విధిరాత నియమాలు-6

Originally posted 2017-01-03 12:59:22.

 సకల సృష్టికి మూలాధారం అల్లాహ్‌యే. ఆయన తన యుక్తినీ, ప్రణాళికను గురించి తన సృష్టితాలలో ఎవరికేది అవసరమో తగు మోతాదులో నిర్థారించాడు.

సకల సృష్టికి మూలాధారం అల్లాహ్‌యే. ఆయన తన యుక్తినీ, ప్రణాళికను గురించి తన సృష్టితాలలో ఎవరికేది అవసరమో తగు మోతాదులో నిర్థారించాడు.

”భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ జీవనోపాధిని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌దే!  అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి.” (హూద్‌:6) మరో చోట ఇలా ఉంది: ”ఎన్నో జంతువులు ఉన్నాయి-అవి తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికీ, మీకు కూడా అల్లాహ్‌యే ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు”. (అన్‌కబూత్:60) అల్లాహ్‌ మరియు ఆయన పేర్లు గుణాలు తప్ప మిగతావన్నీ సృష్టి క్రిందికే వస్తాయి. ప్రతి వస్తువు సృష్టికర్త అల్లాహ్‌ాయే. ఉత్పత్తి దారుల్ని వారు ఉత్పత్తి చేసే సకల వస్తువులను పుట్టించినవాడు అల్లాహ్‌యే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువునూ సృష్టించి దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్థారించాడు.”  (అల్‌ ఫుర్ఖాన్:2)
 8) అల్లాహ్‌ను మినహా మిగతావన్నీ సృష్టిరాసులే:
 సకల సృష్టికి మూలాధారం అల్లాహ్‌యే. ఆయన తన యుక్తినీ, ప్రణాళికను గురించి తన సృష్టితాలలో ఎవరికేది అవసరమో తగు మోతాదులో నిర్థారించాడు. ప్రతి వస్తువు విధి వ్రాతను ముందే చేశాడు. ప్రవక్త ఈసా (అ) ఇలా హితవు పలికారు: ”అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి యైనను,ఏమి ధరించుకొనుమో అని మీ దేహ మును గూర్చియైనను చింతింపకుడి; ఆహార ముకంటే వస్త్రముకంటే దేహమును గొప్పవి కాదా?! ఆకాశ పక్షులను చూడుడి: అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయి నను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా?! మీలోనెవడు చింతించుట వలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?! వస్త్ర ములను గూర్చి మీరు చింతింపనేల? అడవి పువ్వులు ఏలాగు నెడుగుచున్నవో ఆలోచిం చుడి. అవి కష్టపడవు ఒడకవు అయినను తన సమస్త వృభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలం కరింప బడలేదు.నేడుండి రేపు పొయిలోవేయ బడు అడవి గడ్డిని దేవుడేలాగు అలంకరించిన యెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చ యముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి, ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతించు కుడి; అన్య జనులు వీటన్నిటి విషయమై విచా రింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింప బడును. రేపటి గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులు గూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును”. (మత్తయి:25-34)
 దైవ ప్రసాదితమైన ఆహారం సర్వసాధారణ మయినది. ఎవరు ఎక్కడ ఉన్నా వారి పేర రాసి పెట్టిన జీవనోపాధి తప్పక వారికి లభి స్తుంది. కనుక దైవమార్గంలో కష్టాలు ఎదుర యితే, ఒక ప్రాంతాన్ని వీడి మరో ప్రదేశానికి వలస పోవలసి వస్తే మనం మన జీవనోపాధి గురించి అదే పనిగా చింతించాల్సిన అవసరం లేదు. మనలో కొందరు బలవంతులుగా ఉం డగా, మరి కొందరు బలహీనులుగా ఉన్నారు.
కొందరి దగ్గర ఒనరులు పుష్కలంగా ఉంటే, మరి కొందరి దగ్గర ఒనరులే లేవు. కొందరు స్వస్థలంలో సర్వ స్వతంత్య్రాలతో ఉంటే, మరి కొందరు ఆప్తులను, ఆస్తిపాస్తులను వదులుకు ని విదేశాలకు వలస పోయి జీవిస్తున్నారు.  వారందరికీ జీవనోపాధి    సక్రమంగా  లభి స్తుంది. భూమి లోపల తలదాచుకునే చీమలు మొదలుకుని, గాలిలో రెక్కలు చాచి ఎగిరే పక్షులు, నీటిలో ఈదే చేపలు, జల జంతువుల వరకు ఆన్నింటికీ అల్లాహ్‌యే ఆహారాన్ని సమకూరుస్తున్నాడు.
 కనుక అల్లాహ్‌ను నిశ్వసించేవారు వారికి ఏదైనా లాభిస్తే పొంగిపోరు. నష్టమొస్తే కృంగి పోరు. కలిమిని, లేమిని వారు దైవ పరీక్షగా ఎంచుతారు కాబట్టి పేదరికం వారిని బాధిం చదు. ఆకలిబాధ వారిని వేధించదు. కడుపు నిండిన రోజు కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. కడుపు కాలిన రోజు ఓర్పు సహనాలు వహి స్తారు. లేమీ వారి పాలిట వరంగా, కలిమీ వారి పాలిట వరంగా పరిణమిస్తుంది. మహా ప్రవక్త (స) వారి ప్రియ సహచరుల జీవితమే వారికి స్పూర్తి. వారు దైవమార్గంలో తన, ధన, మానాలను పణంగా పెట్టేందుకు సిద్ధమయిన మీదట మునుపటికన్నా శ్రేష్ఠమైన జీవనోపాధి ని అల్లాహ్‌ా వారికి ప్రసాదించాడు.అంతేకాదు, చిర కాలంలోనే ప్రపంచంలోని పెక్కు ప్రాంతా లకు వారిని అధికారులుగా చేశాడు. అయితే ఇక్కడో సృష్టికర్త నియమం ఉంది. అదే అవి రళకృషి!ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవియ్యబడింది: ”మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి అల్లాహ్‌ అనుగ్రహాన్ని అన్వేషించండి …. అల్లాహ్‌ ఉపాధి ప్రదాతలలోకెల్లా గొప్ప ఉపాధి ప్రదాత”.(జుముఅహ్: 10,11)

Related Post