Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

దివ్య ఖుర్‌ఆన్‌ మానవీయ జీవనికి ధర్మదాయి

సర్వలోకాన్ని సృష్టించిన ఏకేశ్వరుడు అయిన అల్లాహ్‌ను మరచి ఎందరో దేవుళ్ళు ఉన్నారని తలచి, బహుదైవారాధన (షిర్క్‌కు పాల్పడకు), వ్యభిచారం దరిదాపులకు కూడా పోకు. అది అతి నీచకరమైన బహుచెడ్డ మార్గం,

సర్వలోకాన్ని సృష్టించిన ఏకేశ్వరుడు అయిన అల్లాహ్‌ను మరచి ఎందరో దేవుళ్ళు ఉన్నారని తలచి, బహుదైవారాధన (షిర్క్‌కు పాల్పడకు), వ్యభిచారం దరిదాపులకు కూడా పోకు. అది అతి నీచకరమైన బహుచెడ్డ మార్గం,

మానవుడు సన్మార్గాన్ని వదలి సత్యం, ధర్మం, న్యాయాన్ని మరచి అంధకారంలో కొట్టు మిట్టాడుతూ, జీవితాన్ని వెళ్ళబోస్తున్నపుడు మాన వునికి జీవనజ్యోతిలా వెలుగుతూ రుజుమార్గాన్ని చూపింది దివ్య ఖుర్‌ ఆన్‌. పవిత్ర గ్రంథమయిన ఖుర్‌ఆన్‌ గురించి అల్లాహ్‌ ఈ విధంగా తెలియ జేస్తున్నాడు: ”యదార్థం ఏమిటంటే ఈ ఖుర్‌ఆన్‌ పూర్తిగా సరియైన మార్గాన్ని చూపుతుంది”. (బనీ ఇస్రాయీల్‌ 9,10)
ఈ పవిత్ర ఖుర్‌ఆన్‌ దైవగ్రంథం ఎవరి తరపున వచ్చింది? మానవునికి ఎలా లభ్యమయింది? దీన్ని ఎవరు సృష్టించారు? మానవుడు సృష్టించడానికి వీలుకాని గ్రంథం ఇది. ఈ గ్రంథానికి మూలకర్త ఎవరు? ఒక్కసారి ఆలోచించు, సర్వలోకాలకు మూలకారకుడై సమస్త జగత్తును, సర్వ మానవాళిని నడిపిస్తూ ఆకాశంలో సింహాసనం మీద ఉన్న, పరమేశ్వరుడు అయిన అల్లాహ్‌ా సృష్టించాడు – ఆ గ్రంథం మానవాళికి ఏ విధంగా చేరిందంటే దైవదూతల్లోకి పెద్దవారైన జిబ్రయీల్‌ (అస్సలామ్‌) ద్వారా. అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) పై పవిత్ర దైవ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ సందేశవాక్కు 23 సంవత్సరాల కాలంలో పూర్తి అయింది.
ఏకేశ్వరుడు సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్‌ మానవునికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ”అల్లాహ్‌ పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖుర్‌ఆన్‌, ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. అల్‌ కితాబ్‌కు వివరణ, ఇది విశ్వ పాలకుని తరుపు నుండి వచ్చిందనే విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు”. (యూనుస్‌ 37)
దివ్యఖుర్‌ఆన్‌ అవతరించిన రాత్రి వెయ్యి నెలలకంటే గొప్పది. ఆ రాత్రి ఎప్పుడంటే ఖచ్చితంగా చెప్పలేం. రమజాన్‌ మాసంలో, ఆఖరి 10 రోజుల్లో ఒక రాత్రి అని మనకు (హదీస్‌ల ద్వారా) తెలుస్తుంది. ఈ పవిత్రమైన ఖుర్‌ఆన్‌ మధురానుభూతితో పారాయణం చేస్తుంటే రోజులు ఏ విధంగా గడచిపోతాయో తెలియదు. రమజాన్‌ నెలలో ఉపవాసాలు పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
సర్వేశ్వరుడు అయిన అల్లాహ్‌ రమజాన్‌ నెల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ”పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరించిన నెల రమజాన్‌ నెల మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇకనుండి రమజాన్‌ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసాలు ఉండాలి”. (అల్‌ బఖర 185)

దివ్యఖుర్‌ఆన్‌ మానవున్ని హెచ్చరిస్తుంది:

”మానవుడా! నువ్వు అవిశ్వాసానికి పాల్పడితే పరలోకంలో అల్లాహ్‌ దగ్గర శిక్ష తప్పదని. దివ్యఖుర్‌ఆన్‌ అవిశ్వాసి (ధర్మం తప్పినవాని గురించి) గురించి ఈ విధంగా బోధిస్తుంది: అవిశ్వాసానికి పాల్పడిన వారికి నరకాగ్ని ఉన్నది. వారు చనిపోవాలి అనే తీర్పూ ఇవ్వబడదు. వారి నరక యాత నను ఎంతమాత్రం తగ్గించటమూ జరగదు. ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్యక్తికీ ప్రతిఫలం ఇస్తాము. వారు అక్కడ పెడబొబ్బలు పెడుతూ ఇలా అంారు. ”మా ప్రభూ! మమ్మల్ని ఇక్కడ నుండి బయటకు తియ్యి. మేము పూర్వం చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేయానికి” (వారికి ఇలా జవాబు ఇవ్వబడుతుంది) గుణపాఠం నేర్చుకోదలచినవాడు గుణపాఠం నేర్చుకోవానికి సరిపడిన ఆయష్షును మేము మీకు ఇవ్వలేదా! ఇక్కడ యాతనను రుచి చూడండి. దుర్మార్గులకు ఇక్కడ సహాయం చేసేవాడెవ్వడూ లేడు. (ఫాతిర్‌ 36,37)

అవిశ్వాసిగా జీవించకు

సర్వలోకాన్ని సృష్టించిన ఏకేశ్వరుడు అయిన అల్లాహ్‌ను మరచి ఎందరో దేవుళ్ళు ఉన్నారని తలచి, బహుదైవారాధన (షిర్క్‌కు పాల్పడకు), వ్యభిచారం దరిదాపులకు కూడా పోకు. అది అతి నీచకరమైన బహుచెడ్డ మార్గం, దొంగతనాలు చేయకు, పరాయి సొమ్ము పాములాింది. హత్యలు చెయ్యకు, మద్యం పుచ్చుకోకు, జూదం ఆడకు, దేవుడి మీద దొంగ ప్రమాణాలు చెయ్యకు, పిసినారితనం చూపకు, స్త్రీలపై అభాండాలు మోపకు, పక్కవారి ఆస్తిని కాజేయకు, సాి మనిషిని ఎగతాళి చెయ్యకు, వడ్డీని ఆశించకు, స్త్రీలను పురుషులను హింసించకు అని ఖుర్‌ఆన్‌ హెచ్చరిస్తోంది.
(1) బహుదైవారాధన (షిర్క్‌) గురించి ఈ విధంగా తెలియచేస్తుంది: అల్లాహ్‌ా క్షమించనిది కేవలం షిర్క్‌ను మాత్రమే (అన్‌ నిసా 47,48)
(2) వ్యభిచారం: ”వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. అది అతి నీచకార్యం, బహు చెడ్డ మార్గం”. (బనీ ఇస్రాయీల్‌ 32)
(3) దొంగతనం: దొంగ – స్త్రీ అయినా పురుషుడైనా ఉభయుల చేతులూ నరకండి. ఇది వారి సంపాదనకు ప్రతిఫలం. అల్లాహ్‌ా తరుపు నుండి గునపాఠం నేర్పే శిక్ష. (అల్‌ మాయిద)
(4) హత్యలు: మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహ్‌కు మీరంటే ఎంతో దయ అని నమ్మండి. హింసా దౌర్జన్యాల ద్వారా అలా చేసేవాణ్ణి మేము తప్పకుండ అగ్నిలో పడవేస్తాము. (అన్‌ నిసా: 29,31)
పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము మీకూ ఉపాధి నిస్తున్నాము వారికీ ఇస్తాము. అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి. బహిరంగమైనవైనాసరే లేక గోప్యమైనవైనాసరే. సత్యంతో తప్ప అల్లాహ్‌ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్నీ హత మార్చకండి. (అల్‌ అన్‌ఆమ్‌: 151,153)
(5) స్త్రీలపై అభాండం మోపడం: శీలవతులు, అమాయికలు అయిన విశ్వాసం గల స్త్రీలపై అభాండం వేసేవారు ప్రపంచంలోనూ, పరలోకం లోనూ శపించబడ్డారు. వారికి పెద్ద పెద్ద శిక్ష పడుతుంది. (అన్‌ నూర్‌:23)
(6) పిసినారితనం : అల్లాహ్‌ తన అనుగ్రహాన్ని విరివిగా ప్రసాదించిన ప్పికీ పిసినారితనం చూపేవారు, ఈ పిసినారితనం తమకు మేలైనదని భావించరాదు. కాదు, ఇది వారికొరకు ఎంతో హానికరమయినది. వారు తమ లోభత్వంతో కూడబెడుతూ ఉన్నదే ప్రళయంనాడు వారి పాలిట కంఠపాశం అవుతుంది. (ఆలి ఇమ్రాన్‌ 180)

Related Post