురాణం, అధ్యాయం దాక్తియా శ్లోకం 15, 3. భగవత్ పురాణం 12, 2- 16, 4. కల్కి అధ్యాయం 2, శ్లోకం 4, 11)

చివరి అవతార పురుషుని కాలం

భారత దేశంలోని ధార్మిక గ్రంధాలు నాలుగు దశలుగా ఉన్నాయి.

1. సత్య యుగము: ఈ యుగ కాలం 17,28,000 సంవత్సరాలు

2. త్రేతాయుగం: సత్య యుగం తర్వాత త్రేతా యుగం వచ్చింది ఈ యుగం 17,28,000 సంవత్సరాలు

3. ద్వాపర యుగం: ఈ యుగం 8,64,000 సంవత్సరాలు

4. కలియుగం: ఈ యుగం 4,30,000 సంవత్సరాలు

అవతార పురుషుని రాకకు పూర్వం భూమండలం, ప్రజలు దౌర్జన్యాలు, అన్యాయాలతో సతతమైపోతారు. ఆ తర్వాత అవతార పురుషుని ఆగమనం జరుగుతుంది. ఈ విషయమై భగవద్గీత ఈ విధంగా తెలియజేస్తుంది:

పాదసూచికలు : ఋగ్వేదం; 10-60-12, అధర్వణ వేదం; 16-1,6, 31-11, 3-12-5

కలియుగంలో చివరి అవతార పురుషుడు జన్మిస్తాడన్నది తధ్యం. కలియుగం 5071 సంవత్సరాల పూర్వం ప్రారంభమయ్యింది. చివరి అవతార పురుషుడు కలియుగం ప్రారంభమై కొంత కాలం గడిచిన తర్వాత జన్మిస్తాడు. అంటే పరిస్థితులు పూర్తిగా దిగజారి పోయి పట్టెడన్నం కూడా లభించని దయనీయ స్థితి నేలకోన్నప్పుడు జన్మిస్తాడు. ఇక్కడ గమనించ వలసిన మరో ముఖ్య విషయమేమిటంటే చివరి అవతార పురుషుడు యుద్ధాల్లో ఖడ్గాలు ఉపయోగిస్తున్న కాలంలో, ప్రయాణానికి గుర్రాలు ఉపయోగిస్తున్న కాలంలో జన్మిస్తాడని భగవత్ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రపంచ పరిరక్షకుడు శరవేగంగా పయనించే గుర్రంపై, దైవదత్తమైన ఖడ్గంతో, ఎనిమిది దైవిక లక్షణాలతో శత్రువులను అంతం చేస్తాడని ఉంది. ప్రస్తుత కాలం ఖడ్గాలు, గుర్రాల కాలం కాదు. ఇది అణు బాంబులు, యుద్ధ టాంకర్ల కాలం. కాబట్టి చివరి అవతార పురుషుడు ఆ కాలంలో జన్మించి ఉండాలి. యుద్ధాల్లో ఖడ్గాలు, గుర్రాల ఉపయోగం నేటికి 1400 సంవత్సరాల క్రితం జరిగేది. ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత గన్ పౌడర్ అరేబియా లో కనుగొనడం జరిగింది. గన్ పౌడర్ ను బొగ్గు, సోడా మిశ్రమంతో తయారు చేసేవారు. ఇంకొక ముఖ్య విషయమేమిటంటే చివరి అవతార పురుషుని జననం తేదీ కూడా కల్కి పురాణం పేర్కొంటుంది. మాధవ మాసం, శుక్ల పక్షం; 12 వ తేదీగా పేర్కొంటుంది.

1. గత్ కాలి 5069 పంచాంగం 2025
2. భవత్ పురాణం; సంపుటం 12, అధ్యాయం 2, శ్లోకం 17
3. భవత్ పురాణం; సంపుటం 12,అధ్యాయం 2, శ్లోకం 19
4. కల్కి పురాణం; అధ్యాయం 2, శ్లోకం 15

కల్కి అవతారం ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఇద్దరి మధ్య పోలికలు చూస్తే:

1. గుర్రపు స్వారీ ఖడ్గచాలనం: భగవత్పురాణం ద్వాద్విశసిఖండం, ద్విత్య అధ్యయం 19వ శ్లోకం ప్రకారం కల్కి అవతారం దేవతలు ఇచ్చిన గుర్రంపై స్వారీ చేస్తారని ఉంది. ఆయన దుష్టులను ఖడ్గముతో అంతమొందిస్తారని ఉంది. దేవతలు ప్రసాదించిన ఆ గుర్రం అత్యుత్తమమైనది. ఆ గుర్రంపై స్వారీ చేస్తూ ఆయన దుష్టులను నిర్మూలిస్తారు. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) కు దైవికంగా లభించిన గుర్రం అది. ఆ వాహనం పేరు బుర్రాఖ్. ఆయన ఆ వాహనంపై స్వారీ చేస్తూ గగనారొహణం చేశారు. ఆ వాహనం ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) కు ఇష్టమైన వాహనం. ఆయన వద్ద చాలా గుర్రాలుండేవి. ప్రవక్త సహచరులు హజ్రత్ అనస్ (ర. జి) ప్రకారం ఆయన ప్రవక్త మెడకు ఖడ్గం వేలాడుతుండగా ప్రవక్త గుర్రంపై స్వారీ చేయడాన్ని ఆయన చూశారు. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వద్ద చాలా ఖడ్గాలుండేవి. అందులో ఒకటి ఆయనకు వారసత్వం లో లభించింది. రెండవ ఖడ్గం జుల్ఫికర్ మూడవ ఖడ్గం ఖలాల్ ఈ మూడు ఖడ్గాలు ఆయనకు ఇష్టమైనవి.
2 2. జగత్ గురు: భగవత్ పురాణం ప్రకారం చివరి అవతార పురుషుడు జగత్ గురుగా ప్రఖ్యాతి చెందుతారు. అంటే ప్రపంచాన్ని పరిరక్షించేవాడు. తన హితబోధల ద్వారా ఆయన పతనమౌతున్న సమాజాన్ని పరిరక్షిస్తాడు. ఇక్కడ సమాజం అంటే ఒక పరిమిత సమూదాయము కాదు. పూర్తి ప్రపంచమే ఆయన సమాజం. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) గురించి దివ్యఖుర్ ఆన్‌ ఇదే విషయాన్ని చెబుతుంది. పూర్తి ప్రపంచానికి దేవుని సందేశాన్ని అందించే ప్రవక్తగా ఆయన్ను ప్రబోధించింది.
(1. ది హిస్టరీ ఆఫ్ స్ట్రగుల్ బిట్వీన్‌ సైన్‌స్‌ ఆండ్ రెలిజియన్‌, డ్రాపర్‌ (సీరతున్నబీ) నుంచి గ్రహించడం జరిగింది.
(2. భగవత్ పురాణం ద్వాదశ్ ద్వితియ్ అధ్యాయ్ శ్లొక్ 19, బుర్రాఖ్ చిత్రాన్ని ఆర్గనైజర్ పత్రిక 1969, ఫిబ్రవరి 8 వ తేదీన ప్రచురించింది.
(3. అసా ఉస్సియార్, పేజి 565, జమావుల్ ఫవాయిద్ సంపుటం 2, పేజి 179.
(4. బుఖారి
(5. అమ్‌హు సింయర్‌, పేజి 498.
(6. భగవత్ పురాణం ద్వాదశ్ ద్వితియ్ అధ్యాయ్ శ్లొక్ 19.
(7. సూరే ఆరాఫ్; ఆయత్ 158.
3. అసాధు దమన్‌: కల్కి గురించిన ప్రస్తావనల్లో ఆయన దుష్టులను నిర్మూలిస్తాడని ఉంది. ఈ ప్రస్తావన ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) కు పూర్తిగా వర్తిస్తుంది. దివ్య ఖుర్ఆన్‌ ప్రకారం క్రూరత్వానికి గురైన వారికి ప్రతిఘటించే అనుమతి పూర్తిగా ఉంది. దేవుడు వారికి సహాయం చేయగల సమర్ధుడు. దేవుడు ఒక్కడే అన్నందుకు దైవారాధకులను వారి ఇళ్ళనుండి గెంటివేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) దుర్మార్గులను, దుష్టులను సంస్కరించారు. ఏకదైవారాధన గురించి వారికి హితబోధ చేశారు. బహుదైవారాధన లోని చెడును గురించి వారికి వివరించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఇస్లాం అన్నది కొత్త మతం కాదని, దేవుని యందు విధేయత ఇస్లామని తెలియజేశారు. వేద్ అన్న పదానికి దేవుని స్వరం అని కూడా అర్ధం ఉన్నది. దైవాదేశాలను అమలు చేసే ధర్మం వైదిక ధర్మం. అంటే ఇస్లాం కు వైదిక ధర్మానికి పోలికలున్నాయి. ఈ రెంటినీ అనుసరించని వారిని నాస్తికులు లేదా అవిశ్వాసులు అని అంటారు. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) జన్మించిన కాలంలో దోపిడీగాళ్ళు, దుర్మార్గులు అధికమయ్యారు. ఆడపిల్లలను హత్య చేసేవారు. పర్షియాకు మొదటి రాజు ఖబద్. ఆయన మజ్దక్ ప్రసంగం విని చాలా ప్రభావితమయ్యాడు. ఆ వెంటనే సంపద, ఆస్తులన్నీ ఉమ్మడి సొత్తులని, వ్యక్తిగతంగా ఎవరికీ సొంతం కాదని ప్రకటించాడు. ఈ అతివాదం చివరకు ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వచ్చిన తర్వాత గాని అంతం కాలేదు. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) ఇలాంటి కుహనా అతివాదాలన్ని అంతం చేసి సత్య ధర్మం ప్రతిష్ఠించారు.
ముహమ్మద్ (స. అ. సం) వారు కల్కి అవతారమని వేద వేదాంగాలు సాక్ష్యమిస్తున్నాయి.
1 1. కల్కి అవతార పురుషుని జనన కాలం:
శ్లోకం: ద్వాదశయం శుక్ల పక్షస్య మాధవే మాసి మాధవం!!
జాతం తద్రుషతుహు: పుత్రం పేతో ద్రష్ మనశవు!!
(కల్కి పురాణం; అంశం 1, అధ్యాయం, 2, శ్లోకం 15)
అర్ధం: కల్కి అవతార పురుషుడు వైశాఖ మాసం శుక్ల పక్షములో సోమవారం తెల్లవారు ఝామున జన్మించును.
వివరణ: పై శ్లోకం వివరించిన విధంగానే మహా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారు వైశాఖ మాసం శుక్ల పక్షం సొమవారం తెల్లవారు జామున జన్మించారు.
2. కల్కి అవతార పురుషుని తల్లి దండ్రుల నామ ధేయములు:
శ్లోకం: తఛ్యుత్వ పుండరీకాక్షో బాహ్మణమిదమ్‌ బ్రవీత్!
శంభలే విష్ణుయశసోగ్రహే పాదురేభవయహం!
సుమత్యం మతురివిభో! కన్యాయం తన్ని దేశత:
(కల్కి పురాణం అంశం 1 అధ్యాయం, 2, శ్లోకం 4)
అర్ధం: కల్కి అవతార పురుషుడు కమల నయనములు కవాడై ఆ పరబ్రహ్మ గ్నానమునకు కారణమైన వాడై, శంబల గ్రామమందు అనగా భూమి నాభి స్థానమందు విష్ణు భక్తునికి, సుమతికి జన్మించును.
వివరణ:
1. మహా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారు కమల నయనములు కలిగి ఉంటారు.
2. వీరు ఆ పర బ్రహ్మ అల్లాహ్ జ్ఞానం పొందినవారు.
3. వీరి తండ్రి పేరు “విష్ణుయశసో” అనగా తెలుగులో దేవుని భక్తుడు అని అర్ధం. అలాగే ముహమ్మద్ (స. అ. సం) వారి తండ్రి పేరు ‘అబ్దుల్లాహ్’ అంటే తెలుగులో “దేవుని భక్తుడు” అని అర్ధం. అలాగే వీరి తల్లి పేరు “సుమతి” అని చెప్పబడింది. సుమతి అంటే తెలుగులో ‘శాంతిదాయక హృదయం కల స్త్రీ’ అని అర్ధం. ముహమ్మద్ (స. అ. సం) వారి తల్లి పేరు అమీనా. అమీనా అనగా తెలుగులో ‘శాంతిదాయక హృదయం కల స్త్రీ’ అని అర్ధం. అరబ్బీ భాషలోని వీరి పేర్లు పురాణాల్లో సంస్కృతంలో చెప్పబడ్డాయి. భాష మార్పేగాని భావం ఒక్కటే. పై శ్లోకముల వలన కల్కి మహా పురుషుడు ముహమ్మద్ (స. అ. సం) వారేనని సాక్ష్యాధారాలతో ఋజువగుచున్నది.
జన్మ స్థానం గురించి వివరణ:
కల్కి జన్మ స్థానం శంభల్. ఆయన ఒక పూజారి ఇంట్లో జన్మిస్తారు. ఆ పూజారి పేరు విష్ణుయశ్. ఈ పేర్లన్ని సంస్కృతంలో ఉన్నాయి. ఈ పేర్లు గుణవాచకాలు కావాలి లేదా అరబ్బీ నుంచి సంస్కృతంలో అనువాదం చేయబడిన పదాలు కావాలి. కాబట్టి ఈ పదాల అర్ధాలను తీసుకుని పరెశీలించడం ఉత్తమం. శంభల్ అంటే శాంతి నిలయం. మక్కా నగరానికి అరబ్బీలో (దారుల్ అమన్‌) శాంతి నిలయం అని అంటారు. ఇస్లాం అంటే దేవునికి విధేయత చూపడం. అంటే సంస్కృతంలో సనాతన ధర్మం లేదా ఆస్తికత్వం అని అర్ధం.
పూజారి ఇంట్లో జననం: కల్కి అవతారం ఒక పూజారి ఇంట్లో జన్మిస్తారని ఉంది. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) కూడా ఒక పూజారి ఇంట్లో జన్మించారు. కాబా గృహానికి అప్పట్లో ధర్మకర్తలుగా ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు.
తల్లి దండ్రులకు సంబంధించిన వివరణ: కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం తల్లి పేరు సుమతి. అంటే మృదుస్వభావం కలిగిన నెమ్మది కలిగిన మహిళ అని అర్ధం. తండ్రి పేరు విష్ణుయశ్. అంటే స్వఛ్చమైన దేవుని ఆరాధకుడు అని అర్ధం. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) తల్లి పేరు ఆమినా. తండ్రి పేరు అబ్దుల్లాహ్. ఈ పేర్ల అర్ధాలు కూదా పైన పేర్కొన్నవే.
చివరి అవతార పురుషుని అవతరణ: కల్కి అవతారం చివరి అవతారం. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) కూడా చివరి దైవ ప్రవక్తగా పేర్కొనబడ్డారు. అందువల్లనే ముస్లిములు ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) తర్వాత ఏ ప్రవక్తను విశ్వసించడం జరగదు. కల్కి అన్న పదానికి నిఘంటువు అర్ధం ఏమిటంటే సీతాఫలాలు తిని మరకలను కడిగేవాడని. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) కూడా ఖజ్జూర ఫలాలు తినేవరు. ఆయన దైవ తిరస్కారం వంటి మరకలను కడిగేవారు.
ఉత్తరం నుండి రావడం మరియు ప్రసంగం:
కల్కి పురాణం ప్రకారం కల్కి జన్మించిన తర్వాత ఒక కొండ దిశగా వెళతారు. అక్కడ పరుశురాముని ద్వారా విధ్యాభ్యాసం పొందుతారు. (పరశురామ్‌ ఒక గుహలో కల్కి అవతారానికి జ్ఞాన బోధ చేశారు. ఇక్కడ పరశురామ్‌ = దైవ దూత జిబ్రాయీల్, కొండ గుహ = హిరా గుహ. (సర్వరే ఆలమ్‌ పేజి 21, కల్కి అవతారం తన దేశంలో ఉత్తర దిశగా ప్రయాణం చేస్తారు. తర్వాత కొంత కాలానికి విజేతగా తిరిగి వస్తారు. ఇది మక్కా నగరం నుంచి వలస మదీనా నగరానికి తరలిపోవడం, తిరిగి రావడాన్ని సూచిస్తుంది.) ఆ తర్వాత ఉత్తరానికి వెళ్ళి తిరిగి వస్తారు. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) కూడా ఒక కొండ దిశగా వెళ్ళారు. దైవదూత జిబాయీల్ ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. ఆ తర్వాత దివ్య ఖుర్ ఆన్‌ అవతరణ ప్రారంభమయ్యింది. ఆ తర్వాత ఆయన ఉత్తర దిశగా మదీనా నగరానికి వెళ్ళారు. ఆ పిదప ఆయన దక్షిణానికి మళ్ళీ వచ్చి తన జన్మ ప్రదేశాన్ని సందర్శించారు. పురాణాల్లోనూ ఈ సంఘటనలు ఇలాగే వర్ణించబడ్డాయి.
4. కల్కి పురుషుని జననాంగం:
పూర్వం శౌనకాదియ మహామునులు చేసిన సభకు నూతన మహర్షి విచ్చేసెను. అతనిని చూచి ఋషులందరూ తగు రీతిన ఆదరించి కుశలమడిగి అతనిని యిట్లు ప్రశ్నించిరి. “ఓ నూతన మహర్షి నీవు సకల ధర్మా ధర్మ విచారుండవు సమస్త పురాణవేత్తవు. భగవత్కౌద కాలక్షేపమున మాకు విందుకూర్పుము. త్రికాలవేదివి నీవెరుగని విషయాలు లేవు. కలియుగమునందు కల్కి మూర్తి ఎచట జన్మించును? అని ప్రశ్నించిరి.
దానికి నూతన మహర్షి యిట్లు చెప్పెను.

శ్లోకం: “ఏతస్ మిన్నతరే మ్లేశ్చ ఆచార్యేణ సమన్విత:
మహమ్మదం ఇతిఖ్యాత శిష్యశాఖా సమన్విత:
నృప శ్ఛైవ మహాదేవం మరుస్థల నివాసినమ్‌”
(భవిష్యత్ పురాణం, ప్రతిసర్గ పర్వం – 3, అధ్యాయం-3, శ్లోకం 5-8)

అర్ధం: అపటికి ధర్మం అస్తమించి అధర్మం క్రమ్మజొచ్చెను. యింతలో మ్లేశ్చుల (పర భాషా పరదేశీయులు) దేశమునందు ఆ పరమాత్కిక కల్కి మహా పురుషుడు “ముహమ్మద” అను నామ ధేయంతో సుప్రసిద్ధి గాంచు శిష్యులతో వేంచేయును. ఆయన ఎడారి ప్రాంతానికి చెందిన వారై ఉంటారు.
వివరణ:
1. పైన శ్లోకం ఖచ్చితంగా పరభాషా (అరబ్బీ) పరదేశము (అరేబియా) నందు కల్కి మూర్తి జన్మిస్తాడని తెలుపుతుంది.
2. కల్కి మూర్తి పేరు ముహమ్మద్ (స. అ. సం) అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది నిజంగా సంభ్రమాశ్ఛర్యం కలిగించే విషయం.
3. ఈయన ఎడారి ప్రాంతానికి చెందినవారై ఉంటారని తెలియజేస్తుంది. ఈ విధంగా ఎడారి ప్రాంతానికి చెందిన ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) ఒక్కరే.
4. ఈయన శిష్యులు ఖలీఫాలుగా ధర్మవేత్తలుగా ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచారు. కనుక ఆ కల్కి మహా పురుషుడు ముహమ్మద్ (స. అ. సం) అని రూఢీ అవుతుంది.
యింకా ఆ కల్కి మహా పురుషుని శుభనామం ఏమై ఉంటుందో కూడా భవిష్యత్ త్రేత్ర ఉపనిషత్ తెలిపింది. ఓ శ్లోకంలో ఇలా ఉంది.
శ్లోకం: “ఆది అధ్యాత్ తిచ్ భూవాని – తస్తాదన్నం తధుచ్చతే
అహమన్నం-మహమన్నం-అహమద్దాదో-మహమద్దాదో-అహమద్దధ:”
దీని భావమేమిటంటే కల్కి అవతార పురుషుని శుభ నామం అహ్మద్ మహమ్మద్ అయివుండునని తెలుపుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) కే అహ్మద్, మహ్మద్ అని పేరు.
పుస్తకం పేరు : కలియుగాంతం కాల జ్ఞానం
రచయిత : డా! వేద్ వ్యాస్ IAS, Phd
ప్రచురించబడిన సం!! : 1994
క్రీస్తు తర్వాత ప్రవక్త అయిన ‘మహ్మదు’ గురించి “భవిష్య పురాణం” ఏం వ్రాసిందో చూస్తే ఇంకా ఆశ్ఛర్యమేస్తుంది.
ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) పుట్టుక:
భవిష్య పురాణంలో ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలలో వ్యాస మహర్షి వర్ణించినది ‘ముహమ్మద్’ ప్రవక్త జననాన్ని గురించి! ఆయన భవిష్యత్తును చెప్పటమే కాక ఆయన పేరు కూడా తెలిపాడు ఎంతో ఆశ్ఛర్యంగా!
“మహమ్మదం ఇతిఖ్యాత”
మ్లేచ్ఛ ఆచార్యేణ సమన్విత:” (భవిష్య పురాణం, ప్రతి సర్గ పర్వం)

అంతిమ దైవ ప్రవక్త ఈయన రాకకు పూర్వమే వేద వేదాంగాలు ఈయన వస్తారని పేరుతో సహా తెలియజేసాయి.
వేదాలలో ముహమ్మద్ (స. అ. సం)
వేదాలలో మహనీయ ముహమ్మద్ (స. అ. సం) గురించి అనేక చోట్ల ‘నరాశంస’ అనే పేరుతో ప్రస్తావించడమైనది.
శ్లోకం: “నరాశంస: యో నరౌ ప్రశస్యతే” – ఏ మానవుడైతే ప్రశంసించ బడతాడో (సాయిణ్ భాష్య, ఋగ్వేద సంహిత: 5-5-2) ఇది కర్మ ధారయ సమాసము. దీని అర్ధం ప్రశంసించ బడే మానవుడు. ముహమ్మద్ అనే అరబ్బీ పదం యొక్క అర్ధం కూడా ఇదే.
(ఋగ్వేదం; 1 వ మండలం – 13వ సూక్తం – 3వ మంత్రం.
2 వ మండలం – 3 వ సూక్తం – 2 వ మంత్రం.
5 వ మండలం – 5 వ సూక్తం – 2 వ మంత్రం.
7 వ మండలం – 2 వ సూక్తం – 2 వ మంత్రం.
10 వ మండలం – 64 వ సూక్తం – 3 వ మంత్రం.
నాలుగు ఉప వేదాలలో ఒకటైన సామ వేదం కల్కి మహా పురుషుని గురించి ఈ విధంగా తెలియజేసింది.

శ్లోకం: “అహమది పితుహు పరిమేధామృతస్య
జాగ్రాణి అహం సూర్యో ఇవాజన:
(సామవేదం; ప్రతిసర్గపర్వం, అధ్యాయం 6, మంత్రం 8)
అర్ధం: అహమద్ అనే అతను సర్వ ప్రవక్తలకు పితామహుని లాంటివాడు మరియు సూర్యుని వంటి వాడు.
అలాగే కలియుగమున వచ్చే ఈ కల్కి అవతార పురుషుని నామం ఎలా తెల్సు కోవాలో వేద వ్యాస మహర్షి తన ఉపనిషత్తులో ఓ శ్లోకాన్ని వివరించి దానిలోని పదాల్లో ఆ కల్కి మహా పురుషుని నామం వస్తుందని తెలిపారు. ఆ శ్లోకమేమిటంటే
“అకారో అఖండస్య హకారో హన్నారే మతి
మకారో మాయా బ్రహ్మండందకారం దదయాంతిశౌ”
దీని భావం సర్వానికి జీవన ముక్తిని ప్రసాదించేవాడని అర్ధం. దీనిలోని శ్లోక వాక్యాల్లోని మొదటి పదాలు కలిపితే “అహమద్” అని వస్తుంది.
యిక వేదాల్లోని నాలగవ ఉప వేదమైన అధర్వణవేదంలో కల్కి మహా పురుషుడైన మహా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారి గురించి చాలా స్పష్టంగా ఇలా ఉంది.

శ్లోకం: “ఇదం జనా ఉపశృత నరాశం నస్తవిష్యతే
షష్టిం సహస్రానవతిం చకారుమ్‌ ఆరుశమేఘ దజ్మహే
ఉష్టాయస్య ప్రవహీణో వధూమంతోద్విర్దశ
వర్షమా రధస్యని జహీడతే దివ ఈషమాణా ఉపశ్పృశ:
ఏషకృషయ్ మామహేశతం నిష్కాన్‌ దశస్రజ:
తీణీ శతన్యర్వతాం సహస్రా దశగోనామ్‌”
(అధర్వణ వేదం; 20 వ కాండం, 127 వ సూక్తం, 1-3 మంత్రం)
అర్ధం: ఓ భక్తులారా! ఈ ప్రబోధకుని మాటలు వినండి. ప్రశంసనీయుడు, ప్రశంసింపబడిన వాడు అయిన ఆ మహర్షి 60, 090 మంది మనుష్యుల మధ్య జననమొందును. ఆయన ఇరవై ఆడ, మగ ఒంటెలపై సవారీ చేస్తారు. అమోఘమైన వారి కీర్తి స్వర్గ లోకం వరకు పాకుతుంది. ఈ మహర్షి వంద బంగారు నాణెములు కలిగి ఉంటారు. పది ముత్యాల హారాలు, మూడు వందల అరబ్బీ గుర్రాలు పదివేల పశుసంపద ఉంటాయి.
ముహమ్మద్ (స.అ.సం) అనే అరబ్బీ పదానికి అర్ధం ప్రశంసనీయుడు, ఆదరనీయుడు అనే తెలుగు అర్ధాలు వస్తాయి.
పైన వివరించినట్లుగానే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు జన్మించేనాటికి మక్కా జనాభా 60 వేల 90 ఉంటుంది.
ప్రవక్తలలో ఒంటెలపై ప్రయాణం చేసిన వారు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు ఒక్కరే.
ఇక వంద బగారు నాణేలను గురించి చెప్పాలంటే అరేబియా వదిలి ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) ఆజ్ఞ మేరకు అబీసీనియా వలస వెళ్ళిన వంద మంది శిష్యులు అని అర్ధం.
పది ముత్యాల హారాలు అంటే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారిచే స్వర్గ లోక వాసులుగా ప్రకటించబడ్డ ఆయన 10 మంది శిష్యులు అని అర్ధం.
ఇక పదివేల పశు సంపద ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారి 10 వేల మంది శిష్యులు అని అర్ధం.
ఇక వేదాల్లో మొదటిది అయిన రిగ్వేదం ఏం చెబుతుందో చూద్దాం:

“అనస్వన్తా సత్పతిర్ మామహే మేగావా చేతిష్టో అసురోమ ఘోనః
(ఋగ్వేదం; మండలం 5, సూక్తం – 27, మంత్రం – 1)

పై శ్లోకానికి భావమేమిటంటే ఈ ప్రపంచాన్ని రక్షించ వచ్చిన వారే ముహమ్మద్ (స.అ.సం).

వారి మాట తీరు, జాతి, గుణ గణాలు ఆచార వ్యవహారాలు వీటి గురించి ఇలా ఉంది.

“లింగచ్చేది శిఖా హీనః శశ్రుధారి సదూషకః
ఉచ్ఛలాపి సర్వ భక్షి భవిష్యతి జనోమమ”
(భవిష్య పురాణం కాండం 3, అధ్యాయం 3 శ్లోకం – 25-27)

అర్ధం: ఆయన పుట్టుకతో లింగచ్చేది (సున్నతి వడుగులు) అయివుంటారు. తలపైన ముడి ఉండదు. గడ్డం పెంచు కుని ఉంటారు. మాంసాహారి అయివుంటారు. బిగ్గరగా గొంతెత్తి మాట్లాడుతారు. ముసలై (అరబ్బీలో ముస్లిం అని అర్ధం) అని పరిచయం చేయబడతారు.

వివరణ :
1. లింగచ్చేది అంటే మర్మాంగం సున్నతి చేసే ఆచారం. ఈ ఆచారం భారత దేశంలో లేదు. ఇది ముహమ్మద్ (స.అ.సం) గురించి చెప్పబడింది. ఎందుకంటే ఈయన తల్లి గర్భం నుండే వడుగులు (సున్నతి) అయి జన్మిస్తారు.
2. శిఖా హీనః తక్కువ జుట్టు కలిగి ఉండడం లేదా శిరో ముండనం చేయించుకోవడం. ప్రవక్తలలో ఇలా చేయించుకున్నవారు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు ఒక్కరే.
3. అలాగే ముసలై అనే సంస్కృత పదానికి అరబ్బీలో ముస్లిం అనే అర్ధం వస్తుంది.
4. ఈయన బిగ్గరగా గొంతెత్తి మాట్లాడతారు.
ఇలా ఎన్నో విషయాలు ఈయన గురించి చెప్పబడ్డాయి. యింకా భవిష్య పురాణం ఏం తెలుపుతుందంటే ఈ కల్కి అవతార పురుషునికి చతుర్విధావస్థలు ఉంటాయని తెలుపుతుంది. అవి 1. ఓంకార అవస్థ 2. వనవాస అవస్థ

3. అజ్ఞాత అవస్థ 4. యుద్ధ రంగ అవస్థ. ఇవి దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారి జీవితంలో సంభవించినవి. అవి ఏమిటో గమనిద్దాం :
1. ఓంకార అవస్థ: ఈ అవస్థ యందు ఈ అవతార పురుషుడు తపస్సునందు నిమగ్నమై దైవ సందేశమును పొందును.
వివరణ: ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు 40 సంవత్సరాల వయస్సుకు ముందు ఏకాంతవాస ప్రియులై కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న హీరా గుహలో రేయింబవళ్ళు దైవ ధ్యాన నిమగ్నులై ఉండేవారు. అక్కడ వారికి తేజస్సు కనబడుతూ నిజమైన కలలు కలుగుతూ ఉండేవి. ఏ కల అయితే ఆయన చూశారో మరుసటి రోజు అది సంభవిస్తూ ఉండేది. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారి 40 సంవత్సరాల వయస్సు తర్వాత దైవ దూత జిబ్రయీల్ ప్రత్యక్షమై సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సందేశమును ముహమ్మద్ (స.అ.సం) వారికి వినిపించారు. వేదాల్లో చెప్పబడిన ఓంకారం తెచ్చే దైవదూత జిబ్రాయీల్ (అ.స) వారే.

2. వన వాస అవస్థ: ఈ అవస్థ యందు అవతారిక పురుషుడు తన అవతార ప్రకటన చేస్తారు. వెంటనే ప్రజలు విశ్వసించరు. వీరి వనవాస కాలంలో ప్రజలు ఒకరినొకరు విశ్వసించి వారికి శిష్యులవుతారు.

వివరణ: దైవ సందేశం అందిన తర్వాత మహా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు తాను దైవ ప్రవక్త అని తెలియ జేశారు. ముందుగా విశ్వాసుల తల్లి ఖదీజా (రజి) మరియు హజ్రత్ అబూబకర్ (రజి) ఇద్దరు విశ్వసించారు.
క్రమక్రమంగా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు తిరస్కారుల బహిష్కరణకు గురై వనవాసము నందు 3 సంవత్సరాలు గడపవలసి వచ్చింది.

3. అజ్ఞాత అవస్థ: ఈ అవస్థలో అవతార పురుషుని గురించి కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.
వివరణ: ఈ అవస్థ యందు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు మక్కా నుండి మదీనా కు వెళ్ళారు. ఈ సందర్భము నందు ప్రవక్త ముహామాద్ (స.అ.సం) వారు అజ్ఞాతంలోకి వెళ్ళారని తిరస్కారులు భావించారు. ఈ మధ్య కాలం అజ్ఞాతవాసంగా గుర్తించబడింది.

4. యుద్ధ రంగ అవస్థ : అధర్మమునకు వ్యతిరేకంగా ఈ కల్కి అవతార పురుషుడు యుద్ధం చేస్తారు.

వివరణ: దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు ధర్మం పై యుద్ధ ప్రకటన గావించిన తర్వాత దైవ తిరస్కారులతో బదర్ యుద్ధం చేశారు. ఈ బదర్ యుద్ధం గురించి కల్కి పురాణంలో చెప్పబడింది.

“యూత్ యామం భువం దేవాః స్వంషవతరణో రతః” (కల్కి పురాణం – అధ్యాయం – 2 శ్లోకం – 7)

అర్ధం: దేవతలు రణరంగంలో కల్కి మహా పురుషునికి సహాయం చేస్తారు.

వివరణ: బదర్ యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) అనుచరులు కేవలం 313 మంది మాత్రమే. కాని అవతలి పక్షం వాళ్ళు 1200 మంది. ఈ యుద్ధమునందు దేవుని యొక్క దూతల సహాయంతో విజయం ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారిని వరిస్తుంది.

ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారికి చతుర్విధ అవస్థలు సంభవించినవి.

కలిని నలుగురు సోదరులతో ఓడించడం: కల్కి పురాణం ప్రకారం కల్కి తన నలుగురు సోదరులతో కలిసి కాళీ సాతానును ఓడిస్తారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) తన నలుగురు సోదరులతో అంటే హజ్రత్ అబుబకర్ (రజి) హజ్రత్ ఉమర్ (రజి), హజ్రత్ ఉస్మాన్ (రజి) మరియు హజ్రత్ అలీ (రజి) లతో కలిసి దుష్ట శక్తులను ఓడించారు. ఏక దైవారాధక ధర్మాన్నిబోధించారు.

సంపూర్ణ ప్రకాశం: కల్కి అవతారం గురించి ఎమున్నదంటే ఆయన సంపూర్ణ కాంతి కలిగి ఉంటారు. ఆయన చాలా అందంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) కూడా మానవాళిలో అత్యంత అందమైన వ్యక్తి. అందరికన్నా ఆదర్శవంతుడు. అన్నింటికి మించి గొప్ప యోధుడు.

శరీర సువాసన: శ్రీ మద్ భగవత్ పురాణం ప్రకారం కల్కి అవతారం శరీర సువాసన హృదయాలను పరిశుభ్రపరుస్తుంది.
ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి శరీర సువాసన ప్రఖ్యాతి గాంచింది. ఆయనతో ఎవరైనా కరచాలనం చేస్తే ఆ వ్యక్తి చేయి ఆరోజంతా సువాసనతో ఉండేది. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి పనివాడి మాటల ప్రకారం ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ ఆయన శరీర గంధము వ్యాపించేది.

ఒకసారి ఉమ్మె సులేమాన్ ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి చెమటను సేకరించారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) ఆమెతో “దాంతో ఏంచేస్తారని” అడిగితె ఆమె దానిని సువాసన ద్రవ్యాల్లో కలుపుతానని, ఎందుకంటే ఇది అన్ని సువాసనల కన్నా మేలైనది అని చెప్పారు.
(ఖుర్’ఆన్ సూరే అహ్జాబ్; ఆయత్ 9
భగవత్ పురాణం అధ్యాయం 12, పేరా 32, శ్లోకం 20
జమావుల్ ఫవాయిద్ పేజి నెం: 279 బుఖారి గ్రంధం
కల్కి పురాణం పేరా 2 శ్లోకం 4
ఆషావుస్సియాద్ పేజి 48
భగవత్ పురాణం అధ్యాయం 12, పేరా 32 శ్లోకం 21
షిమాయిలె తిర్మిజీ
అనస్ (రజి) గారి పనివాడి వ్యాఖ్య “మేము ఎల్లప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) గారి రాకను వారి శరీరం వచ్చే ఫిర్దౌస్ సువాసను బట్టి గుర్తించే వారము. విలియం మూర్ వ్రాసిన ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) జీవిత చరిత్ర నుంచి.

కల్కి మహాపురుషుని శిష్య బృందం గురించి: కలియుగాన జన్మించే కల్కి అవతార పురుషుడు చతుర్భుజుడు అని చెప్పబడింది. చతుర్భుజుడు అంటే అందరు ఏమనుకుంటున్నారంటే నాలుగు చేతులు కలవాడని భావిస్తున్నారు. కాని అదికాదు. వాస్తవం ఏమిటంటే నాలుగు భుజాల వంటి శిష్యులు కలిగి ఉంటారని అర్ధం.

శ్లోకం: “చతుర్ధి భ్రాతృర్బి ర్రేవ కలిష్యామి కలిక్షయమ్”
(కల్కి పురాణం- అధ్యాయం – 2, శ్లోకం – 5)

అర్ధం: సహోదరుల వంటి నాలుగు భుజాలతో ధర్మ సంస్థాపన చేస్తాడు.

వివరణ: ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారికి నాలుగు భుజాల వలె పని చేసి నేటి ఇస్లాం స్థితికి నాలుగు స్థంబాలు గా నిలబడిన వారు 1. హజ్రత్ అబుబకర్ (రజి) 2. హజ్రత్ ఉమర్ (రజి), 3. హజ్రత్ ఉస్మాన్ (రజి) మరియు 4. హజ్రత్ అలీ (రజి) వీరి గురించే కల్కి పురాణం నాలుగు భుజాలుగా అభివర్ణించింది. వారి సహకారం వల్లనే ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారు ధర్మ సంస్థాపన చేశారు.

దేవుని ద్వారా గుర్రం బహుకరణ: కల్కి మహాపురుషునికి దేవుడు ఒక గుర్రాన్ని బహుకరిస్తాడు. ఆ గుర్రం మహిమాన్వితమైనది. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)కు దేవుడు ఒక వాహనాన్ని బహుకరిస్తాడు. ఆ వాహనం పేరు బుర్రాఖ్, అది మహిమాన్వితమైనది.

కల్కిపురుషుని ఆత్మిక వాహనం బుర్రాఖ్ గురించి:

శ్లోకం: “ఆశ్వమాసుగగ్ యూరుహ్మ దేవదత్తం జగత్పతి:
అసినా సాదు దమన మష్టై యిశ్వర గుణాన్వితః”
(భగవత్ పురాణం – స్కంధం 12, అధ్యాయం – 2, శ్లోకం – 19)

అర్ధం: అష్ట ఐశ్వరముల వంటి గుణ సంపన్నుడైన కల్కి మహాపురుషుడు దైవదత్తమైన అశ్వాన్ని అధిరోహించి ఖడ్గముతో దుష్టులను సంహరిస్తాడు.

వివరణ: ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారు అష్ట ఐశ్వర్యములవంటి గుణ సంపత్తి గలవారు. ఈ విషయాన్ని ఈయన తిరస్కారులు సైతం అంగీకరించేవారు. వీరు దైవ దత్త మైన అశ్వాన్ని అధిరోహిస్తారని ఉంది. ఓ సారి దైవదూతలు వచ్చి దైవాజ్ఞ మేరకు దైవ దత్తమైన అశ్వం పై ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)వారిని అధిరోహింపజేస్తారు . యిదియే బుర్రాఖ్ అని చెప్పబడింది. యిది పూర్తిగా అశ్వం కాదు, అశ్వా కారంలో ఉంటుంది. సర్వ వాహన ప్రతీకగా ఉంటుంది. దీనిపై దైవదూతలు ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)వారిని దేవుని యొద్దకు తీసుకు వెళ్తారు. వీరు అచట నుండియే నమాజ్ ను (మానసిక ప్రార్ధన) ఈ లోకమునకు తీసుకు వచ్చి లక్షలాది, కోట్లాది మందిని తన “ఇస్లాం” అనే ఖడ్గముతో వారిలోని దుష్టత్వాన్ని తొలగించి ఈ కలియుగాన విశ్వాసుల్లా మార్చి ధర్మ సంస్థాపన చేయడం జరిగింది. ఈ బుర్రాఖ్ యొక్క చిత్రం ఎల్లోరా గుహ యందు చెక్కబడి ఉంది. నేటి ది హిందూ దిన పత్రికలో పై భాగమున కూడా బుర్రాఖ్ చిత్రముంటుంది. ఇంతటి ఘనమైన దైవదత్తమైన వాహనాన్ని ఏ ప్రవక్తలు అధిరోహించి ఉండలేదు. దేవుడు ఇది ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారికి మాత్రమే ఇచ్చాడు. ఇంతటి ప్రాధాన్యం ఉంది కావునే ఈ వాహనం గురించి ఓ శ్లోకంలో ఇలా వివరించ బడింది.

“త్వగారుడ మిత్ చాశం కమగ బహురూపేనాం
శుక్ మేనజ్జ్య సర్వజ్ఞ మయాదత్త గ్రుహణ్భో”
భావం: హరుని వాహనమెద్దు – హరికి తెల్లని గద్ద
నెమలి సరస్వతి వాహనమందు – ఆశ్వవాహనంబు
శ్రీ పరశునాధునిదే ఇటుల వేరు వేరు వారి వాహనముల
సకల వాహనముల ఏక వాహనం కల్కి వాహనం

ఇలా ఆత్మిక వాహనమైన “బుర్రాఖ్” ను అధిరోహించిన ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి గురించి వారి దేవదత్తమైన అశ్వం గురించి వేద వేదాంగాలు వర్ణించాయి.
అలాగే వీరి స్థూల దేహ వాహనముల గురించి కూడా కల్కి పురాణం ఏం చెప్పిందంటే అవి 1. గుర్రం 2. ఒంటె అయి ఉంటాయని తెలిపింది. ఈ రెండు వాహనములు ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)వారు అధిరోహించి ఉన్నారు. కనుక ఈ కల్కి మహా పురుషుడు వీరేనన్న సంగతి ఆలోచనా జ్ఞానమున్న ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు.

శంబల అంటే నేటి మక్కాయేనా?

కలియుగంలో పాపం హెచ్చుమీరి నప్పుడు కల్కి అవతార పురుషుడు శంబల అనే పట్టణంలో జన్మిస్తాడని వేదాలు పురాణాల్లోనూ చెప్పబడింది. అయితే ఈ శంబల అనే ప్రదేశం ఎక్కడ ఉంది? అది ఏది? అనే విషయం అనేక మంది మన మేధావులకు తొలుస్తున్న విషయం. ఈ క్రమంలో మన హిందూ దేశంలో పరిశోధన జరగక మునుపే రష్యా, చైనా, టిబెట్ వంటి దేశాల నుండి ఏంతో మంది మేధావులు ఈ సంబల అనే ప్రదేశాన్ని కనిపెట్టడానికి నానా కష్టాలు పడ్డారు. ఇలా పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు రష్యాకు చెందిన అలేగ్జాందర్ నికోలస్ రోరిక్, ప్రొఫెస్సర్ గ్రుమ్వెడల్ ప్రముఖులు. ఈ శంబల గ్రామాన్నే ‘తాషీలామా’ అనే టిబెట్ గురువు కూడా తన “ఆధ్యాత్మిక రహస్యాలు” అనే పురాతన గ్రంధంలో వివరించాడు. వీరందరి పరిశోధనా ఫలితంగా వీరు చెప్పేదేమిటంటే శంభల భూమి నాభి స్థానంలో ఉంటుందని అది నేటి మక్కాయే నని వీరి అభిప్రాయం. భూగోళ, ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం కూడా ఇదే.

ఇంకా ‘ఖమ్రాన్’ గుహలో లభించిన అత్యంత పురాతన తాళ పాత్ర గ్రంధాలను సుదీర్గంగా పరిశీలించిన తర్వాత వీరికి ఓ అద్భుత విషయం తెలిసింది. అదేమంటే ‘స్వర్గలోకపుశిల’ . ఇది కల్కి మహా పురుషుడు శంభలలో జన్మించిన తదుపరి శంభల చేరుతుందని వ్రాయబడి యున్నది. అన్ని పురాతన గ్రంధాలు మక్కాయే శంభల అని నిరూపించి నప్పుడు మరి ఈ శిల సంగతేమిటి? అని పరిశీలించినప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారి బాల్య జీవితంలో ఓ సంఘటన చదివి ఆశ్చర్యచకితులయ్యారు. అడిమిటంటే ఓ స్వర్గలోకపు శిల అక్కడి మక్కాలోని ఖురైషులకు లభించగా దానిని ఏ తెగవారు కాబా గృహ గోడనందు అమర్చవలెననే విషయం మీద జరుగుతుంది. అప్పుడు చిన్న పిల్లవాడైన ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)వారు అన్ని తేగల సర్దారులచే దుప్పటి పట్టించి శిలను అందులో పెట్టి స్వయంగా తన చేతులతో ఈ శిలను కాబా గోడ నందు అమరుస్తారు. ఈ స్వర్గలోకపు శిల కాబా గృహాన్ని సందర్శించినప్పుడు ఇప్పటికీ కనిపిస్తుంది. అంతే గాని అంతకు మించి దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఈ శిలే తాటాకు గ్రంధాలలో చెప్పబడ్డ శిలయని వీరు నిర్ధారించి కలియుగాన వచ్చిన ఆ కల్కి మహాపురుషుడు మహాప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారేనని నిర్ధారించుకొని అల్లాహ్ ను దైవ ప్రవక్తను విశ్వసించారు.

అల్లాహ్ ఆ ఎడారి నందు ఓ నీటి బుగ్గను పుట్టిస్తాడు. ఆ నాటి బుగ్గనుండి వచ్చే నీరే జమ్ జమ్ నీరు. అది ఆనాటి నుండి ఈనాటి వరకు అరేబియా ప్రాంతం మొత్తం వినియోగిస్తూ, హజ్ యాత్ర నిమిత్తం వచ్చే లక్షలాది హజ్ యాత్రికులు తమ తమ ప్రదేశాలకు తీసుకు వెళ్తున్నా ఈ నీటి బుగ్గ ఎండి పోలేదు. ఇది కూడా అల్లాహ్ యొక్క ప్రత్యక్ష మేలుకు నిదర్శనం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్త సృష్టిలోని ప్రతి విషయం కూడా అల్లాహ్ యొక్క మహత్తుకు నిదర్శనాలు. కళ్ళున్న ప్రతీ వారు దీన్ని చూడగలరు. చెవులున్న ప్రతీ వారు దీన్ని వినగలరు. జ్ఞానమున్న ప్రతీ వారు దీనిని తెలుసుకోగలరు.
వేదాలలో చెప్పబడ్డ కలియుగ మహా మంత్రం నేడు ముస్లిములు పఠించే కల్మా
“లా ఇలాహ ఇల్లల్లాహు ముహమాదుర్ రసూలులుల్లాహ్”
అర్ధం: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు ఎవరూ లేరు ముహమ్మద్ (స. అ. సం) అల్లాహ్ యొక్క ప్రవక్త (సందేశహరుడు)

ఈ మహా మంత్రాన్ని పఠించి, విశ్వసించి మోక్షం నొందవలసినదిగా కలియుగ మానవులకు మహాఋషులు బోధించారు. వేదాలు కూడా చెబుతున్నాయి. అయితే భాష వేరు కావడం వలన ఇది ముస్లిములకు చెందినది అని మనం అనుకుంటున్నాము. కాని ఇది సర్వ మానవులు ఖచ్చితంగా పఠించి, విశ్వసించి, ఆచరించవలసిన ముక్తిదాయక మహా మంత్రం. కనుకనే ప్రఖ్యాత భక్తి ఉద్యమ ఋషి తులసీదాస్ తన “సంగ్రామ్‌ పురాణ్” లో ఈ విధంగా చెప్పారు.
“లా యిలాహ హరణేపాపం యిల్లల్లాహు పరమ పదం
జన్మ వైకుంఠప్రాప్నోతి తూజపేనామే మొహమ్మదం”
అర్ధం: ఏమానవుని సర్వపాపములైనను హరించవలెనన్న, పవిత్రమైన, ఉత్తమమైన స్థానం పొందవలెనన్న దేవుడు ఒక్కడని ఆయన తప్ప ఆరాధ్యుడు లేడని ముహమ్మద్ (స. అ. సం) ఆయన ప్రవక్త యని విశ్వసించాలి.
ఇంకా తులసీ దాస్ తన హిందీ ‘సంగ్రామ్‌ పురాణ్‌’ లో యిలా చెప్పాడు.
“జబ్ సంగ్రామ్‌ కేదిన్‌ హువేబినా ముహమ్మద్ కేనయ్యా పార్‌నహోవే”
అర్ధం: ఎప్పుడైతే ప్రళయకాలమెర్పడుతుందో ముహమ్మద్ (స. అ. సం) వారితో తప్ప యితర ప్రవక్తలతో ఆకాలాన్ని దాటలేము.

కల్మా అంతటి మహత్తరమైన వచనం. కాబట్టే సిక్కు గురువు గురునానక్‌ ఈ కల్మా పఠించి ముస్లింగా మారి మక్కా యాత్ర చేసి కాబా ఆలయాన్ని సందర్శించారు.
యింకా భారతదేశంలో మలబార్ హిందూ రాజు శ్రీ “చెరమాన్‌ పెరమాళ్” అందరికంటే ముందు స్వయంగా మహా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారిని దర్శించి ఆయన సమక్షంలో ఈ కల్మా పఠించి ముస్లిం (దైవ విధేయుడు) గా మారారు. అదెలాగంటే ఓ సందర్భంలో రాజు “చెరమాన్‌ పెరమాళ్” ఆకాశంలో ఓ వింత దృశ్యం చూశారు. ఈ వింత ఇప్పటికీ ఖగోళ శాస్త్ర రికార్డులలో నమోదై ఉంది. ముఖ్యంగా బ్రిటీష్ శాస్త్ర రికార్డ్స్ లో నేటికినీ ఉన్నది. ఈ వింత రికార్డ్ అయిన తేదీని పరిశీలిస్తే ఇది మహా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) కాలంలో జరిగిందని తెలుస్తుంది. చంద్రుని పై అడుగుపెట్టిన హ్యోమోగాములు తీసుకు వచ్చిన కొన్ని రాళ్ళను బట్టి యూరప్ సైంటిఫిక్ లేబరేటరీ అనేక పరిశోధనలు చేసినప్పుడు చంద్రుడు కుదుపుకు గురియై చీలి కలిసినట్లు నిర్ధారించారు.
అసలు చంద్రునికి సంబంధించిన ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే విగ్రహారాధమూకలు జగత్ ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారి దగ్గరికొచ్చి నిజంగా నీవు దైవప్రవక్తవే అయితే మాకు ఏదైనా ఒక అద్భుతం చేసి చూపించు అని వేధించేవారు. అప్పుడు ప్రవక్త (స. అ. సం) మహనీయులు అన్ని మహిమలకు ఆధారభూతుడు సర్వసృషిటికర్తయైన అల్లాహ్ యే నని తన వద్ద ఎటువంటి మహిమలు లేవని పలికారు. అప్పుడు వారు ఏదీ నీ దేవుని ప్రార్ధించి ఆ చంద్రుని రెండుగా చీల్చి చూపమన్నారు. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారు దేవుని ప్రార్ధించి చంద్రునివైపు వేలెత్తి చూపించారు. చంద్రునిలో పెనుమార్పు జరిగి చంద్రుడు రెండుగా చీలి మళ్ళీ కలిసెను. ఈ సంఘటననే మన హిందూ దేశంలో కేరళ (మలబార్) రాజు చెరమా్న్‌ పెరమాళ్ చూశారు. ఈ అద్భుత సంఘటనకు ఆస్ఛర్యచకితుడై, రాజు తన రాజ్యంలోని పండితులను, జ్యోతిష్యులను ఈ విషయం పై చర్చించగా అందులోని జ్ఞాన సంపత్తి కలిగిన వారు ఏమని సెలవిచ్చారంటే ఓ రాజా! ఒక మహాపురుషుడు, దైవాంశ వలన జన్మించిన ఓ మహా ప్రవక్త అవతరించి ఈ కార్యము చేసి ఉన్నారని చెపారు. ప్రపంచమున ఉద్భవించిన ఆ మహా ప్రవక్త ఎవరైయుందురని రాజు పలువురితో సంప్రదించగా వ్యాపార నిమిత్తం వచ్చియున్న అరబ్బు వర్తకులు రాజుతో కల్సి ఓ రాజా! మా దేశమందు ఓ మహాప్రవక్త ఉద్భవించి యున్నారని తెలిపారు. ప్రవక్త (స. అ. సం) వారి గుణగణాలు, మహిమాన్వితమైన జీవితమును గురించి వివరించారు. అంతట రాజు తనకు మోక్షం నిచ్చుటకే దేవుడు ఈ సంఘటన చూపెనని తలచి కొంతమంది పండితోత్తములను వెంట బెట్టుకొని అరేబియా వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారిని దర్శించి ఆయన చేతుల మీదుగా “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అని “కల్మా” పఠించి విశ్వాసియై భారత దేశము నకు తిరిగి వచ్చెను. ఈ విధంగా తొట్ట తొలిసారిగా భారతదేశంలో ఇస్లాం ప్రవేశించెను.
ఈ కల్మా ముక్తిదాయక మహా మంత్రమును భారత దేశంలో అనేక మంది హిందూ రాజులు, సాధువులు పుణ్యఫలాపేక్షతో అనేక చోట్ల చెక్కించారు. నేటికినీ అనేక దేవాలయాలలో, మఠాలలో ఈ కల్మా అరబ్బీ భాషలో చెక్కి ఉండడం మనం గమనిచవచ్చు. అందులో కొన్నిటి పేరు ఏమంటే:

శ్రీ కాశీ విశ్వనాధ మందిరం బనారస్ యు. పి.
శ్రీ బాబా నానక్ గారి గురుద్వారా డేరే బాబా నానక్
శ్రీ రామేశ్వర మందిరం దక్షిణ భారత దేశం
శ్రీ కొడెక్కల్ శ్రీ బసవప్పమఠము, కర్నాటక
తింతని మానేశ్వర మఠము గుల్బర్గా కట్నాటక
కొప్పాల్ శిరస్సా మఠము కర్నాటక
కడగంచి మరులారై సంప్రదాయ మఠము కర్నాటక
శిర్హట్టి ఫకీర్ స్వామి మఠము, కర్నాటక
వర్వీ మౌనేశ్వర స్వామీ మఠము కర్నాటక
శిద్వారుడ్ శ్రీ శంకరాచార్య మఠము, కర్నాటక
శృంగేరి శ్రీ శంకరాచార్య మఠం కర్నాటక
ముస్లిములు చేసే నమాజ్ (మానసిక ప్రార్ధన) గురించి వేదవేదాంగాలు ఏమి చెప్పాయి?

అన్నింటి కంటే మరో ఆశ్చర్యకరమైన అద్భుత విషయం, భారత దేశంలో అన్ని వర్గాల వారు ఆలోచించవలసిన విషయం, మేధావులు దృష్టిని కేంద్రీకరించాల్సిన విషయమేమిటంటే ముస్లిములు ఆచరించే నమాజ్ అంటే ఏమిటి? కలియుగంలో వచ్చిన ఈ ప్రార్ధనా విధానం గురించి వేదాలు ముందే ఎందుకు చెప్పాయి? అన్ని ప్రార్ధనల కన్నా మానసిక ప్రార్ధన ఉత్తమమైనదని మనకు వేదాలు చెబుతున్నాయి. కలియుగంలో వచ్చే కల్కి మహా పురుషుడు చేసే ప్రార్ధన మానసిక ప్రార్ధన యని చెప్పబడింది. ఈ ప్రార్ధనా విధానాన్నే ప్రతి మానవుడు ఆచరించి మోక్షం పొందవలెనని వేద వేదాంగాలలోను, పురాణాలలోను తెలుపబడింది. నేడు ముస్లిములు ఆచరించే నమాజ్ (మానసిక ప్రార్ధన) గురించే యివన్నీ చెప్పబడ్డాయి.

ఈ నమాజ్ గురించి శ్రీ రామ తత్వబోధామృతంలో యిలా చెప్పబడింది.

శ్లోకం: “ప్రధమం తారకం చైవ ద్వితీయం దండముచ్చ్యతే
తృతీయం కుండలాకారం, చతుర్ధం అర్ధచంద్రకం
పంచమం బిందు సంయుక్తం ఓం నిత్య జ్యోతి రూపకం”

శ్లోకం: “అష్టాంగం చతుష్ట్ పాదం, త్రిస్థానం పంచదేహకం
ఓం నిత్యానే జాయతే బ్రాహ్మణోన భవేత్ సహి”

అర్ధం: ప్రధమం తారకం చైవ : సృష్టిలోని పక్షులను చూడుము అవి నిలబడి ఉన్నాయి. అగ్ని కూడా ఇదే స్థితిలో రగులును. ఇవి తారకం స్థితిలో నిలబడి ఉన్నవి. కనుక నీవు అదే స్థితిలో ధ్యానిన్చుము.

వివరణ: ముస్లిములు కూడా తాము చేసే నమాజ్ ప్రధమంగా ఇదే స్థితిలో నిలబడతారు.

ద్వితీయం దండముచ్చ్యతే : ఈ భూమి పై ప్రాకే జీవరాసులను చూడుము. అవి అష్టాంగా నమస్కార స్థితిలో ఉన్నవి. నీవును అదే స్థితిలో ధ్యానించుము.

వివరణ: ముస్లిముల యొక్క నమాజ్ నందు రెండవ స్థితి యిదే విధంగా ఉంటుంది.

తృతీయం కుండలాకారం : ఈ పర్వతములను చూడుము. ఇవన్నీయును కూర్చుని ఉన్నవి. భూమి కూడా కుండలాకారం స్థితిలో ఉన్నది. కనుక నీవు కూడా కుండలాకార స్థితిలో ధ్యానించుము.

వివరణ: ముస్లిముల యొక్క నమాజ్ నందు మూడవ స్థితి యిదే విధంగా ఉంటుంది.

కలియుగం నందు వస్తుందని చెప్పబడ్డ వరుణో వేదమే పవిత్ర గ్రంధం
ఖుర్’ఆన్

వేదాలు మొత్తం ఐదు. అందు నాలుగు వేదాలు కలియుగం కంటే ముందే వెలువడ్డాయి. అవి ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణవేదము, సామ వేదము. యిక ఐదో వేదము, వరుణోవేదముగా చెప్పబడింది. యిది కలియుగము నందు వస్తుందని చెప్పబడింది. పవిత్రమైన హృదయంతో నిస్పక్షిపాత దృష్టితో పరిశీలించిన నేటి దైవ గ్రంధం ప్రపంచంలో అత్యధికంగా పఠించబడుతూ, అత్యంత గౌరవించబడుతున్న దివ్య గ్రంధం ఖుర్’ఆన్ పంచమ వేదమని ఇదియే వరుణోవేదమని సాక్ష్యాధారాలతో తేట తెల్లమగుచున్నది. దీనికే బీజగ్రంధమని ప్రణవ వేదమని కూడా పేర్లు కలవు.

ఖుర్’ఆన్ అరబ్బీలో ఉన్న కారణంగా యిది మనది కాదు ముస్లిములది అని హిందూ సోదరులు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు ముస్లిములు కూడా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ యిది మనదే అనుకుంటున్నారు. కాని అసలు విషయం అది కాదు. పవిత్ర ఖుర్’ఆన్ సర్వ మానవాళికి రుజుమార్గం చూపడానికి ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) పై అవతరించినటువంటి చివరి గ్రంధం. స్వయంగా ఈ దివ్య గ్రంధం ఏమంటుందో గమనించగలరు :

(ఖుర్’ఆన్; 14: 52) “ఇదొక సందేశం, వారిని హెచ్చరించాలని, యదార్ధంగా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది (ఖుర్’ఆన్) పంపబడింది.”

దీనిని గురించి కపిల గీతలో ఇలా చెప్పబడింది.

“తారకం చైనా ఋగ్వేదో,యజుర్వేదోహి దండకం కుండల్యం సామవేదం అర్ధ చంద్రోరధర్వేదన, బిందుత్స సూక్ష్మవోదయం, తరుణో వేదకం బీజకం”

అర్ధం: ఇప్పటివరకు నాలుగు వేదాలు వచ్చినవి. ఇది అందరికి తెలిసిన విషయమే . మరి కలియుగ ప్రణవ వేదమై ఎల్లప్పుడూ చదవ బడే దైవ సర్వ వేద సారాంశమైన వరుణోవేదమే బీజ గ్రంధం. ఇంతటి మహిమాన్వితమైన పవిత్ర గ్రంధం కనుకనే వేద వ్యాస మహర్షివారు తన వ్యాస ఉపనిషత్ లో కలియుగ మానవులకు ఈ విధంగా తెలియజేశారు.

శ్లోకం: “ఇతిహాస పురాణం చందాన నరాశ్యాషి
ఇంజీలం జబ్బూరం తౌరేతాని సర్వంనే
సత్యహః తద్ ఖురానాం నామకం గ్రంధం సాగచ్చాతి”

అర్ధం: ఇతిహాసాలు, వేదాలు, పురాణాలు, ఇంజీల్, జబ్బూరు, తౌరాతు ఈ సర్వ గ్రంధములన్నియు సత్యమే. కాని ఖుర్’ఆన్ నామము గల గ్రంధం సర్వ గ్రంధ సారం కనుక దీనిని ఆచరింపుడు. ఇక్కడ మనకు అత్యంత ఆశ్చర్య పరచే విషయమేమిటంటే పైన చెప్పబడిన అన్ని గ్రంధములు దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) రాకడను తెలియపరిచాయి. కల్కి మహా పురుషుడైన దైవ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారిపై అవతరించిన గ్రంధాన్ని అనుసరిస్తే ముక్తి దొరుకుతుందని కూడా చెబుతున్నాయి.

దీనిని గురించి కల్కి పురాణం ఏం చెబుతుందో గమనిద్దాం:

శ్లోకం: “సంకల్పసిద్ధం శ్లోకే: షట్ సహస్త్ర శతాధికమ్
సర్వ శాస్త్రార్ద తత్వానాం సారం శ్రుతి మనోహరమ్”
(కల్కి పురాణం ; అంశం 3, అధ్యాయం 31, శ్లోకం 28)

అర్ధం: సంకల్పం సిద్ధించు 6వేల శతాధిక శ్లోకములతో సర్వ ప్రవక్తల ఓంకారములు కేంద్రీకరణమై శ్రుతి మనోహర రూపం దాల్చి ఈ గ్రంధం అవతరిస్తుంది.

వివరణ: పై శ్లోకం వివరించునట్లుగానే ఖుర్’ఆన్ షరీఫ్ ఆరువేల శతాధిక శ్లోకములతో అవతరించింది. సర్వ గ్రంధాల సారం ఇందులో ఇమిడి ఉంది. ఇది మానవునికి ఇహ, పరలోక సంబంధమైన విషయాలలోనూ మార్గం చూపిస్తుంది. ఒక వ్యక్తా? సమాజమా? దేశమా? ప్రపంచమా? సామాజికంగా ఎలా ఉండాలి? నైతికంగా ఎలా ఉండాలి? పరిపాలనా పరంగా ఎలా ఉండాలి? ఆర్ధికంగా ఎలా ఉండాలి? అనే విషయాలను బోధిస్తుంది.

ఎనిమిది దైవిక లక్షణాలు: భగవత్ పురాణం అధ్యాయం 12 ప్రకారం కల్కి అవతారం 8 దైవిక లక్షణాలు కల్గి ఉంటారు. అవేమిటంటే అగోచర జ్ఞానం, ఉన్నత వంశం, ఆత్మనిగ్రహం, శారీరక బలం, తక్కువగా మాట్లాడడం, పరోపకారం, కృతజ్ఞత.

ప్రవక్త భవిష్యవాణి : ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) కు భవిష్య వాణి తెలిపారు.

ఉదాహరణకు రోమన్లు పర్షియన్లకు మధ్య యుద్ధం జరుగుతున్నప్ప్పుడు రోమన్లు పరాజయం పాలయ్యారు. అప్పుడు ప్రవక్త (స.అ. సం) దైవికంగా ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే తన సహచరులకు తెలిపారు. అయితే ఖురేషీయులు ప్రవక్త (స.అ.సం) సహచరుల ద్వారా ఈ విషయాన్నీ తెల్సుకొని రోమన్లు ఓడిపోయారని తెగ సంబర పడి పోయారు. కాని 9 సంవత్సరాల తర్వాత పర్షియన్లు ఓడిపోతారని ప్రవక్త (స.అ. సం) భవిష్యవాణి తెలిపారు. ఆయన చెప్పినట్లే క్రీ. శ 627 లో జరిగిన యుద్ధంలో రోమన్లు గెలిచారు. ఈ సందర్భంగా సూరే రోమ్ అవతరించింది. అలాగే ప్రవక్త (స.అ.సం) దైవిక జ్ఞానం ద్వారా చెప్పిన అనేక సంఘటనలు చరిత్రలో నమోదయ్యాయి.

ఉన్నత వంశం: కల్కి అవతారం ఉన్నత వంశంలో జన్మిస్తుందని ఉంది. ప్రవక్త (స.అ.సం) కూడా ఉన్నత పూజారి ఇంట్లోజన్మించారు. ఆయన వంశం కాబాగృహం ధర్మ కర్తల వంశం. ప్రవక్త (స.అ.సం) క్రీ.స. 571 లో జన్మించారు. ఖురైషియుల్లోని హాషిం వంశంలో పుట్టారు. ఈ వంశానికి అరబ్బులలో గొప్ప గౌరవ ప్రతిష్టలు ఉండేవి.

1. మహా భారతం 2. ఆయన క్రీ. శ. 571లో జన్మించారు. ఉన్నత పూజారి ఇంట్లో జన్మించారు. ఆ వంశం సుదీర్ఘ కాలంగా కాబా గృహానికి ధర్మకర్తలుగా ఉన్న వంశం, ఇంట్రోడక్షన్ సెర్మన్స్ ఆఫ్ ముహమ్మద్ (స.అ.సం), లేన్ పూల్ పబ్లిషర్స్, లండన్. 3. ఆయన హాషిం కుటుంబంలో జన్మించారు. అరబ్బులలో ఆ కుటుంబానికి అత్యంత గౌరవమర్యాదలు ఉండేవి. ఆ కుటుంబం మక్కా నగరానికి కులీన కుటుంబం వంటిది. వారసత్వంగా కాబా గృహానికి పూజారులుగా ఉంటున్న కుటుంబం. (డిక్లైన్ అండ్ ఫాల్ అఫ్ రోమన్ ఎంపైర్, ఎడ్వర్డ్ గిబ్బన్, పేజి 229, వాల్యుమ్ 5)

దైవవాణి: ఇది ఎనిమిది లక్షణాల్లో నాల్గవ లక్షణం. దైవవాణి దేవుని హితబోధ ఒక సందేశహరుని ద్వారా అందడం. ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) వారికి దైవ వాణి అవతరించేది. సర్ విలియం మూర్ కూడా ఈ విషయాన్ని వివరిస్తూ ప్రవక్త (స.అ.సం) ను దేవుని ప్రతినిధిగా అభివర్ణించాడు. దీన్ని బట్టి ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం), కల్కి అవతారం ఒకటే అని అర్ధం అవుతుంది. (లైఫ్ ఆఫ్ ముహమ్మద్, సర్ విలియం మూర్)

భౌతిక శక్తి: ఎనిమిది లక్షణాల్లో ఇది ఐదవ లక్షణం. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)కు అందరికన్నా ఎక్కువగా శారీరక బలం ఉండేది. రుక్కానా అనే పహల్వాను ఒక హుగలో ఉండేవాడు. అతను ఖురైష్ వంశానికి చెందినవాడు. ప్రవక్త (స. అ. సం) అతనితో దైవాన్ని ఎందుకు విశ్వసించడం లేదు? ఎందుకు దేవునికి భయపడడం లేదు? అని ప్రశ్నించారు. ఆ పహిల్వాను ఏవేవో వివరణలు అడిగాడు. ప్రవక్త (స. అ. సం) అతనితో నీవు చాలా బలవంతుడివి, నేను కనక నిన్ను కుస్తీలో ఓడిస్తే నువ్వు దేవుని విశ్వసించడం ప్రారభిస్తావా? అని ప్రశ్నించారు. అతను అంగీకరించాడు. ప్రవక్త (స. అ. సం) అతడిని సునాయాసంగా కుస్తీలో ఓడించారు. ఒకసారి కాదు రెండు సార్లు, కాని అతను మాత్రం ఆయన్ను ప్రవక్తగా అంగీకరించడానికి, దేవుని విశ్వసించడానికి సిద్ధపడలేదు.

తక్కువగా మాట్లాడడం:
గొప్పవారి గొప్ప లక్షణాల్లో తక్కువగా మాట్లాడడం కూడా ఒకటి. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) చాలా తక్కువగా మాట్లాడేవారు. కేవలం చర్చలు, సంవాదాల్లో మాత్రమే మాట్లాడేవారు. అరేబియా ప్రజలు ఆయన మాట్లాడుతుంటే మంత్రముగ్ధులై చూస్తూ వినేవారు.
పరోపకారం: మతంలో పరోపకారం అనేది చాలా ముఖ్యమైనది. ఎనిమిది లక్షణాల్లో ఏడవ లక్షణం పరోపకారానికి సంబంధించినది. పురాణాల్లో ఈ ఎనిమిది లక్షణాల వివరాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) ఎల్లప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఇంటి ముందు బీదవారు ఎల్లప్పుడు ఉండేది. ఆయన ఎవరినీ నిరుత్సాహ పరచేవారు కాదు. సర్ విలియం మూర్ ప్రకారం చాలా అందమైన వ్యక్తి. ఆరోగ్యం, శారీరక దరుఢ్యంతో పాటు పరోపకారం కలిగిన వ్యక్తి.
1. అసాహుస్సియార్ పేజి 79, లైఫ్ ఆఫ్ ముహమ్మద్, పేజి 523.
2. ఆయన చాలా క్లుప్తంగా, సమగ్రంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడిన మాటలు ధృఢంగా, స్పష్టంగా ఉండేవి. ఆ మాటలను ఎవరూ మరిచిపోలేని విధంగా ఉండేవి. (ఇంట్రొడక్షన్‌ ఆఫ్ ది స్పీచెస్ ఆఫ్ ముహమ్మద్, లైన్‌ పూల్)
3. సహచరులతో కూర్చున్నప్పుడు ఆయన మౌనంగానే ఉండేవారు. అయితే ఏదైనా విషయమై మాట్లాడవలసి ఉన్నప్పుడు చాలా స్పష్టంగా, వాగ్ధాటితో చెప్పేవారు. భాషా పరంగా పటిష్టమైన శైలిలో సామెతలు, పలుకుబళ్ళు ఉపయోగిస్తూ అందరినీ ఆకట్టుకునేలా మాటలాడేవారు.
(ముహమ్మద్ సాహెబ్ ఆండ్ ముహమ్మడనిజమ్‌, బోస్ వర్త్ పేజి 110)
4. నిజానికి ప్రవక్త (స. అ. సం) ఇంటి ముందు ఒక అరుగు ఉండేది. అక్కడ ఎల్లప్పుడు బీదవారుండేవారు. ఆయన చేసే దానధర్మాల వల్ల జీవించేవారు. వారిని అందుకే అరుగు వాళ్ళు అని కూడా జనం పిలిచేవారు. (లైఫ్ ఆఫ్ ముహమ్మద్, విలియం మూర్ పేజి 523).
కృతజ్ఞతా భావం: ఇది ఎనిదవ లక్షణం. పురాణాల్లో పేర్కొన్న ఎనిమిది లక్షణాల్లో ఇది చివరి లక్షణం. ఇంతకు ముందు మనం ఏడు లక్షణాల గురించి వివరణ ఇచ్చాము. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) లో కృతజ్ఞతా భావం ఏ స్థాయిలో ఉండేదో ఏ చరిత్ర కారుడు కూడా కాదనలేడు. అంసార్ల గురించి ఆయన చెప్పిన మాటలే అందుకు నిదర్శనాలు.
దైవ వాణి ఆధారంగా హితబోధ: కల్కి అవతారం స్థాపించే మతం వైదిక మతమని అందరికి తెలిసిన వాస్తవం. అలాగే ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) ద్వారా అవతరించిన దివ్య ఖుర్ ఆన్‌ దేవుని వాణి. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించక పోయినా ఇది వాస్తవం. అందువల్ల ఈ మత స్థాపన, లక్షణాలు, ప్రేమ, గౌరవాదరాలు అన్నీ దైవ ప్రేరితాలే. ఇవే బోధనలు మనకు వేదాల్లోను కనబడతాయి. ఖుర్ ఆన్‌లో విగ్రహారాధనను తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఖుర్ ఆన్‌ బోధనల ప్రకారం ముస్లిములు రోజుకు ఐదు పూటల నమాజ్లు చేస్తారు. బ్రాహ్మణుల్లోనూ పూజారులు రోజుకు మూడు సార్లు సంధ్యావందనం చేస్తారు. ఇప్పుడు మనం ఖుర్ ఆన్‌, వేదాల్లో మౌలిక బోధనల్లో సారూప్యాలను చూద్దాం

Related Post