Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

చిట్ట చివరి దైవ గ్రంధం దివ్యఖుర్ఆన్

దైవ వచన లిఖిత రూపమే ఖుర్ఆన్. సృష్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ముహమ్మద్(స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు. ఖుర్ఆన్, సృస్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు.

దైవ వచన లిఖిత రూపమే ఖుర్ఆన్. సృష్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ముహమ్మద్(స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు. ఖుర్ఆన్, సృస్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు.

1450వందల సంవత్సరాలకు పూర్వం సర్వ శక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ తన దూత (గాబ్రేయిల్) ద్వారా చివరి ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) పై క్రమ క్రమంగా 23 సంవత్సరాలలో పవిత్ర ఖుర్ ఆన్ ను అవతరింపజేశాడు. జిబ్రయీల్ (గాబ్రేయిల్) దూత దైవ సందేశాన్ని ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలకు అందజేశాడు. ఆ దూత ప్రవక్తలకు మానవ రూపంలో అవతరించేవాడు. కొంత మంది ప్రజలు మానవ రూపంలో ఉన్న ఆ దూతను దేవునిగా భావించసాగారు.

ముహమ్మద్ (స. అ. సం) నిరక్షరాస్యులు. ఆయన పవిత్ర ఖుర్ ఆన్ ను దేవుని సహాయ తో జ్ఞాపకం చేసుకొని తన శిష్యులకు బోధించి తద్వారా ప్రజలందరికీ చేరవేశారు.

ఖుర్ ఆన్ అవతరిచిన నాటి నుండి 1450 ల సంవత్సరాలుగా ఎటువంటి మార్పులు చేర్పులకు గురికాని ఏకైక గ్రంధం. దానిని రక్షించే బాధ్యత దేవుడు స్వయంగా తీసుకున్నాడు. ఈ ఖుర్ ఆన్ గ్రంధం ప్రతి తరం వారికి యుగాంతం వరకు మార్గదర్శకం. మరియు ముహమ్మద్ (స. అ. సం) చిట్ట చివరి దైవ ప్రవక్త.

ఖుర్ఆన్ అనగా ఏమిటి ?

(దివ్యఖుర్ఆన్ – 39 : 1) ” ఈగ్రంథం (దివ్యఖుర్ఆన్) మహాశక్తి సంపన్నుడూ, మహా వివేకవంతుడూ అయిన అల్లాహ్ తరపు ను౦డి అవతరించింది. ”

దైవ వచనం: దైవ వచన లిఖిత రూపమే ఖుర్ఆన్. సృష్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ముహమ్మద్(స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు. ఖుర్ఆన్, సృస్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు.

ఈ ఖుర్’ఆన్ గ్రంధానికి మరొక పేరు ఫుర్ఖాన్ (గీటురాయి). సాధారణంగా మనం గీతురాయిని ఏది మంచి బంగారం ఏది నకిలీ బంగారం అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. అలాగే ఖుర్’ఆన్ గ్రంధం కూడా ఏది సత్యం ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం, నిజదేవుడెవరు?, కల్పిత దేవుళ్లెవరు? అనే విషయాలు వేరు చేసి చూపిస్తుంది. అందుకే దీన్ని సృష్టికర ఫుర్ఖాన్ (గీటురాయి) అని పిలిచాడు.
సర్వ లోకాల సృష్టికర్త సర్వ మానవాళికి ఋజుమార్గం చూపడానికి ఈ ఖుర్’ఆన్ గ్రంధాన్ని అవతరింపజేశాడు. అందుకే ఖుర్ఆన్ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వం

సోదరులారా! సర్వ లోకాల సృష్టికర్త సర్వ మానవాళికి ఋజుమార్గం చూపడానికి ఈ ఖుర్’ఆన్ గ్రంధాన్ని అవతరింపజేశాడు. ఉదాహరణకు ఈ ఖుర్’ఆన్ వాక్యాలను పరిశీలించండి.

(దివ్యఖుర్ఆన్ – 2: 185) “ఖుర్’ఆన్ మానవులందరికీ మార్గదర్శకం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు దీనిలో ఉన్నాయి .”

(ఖుర్’ఆన్ 14:52). “సర్వ మానవులకు ఇదొక సందేశం, అందరినీ హెచ్చరించాలని, అందరూ యదార్ధంగా దేవుడు ఒక్కడే అని తెలుసుకోవాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది (ఖుర్’ఆన్) పంపబడింది.

ఖుర్ ఆన్ ముస్లింల కోసం మాత్రమె అవతరించిందని ఖుర్’ఆన్ గ్రంధంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు.

సర్వ లోకాల సృష్టికర్త సర్వ మానవాళికి ఋజుమార్గం చూపడానికి అవతరింప చేసిని చిట్టచివరి దైవ సందేశం ఖుర్ఆన్

మహాశక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ చిట్ట చివరి గ్రంథమే ఖుర్ఆన్. ఇది పూర్వపు దైవగ్రంథాలను ధ్రువపరుస్తుంది. పూర్వ గ్రంథాలలోని కల్పితాలు , అస౦గతులను ఖండించిన, సరిచేసిన పరిశుద్ధ దైవగ్రంధం.

(దివ్యఖుర్ఆన్ – 4: 47)”గ్రంథ ప్రజలారా! మేము ఇప్పుడు అవతరింపజేసిస గ్రంథాన్ని విశ్వసించండి. అది, మీ వద్ద పూర్వం నుండే ఉన్న గ్రంథాన్ని ధ్రువపరుస్తుంది, సమర్ధిస్తుంది.”

ఖుర్ఆన్ గ్రంథం ఎలా అవతరించింది ?

ఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) పై అవతరించింది. అది ప్రకటితమైనది అరబీ భాషలోనే. అయితే ఖుర్ఆన్ భావానువాదాలు ప్రపంచంలోని అనేక భాషలలో లభిస్తున్నాయి.
ఒకే ఒక్క దైవవాణిలో మొత్తం ఖుర్ఆన్ గ్రంధం అవతరించలేదు. 23 ఏళ్ళపాటు ప్రకటితమైన దైవాజ్ఞల సంకలనమే ఖుర్ఆన్.
ఈ కారణంగానే, ఖుర్ఆన్ వచనాలు (ఆయతులు) ఏయే సందర్భాలలో ప్రకటితమయ్యాయో అర్ధం చేసుకోవడం అత్య౦త అవశ్యకం, లేదంటే ఖుర్ఆన్ బోధనలను అపార్ధం చేసుకునే అవకాశం ఉంది.

450 ఏళ్ళుగా ఎలాంటి మార్పులు, చేర్పులు, సవరణలకు గురికాకుండా యథాతథ రూపంలో సురక్షిత౦గా ఉనంగ్రంథం.

(దివ్యఖుర్ఆన్ – 15: 09) ” ఇక ఈ జ్ఞాపిక, దానిని మేము అవతరింపజేశాము. స్వయంగా మేమే దానిని రక్షిస్తాము.”

(దివ్యఖుర్ఆన్ – 41: 53) ” మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖుర్ఆన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. ”

సంరక్షణ ప్రకటితమైన నాటి ను౦చి ఎలాంటి మార్పులు, చేర్పులు, సవరణలకు గురికాకుండా యథాతథ రూపంలో సుదీర్ఘకాలం చెలామణిలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథం ఖుర్ఆన్. 450 ఏళ్ళుగా యథా రూపంలో సురక్షిత౦గా ఉనంగ్రంథం.
దివ్య ఖుర్ఆన్ కేవలం లిఖిత రూపంలోనే సంరక్షిపబడి లేదు. స్త్రీ, పురుషులు, పిల్లల హృధయాల్లో సయితం సంరక్షింపబడి ఉ౦ది. నేడు లక్షలాది మ౦ది ఖుర్ఆన్ ని ఆద్యంతం కంఠస్తం చేశారు.

ఖుర్ఆన్ గ్రంథం శాస్త్రీయ అద్భుతం

అధునిక విజ్ఞాన శాస్త్రం తో ఖుర్ఆన్ విభేదించలేదు. పైగా దానిని సమర్థించింది. ఖుర్ఆన్ విశిష్ఠత ఏమిటంటే అది పిండోత్పత్తి శాస్త్రం (embriyology), వాతావరణశాస్త్రం (meteorology), ఖగోళ శాస్త్రం (astronomy), భౌగోళిక శాస్త్రం (geology), సాగర శాస్త్రం (oceanography) వ౦టి వివిధ రంగాలకు చెందిన ప్రాకృతిక దృగ్విషయాలను ఖుర్ఆన్ ని అనేక ఆయతులు స్పష్టంగా వివరించాయి. 7వ శతాబ్దంనే ఈగ్రంథం అనేక శాస్త్రీయ విషయాలను వివరించిందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వాస్తవానికి ఖుర్ఆన్ గ్రంథం పేర్కొన్న అనేక శాస్త్రీయ అద్భుతాలను ఇటీవలి కాలంలోనే ఆధునిక సాంకేతిక పరికరాల ప్రగతి కారణంగా కనుగొన్నారు.

ఈ క్రింది అంశాలని పరిశీలించండి :
– మానవ పీండోత్పత్తి అభివృద్ధిని గురించి ఖుర్ఆన్ వివరించింది. నిజానికి ఈ వివరాలు ఇటీవలి కాలం వరకు శాస్త్రజ్ఞులకు తెలియవు.
– రోదసి పదార్థాలు (నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుళ్ళూ వగైరా…) మేఘాల ధూళితో ఏర్పడ్డాయని, ఖుర్ఆన్ స్పష్టీకరించి౦ది. ఇదివరలో ఈ విషయం తెలియదు. కానీ ఆధునిక ఖగోళశాస్త్రంలో ఇదో నిర్వివాద వాస్తవంగా ఇప్పుడు మారింది. రెండు సముద్రాలు కలిసినప్పటికీ అవి తమ ఉష్ణోగ్రతను, సాంద్రతను, లవణీయతను కలిగి ఉంటాయన్న విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇటీవల కనుగొన్నది.
ఈ దైవ సూచనలను 1400 ఏళ్ళకు పూర్వమే ఖుర్ఆన్ తెలిపింది.
అద్వితీయమైనది
ఖుర్ఆన్ అవతరించినప్పటి నుంచి ఎవరూ అలాంటి గ్రంథాన్ని రూపొందిచలేదు. కనీసం అందులోని ఒక అధ్యయనాన్ని (సూరా) అయినా రూపొందించలేదు. సుధరం, స్పష్టత, శోభ, విజ్ఞానం, భవిష్య సూచనలు, తదితర అ౦శాలన్నీ ఖుర్ఆన్ లో ఉన్నట్లు మళ్ళీ ఎవరూ చెప్పలేదు. ఖుర్ఆన్ ఆవిర్భవించిన భాష అరబీలో ప్రవీణులై ఉండి, ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) ని తిరస్కరించిన వారు సయితం అలాంటి మరో గ్రంథం సృష్టించి చూపమన్న సవాలుసు ఎదుర్కోలేకపోయారు. ఈ నాటికి ఖుర్ఆన్ వంటి గ్రంధాన్నొక్కటి సృష్టించి చూపమన్న సవాలు అలాగే ఉండిపోయింది.
(దివ్యఖుర్ఆన్ – 41: 53) ” మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖుర్ఆన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. ”

 

Related Post