ఇస్లాం కారుణ్య ధర్మం

Originally posted 2017-03-14 17:26:56.

ఇస్లాం కారుణ్య ధర్మం. శాంతికి ప్రతీక. దివ్యావిష్కృతి దీపిక, ఆత్మ జ్యోతిని జ్వలింపజేసే తైలం, దైవ ప్రసన్నతకు అద్వితీయ సాధనం, సాఫల్యానికి సేతువు, స్వర్గానికి హేతువు. ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్‌ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్‌ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాిం ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేెసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణం లో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!

ఇస్లాం కారుణ్య ధర్మం

ఇస్లాం నేరస్థులు కానీ ముస్లిమేతరులతో మంచిగా మెలగమని ఆజ్ఞాపిస్త్తుంది. వారి విషయం లో న్యాయంగా వ్యవహరించమని ఉపదేశిస్తుంది. అలా చేసే వారికి అల్లాహ్‌ ప్రసన్నత ప్రాప్తమవుతుంది అని శుభవార్తను అందజేస్తుంది.

1) మనిషి ప్రాణానికి ఇస్లాం ఇచ్చే విలువ:

ముస్లిం-అతను ఏ భాష మాట్లాడేవాడయినా,ఏ రూపు-రంగు గలవాడయినా సరే,ఏ ప్రాంతం, దేశానికి చెందినవాడయినా సరే పాపం చెయ్యని ముస్లిమేతరులతో మంచిగా మెలగమని, వారి ప్రాణ, మాన, ధనాలను కాపాడాలని ఉప దేశిస్తుంది ఇస్లాం. వారికి ఏ విధమయినటువిం హాని తలపెట్టకూడ దని నొక్కి వక్కాణిస్తుంది.అన్యాయంగా ఒక వ్యక్తి హత్యను పూర్తి మాన వాళి హత్యగా ఖరారు చేస్తుంది. ”ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకా రంగా కాకుండా,భూమిలో అల్లకల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవుల ను చంపిన వాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు”. (దివ్యఖుర్‌ఆన్‌-5: 32)
మానవ రక్తానికి మనిషి దృష్టిలో ఎంత విలువ ఉందో చెప్పలేము కానీ, అల్లాహ్‌ దృష్టిలో ఎంత విలువ ఉందో ఈ ఒక్క వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. హత్యా నేరం ఎంత ఘోరమయినదో అర్థం చేసుకో వచ్చు.

తర్వాత అలాంటి  వ్యక్తులకు ఇస్లాం విధించే శిక్ష గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటుంది: ”ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరా డుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించ బడాలి. లేదా ఉరి కంబం ఎక్కించ బడాలి. లేదా ఎదురుగా వారి కాళ్ళూ చేతులు ఖండించాలి. లేదా వారిని దేశం నుంచి బహిష్క రించాలి. ఇది ఇహ లోకంలో వారికి కలగవలసిన పరాభవం. పర లోకంలో వారికి విధించ బడే శిక్ష (ఇంతకన్నా)ఘోరంగా ఉంటుంది”. (దివ్యఖుర్‌ఆన్‌-5: 33)
మాటు వేసి ఆయుధాలు ధరించి దాడి చేయడం, హత్యాకాండకు పాల్పడ టం, దోపిడి చెయ్యడం, కిడ్నాప్‌కు పాల్పడటం, మానభంగాలు చేయడం మొదలయినవాటికి పై ఆయతులో నాలుగు శిక్షలు పేర్కొన బడ్డాయి. సమకాలీన నాయకుడు నేర తీవ్రతను బట్టి తీర్పు జారీ చెయ్య గలడు. వ్యక్తి ముస్లిం అయినా, ముస్లిమేతరుడయినా ఈ ఆదేశం వర్తిస్తుంది.

2) ఇస్లాం న్యాయం చెయ్యమని ఆదేశిస్తుంది:

ఇస్లాం నేరస్థులు కానీ ముస్లిమేతరులతో మంచిగా మెలగమని ఆజ్ఞాపిస్త్తుంది. వారి విషయం లో న్యాయంగా వ్యవహరించమని ఉపదేశిస్తుంది. అలా చేసే వారికి అల్లాహ్‌ ప్రసన్నత ప్రాప్తమవుతుంది అని శుభవార్తను అందజేస్తుంది.
”ధర్మ విషయంలో మీపై కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చెయ్యడాన్ని అల్లాహ్‌ ఎంత మాత్రం నిరోధించడు. పైగా అల్లాహ్‌ న్యాయంగా వ్యవహరించేవారిని ప్రేమిస్తాడు”. (దివ్యఖుర్‌ఆన్‌-60: 8)

అ) ఇస్లాం ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారన్న ఒకే ఒక్క నేెపంతో వారిపై కయ్యానికి కాలు దువ్వకుండా ఉండేవారితో మంచిగా మెలగడాన్ని అల్లాహ్‌ ఇష్ట పడతాడు.
ఆ) ఇస్లాం ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంగా వారిని వారి ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా సహజీనం సాగించే ముస్లిమేతరులతో సత్ప్రవర్తన కలిగి ఉండాన్ని అల్లాహ్‌ా నిరోధించడు. పైగా సహన భావం గల ఇలాిం ముస్లిమేతరులతో సత్ప్రవర్తన కలిగి ఉండటం, న్యాయ వైఖరిని అవలంబించడం ఎంతో మెచ్చుకో దగ్గ, అల్లాహ్‌కు ఇష్టమయిన విషయం. ‘విశ్వసించని తన తల్లి పట్ల ఎలా వ్యవహరించాలి?’అని హజ్రత్‌ అస్మా(ర.అ), ప్రవక్త(స) వారిని ప్రశ్నించ గా – ”నీ తల్లి యెడల ఉత్తమంగా ప్రవర్తించు” అని తాకీదు చేశారు. (బుఖారీ)

3) యుద్ధం చేసే వారే సంధికి వస్తే సంధి చేసుకోవాలి:

ఒకవేళ ముస్లిమేతరులు ముస్లింలతో శత్రుత్వం వహిస్తూ యుద్ధానికి సిద్ధమయి, యుద్ధం మధ్యలో సంధి కోసం వస్తే, ముస్లింలు ఎంత బల పరాక్రమం గలవారయినా, శాంతిని కోరుతూ సంధి చేసుకోవాలని ఇస్లాం ఉపదేశిస్తుంది. వారితో సంధి చేసుకోవడం వల్ల స్వయంగా ముస్లింలకు ప్రమాదం పొంచి ఉందన్న సందేహం ఉన్నా సరే, అల్లాహ్‌ పై భరోసా ఉంచి, తన ప్రాణ, ధన మానాల రక్షణను అల్లాహ్‌కు అప్పగించి సంధీ రూపంలో శాంతి సుస్థిరతలను స్థాపించడానికి కృషి చెయ్యాలి.
”ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే(ఓ ప్రవక్తా!) నువ్వు కూడా సంధీ వైపు మొగ్గు చూపు. అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఒకవేళ వారు నిన్ను మోసగించదలిస్తే, నీకు అల్లాహ్‌ చాలు.ఆయనే తన సహాయం ద్వారానూ, విశ్వాసుల ద్వారానూ నీకు సహాయ పడ్డాడు”. (అన్ఫాల్‌: 61,62)

4) ఆశ్రయం కోరి వస్తే ఆశ్రయం ఇవ్వాలి:

యుద్ధంలో శత్రు వర్గానికి చెందిన ఒక వ్యక్తి ప్రాణ రక్షణకై ఆశ్రయం కోరి వచ్చినట్లయితే అతన్ని సురక్షితమయి చోటుకి చేర్చడం ముస్లింపై విధిగా చేస్తుంది ఇస్లాం. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఒకవేళ బహుదైవా రధకులలోని ఏ వ్యక్తి అయినా నీ శరణు కోరితే, అతను అల్లాహ్‌ వాణి వినేంత వరకు అతనికి నువ్వు ఆశ్రయమివ్వు. ఆ తర్వాత అతన్ని అతని సురక్షితమయిన స్థానానికి చేర్చు. వారు తెలియని వారవటం చేత వారి పట్ల ఈ విధంగా వ్యవహరించు”. (దివ్యఖుర్‌ఆన్‌-9: 06)

5) ధన, మాన, ప్రాణ రక్షణ బాధ్యత ఇస్లామీ ప్రభుత్వంపై ఉంటుంది:

ఇస్లామీయ పరిపాలన క్రింద ఉండాలనుకున్న ముస్లిమేతర సోదరుని ధన, మాన, ప్రాణ రక్షణ ఇస్లామీ ప్రభుత్వంపై ఉంటుంది. రక్షణ బాధ్య తను తీసుకున్న తర్వాత ఎవరయినా ముస్లిం అతని ధనాన్ని, మానాన్ని నష్ట పరిస్తే దానికి తగ్గ శిక్ష ఉంటుంది.ఒకవేళ హత్య చేస్తే ఇహలోకం లో అతనికి సయితం మరణ దండన విధించడమే కాక, అతను రేపు ప్రళయ దినాన స్వర్గపు సువాసనను సయితం ఆఘ్రాణించ లేడు అంటుంది ఇస్లాం. ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు:”రక్షణ కల్పించ బడిన వ్యక్తిని ఎవరయినా హత్య చేస్తే అతను (స్వర్గ ప్రవేశం చాలా దూరం) స్వర్గపు సువాసనను సయితం ఆఘ్రాణించ లేడు. స్వర్గపు సువాసన 40 సంవత్సరాలంతి దూరం నుండి ఆఘ్రాణించ బడుతుంది” అన్నారు. (బుఖారీ)
ముస్లిమేతరుడయిన వ్యక్తి-ఒక దేశ రాయబారి-అంబాసిడర్‌ అయినా, రక్షణ పొందిన సాధారణ వ్యక్తి అయినా అతనికి పూర్తి రక్షణ కల్పించడం, పరిస్థితులు బాగోలేనప్పుడు అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలిం చడం ప్రతి ముస్లింపై తప్పనిసరయి ఉంటుంది.

6) ముస్లిం సంతానం ముస్లిమేతర తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించాలి:

తల్లిదండ్రులు ముస్లిమేతరులయినా వారు బతికి ఉన్నంత కాలంవారి అవసరాల్ని తీర్చడంతోపాటు,వారి యెడల మర్యాద గా వ్యవహరించాలంటుంది ఇస్లాం. ”మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని ప్రయాస మీద ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలు విడిపించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక మానవుడా!) నువ్వు, నాకూ నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవయి ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే”. (లుఖ్మాన్‌: 14)

”ఒకవేళ నీకు తెలియని వాటిని వేటినయినా నాకు సాటిగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకు వస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమ రీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వారినే ఆదర్శంగా తీసుకో. ఆ తర్వాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మల న్నింటినీ తెలియ పరుస్తాను”. (లుఖ్మాన్‌:15)

అలాగే మనకు సామాజికంగా ఎవరితో సంబంధాలున్నా-వారు విగ్ర హారాధకులయినా, నాస్తికులయినా వారితో సామాజిక పరమయిన సత్సంబంధం కలిగి ఉండాలంటుంది ఇస్లాం.ఎందుకంటే ఉత్తమ నైతిక ప్రమాణ పరిపూర్తికై ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని ప్రభవింప జేయ డం జరిగింది గనక. అపమార్గాన ఉన్న ప్రజల్ని సన్మార్గం వైపు పిలిచే గురుతర బాధ్యత అల్లాహ్‌ ముస్లిం సముదాయంపై విధిగా చేశాడు గనక.అది అందరి శ్రేయం కోరినప్పుడే సాధ్యమవుతుంది గనక. అంటే, ఒక వ్యక్తిలో ఏదయినా అవలక్షణం, అవిశ్వాస పోకడ ఉంటే, అతనిలో ఆ అవిశ్వాస పోకడను, అవలక్షణాన్ని అసహ్యించుకోవాలి, వ్యక్తి అయిన అతన్ని కాదు.

7) ప్రత్యర్ధి పట్ల ప్రేమ:

నేడు ఏ దేశాన్ని చూసినా తన ప్రత్యర్ధి దేశం, ప్రశ్నించే సమాజమే ఉండకూడదు అన్న చందంగా వ్యహరిస్తోంది. కొందరి రాజకీయ వైఖరికి ఫలితంగా మొత్తం దేశ ప్రజలను నిప్పు కుంపటిలో నెట్టే ప్రయత్నమే అధికంగా జరుగుతున్నది. అదే మనం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి జీవితాన్ని క్షుణ్ణంగా అధ్య యనం చేసినట్లయితే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. మక్కా వాసులు, తాయిఫ్‌ ప్రజలు ఆయనకు పెట్టిన చిత్రహింసలు, మానసిక వ్యధ అంతా ఇంతా కాదు. అయినా ఆయన (స) మాత్రం వారితో మన్నింపుల వైఖరినే అవలంబించారు. తల పగిలి రక్తం కారుతున్నా, శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయినా ఆయన మాత్రం వారి శ్రేయ స్సును కోరుతూ-”దేవా! వారికి ఏమీ తెలీదు, వారికి సన్మార్గాన్ని ప్రసా దించు” అని ప్రార్థించారు. అదే మక్కా విజయ సందర్భంగా ఆయన కనబరచిన ఔదార్యం మానవ చరిత్రలోనే కని, విని, ఎరుగనిది. దాదాపు 21 సంవత్సరాలు కిం మీద కునుకు లేకుండా చేసిన, తనను చంపడానికి పనికొచ్చే ఏ ఆస్త్రాన్ని వదలకుండా ప్రయోగించిన మక్కా వాసుల్లో కరడుగ్టిన వ్యక్తుల్ని సయితం ఆయన మన్నించి పరమ ప్రభువు చేత ఉన్నత నైతిక శిఖరాగ్రంగా నీరాజనాలందుకున్నారు.

8) శాంతి స్థాపన కోసం సామరస్యం:

ముస్లిమేతరులతో సామరస్యంగా వ్యవహరించాలంటుంది ఇస్లాం. ప్రవక్త (స) వారి ఆవిర్భావ కాలం నాికి ఈరాన్‌, రోము అగ్ర రాజ్యాల మధ్య శత్రుత్వం గడ్డి వేెస్తే భగ్గుమనే స్థాయిలో ఉండేది. అదే సమయంలో మదీనాకు వలస వెళ్ళి అక్కడ నవ సమాజ నిర్మాణానికి పూనుకున్న ప్రవక్త (స), అక్కడ నివ శించే యూద, క్రైస్తవులతో ఎంతో సహన భావం, సామరస్యంతో వ్యవ హరించారు. శాంతి, సుస్థిరతల నిమిత్తం కొన్ని నిబంధనలతో కూడిన ఒక ఒప్పందాన్ని అమలు పర్చారు. విశ్వాస పరంగా అన్య మతస్థులతో విభేదం ఉన్నా వ్యవహారం, సామాజిక జీవనంలో మాత్రం ఎలాంటి పొరపొచ్చాలకు తావు ఇవ్వ లేదు. అలాగని విశ్వాస పరంగా వారితో కాంప్రమైజ్‌ అవ్వ లేదు. ఒక్క మాటలో చెప్పలంటే నేటి ప్రసిద్ధ నినాదమయిన (MUTUAL COEXISTENCE)ను క్రియా రూపంలో ప్రవక్త (స) 14వందల సంవత్సరాల క్రితమే మదీనాలో అమలు పరచి చూపారు.

9) పరిశీలన ముఖ్యం:

ఇస్లాం-శాంతి, భద్రతల దృష్ట్యా ఏదయినా ముఖ్యమయిన వార్త, సమాచారం అందినప్పుడు దూకుడుగా వ్యవరించ డానికి ఖండిస్తుంది. పూర్వపరాలు తెలుసుకోకుండా, నిజానిజాలు నిర్ధారించుకోకుండా నోరు పారేసుకోవడానికి అది గ్టిగా వారిస్తుంది. ఎందుకంటే, జాతికి, దేశానికి ఒక జఠిల సమస్య ఎదురయినప్పుడు దాని లోతుల్ని అర్థం చేసుకునే, పరిష్కరించ గలిగే సామర్థ్యం ప్రజలం దరిలో ఉండదు. అలాిం విపత్కర పరిస్థితిలో ఆ సమస్యను మేధా వులు, విజ్ఞుల దృష్టిలోకి తీసుకొచ్చి సుదీర్ఘ చర్చలు జరిపి, ఆయా రంగాలకు చెందిన నిపుణులతో సలహాసంప్రతింపులు జరిపి ఒక ఖచ్చితమ యిన నిర్ణయం తీసుకోవాలంటుంది”శాంతికి సంబంధించిన వార్తగాని, భయాందోళనల్ని కలిగించే సమాచారంగానీ ఏదయినా వారికి అంద డమే ఆలస్యం వారు దాన్ని వ్యాపింప జేస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు, విషయం లోతుల్లోకి వెళ్ళే విజ్ఞులకు చేరవేసి ఉంటే, వారు అందలి నిజానిజాలను, ఉచితానుచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావడానికి ఆస్కారముండేది. అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప-అందరూ షైతాన్‌ అనుయాయులుగా మారి పోయే వారు”. (అన్నిసా: 83)

సహాబా కాలంలో ఒక తాబయీ ప్రజా సమస్యల విషయమయి అనవసరపు జోక్యం చేసుకొని సొంత తీర్మానాలు ఇస్తూ ఉండేవాడు. అది గమనించిన ఒక సహాబీ (ర) ఆయన్ను గట్టిగా మందలించడమే కాక, ”ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) గారి హయాంలో-ఇలాిం సామాజిక పరమయిన ఏదయినా సమస్య ఎదురయితే – బద్ర్‌ సంగ్రామంలో పాల్గొన్న సహాబాలంద రిని సమైక్య పరచి వారందరి సలహా తీసకొని ఒక నిర్ణయానికి వచ్చేవారు. కానీ మీ నిర్వాకం ఎలా ఉందంటే, తొందరపాటు నిర్ణయాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు” అన్నారు. (ఎలాముల్‌ మూఖియీన్‌)

నేడు మీడియా మీద మిడి మిడి జ్ఞానం గల కొందరు మేధా(తా)వుల ధోరణి చూస్తుంటే నాడు ప్రవక్త (స) వారు చెప్పిన మాట వీరి విషయంలో నిజమవడం గమనించవచ్చు. ఆయన ఇలా అన్నారు ”కుత్సిత బుద్ధులు, కుమనస్కులు, కుసంస్కారులు, కుటిల నీతిజ్ఞుల కాలం ఒకి రానున్నది. అది వచ్చినప్పుడు అసత్యవాదిని,సత్యవంతునిగా, అవినీతి పరుణ్ణి నీతిమంతు నిగా పట్టం కట్టి గౌరవించడం జరుగుతుంది. అప్పుడు ‘రువైబిజహ్‌’ మాట్లాడుతాడు”.అది విన్న సహాబా(ర) ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! (స) రువైబిజహ్‌’ అంటే ఏమి’? అని ఆరా తీశారు.అందుకాయన (స) – ”ప్రతి నీచుడు, ప్రతి అల్పుడయిన వ్యక్తి ప్రజా సంబంధిత విషయాల్లో కలుగజేసుకుని పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తాడు” అన్నారు ప్రవక్త (స). (సునన్‌ ఇబ్ను మాజహ్‌ా)

10) యెల్లరి శ్రేయం:

ఇస్లాం-ధన, మాన, ప్రాణ రక్షణను ముస్లిం విశ్వాస పూర్ణతకు ఆనవాలుగా పేర్కొంటుంది. ”తన పొరుగు వాడు పస్తులతో ఉండ గా తాను మాత్రం పుష్టిగా భోంచేసేవాడు పరిపూర్ణ ముస్లిం కాజాలడు” అన్నారు ప్రవక్త (స). (సహీహుల్‌ జామె). వేరోక ఉల్ళేఖనంలో – ”ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు, ఎవని వెకిలి చేష్టల వల్లనయితే అతని ఇరుగు పొరుగు సురక్షితంగా ఉండరో” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (ముస్లిం)
అంటే, ఒక ముస్లిం మాట, చేష్ట వల్ల ఇరుగు పొరుగు ప్రజలకు ఎలాంటి హాని కలుగ కూడదు అన్నది ఇస్లాం ఉపదేశం. అలాంటి శాంతియుత ధర్మానికి అశాంతి, అలజడి, ఉగ్రవాద మతంగా అసత్య రంగులు పులమడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు సాగడం నిజంగా కడు శోచనీయం!

Related Post