ప్రపంచంలోని ప్రముఖ ధర్మాల వర్గీకరణ

Originally posted 2014-12-15 10:45:57.

ఆర్యుల జాతిలో బయల్పడిన ధర్మాల్ని ఆర్య ధర్మాలుగా పేర్కొంటారు. అత్యంత శక్తిమంతులై, ఇండో-యూరోపియన్‌ భాష లను మాట్లాడే జాతులు ఆర్యజాతులుగా పిలువబడ్డారు. వీరు క్రీ.పూ.1500 నుండి 2000 వరకు ఇరాన్‌ మొదలుకొని ఉత్తర భారతం వరకు వ్యాపించారు.

ఆర్యుల జాతిలో బయల్పడిన ధర్మాల్ని ఆర్య ధర్మాలుగా పేర్కొంటారు. అత్యంత శక్తిమంతులై, ఇండో-యూరోపియన్‌ భాష లను మాట్లాడే జాతులు ఆర్యజాతులుగా పిలువబడ్డారు. వీరు క్రీ.పూ.1500 నుండి 2000 వరకు ఇరాన్‌ మొదలుకొని ఉత్తర భారతం వరకు వ్యాపించారు.

డా: జాకీర్ నాయక్

మనం విశాల దృష్టితో పరికించినట్ల యితే, ప్రపంచ ధర్మాలన్నింటిని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సామి రెండవది ‘సామియేతర’ ధర్మాలు. ఇక సామియేతర ధర్మాల్ని కూడా రెండుగా విభ జించవచ్చును. ఒకటి ఆర్య మతాలు, రెండవది ఆర్యేతర మతాలు.
సామి ధర్మాలు:
సామీలలో బయల్పడిన ముఖ్య ధర్మాల్ని సామి(సెమిటిక్‌) ధర్మాలంటారు. బైబిలును అనుసరించి మహనీయ నూహ్‌ా(అ) ఒక కుమారుని పేరు ‘సామ్‌’ ఉండేది. అతని ద్వారా వచ్చిన సంతతినే ‘సామి సంతతు లు’ అంటారు. అందుకని యూదులు, అర బ్బులు, ఆశూరీలలో బయల్పడ్డ ధర్మాలు ‘సామిధర్మాలు’గా గుర్తింపు పొందాయి. యూదమతం (జూడాయిజం), క్రైస్తవం మరియు ఇస్లాం, సామిధర్మాల్లో ప్రఖ్యాతి గాంచిన గొప్ప ధర్మాలు. ఇవన్నీ కూడా దైవదౌత్యాన్ని ప్రతిపాదించే ధర్మాలే. అంటే దైవం మానవుల సంస్కరణ, సన్మార్గం పొందుటకై ప్రవక్తల ద్వారా తన ఆదేశా లను మానవులకు అందిస్తాడని విశ్వసించే ధర్మాలు. అనగా ఆకాశ గ్రంథాలను, దైవ వాణిని విశ్వసించే ధర్మాలు అన్నమాట.
సామియేతర ధర్మాలు ( నాన్‌-సెమిటిక్‌ రిలిజియన్స్‌)
ఇంతకు ముందే పేర్కొన్నట్లు, సామియే తర ధర్మాల్ని ఆర్యధర్మాలు, ఆర్యేతర ధర్మా లు అని రెండుగా విభజించవచ్చును.
ఆర్య ధర్మాలు:
ఆర్యుల జాతిలో బయల్పడిన ధర్మాల్ని ఆర్య ధర్మాలుగా పేర్కొంటారు. అత్యంత శక్తిమంతులై, ఇండో-యూరోపియన్‌ భాష లను మాట్లాడే జాతులు ఆర్యజాతులుగా పిలువబడ్డారు. వీరు క్రీ.పూ.1500 నుండి 2000 వరకు ఇరాన్‌ మొదలుకొని ఉత్తర భారతం వరకు వ్యాపించారు.
ఈ ఆర్య ధర్మాల్ని కూడా తిరిగి రెండు శాఖలుగా విభజించవచ్చును. ఒకటి వైదిక ధర్మం, రెండవది వైదికేతర ధర్మాలు. వైదిక ధర్మాన్ని సామాన్యంగా హిందూ ధర్మంగా, బ్రాహ్మనిజంగా పేర్కొంటారు. వైదికేతర ధర్మాల్లో సిఖ్ఖు మతం, బౌద్ధమతం, జైన మతం మొదలగునవి వస్తాయి. దాదాపు అన్ని ఆర్య ధర్మాల్లో దైవదౌత్యం (ప్రవక్తల) భావన లేదు.
జోరాస్ట్రియన్‌ మతం ఒక్కటే ఆర్య ధర్మాల్లోని వైదికేతర ధర్మం, దీనికి హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు. దైవ దౌత్యపు (ప్రవక్తల) భావన కలిగివున్నట్లు దీని వాదన.
ఆర్యేతర ధర్మాలు:
ఆర్యేతర ధర్మాల పుట్టుక వివిధ ప్రాంతా ల్లో జరిగింది. కన్‌ప్యూషినిజం మరియు తావ్‌ఇజం ఉద్భవనం చైనాలో జరిగితే, షింటో ధర్మం జపాన్‌లో వేళ్ళూనుకుంది. ఇలాంటి అనేక ఆర్యేతర ధర్మాల్లో దైవ భావనే కనిపించదు. అందుకని వీటిని సామాన్యంగా ధర్మం అనే బదులు నైతిక బోధనల సముదాయం అంటే సమంజసం గా ఉంటుంది.
ఒక ధర్మంలో దైవభావనను గుర్తించే సక్రమ పద్ధతి:
ఏ ధర్మంలోనైనాసరే, అందులో దైవ భావన ఎంత వరకుంది, ఎలా ఉంది అని తెలుసుకోవటానికి కేవలం దాని అను యాయుల ప్రవర్తన కొలమానం కాదు. ప్రజల్లో తమ ధార్మిక గ్రంథాల పట్ల అవ గాహన లేదన్నది సర్వసామాన్య విషయం. అందుకని ఒక ధర్మంలో దైవ ఉనికి, లేక దైవభావన ఎలా ఉంది, ఎంత వరకు ఉంది అనే విషయం తెలుసుకోవటానికి దాని పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయటమే సరైన మార్గం. ఆ గ్రంథబోధ నల వెలుగులోనే ఆ ధర్మంలో గల దైవ భావనను గుర్తించగలుగుతాము.
ఇక ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ ధర్మాల తాత్విక విశ్లేషణ చేసి, వాటి ధార్మిక గ్రంథాల బోధనల వెలుగులో ఆ ధర్మాల్లో గల దైవ ఉనికిని, దైవ భావనను తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం.

Related Post