ప్రపంచ ధర్మాల్లో దైవభావన

Originally posted 2014-12-15 10:38:17.

క్రీ.శ. 1954, అక్టోబర్‌ 24వ తేదీ 'ది అబ్జర్వర్‌' అనే పత్రికలో ప్రచురింపబడిన తన వ్యాసంలో అతనిలా వ్రాస్తాడు: ''సృష్టి పుట్టుకకు సంబంధించిన రహస్యాన్ని కేవలం ధర్మం మాత్రమే చేదించ గలదని నేను విశ్వసిస్తున్నాను.''

క్రీ.శ. 1954, అక్టోబర్‌ 24వ తేదీ ‘ది అబ్జర్వర్‌’ అనే పత్రికలో ప్రచురింపబడిన తన వ్యాసంలో అతనిలా వ్రాస్తాడు: ”సృష్టి పుట్టుకకు సంబంధించిన రహస్యాన్ని కేవలం ధర్మం మాత్రమే చేదించ గలదని నేను విశ్వసిస్తున్నాను.”

ధర్మాలు, వివిధ నైతిక వ్యవస్థలకు, మన సభ్యతా సంస్కృతుల్లో ఓ ప్రత్యేక ప్రాము ఖ్యం ఉంది. అనాదిగా మనిషి, తన పుట్టు కకు కారణమేమిటో, ఈ విశ్వంలో తన స్థానమేమిటో, తెలుసుకొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ విశ్వవ్యవస్థలో తన గుర్తింపును, తన స్థానాన్ని తెలుసుకోవ టానికి అతడు అన్ని కాలాల్లో ప్రయాస పడ్తూనే ఉన్నాడు.
ప్రఖ్యాత చరిత్రకారుడు, ఆర్‌నాల్డ్‌ టాయిన్‌బి, యుగయుగాలపై పరివేష్టించి ఉన్న మానవ చరిత్రను నిశితంగా అధ్య యనం చేయటానికి ప్రయత్నించాడు. ఆ తరువాత పది సంపుటాలపై వ్యాపించి ఉన్న తన బృహత్తర కార్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించాడు. అతను రూపొం దించిన ఈ సంపుటాల సారాంశం ఏమి టంటే సమస్త మానవ చరిత్రలో మతమే కేంద్ర స్థానాన్ని ఆక్రమించి ఉంది. క్రీ.శ. 1954, అక్టోబర్‌ 24వ తేదీ ‘ది అబ్జర్వర్‌’ అనే పత్రికలో ప్రచురింపబడిన తన వ్యాసంలో అతనిలా వ్రాస్తాడు: ”సృష్టి పుట్టుకకు సంబంధించిన రహస్యాన్ని కేవలం ధర్మం మాత్రమే చేదించ గలదని నేను విశ్వసిస్తున్నాను.”
ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ధర్మాన్ని ఈ విధంగా నిర్వచించటం జరిగింది:’ఒక మానవాతీత మైన శక్తిపై విశ్వాసముంచటం ప్రత్య కించి, విధేయతకు, ఆరాధనకు అర్హమైన దేవుడు లేక దేవుళ్ళు ఉనికిపై విశ్వాస ముంచటం.’

ప్రపంచంలోని ప్రఖ్యాత ధర్మాలన్నింటిలో సర్వ శక్తిమంతుడు, లేక సర్వాధికారి అయిన ఒకే దేవుని భావన కనబడు తుంది. అంతేకాక ఈ ధర్మాలను విశ్వ సించే వారంతా తామే దేవుణ్ణైతే విశ్వసించి ఆరాధిస్తున్నారో, ఆయనే మిగిలిన ప్రజ లందరికీ కూడా దేవుడని విశ్వసిస్తారు.
అనేక ధార్మికేతర విశ్వాసాలు లేక సిద్ధాం తాలు ఉదాహరణకు మార్క్సిజం, ఫ్రాయి డిజం మొదలైనవన్ని, సుసంఘటిత ధర్మాల మూలంపై దాడికి ప్రయత్నిం చాయి. విచిత్రమేమిటంటే ఈ ధార్మికేతర విశ్వాసాలు కూడా, ధార్మికపరమైన విశ్వా సాల రూపాన్ని సంతరించుకున్నాయి.

ఉదాహరణకు అనేక దేశాల్లో కమ్యూనిజం లేక సామ్యవాద వ్యవస్థ ఏర్పడినప్పుడు అక్కడ కూడా ఈ ధార్మికేతర సిద్ధాంతాల్ని, విశ్వాసాల్ని ఒక ధర్మం మాదిరిగానే ఆ తరహాలోనే, అదే సమిష్టిరూపంలో, అదే నిండు హృదయంతో ప్రచారం చేయటం జరిగింది. అంటే ధర్మం మానవ ఉనికికి అనివార్యమైన అంశం అని అర్థమవు తోంది.
దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది ఆయత్‌లో దైవం ఇలా ఉపదేశిస్తున్నాడు- ప్రవక్తా! ఇలా చెప్పు: ”గ్రంథ ప్రజలారా! మాకూ మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి, (అది ఏమిటంటే) మనం అల్లాహ్‌ాకు తప్ప మరెవరికీ దాస్యం చెయ్య రాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరి నీ నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాహ్‌ాను తప్ప మరెవరినీ తమ ప్రభువు గా చేసుకోరాదు అనేది.” ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరి స్తే, వారితో స్పష్టంగా ఇలా అను: ”మేము ముస్లిములము (కేవలం అల్లాహ్‌ాకే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్‌ : 64)

ప్రపంచంలోని వివిధ మతాల తులనాత్మక అధ్యయనం, నాకు బాగా లాభించింది. దైవం, ప్రతి మనిషిని తన యొక్క ఉనికిని గుర్తించే జ్ఞానంతో పుట్టించాడనే నా విశ్వాసం, దీనితో ద్విగుణీకృతమైంది. మానవుని, మానసిక నిర్మాణం ఎలా జరిగిందంటే, అతను మహోన్నతమైన ఒక సృష్టికర్త భావనను అవలీలగా స్వీకరిస్తాడు. అలాకాక దేవుడు లేడనే భావనకు అతనికి దృష్టాంతాలు చూపించాల్సి ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే దైవభావనను విశ్వసించటానికి దృష్టాంతం అవసరం లేదు, కాని దైవ భావనను తిరస్కరించ టానికి మాత్రం దృష్టాంతాల అవసరం ఏర్పడుతుంది.

Related Post