రమజాను మాసమా! మార్పు నీ చిరునామ!!

Originally posted 2014-06-28 15:16:08.

అటు అలజడి, ఇటు అలజడి. ఎటు అడుగిడితే అటు కోర్కెల అలికిడి, కాంక్షల పుప్పొడి, తనువు అనువణువు భావ తలంపుల ముళ్ళ తక్కిడి. మెదడులో నీచ నిప్పు కణికల రాపిడి. మనస్సులో తమస్సు తాండవపు సడి. దైవాన్ని మనల్ని పూర్తిగా అర్పించుకో వడం అంత సులభం కాదదని తెలుస్తూనే ఉంది. అందుకనే జడివానలాంటి కన్నీటి తడితో మన మనో మాలిన్యాల్ని కడుక్కో వాలి.

అటు అలజడి, ఇటు అలజడి. ఎటు అడుగిడితే అటు కోర్కెల అలికిడి, కాంక్షల పుప్పొడి, తనువు అనువణువు భావ తలంపుల ముళ్ళ తక్కిడి. మెదడులో నీచ నిప్పు కణికల రాపిడి. మనస్సులో తమస్సు తాండవపు సడి. దైవాన్ని మనల్ని పూర్తిగా అర్పించుకో వడం అంత సులభం కాదదని తెలుస్తూనే ఉంది. అందుకనే జడివానలాంటి కన్నీటి తడితో మన మనో మాలిన్యాల్ని కడుక్కో వాలి.

 

అది 2013 ఆగస్టు 22వ తేదీ లగాయతు రఫీ తమ్ముడు రఖీబ్‌ తాలూకు నేలపై నూకలు చెల్లిపోయాయి. ఆ రోజు రఖీబ్‌ ఆత్మ ఆతని శరీరాన్ని వీడి పోయింది. రఖీబ్‌ దొరికిన ఏ మంచి కార్యాన్ని ఇట్టే వదిలే రకం కాదు. అతనికి ధర్మావగాహన కలిగిన రోజు నుంచి ఎంతో నిష్ఠగా నియమబద్ధంగా జీవితం గడుపుతు న్నాడు. ఆర్థిక ఇబ్బందులు అతన్ని ఎంతగా పీడించి, సంసార బాధ్యతలు ఎంతగా సతాయించినా, ఊరి జనం పిచ్చోడని విమర్శించినా అతను మాత్రం ధర్మం తప్పలేదు. దైవం గీసిన సరిహద్దు రేఖ దాటలేదు. దైవప్రవక్త (స) నిర్దేశించిన రీతిని వదల లేదు. బొందిలో ప్రాణమున్నంత వరకూ అల్లాహ్‌ దరిని వదిలి మరే దరి మీద, దర్గాహ్‌ మీద తలవంచ లేదు. న్యాయం, ధర్మం ముందు తప్ప మరే పీరు సాహెబు, బాబా సాహెబు ముందర తల దించలేదు, నయవంచనకు; ఆత్మవంచనకు పాల్పడ లేదు. ఏ అధర్మ కార్యంలో, ఏ ఉరుసు ఉత్సవాల్లో, ఏ పీర్ల సంబరాల్లో, ఏ గ్యారవీఁ విందులలోనూ అతను పాల్గొనలేదు. అతనిలో ఇంతటి మార్పుకి కారణం అతని జీవితంలో చోటు చేసుకున్న ఒకానొక రమజాను మాసం మరియు సజ్జనులైన స్నేహితులే. నేడు జనులందరి తలల్లో తలో నాలుకయ్యాడు. అతని నిష్ఠకుగానూ, అతని గుండె ధైర్యానికి, మనో స్థయిర్యానికిగానూ నింగీనేలా నీరాజనాలు పడుతున్నాయి. అతనిలో వచ్చి మార్పునే జనులం దరిలోనూ చూడగోరుతున్నాయి.
……………………………………………………………….
నిజం – ఈ మాసంలో మానవాత్మలు, అంతరాత్మలు సచేత నంగా, సజీవంగా, సశ్యశామలంగా కమనీయ కాంతులీనుతూ ఉంటాయి. నిత్య నిర్మల మనో వసంతాన్ని తలపిస్తూ ఉంటాయి. వందేళ్ళ జీవితానుభూతుల్ని చవిచూసిన పండు వృద్ధులయినా, విద్యాసాగర సంచితాన్ని ఔపాసన పట్టిన పండిత మహాశయులయినా, సందిగ్దంలో సద్వివేకాన్ని, సద్వర్తనుల్ని సంప్రదించి సరైన సమయంలో జీవితాన్ని అతలాకుతలం చేసే అల్లకల్లోలాల అలల మధ్య నుండి బయట పడేయగల నిర్ణయాలు తిసుకునే స్ఫూర్తి, సమయస్ఫూర్తిగా గల సామాన్యులైనా తమకు ప్రాప్తమయిన ఈ శుభ ఘడియల్లో తనివితీరా ఓలలాడేందుకు పరితపిస్తూ కనబడ తారు. తూనిగల్లా ఝమ్మని బైకులేసుకు తిరిగే కుర్రాళ్లలో, రంగు రంగుల దుస్తుల్లో భువన తారకల్లా మెరిపోతూ, పారిజాతాల్లాంటి పవిత్ర దరహాసంతో తేనెలొలుకు పలుకులతో తుళ్లుతూ వీధుల నిండా విహరించే చిన్నారి బాలబాలకల్లో ఒకే స్థాయి భక్తిభావాలు తొణికిసలాడుతూ దర్శనమిస్తాయి. అయిదు పూటల నమాజు సలపడం మానేసి, బజార్లలో బాతాఖానీలో ‘మాటల మాంత్రికుల నిపించుకునే ‘సరదా సాహెబులు’, సారాయి రాయుళ్ళు సయితం బుధ్ధిగా ప్రార్థనల్లో పాల్గొంటూ తారసపడతారు. తలను నున్నగా దువ్వుకుని సాదాసీదా బట్టలెసుకుని వీపుకి పుస్తకాల బ్యాగు తగిలించుకుని, అటూ ఇటూ దిక్కులు చూడకుమడా రోడ్డు మీద ఎక్కడా ఆగి పెత్తనాలు చేయకుండా నేరుగా పాఠశాలకు వెళ్ళే చిన్నారి విద్యార్థులు సయితం రోజా వ్రతం పాటిస్తూ ముచ్చటే స్తారు. ఎముకలుడిగిన వయసుతతో బక్కచిక్కిన ముసలివారు సయితం ఎంతో నిష్ఠగా ఉపవాసాలు పాటిస్తూ పరవశించిపోవ డం ఒక రమజాను మాసంలోనే కనబడుతుంది. ఇలా రకరకలా సుభక్త జనాలతో హరివిల్లులోని రంగులన్నీ ఒకే చోట అలరారు తున్నట్లుంటుంది వరాల వసంతం రమజాను మాసం.
సమాజ హితానికి, సంఘ క్షేమానికి, వ్యక్తి సంపూర్ణతకి కావల సిన, భక్తిభావనల్ని, ప్రేమాభిమానాన్ని, నమ్మకాన్ని, వ్కక్తావ్యక్త స్వేచ్ఛని, అనురాగాన్ని, అనుబంధాన్ని, త్యాగాన్ని, పరస్పర సహ కారాన్ని, సుహృద్భావాన్ని రమజాను మాసం మనలో జనింప జేస్తుంది. ఏదైనా కానీ, ఏమైనా కానీ మరణం దాకా ప్రార్థించ డమే మానవ జీవితానికి అర్థం. దైవప్రేమ తోడుంటే కుత్సిత మతులు ఎన్ని కుయుక్తులు పన్నినా ధర్మోన్నతి కోసం పాటు పడ టమే పరమార్థం. ప్రార్థించడం అంటే అనుకున్నంత తేలికయిన విషయం కాదు! మనల్ని మనం దైవానికి పూర్తిగా అర్పించుకోనిదే అది సాధ్యం కాదు. అనునిత్యం మనం హృదయాన్ని దైవ ప్రేమ తో వెలిగించే ఉంచాలి. మిథ్యా ఆలోచనలకు తావియ్యకూడదు.

అటు అలజడి, ఇటు అలజడి. ఎటు అడుగిడితే అటు కోర్కెల అలికిడి, కాంక్షల పుప్పొడి, తనువు అనువణువు భావ తలంపుల ముళ్ళ తక్కిడి. మెదడులో నీచ నిప్పు కణికల రాపిడి. మనస్సులో తమస్సు తాండవపు సడి. దైవాన్ని మనల్ని పూర్తిగా అర్పించుకో వడం అంత సులభం కాదదని తెలుస్తూనే ఉంది. అందుకనే జడివానలాంటి కన్నీటి తడితో మన మనో మాలిన్యాల్ని కడుక్కో వాలి. దైవ మహిమ ఏమిటో, ఆయన గుణవిశేషాలేమిటో, ఆయన శక్తీసామర్థ్యాలు ఏమిటో తెలిసిన వారికే ‘స్వయంగా ఆయన్నే చూస్తున్నామన్నంత తన్మయంతో ప్రార్థించడం చేెత నవుతుంద’ని తెలిసిన మనం నిత్యం మారుతుండాలి. మన ప్రవ ర్తనలో పరివర్తనకై పరితపిస్తూ ఉండాలి. ఉదయం సాయంత్రం దైవకీర్తినలో ఊయలూగాలి మన హృదయం. పొద్దుపై దైవ స్తుతి గీతికలు లిఖిస్తూ ప్రకాశించే ఉదయభానుడు, పగలూరేయీ ప్రతి క్షణం అల్లాహ్‌ాను ప్రశంసిస్తూ మీరు+నేను=మనం.

మనం ఎప్పుడూ ఇలానే ఉండాలి. పూలలో పరిమళాలై దాగుం డాలి. మన ఈ విధేయత అవిధేయతగా రూపు దాల్చకూడదు. మనలో పొంగిపొర్లే భక్తిభావ తరంగాలు భుక్తి సహిత సుడి గుండాలవ్వకూడదు. మనసు మనకు చెప్పకనే త్రోవ తప్పు తుందేమో జాగ్రత్తగా మెలకువమై ఉందాం మనం!

Related Post