ఇతర మతాల్లో పుణ్య పురుషులు ఎవరిని ఆరాధించారు?

Originally posted 2016-05-15 19:50:07.

 మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ఆన్ (5 : 72-73)

మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ఆన్ (5 : 72-73)

ఈ భూమి పై పుట్టి మరణించిన వారుమహా రాజులూ కావొచ్చు – రారాజులు కావొచ్చు , మహానుబావులు కావొచ్చు – మహా మహా మేధావులు కావొచ్చు,ప్రవక్తలు కావొచ్చు-మహా ప్రవక్తలు కావొచ్చు, అందుకే వారిని ప్రేమిద్దాం- వారికీ Respect ఇద్దాం, కాని వీరిని దేవుడు అని పూజించడం తప్పు.

ఎందుకంటే పుట్టి మరణించిన వారు సృష్టి రాశులు అవుతారు, కాని సృష్టికర్త కాలేరు. వాస్తవానికి వారు కూడా బ్రతికి ఉన్నప్పుడు ఆ నిజ దేవుడినే ఆరాధించేవారు , కాని అజ్ఞానం వల్ల వారు బోదించిన బోదనలు వినకుండా ఈ రోజు మానవులు వారినే దైవాలు గా చేసుకొని ఆరాధిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు

వేదాలు, బైబిల్, ఖుర్ఆన్ గ్రంధాలు ప్రకారం సృష్టి పూజ పాపం. సృష్టికర్త ఒక్కడే వున్నాడు ఆయన అగోచరుడు, జ్ఞానం లేని వారే మూర్కపు వాదనలు చేస్తారు

పుణ్య పురుషులు ఎవరిని ఆరాధించారో, మరియు ఏమని భోధించారో…నిష్కల్మషమైన హృదయంతో పరిశీలిద్దాం రండి ?

గురునానక్ ఏమని బోధించాడు..?
(Volume – 1 Japuji verse – 1) “There is no God but one. He is the real creator. He is beyond human weaknesses and has birth and death. He is self sufficient, great and Merciful” ఒక్క దేవుడు తప్ప మరొకడు లేడు. ఆయన నిజమైన సృష్టికర్త, మానవ బలహీనతలకు అతీతుడు. చావు పుట్టుకలు లేని వాడు, స్వాయంభవుడు, గొప్పవాడు, కరుణామయుడు.

ZORAOASTRAIN RELIGION
Zoroaster
(దస్తగిర్ గ్రంధం) దేవుడు ఒక్కడే. ఆయనకు పోలిక లేదు. ఆది మరియు అంతం లేదు. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు లేరు. ఏ కనులు ఏ శక్తి ఆయనను చూడలేదు. ఆయన ఇంద్రియాలకు అగోచరుడు. ఆయన అత్యంత సమీపంలో ఉన్నాడు. “God is one. None is comparable to Him. He has no beginning and end. He has no parents, wives and children. He has no physical body. No eyes or power can reach Him. He is invisible. He is very near”.
శిరిడి సాయి బాబా ఎవరిని ఆరాధించాడు…? మరియు ఏమని బోధించాడు..?

సాయి బాబా తన జీవితాంతం ఈ క్రింది ప్రవచనాలు తరచూ పలుకుతూ ఉండేవారు.
1) “Sab ka maalik ek hai” सब का मालिक एक है – God of all is one.
“సబ్ కా మాలిక్ ఏక హై” – “सब का मालिक एक है !” అందరి దేవుడు ఒక్కడే.
2) “Allah maalik” अल्लाह मालिक – Allah is the God.
“అల్లాహ్ మాలిక్ హై” – “अल्लाह मालिक है!” అల్లాహ్ యే దేవుడు.
3) “Allah bhala karega” अल्लाह भला करेगा – Allah will do good.
“అల్లాహ్ భలా కరేగా” – “अल्लाह भला करेगा!” అల్లాహ్ మాత్రమే మేలు చేస్తాడు.
మిత్రులారా! సాయి బాబా ఒక ఫకీర్. ఓ నిజమైన ముస్లిం (విశ్వాసి). ఆయన ప్రతి రోజూ చేయవలసిన విధి నమాజులను క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉండేవారు. ఖుర్’ఆన్ చదివేవారు. ఉపవాసం పాటించేవారు. అవసరాల్లో ఉన్నవారికి సహాం చేసేవారు.

“ప్రతి రోజు ఉదయం సాయి బాబా చాలా పెందలకడనే నిద్ర లేస్తారు. అన్నింటి కంటే ముందు నమాజులు ఆచరిస్తారు.”

(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 139వ పేజి)

తానూ ఓ దైవదాసుడినేనని సాయి బాబా స్వయంగా చెప్పి ఉన్నారు.

“నేను దేవుని దాసుణ్ణి. దేవుడు ప్రభువు మరియు యజమాని”

(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయిబాబా ది మాస్టర్” 228వ పేజి)

దేవుని పేరు ప్రస్తుతించమని, ధర్మగ్రందాలను అధ్యయనం చేయమనీ సాయి బాబా ప్రజలను ఎల్లప్పుడూ బోధిస్తూ ఉండేవారు.

“పని చేయండి, దైవనామాన్ని స్మరించండి. ధర్మగ్రందాలు చదవండి. పరస్పరం విద్వేషాలు,

జగడాలు మానుకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడతారు.”

(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 232వ పేజి)

అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడని సాయి బాబా చాలా స్పష్టంగా చెప్పారు.

“నిరు పేదలను కాపాడేవాడు అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరో దేవుడు లేనే లేడు”

(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 235వ పేజి)

తాను అల్లాహ్ దాసున్ణని సాయి బాబా చెప్పుకునే వారు.

“నేను ఎవరికీ నౌకరును కాను. నేను కేవలం అల్లాహ్ దాసుణ్ణి” “అల్లాహ్ నామమే శాస్వతమైనది”

(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 236వ పేజి) అయితే సాయి బాబా గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా మనం అల్లాహ్ ను వదిలి పెట్టి సాయి బాబా ను ఎలా పూజించాగలం? మనం నిజంగా సాయి బాబాను ప్రేమిస్తున్నట్లయితే ముందు ఆయన బోధనలను ఆచరణలో పెట్టాలి. ఆయన జీవితం గడిపిన విధంగా మనమూ జీవితం గడపాలి. ఆయనే దేవుడైతే “సబ్ కా మాలిక్ ఏక్ హై ఎందుకు అంటారు? సబ్ క మాలిక్ మై హో అంటారు కదా? (అందరికీ దేవుణ్ణి నేనే అని) అంటారు కదా! కాని ఆయన జీవితంలో ఎన్నడు ఆ మాట చెప్పలేదు.

(Page no 18) ఆయన ఒంటరిగా అల్లాహ్ ను స్మరిస్తూ మస్జిద్లలొ గడిపేవారు. పల్లె ప్రాంతాలలో, అడవుల్లో, నదీజలాల దగ్గర చెట్ల క్రింద గడిపే వారు. (Page no 19) ఆయన ఒంటరిగా ధ్యానం చేస్తూ కూర్చుని ఉండేవారు.
శ్రీ రాముడు ఎవరిని ఆరాధించాడు …?

(Ramayana Bala Kanda )
Kausalya supraja – Rama – Olendearing son of Kausalya, Ram.
Purva Sandhya Pravarthathe- the dawn before sunrise is on its way
Uthista – get up
Narashar dhoola – Tiger among humans
Kartavyam – it is your duty
Deva mahinikam – to worship God
కౌసల్యా సుప్రజా రామా : కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడైన రామా
పూర్వా సంధ్యా ప్రవర్తతే : సూర్యోదయానికి వేళ అవుతుంది
ఉత్తిష్ట : నిదుర లే
నరశార్దూల : నరులలో పులి వంటి వాడా
కర్తవ్యమ్ దైవ మహ్నికం : ఆ దైవాన్ని ఆరాధించుట నీ కర్తవ్యమ్
రాముడిని తన గురువైన విశ్వామిత్రుడు ఆ సృష్టి కర్తను ఆరాధించుటకు వేకువజామున లేపేవాడు. (శ్రీరాముడు కూడా దేవుణ్ణి ఆరాధించాడు)
శ్రీకృష్ణుడు ఏమని బోధించాడు…?

తమేవ శరణం గచ్చ తత్ప్రసాదాత్మరం శాంతిం స్తానం ప్రప్యాసి శాశ్వతం
तमेव सरणम् गच्छा तत्पसादातमरम सन्तिम स्थानम प्राप्यसी सासवतम्
ఓ అర్జునా..! నీవు సర్వ విధముల ఆ ఒక్కడినే శరణు బొందు
(కృష్ణుడు తన కతీతంగా ఉన్నటు వంటి దేవుణ్ణి ఆరాధించు అంటున్నాడు చూడండి )
(భగవద్గీత 18:62) తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత|
తత్ప్రసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్

అన్ని విధాల ఆయన్నేశరణు పొందు. ఆయన అనుగ్రహం వలన పరమ శాంతిని శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు.

(భగవద్గీత 7:20) “ఎవరి బుద్ధినయితే భౌతిక వాంఛలు ఆవహిస్తాయో వారు చిల్లర దేవుళ్ళకు ఆత్మ సమర్పణ చేసుకుంటారు. ఇంకా స్వయం కల్పిత ఆరాధనా విధానాల ద్వారా ప్రత్యేక నియమాలను, నిబంధనలను అనుసరిస్తారు.”

ఏసు ఎవరిని ఆరాధించాడు …?

మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ఆన్ (5 : 72-73)

దివ్య ఖుర్ఆన్ (5 : 73-74) అల్లాహ్ “ముగ్గురిలో ఒకడు” అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి దేవుడు ఒక్కడే.మరొక దేవుడు లేడు.వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.
యేసు స్వయంగా దేవుని [అల్లాహ్/ప్రభువు/యెహొవా] వైపునకు పిలిచేవారు
(మార్కు :12 :29 ) అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము.మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
(లూకా : 4 : 8) అందుకు యేసు – నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను.
(యోహాన్ :20:17) నాసహొదరుల యొద్దకు వెళ్లి -నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపొవుచున్నానని వారితొ చెప్పమనెను.
యేసు కేవలం “అల్లాహ్ ఒక్కడే దేవుడు” అని చెప్పడమే కాదు ఆరాధించి చూపించారు.
యెహొవా [అల్లాహ్] నే యేసు ప్రార్దించేవారు.
(లూకా : 3:21) ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్దన చేయుచుండగా ఆకాశము తెరవబడి .
(మార్కు 1;35) ఆయన [యేసు] పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే అరణ్య ప్రదేశ్యమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను.
అద్భుతాలు చేసేటప్పుడు సహితం యేసు అల్లాహ్ ను ప్రార్ధించేవారు.
1మార్కు : 9:29.అందుకాయన [యేసు] ప్రార్ధన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది [దయ్యము] వదలి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
2యొహాను : 11:35-41.లాజరు విషయమై యేసు కన్నీటి ప్రార్ధన చేసెను.
కష్ట కాలంలొ మరింత వేదనతో యేసు అల్లాహ్ ను ప్రార్ధించుచుండేవారు.
1.మార్కు : 14:35 కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు…
2.లూకా : 22:44 ఆయన [యేసు] వేదన పడి మరింత ఆతృ తగా ప్రార్ధన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను.
శిష్యులను కూడా తండ్రి [అల్లాహ్]నే ప్రార్ధించమని యేసు బోధించేవారు
(మత్తయి 6:6) నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి [అల్లాహ్]కు ప్రార్ధన చేయుము.అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి [అల్లాహ్] నీకు ప్రతిఫలమిచ్చును.

మొహమ్మద్ (స) ఎవరిని ఆరాధించాడు …?

(హదీస్) (hadeeth) అల్లాహ్ కు సాటి ఆరాధ్యుడు లేడని విశ్వసించండి సాఫల్యం పొందుతారు.
(దివ్యఖుర్ఆన్ 2:21) ఓ మానవులారా, మిమ్ముల్ని, మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువునే ఆరాధించండి.
దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది.
(దివ్యఖుర్ఆన్ 41:37); మీరు సూర్యచంద్రులను ఆరాధించకండి. వాటిని సృష్టించిన దేవున్ని ఆరాధించండి.

(దివ్యఖుర్ఆన్ 37:95); స్వయంగా మీరే చెక్కుకున్న వస్తువులను మీరు పూజిస్తున్నారా. వాస్తవానికి అల్లాహ్యేయే మిమ్ముల్ని సృష్టించాడు

(దివ్యఖుర్ఆన్16:20); అల్లాహ్ ను విడిచి ప్రజలు వేడుకొంటున్న ఇతర శక్తులు ఏ వస్తువులకు సృష్టికర్తలు కావు. స్వయంగా వారే సృష్టించబడినారు.

(దివ్యఖుర్ఆన్ 5:72) సర్వశక్తిగల దేవుడికి ఇతరులను బాగ్యస్వాములుగా చేసే వారికీ ఆ దేవుడు స్వర్గాన్ని నిషేధం చేశాడు. వారి నివాసం నరకం.
ఎవరిని ఆరాధించాలి ?
(Qur an 20:14) నిశ్చయంగా నేనే అల్లాహ్ ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నమాజును నెలకొల్పు.

(Bhagavad Geetha 7:17) येक भक्तिर विशिष्यते ఒక్క దేవుడి యందె భక్తీ గలవాడు నగు జ్ఞాని శ్రేష్టుడగుచున్నాడు.
(Bible Luke 4:8) నీ దేవుడైన (యహోవా) నకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను.

సృష్టి కర్తను బైబిల్ ప్రకారం యహోవా అని, సంస్కృతం లో సర్వేశ్వరుడు అని, అరబ్బీ భాష లో అల్లాహ్ అని పిలుస్తారు. వివిధ భాషలలో వివిధ పేర్లతో పిలిచినా ఆయన మాత్రం ఒక్కడే ఆరాధనకు అర్హుడు.

Related Post