న్యాయం మరియు ఇస్లాం

న్యాయం అంటే హక్కుదారులకు వారి హక్కును ఉత్తమ పద్ధతిలో సగౌరవంగా అందేలా చేయడమే. ఆ విషయంలో ఇస్లాం ప్రతి వ్యక్తితోనూ న్యాయంగానే వ్యవహరించింది. ముస్లిం, ముస్లిమేతరుడు, స్త్రీ, పురుషుడు, రాజు, ప్రజ, తనవారు, పరాయివారు, స్వసంస్కృతి, పరసంస్కృతి, స్వదేశం, పరదేశం, స్నేహితుడు, శత్రువు వంటి తరతమ బేధాలను అది ఎంత మాత్రం పాటించదు. వ్య

న్యాయం అంటే హక్కుదారులకు వారి హక్కును ఉత్తమ పద్ధతిలో సగౌరవంగా అందేలా చేయడమే. ఆ విషయంలో ఇస్లాం ప్రతి వ్యక్తితోనూ న్యాయంగానే వ్యవహరించింది. ముస్లిం, ముస్లిమేతరుడు, స్త్రీ, పురుషుడు, రాజు, ప్రజ, తనవారు, పరాయివారు, స్వసంస్కృతి, పరసంస్కృతి, స్వదేశం, పరదేశం, స్నేహితుడు, శత్రువు వంటి తరతమ బేధాలను అది ఎంత మాత్రం పాటించదు. వ్య

”చూడండి! ఒక జాతి వైరం మిమ్మల్ని అన్యాయానికి పురిగొల్ప కూడదు. మీరు సదా న్యాయానికే కట్టుబడండి. ఇదే దైవభీతికి అత్యంత చేరువయిన అంశం”. (అల్‌ మాయిదహ్‌: 8)
సమాజంలోని సభ్యుల మధ్య అనేక బంధాలు, అనుబంధాలు, రక్త సంబం ధాలు, స్నేహ సంబంధాలు. వాటికి అనుగుణంగానే అనేక హక్కులు, బాధ్యతలు. ఏ స్థాయిలో ఏ మాత్రం హెచ్చుతగ్గులు జరిగినా, వ్యవస్థ అది ఏదయినా సజావుగా కొనసాగడం అసాధ్యం. అందు వల్ల అందరి మధ్య సంతులాన్ని స్థాపించే న్యాబద్ధమయిన నియమాలు కావలసి ఉంటాయి. ఆ న్యాయబద్దమయిన నియమాల వల్లనే ఏ సమాజంలోనూ, మరే దేశంలోన యినా శాంతి సుస్థిరతలు నెలకొంటాయి. ఈ కారణంగానే ఇస్లాం న్యాయాని కి పెద్ద పీట వేస్తుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”నిశ్చయంగా అల్లాహ్‌ న్యాయం చెయ్యండి అని, ఉపకారం చెయ్యండి” అని గట్టిగా తాకీదు చేస్తు న్నాడు. (అన్నహ్ల్‌: 90)

సమాజం అది ఆస్తికం, నాస్తికం-ఏదయినా సరే అక్కడ న్యాయం నశించి నట్లయితే అన్యాయం, అక్రమం, అఘాయిత్యాలనే అంధకారాలు అలుముకుంటాయి. ధనికుడు పేదవాటడిని అణచి వేసే ప్రయత్నం చేస్తే, బలవం తుడు బలహీన ప్రజల హక్కులను కాల రాస్తాడు. ప్రభుత్వం ప్రజలపై దౌర్జ న్యానికి దిగుతుంది. నేడు ప్రపంచంలో ఎక్కడయినా దురన్యాయం, దుర్మా ర్గం, దౌర్జన్యం పెచ్చుమీరి ఉందంటే కారణం అక్కడి న్యాయ వ్యవస్థ బలంగా లేకపోవడమే.

న్యాయం అంటే హక్కుదారులకు వారి హక్కును ఉత్తమ పద్ధతిలో సగౌరవంగా అందేలా చేయడమే. ఆ విషయంలో ఇస్లాం ప్రతి వ్యక్తితోనూ న్యాయంగానే వ్యవహరించింది. ముస్లిం, ముస్లిమేతరుడు, స్త్రీ, పురుషుడు, రాజు, ప్రజ, తనవారు, పరాయివారు, స్వసంస్కృతి, పరసంస్కృతి, స్వదేశం, పరదేశం, స్నేహితుడు, శత్రువు వంటి తరతమ బేధాలను అది ఎంత మాత్రం పాటించదు. వ్యక్తి తన కులస్థుడా కాదా, తన బంధువా కాదా, ఉన్న వాడా, లేనివాడా అని చూడదు. కక్ష, వివక్షలకి అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటుంది. ఖుర్‌ఆన్‌ ఇలా ఉపదేశిస్తుంది: ”న్యాయం చెయ్యండి. నిశ్చయంగా అల్లాహ్‌ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు”. (హుజురాత్‌: 9)

నిత్యం న్యాయానికి, ధర్మానికి కట్టుబడి జీవించేవారిని అల్లాహ్‌ కరుణిస్తాడు. సాక్ష్యమిస్తే సత్యబద్ధంగానే ఇవ్వాలి. మనమిచ్చే సాక్ష్యం మనకు, మన తల్లి దండ్రులకు, మన ఆత్మీయులకు, నష్టకరంగా పరిణమించినప్పికీ వెనుకా డరాదు. ఎందుకంటే న్యాయం అన్నికన్నా ముఖ్యం. అందరూ స్వేచ్ఛగా జీవించగలిగేలా చేసేది న్యాయం మాత్రమే. అందుకే అన్ని తెలిసినా అల్లాహ్‌ ఇలా ఉపదేశిస్తున్నాడు: ”ఓ విశ్వసించిన వారలారా! మీరు న్యాయం విష యంలో నిక్కచ్చిగా ఉండండి. అల్లాహ్‌ ప్రసన్నత నిమిత్తం (సత్యం మాత్రమే పలికే సాక్షులుగా ఉండండి. (మీరు ఇచ్చే సాక్ష్యం) అది మీ స్వయానికీ, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే! అతను ధనికుడయినా, పేదవాడయినా సరే. వారి పట్ల అల్లాహ్‌ (మీకన్నా) ఎక్కువ శ్రేయోభిలాషి. కాబట్టి మీరు మీ మనోవాంఛలకు లొంగిపోయి న్యాయాన్ని వీడకండి. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, సాక్ష్యం చెప్పడానికి విముఖత చూపినా మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు సుమా!” (అన్నిసా: 135)
తనవారు, పరాయివారు; తన జాతి, పరాయి జాతి; తన దేశం, పరాయి దేశం – ఇలా మానవుల మధ్య మానవ ప్రయోజనాల మధ్య, మానవులకు కలిగే మేలూ కీడుల మధ్య లంకెలు కుదిర్చి న్యాయాన్యాలకు, ద్వేషాభి మానాలకు కొలబద్ధలు నిర్మించుకున్నాడు మనిషి. ఫలితంగా మనిషికి మనిషి మధ్య వైషమ్యాలు, వైరాలు, దూరాలు పెరిగాయి. ఒకరితో మాట్లాడి మానవ సంబంధాలు పెంచుకోవడానికి బదులు ఒకరి గురించి మాట్లాడి బంధాలను తుంచుకున్నాడు. నేడు మనిషి పీక్కు తినే దుష్కృతి జడలు విప్పడానికి కారణం మనిషి ఏర్పరచుకున్న ఈ అసమానతలు, అన్యాయ ధోరణులే. వ్యక్తి స్వసంస్కృతీ నిష్ఠుడయినా, స్వదేశానురాగుడయినా పర సంస్కృతుల పట్ల సంసర్గం, పరాయి దేశాల పట్ల గౌరవాలు పుష్కలంగా ప్రదర్శించే సామరస్య, న్యాయబద్ధ ధోరణి నేటి మనందరి ముఖ్యావసరం.ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”చూడండి! ఒక జాతి వైరం మిమ్మల్ని అన్యాయానికి పురిగొల్ప కూడదు. మీరు సదా న్యాయానికే కట్టుబడండి. ఇదే దైవభీతికి అత్యంత చేరువయిన అంశం”. (అల్‌ మాయిదహ్‌ా: 8)
తల్లి ఒడిలో పసిపాపల పెంపకం మొదలు, బడిలో పంతులు చెప్పే చదు వుల వరకు, ఇంటిలోని ఇల్లాలి సమస్యలు మొదలు వీధిలో మనిషి నడవడిక వరకు-బజారులో చేసే బేరాలయినా, బ్రతుకు తెరువు కోసం చేసే పోరాటాలయినా, ఏలికలు సాగించే రాచపనులయినా-అన్నీ న్యాయబద్ధంగా జరిగిన ప్పుడే సత్ఫలితాన్ని చూడగలడు మనిషి. నోమాన్‌ బిన్‌ బషీర్‌ (ర) గారి సంఘటన ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ- ”మా నాన్న నాకు ఒక కానుక ను ఇచ్చారు. అది చూసిన మా అమ్మ గారు, ఈ కానుకకు దైవప్రవక్త (స) సాక్షిగా ఉండనంత వరకూ తాను దాన్ని ఒప్పుకోనని అంది. అప్పుడు మా నాన్న దైవప్రవక్త (స) వారి వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించారు. ‘నువ్వు నీ పిల్లలందరికీ ఈ కానుకను ఇచ్చావా?’ అని దైవప్రవక్త (స) దర్యాప్తు చేశారు. ‘లేద’ని మా నాన్న గారు బదులిచ్చారు. ‘మరయితే అల్లాహ్‌ాకు భయపడు. సంతానం మధ్య న్యాయాన్ని పాటించు.నేను అన్యాయానికి సాక్షిగా ఉండను’ అని చెప్పారు. (సహీహ్‌ ముస్లిం)

సమతౌల్యం, సమతూకం, న్యాయం అన్న సలక్షణాలకు మనిషి కట్టుబడి ఉండటం కష్టమే కానీ సాధ్యం. ముఖ్యంగా మనిషి స్వార్థాలు ఒక విషయంతో ముడి పడి ఉన్నప్పుడు, న్యాయం చేస్తే తను నష్ట పోవాల్సి వస్తుందని తెలిసినప్పుడు అహం అడ్డు తగిలి న్యాయానికి దూరంగా ఉంచేంతుకు ప్రయత్నిస్తుంది. అలాంటి సమయాల్లో అల్లాహ్‌ భీతిని ఆశ్రయించినట్లయితే, అల్లాహ్‌, మనిషి చేసే న్యాయానికి ప్రసాదించే ప్రతిఫలాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మనిషి ఈ బలహీనతలను అధిగమించ గలడు.అంతిమ దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ఏ రోజునయితే ఆయన నీడ తప్ప మరే నీడా ఉండదో ఆ దినాన ఏడుగురిని అల్లాహ్‌ తన నీడ పట్టున ఆశ్రయం కల్పి స్తాడు. (ఆ ఏడుగురిలో) న్యాయంగా పరిపాలించినా నాయకుడు ఒకడు”. (ముత్తఫఖున్‌ అలైహి)
మనలోని ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో నాయకులే, కాపలాదారులే. మనం మన పోషణ క్రింద ఉండే వారి విషయంలో న్యాయంగా వ్యవహ రించాలి. చరిత్ర ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, ముస్లింలు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నంత కాలం వారు తిరుగు లేన విజేతలుగా విరాజిల్లారు.

ప్రవక్త (స) వారి కాలంలో ఓ గొప్పింటి స్త్రీ దొంగతనానికి పాల్పడింది. శిక్ష నుండి ఆమెను తప్పించే ప్రయత్నం కొందరు చేసినప్పుడు మహా నాయకులు ముహమ్మద్‌ (స) అగ్రహోదగ్రులయి అన్న మాట: ”ఓ ఉసామా! అల్లాహ్‌ సరిహద్దుల్లోని ఓ హద్దు వియంలో సిఫారసు చేస్తావా? ముహమ్మద్‌ (స) ప్రాణం ఎవరి చేతిలోనయితే ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను – ఒకవేళ ముహమ్మద్‌ (స) కూతురు ఫాతిమా (ర.అ) ఈ దొంగతనానికి పాల్పడి ఉన్నా నేను ఆమె చేతిని సయితం తీసే వాడిని”. (ముత్తఫఖున్‌ అలైహి)

నైజం రీత్యా మనిషి న్యాయాన్ని ఇష్ట పడతాడు. ఏదేని వ్యవహారంలో తనకు న్యాయం జరిగితే సహజంగానే సంతోషిస్తాడు కూడా. ఆ విషయాని కొస్తే అన్యాయపరుడు సయితం తనకు న్యాయమే జరగాలని కోరుకుంటాడు. న్యాయం శాంతికి, సంతృప్తికి, అభివృద్ధికి కారణమయితే, అన్యా యం అశాంతికి, అలజడికి, అసంతృప్తికి, అధోగతికి కారణం అవుతుంది.

ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) గారి హయాంలో రోము రాజు తన రాయబారిని ఆయన వద్దకు పంపాడు. అతను మదీనా చేరుకొని ”మీ రాజు ఎక్కడ?” అని ప్రశ్నించాడు. మాకు రాజు అనేెవాడు లేడు కానీ ప్రతినిధి, ఖలీఫా ఉన్నారు, ఆయన ప్రస్తుతం పట్టణం వెలుపల ఏదో పని మీద వెళ్ళి ఉన్నారు అని బదులిచ్చారు ప్రజలు. ఆ రాయబారి హజ్రత్‌ ఉమర్‌ (ర) గారిని వెతుక్కుంటూ ఆయన ఉన్న ప్రదేశానికి చేరుకుని ఆయన్ను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ‘ముస్లింల ప్రతినిధి (అప్పటి సగం ప్రపంచానికి నాయకుడు) ఇసుక తిన్నెల మీద తల పెట్టి నేలపై విశ్రాంతి తీసుకుంటున్నారు’. ఎందరో రాజుల్ని, వారి పటాటోపాన్ని ప్రత్య క్షంగా చూసిన ఆ రాయబారి ఖలీఫా ఉమర్‌ (ర) గారి నిరాడంబరతను చూసి ఆశ్చర్యచకితుడయి అన్న మాట – ”ఏ వ్యక్తి పేరు వింటేనే ప్రపం చం వణుకుతుందో ఆ వ్యక్తి ఇతనేనా? ఓ ఉమర్‌! మీరు న్యాయం చేశారు. ఫలితంగా ఇంత ప్రాశాతంగా నిద్రపోతున్నారు” అని.

ఇస్లాం న్యాయం విషయంలో ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య తేడాను పాటించదు. ఇస్లాం న్యాయ పరిపాలన గురించి మిత్రులే కాదు శత్రువులు సయితం పెద్ద ఎత్తునే సాక్ష్యం ఇచ్చారు. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ రవాహా (ర) గారిని ప్రవక్త (స) యూదల వద్దకు న్యాయ నిర్ణేతగా చేసి ఖైబర్‌ ప్రాంతానికి పంపారు. జడ్జీ ముస్లిం కదా ఎక్కడ తమ విషయంలో అన్యాయం చేస్తాడేమోనని భయ పడిన యూదలు ఆయన్ను రాజీ పర్చు కునేందుకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. అది గమనించిన ఆయన ఇలా అన్నారు: ”నాకు ప్రవక్త (స) వారి పట్ల ఉన్న అభిమానం, మీ పట్ల ఉన్న ధ్వేషం నన్ను న్యాయం నుండి ఆప జాలదు”. అది విన్న యూదులు ముక్త కంఠంతో ఇచ్చిన కితాబు- ‘మీరు కనబరచిన ఈ న్యాయం ఆధారంగానే భూమ్యాకాశాల వ్యవస్థ సజావుగా సాగుతోంది’ అని.

సుల్తాన్‌ ముహమ్మద్‌ గజ్నవీ అంటే తెలియని వారెవరుంటారు చెప్పండి! ఓ సారి ఒక వ్యక్తి ఆయన దర్బారుకి వచ్చి ఇలా ఫిర్యాదు చేశాడు-‘మహా రాజా! కొంత కాలంగా తమరి చెల్లెలి కొడుకు రాత్రి పూట మా ఇంటికి వచ్చి నన్ను కొరడాతో చావబాది ఇంటి నుండి గెంటేసి – పూర్తి రాత్రి నా భార్యతో గడుపు తున్నాడు’. అది విన్న ముహమ్మద్‌ పంటి క్రింద కోపాన్ని భరిస్తూనే బోరున విలపించ సాగాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు: ”వాడు మరోసారి మీ ఇంటి కొచ్చి అలా వ్యవహరించినప్పుడు తక్షణమే నాకు తెలియజేయి” అని చెప్పడం తోపాటు దూరంగా ఉన్న భటుల్ని ఉద్దేశించిన ఇతను ఎప్పుడొచ్చినా ఆపకుండా నా వద్దకు పంపండి అని ఆజ్ఞాపించాడు. అలవాటు ప్రకారం దుర్మార్గుడు రానే వచ్చాడు. సదరు వ్యక్తి విషయాన్ని రాజు వరకు చేర వేశాడు. వెంటనే సుల్తాన్‌ కరవాలం చేతబూని అతనితోపాటు అతని ఇంికి చేరుకుని, పేదవాని భార్యతో కులుకుతున్న ఒక్క వేటుతో చెల్లెలి కొడుకు తల మొండెం వేరు పర్చేశాడు. ఆ తర్వాత నీళ్ళు తెప్పించి త్రాగాక ఇలా అన్నాడు:

”నీవు వచ్చి నీ బాధ నాతో చెప్పినప్పుడే నేను ప్రతీన బూనాను. నీకు పూర్తి న్యాయం జరగనంత వరకూ పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోనని, ఈ కామాంధుడి రక్తం కళ్ళ చూశాక గాని నా దాహం తీర్చుకోనని”.

ఇది మన పూర్వీకులు స్థాపించి వెళ్లిన న్యాయం. ఇలాంటి ఆదర్శాలను మాటల వరకే పరిమితం చెయ్యక మనం సయితం మన స్వీయ విషయంలో, స్నేహితుల విషయంలో, వృత్తి విషయంలో, వ్యవహార విషయంలో, దేశం- దేశప్రజల విషయంలో న్యాయంగా వ్యవహరించాలి. బాధితుల శాపాన్నుండి మనల్ని మానం కాపాడుకోవాలి. దైవప్రవక్త (స): ”బాధితుని అభిశాపం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అతని అభిశాపానికి అల్లాహ్‌కు మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు” అని హెచ్చరించారు.

Related Post