తల్లిదండ్రుల సేవ

Originally posted 2016-12-20 11:59:19.

తల్లిదండ్రుల నిద్రకు భంగం వాటిల్లకూడదని పాలు నిండిన పాత్రను చేతిలో పట్టుకొని రాత్రంగా వారి పాదాల చెంతనే గడిపి ఉదయం వారు లేచాక వారి ఆకలిని తీర్చి ఆ తర్వాత తన ఆలుబిడ్డల ఆకలిని తీర్చిన సుమతులు మన పూర్వీకులు.

తల్లిదండ్రుల నిద్రకు భంగం వాటిల్లకూడదని పాలు నిండిన పాత్రను చేతిలో పట్టుకొని రాత్రంగా వారి పాదాల చెంతనే గడిపి ఉదయం వారు లేచాక వారి ఆకలిని తీర్చి ఆ తర్వాత తన ఆలుబిడ్డల ఆకలిని తీర్చిన సుమతులు మన పూర్వీకులు.దేవుని  తర్వాత మన ఉనికి కారకులు తల్లిదండ్రులు. మన సుఖం కోసం తమ సుఖాన్ని, మన హాయి నిద్ర కోసం వారి హాయి నిద్రను త్యాగం చేెసిన త్యాగధనులు మన తల్లిదండ్రులు. మన సంతోషాన్ని తమ సంతోషంగా, మన బాధను తమ బాధగా భావించిన ధన్యజీవులు మన తల్లిదండ్రులు. మహా పర్వతం అంతటి ప్రేమను పిల్లలందరికీ పంచి పెట్టగలిగే పిచ్చి గుండెలు ఎవరివి? అని అడిగితే, సందేహమే లేదు; అవి మన జననీ జనకులవే. తమ భవితవ్యాన్ని మరచి మన భావికి బాట వేసి, మన బంగారు భవిష్యత్తు గురించి కలలు గనే కరుణా స్వరూపులు ఎవరు? అంటే సంశయమే లేదు; వారు మన అమ్మానాన్నలే.అట్టి మమతామూర్తుల్ని గౌరవించడం, అభిమానిం చడం, వారి మాటకు శిరసా వహించడం సంతానంగా మనందరి కర్త వ్యం అంటున్నాడు అల్లాహ్‌:

 
”అల్లాహ్‌ తీర్మానం చేెసేశాడు. (ఇదే అంతిమ తీర్పు). మీరు ఆయన్ను తప్ప మరెవ్వరినీ పూజించకూడదు. తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవ హరించాలి. ఒకవేళ వారిలో ఒక్కరుగానీ, ఇద్దరుగానీ ముదిమి థకు చేెరుకుని ఉంటే వారిని ‘ఉఫ్‌’ అని కూడా అనకూడదు. వారితో మర్యా దపూర్కంగా మాట్లాడాలి. వారి కోసం నీ రెక్కలను వాత్సల్యంతో వంచి ఉంచాలి. వారి కోసం సదా ఇలా ప్రార్థిస్తూ ఉండాలి: ”ప్రభూ! వారు నన్ను బాల్యంలో ఎంత కరుణతో, ఎంత వాత్సల్యంతో పెంచారో వారిపై సయితం అటువంటి కరుణనే కురిపించు”. (బనీ ఇస్రాయీల్‌: 23) అవును అమ్మానాన్నల రుణం తీర్చుకునేంతటి ధర్మాత్ముడు, ధన వంతుడు ఇప్పటికెవరూ పుట్టలేదు. పుట్టబోరు కూడా.
ఒకసారి హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర) గారు ఓ యమన్‌ దేశ స్థుడిని తన వీపు మీద తల్లిని ఎత్తుకుని కాబా ప్రదక్షిణ చేస్తూ చూశారు. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమర్‌ (ర) గారిని చూడగానే, అతను – ‘ఓ ఉమర్‌ పుత్రుడా! నేను నా తల్లి రుణం తీర్చేశానంటారా?’ అని అడిగాడు. అతని మాట విన్న ఆయన – ”నువ్వు ఆమె రుణం తీర్చడం మాట అలా ఉంచు, నిన్ను జన్మనిచ్చినప్పుడు ఆమె తీసుకున్న ఒక్క ఉచ్శ్వాసకు బదులు రుణాన్ని కూడా చెల్లించ లేదు” (ఆమె నిన్ను నవ మాసాలు మోసి, కని, పాలు పట్టి, పెంచినదానికి నువ్వేం రుణం తీర్చుకోగలవు) అన్నారు.
ప్రసవ సమయంలో తల్లి పడిన ప్రయాసను స్వయంగా పరమ ప్రభు వయిన అల్లాహ్‌ా ప్రస్తావించాడంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించ వచ్చు: ”మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలు విడిపించడా నికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవయి ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే”. (లుఖ్మాన్‌: 14)

కాలం ఆగకుండా ఉంటుందా చెప్పండి! రూపు రేఖలు మారకుండా ఉంటాయా? చెప్పంటి! తల్లిదండ్రుల తలలు ముగ్గు బుట్టలవుతాయి. ముఖాలు మడతలు పడతాయి. కంటి చూపు సన్నగిల్లుతుంది. చేతులు పట్టు సడలుతుంటే, కాళ్లకు వణుకు వస్తుంది. అప్పుడు మన అవసరం వారికి ఇంకా అధికంగా ఉంటుంది. కాబట్టి మన జన్మ కారకులయిన జననీ జనకులను సేవించుకొని వారి దీవెనల్ని పొందాల్సిన అవసరం పిల్ల యిన మనందరికి ఉంది. ఆ విషయానికొస్తే మన స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, అవి మన ఇంట్లోనే ఉన్నాయి.
”అల్లాహ్‌ా ప్రసన్నత తండ్రి ప్రసన్నతలో ఉంది” అని ఓ సందర్భంలో చెబితే, ”తండ్రి స్వర్గపు మధ్యస్థ తలుపు” అని మరో సందర్భంలో అన్నారు ప్రవక్త (స). ఈ తలుపు గుండా స్వర్గంలో ఎవరు ప్రవేశిస్తారో తెలుసా? తల్లిదండ్రుల సేవలో తరించి సజ్జన సంతానం.
ఒకసారి ఓ వ్యక్తి వచ్చి -‘నేను జిహాద్‌లో పాల్గొనాలనుకుంటున్నాను’ అని కోరగా, అతని వృద్ధ తల్లి బ్రతికుందని తెలుసుకున్న ప్రవక్త (స) – ”నువ్వు ఆమెను అంటి పెట్టుకుని ఉండు (ఆమె సేవలో తరించు). స్వర్గం ఆమె పాదాల చెంత ఉంది” అన్నారు. (నసాయీ)
తల్లిదండ్రుల స్థానం మహా గొప్పది. వారి యెడల అనుచితంగా వ్యవ హరించడం మహాపరాధం-కబీరా గునాహ్‌ా. అయితే నేటి యువత ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్త్తోంది.
సమయం రాత్రి 12 గంటలు కావస్తోంది.. ఓ వృద్ధ మహిళ సముద్ర ఒడ్డున కూర్చుని ఉంది. అటుగా వెళుతూ ఓ యువకుడు – ‘అవ్వా! ఏమిటి. ఈ సమయంలో ఇక్కడ ఉన్నావేంటి?’ అని ఆరా తీశాడు.

‘ఏమీ లేదు నాయానా! నా కొడుకు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు’. గంట, రెండు గంటలు గడచినా ఎవరూ రాకపోయే సరికి ఉండ బట్టలేక వెళ్లి అడిగాడు. అదే సమాధానం; ‘కొడుకు వస్తుంటాడు, వస్తాడు’. అంతలో ఆ కుర్రాడి దృష్టి ప్రక్కనే పడి ఉన్న ఓ కాగితం మీద పడింది. ‘అవ్వా! ఈ కాగితం నీదే అయితే, నేను చదవచ్చా?’ అని అడిగాడు. ‘ఈ కాగితం నా కొడుకు వెళుతూ నాకిచ్చి-ఎవరయినా వచ్చి పలుకరిస్తే వారికివ్వు’ అని పురమాయించి మరీ వెళ్ళాడు. ఏముంది బాబు అందులో? అంటూ ఆత్రంగా చూడసాగింది ఆ వృద్ధ మహిళ. అందులో ఏం వ్రాసి ఉందో తెలుసా?
”ఈ ముసలావిడ ఎవరికి దొరికినా వారు దయచేసి ఆమెను వృద్ధాశ్ర మానికి తరలించండి!”….

ఇదా మనం మన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం? ఇదా మనం వారితో వ్యవహరించాల్సిన తీరు? ఇదా మనం వారి సేవలకు ఇచ్చే గుర్తింపు? అసలు మనకు అల్లాహ్‌ా అంటే భయం లేదా? సంఘటన ఇదొక్కటే అనుకొంటే పొరపాటు. కోర్టుల్లో నడిచే కేసుల్ని, వైద్యాల యాల్ని, వృద్దాశ్రమాల్ని మనం వెళ్లి సందర్శించినట్లయితే ఇటువంటి హృదయ విదారక సంఘటనలు ఎన్నో…! ఎన్నెన్నో!!
సుభక్తాగ్రేసరుల్లో అగ్రగణ్యులయిన ప్రవక్తలు సదా తల్లిదండ్రుల సేవలో తరించారు. ప్రవక్త నూహ్‌ (అ) అల్లాహ్‌ను ఇలా వేడుకుంటు న్నారు: ”ప్రభూ! నన్ను నా తల్లిదండ్రులను క్షమించు”. (నూహ్‌: 28)

ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ), ప్రవక్తలందరి పితామహులు. తండ్రి విగ్రహా రాధకుడయినా ఆయనతో ఎంతో సౌమ్యంగా మాట్లాడేవారు. ఆస్తి పాస్తుల నుంచి బేదఖలు చేసిన, ఇంటి నుండి గెంటేసిన, ఊరి నుండి వెలివేసిన సందర్భం అది.అట్టి క్లిష్టస్థితిలో సయితం తండ్రితో మార్యాద పూర్వకంగానే మాట్లాడుతున్నారు.”నాన్నా! మీరెందుకు షైతాన్ని ఆరాధి స్తున్నారు? కరుణామయుని వద్ద నుండి ఏదయినా విపత్తు మీపై విరు చుకు పడుతుందేమోనని నేను భయ పడుతున్నాను”. (మర్యమ్‌: 19)
ఒక వైపు ఇంటి నుండి శాశ్వతంగా గెంటేస్తున్న తండ్రి. ఎక్కడికెళ్ళాలి? ఎలా బ్రతకాలి? అని ఆలోచించకుండా, ఉడుకు రక్తంతో దూకుడుగా వ్యహరించకుండా, తన గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, నాన్నే మయిపోతాడోనన్న బెంగతో బాధ పడుతున్న కొడుకు మరోవైపు…

ప్రవక్త యహ్యా (అ). ఆయన గురించి స్వయంగా అల్లాహ్‌ా ఇస్తున్న కితాబు ఇది: ”అతను అతని తల్లిదండ్రుల యెడల సద్వ్యవహారం కలిగినవాడు. వారి పట్ల కర్కశంగా, కఠినంగా, దుర్మార్గంగా వ్యవహరి ంచేవాడు కాదు”. (మర్యమ్‌:1 4)
ప్రవక్త ఈసా (అ) చెబుతున్న మాట: ”అల్లాహ్‌ నాకు చేసిన మహో పదేశం-నేను నా తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. వారికి విధేయుడిగా జీవించాలి” అని. (మర్యం:32)

తల్లిదండ్రుల నిద్రకు భంగం వాటిల్లకూడదని పాలు నిండిన పాత్రను చేతిలో పట్టుకొని రాత్రంగా వారి పాదాల చెంతనే గడిపి ఉదయం వారు లేచాక వారి ఆకలిని తీర్చి ఆ తర్వాత తన ఆలుబిడ్డల ఆకలిని తీర్చిన సుమతులు మన పూర్వీకులు.

హజ్రత్‌ అబు హురైరా (ర) ఇంట్లో ప్రవేశించినప్పుడల్లా తల్లిని ఉద్దే శించి – ‘మీరు నన్ను ఎంత కరుణా వాత్సల్యంతో పెంచారో అల్లాహ్‌ా అటువంటి కరుణనే మీపై కురిపించుగాక!’ అని దుఆ చేసేవారు. బదులుగా ఆయన తల్లి కూడా – ”బాబూ! ముదిమి థలో నన్నేంతో ప్రేమగా చూసుకుంటున్న నిన్ను కూడా అల్లాహ్‌ా చల్లగా చూడు గాక!” అని దీవించేది.
హసన్‌ బస్రీ (ర), తల్లిని ఎంతగా గౌరవించేవారంటే, ఆమెతో కలిసి ఒకే పళ్ళేంలో భోంచేసేవారు కాదు. ఎందుకనుకుంటున్నారు? తన తల్లికి నచ్చిన ఏదేని ఆహార పదార్థాన్ని ఆమెకన్నా ముందు తానెక్కడ తినేస్తానేమోనన్న భయం.

సజ్జనులయిన మన పూర్వీకుల్లో కొందరయితే, ఏ ఇంటి క్రింది భాగం లో తల్లి ఉండేదో, ఆ ఇంటి పై భాగంలో వారు నివాసముండే వారు కాదు. కష్ట పడి సంపాదించిన రోజు కూలిని నాన్నకు ఇచ్చే సమయం లో సయితం ఆయన చేయి క్రింద ఉండకూడదు అన్న గొప్ప గౌరవ భావంతో బల్ల మీద పెట్టి వెళ్ళేవారు. ఫలితంగా అల్లాహ్‌ా వారిని ఎంత గా సన్మానించాడో, ఎన్ని కీర్తిశిఖరాలకు తీసుకెళ్ళాడో చరిత్రే సాక్షి!

మనలో ప్రవక్త (స) వారి సహచర్యాన్ని కోరుకోని వారు ఎవరుం టారు చెప్పండి! సహాబా మహా గొప్ప అదృష్టవంతులు అని, ముందు వారు, ముందున్నవారు అని మనం నమ్ముతాము. అలాంటి భాగ్యానికి దూరమయ్యారు యమన్‌ దేశానికి చెందిన ఉవైస్‌ అల్‌ ఖర్నీ (ర). కార ణం ఏమయి ఉంటుందనుకుంటున్నారు? ‘వృద్ధురాలయిన తన తల్లి సేవ’! హజ్జ్‌ మహారాధన చేసుకునే అదృష్టం దక్కాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయనకూ హజ్జ్‌ చెయాలని ఉన్నా తల్లి బ్రతి కుండగా హజ్జ్‌ చేయలేకపోయారు. కారణం-‘తల్లి సేవ’! అంతగా ఆయన తల్లిని సేవలో తరించారు గనకే నయం కాని కుష్టు రోగాన్ని అల్లాహ్‌ా నయం చేశాడు. ఆయన పేరు తీసుకొని మరీ ప్రవక్త (స) స్వయంగా ఆయన్ను ప్రశంసించారు. అంతే కాదు – ”యమన్‌ నుండి ఉవైస్‌ ఖర్నీ అనేె వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. అతను తన తల్లి యెడల ఉత్తమంగా వ్యవహ రించేవాడు. ఓ ఉమర్‌! నువ్వే గనక అతన్ని చూస్తే నీ కోసం ప్రార్థించ మని చెప్పు. నేను చెప్పానని చెప్పు” అని తాకీదు చేసారు.
ఆధ్యాత్మిక రంగానికి చెందిన మహా ఉద్ధండులయిన ఉమర్‌ (ర) ఆయన వచ్చేంత వరకు వేచి ఉండటమే కాక, ఆయన వచ్చాక ఆయన్ను కలిసి తన కోసం ప్రార్థించ వలసిందిగా కోరారు. ఓ మామూలు స్థాయికి చెందిన ఆయన్ను అంతటి మహోన్నత స్థాయికి చేర్చిన విషయం ఏది? అదే ‘తల్లి సేవ’! నేడు సయితం మనకు ఎంతో మంది తారస పడుతుం టారు. చాలా సింపుల్‌గా కనిపించే వారు చాలా గొప్ప గొప్ప హోదాల్లో రాణిస్తుంటారు. పూర్వపరాల్ని పరిశీలిస్తే ఆర్హతతోపాటు వారు తల్లిదం డ్రులకు చేసుకునే సేవే వారిని ఆ స్థాయిలో కూర్చోబెట్టిందని అర్థమవు తుంది.

అమ్మానాన్నల దీవెనలు ఇహంలోనూ ప్రతిఫలిస్తాయి. పరంలోనూ ప్రతి ఫలిస్తాయి. ఆదే వారి యెడల దురుసుగా వ్యవహరించేవారు, దుర్మార్గంగా నడుచుకునే వారు, వారిని తిట్టేవారు, కొట్టేవారు పురు గులు పట్టి పోతారు. వారికి మించిన దౌర్భాగ్యులు మరొకరు లేరు. ”వాడు నాశనం గాను, వాడు నాశనం గాను, వాడు నాశనం గాను” అని మూడు సార్లు ప్రవక్త (స) అభిశపించారు. అది విని కంగారు పడిన సహచరులు ఇంతకీ ఆ దౌరాగభగ్యుడు ఎవరో? సెలవియ్యండి ప్రవక్తా! అని విన్నవించుకున్నారు. అందుకాయాన-వృద్ధ థలో తల్లి దండ్రుల్ని పొంది కూడా (వారి సేవ చేసుకొని) స్వర్గానికి వెళ్ల లేని వాడు” అన్నారు. (ముస్లిం)
అవును అలాంటి వాడు ఇంటికి బరువు, సమాజానికి బరువు, దేశానికి బరువు, భూమికే బరువు. అందుకే వేమన అన్నాడు:
తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుఁడు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అని.

Related Post