Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

కీచక క్రీడ – కింకర్తవ్యం

భవిష్యత్తులో ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలకు ఆలంబనగా, కొం గ్రొత్త పరిశోధనలకు పట్టుకొమ్మగా, దేశాభివృద్ధికి, జాతి అభ్యుదయానికి మూల స్థంభంగా నిలవాల్సిన విద్యార్థుల జీవితాలు ఇలా ర్యాగింగ్‌ కీచక క్రీడకు బలయిపోవడం శోచనీయం! మిక్కిలి విచారకరం!!

విద్యను ఒక పద్ధతి ప్రకారం నేర్పడానికి ఉపయోగ పడే వ్యవస్థనే పాఠశాల అంటారు.పాఠశాలలో గురువులు విద్యార్థులకు వారి వయసు, మేధాశక్తిని బట్టి శ్రేణులుగా విభజించి నేర్పే విషయాలే పాఠాలు. గురువులు కేవలం విద్యనే కాకుండా వికాసానికి సంబంధించిన విష యాన్ని బోధిస్తూ వారిని సంపూర్ణ మానవులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన వారే సిసలయిన గురువులు, అంటే విధ్యార్థికి శారీరక వికాసం (ఫిజికల్‌ డెవలప్‌మెంట్‌), మానసిక వికాసం (సైకాలజికల్‌ డెవలప్‌మెంట్‌), ప్రజ్ఞా వికాసం (ఇంటల్‌లెక్చువల్‌ డెవలప్‌మెంట్‌), సాంఘిక వికాసం (సోషియల్‌ డెవలప్‌మెంట్‌), చింతనా వికాసం (థింకింగ్‌ డెవలప్‌మెంట్‌), ఉద్వేగ వికాసం (బిహెవియర్‌ డెవలప్‌ మెంట్‌) – అన్నీ సమపాళ్ళలో అందించగలగాలి. ఎందుకంటే అంగన్‌ వాడి మొదలు ఆమెరికా యూనివర్సిటీ వరకూ అన్నీ విద్యార్థుల కోసమే కట్ట బడ్డాయి. క్రింది స్థాయి నుండి పైస్థాయి వరకు అన్నింటిలోనూ కేంద్ర బిందువు విద్యార్థే. కాబట్టి విద్యార్థి స్వభావాన్ని,నైపుణ్యాన్ని కూడా అధ్యయనం చేసి, పసిడి స్వభావం తెలిసిన స్వర్ణకారుణిలా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమం చేసి, వారిని విలువయిన వ్యక్తు లుగా, వెన్నుముక వ్యక్తిత్వం గల పౌరులుగా తీర్చిదిద్దినవారే బోధ గురు వులు. అయితే నేటి మన విద్యా విధానం గానీ, విద్యాలయాలుగానీ ఒక విద్యార్థికి కావాల్సిన బహుముఖ వికాసాన్ని అందిస్తున్నాయా? విద్యా ఒరవడిలో విలువలకు వలువలు కొరవడకుండా విద్యాబోధ జరుగుతు న్నదా? అంటే సందేహమే!! ఈ బలహీన కోణం నుండి జడలు విప్ని కీచక క్రీడే ర్యాగింగ్‌ పెనుభూతం!!!

కళాశాలల్లో సీినియర్‌ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మన స్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించడాన్ని ర్యాగింగ్‌ అంటారు. ఈ కీచక పర్యం – ఆస్ట్రేలియా, బ్రిటన్‌, శ్రీలంక, బారత దేశం వంటి దేశాల్లో అధికంగా ఉంది.యూనివర్సిటోల్లో ర్యాగింగ్‌ భూతం కొన్ని సందర్భాల్లో భయంకర పరిణామాలకు దారి తీసిన సందర్భాలూ లేకపోలేదు. బొమ్మలతో సెక్స్‌ చేయించడం,బ్లో ఆప్‌ డాల్స్‌తో ప్రకృతి విరుద్ధమయిన శృంగారంలో పాల్గొనమనడం, దుస్తులు విప్పించి,నగ్నంగా పరుగులు తీయించడం వంటి దారుణాలు జరుగుతున్నాయి.

ఏది ఎలా ఉన్నా ఈ కీచక క్రీడ మూలంగా మనిషిలోని మానవీయత మంట గలుస్తున్నది. ఈ విష సంస్కృతి మనిషి ఓ శాడిస్టుగా మార్చి వేస్తు న్నది. భవిష్యత్తులో ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలకు ఆలంబనగా, కొం గ్రొత్త పరిశోధనలకు పట్టుకొమ్మగా, దేశాభివృద్ధికి, జాతి అభ్యుదయానికి మూల స్థంభంగా నిలవాల్సిన విద్యార్థుల జీవితాలు ఇలా ర్యాగింగ్‌ కీచక క్రీడకు బలయిపోవడం శోచనీయం! మిక్కిలి విచారకరం!! ఇలాంటి తరుంణంలో మనందరి కింకర్తవ్యం ఏమిటి?
చీకట్ల మీద చీకట్లు, దట్టమయిన చీకట్లను తిమిరం దాటించే వజ్రా యుధమే ఇస్లాం. ఇస్లాం ఇటువంటి అమానవీయ చర్యల్ని ఖండించడమే కాక, వాటిని మూలాలతో సహా పెకళించే కార్యప్రణాళికను అందిస్తుంది. అంతిమ దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”అల్లాహ్‌ాను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి వచ్చే అతిథిని గౌరవించాలి, సత్కరిం చాలి – (అవమానించకూడదు)”. (బుఖారీ, ముస్లిం)

వేరోక ఉల్లేఖనంలో – ”నీకు తెలిసిన, తెలియని వానికి సలామ్‌ చెయ్యి” అని ఉంది. అంటే వ్యక్తి ఎవరయినా మనం ప్రతి ఒక్కరి శ్రేయాన్ని, క్షేమాన్ని కోరాలన్నది ఇస్లాం ఉపదేశం. పరస్పర ప్రేమాభిమానాలను పెంచే నిమిత్తం ఇస్లాం నేర్పే అభివాదం చాలా విస్తృత భావం కలది. ”అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” – మీపై శాంతి కురియుగాక! అల్లాహ్‌ా కృపానుగ్రహాలు మీపై వర్షించుగాక! అంటే ఎదుటి వ్యక్తి ఎవరయినా, ‘నువ్వు క్షేమంగా ఉండాలి, దేవుని కృపానుగ్రహాలు నీ సొంతమవ్వాలి’అని దీవెనగా ఓ ముస్లిం ఈ పరిచయ పలుకులుంటాయి. వ్యక్తి ఎవరయినా దగ్గరవ్వాలన్నదే దీని అసలు ఉద్దే శ్యం. ఎదుటి వ్యక్తిలో అపరిచయ వ్యక్తి పట్ల చోటు చేసుకునే భయం, ఆందోళన దూరమయి ‘నేను నీ వాడనే, నీ మేలు కోరేవాడినే’ అన్న సంకేతాన్ని అందజేయడమే సలామ్‌ అసలు ఉద్దేశ్యం.

మహనీయ ముహమ్మద్‌ (స) తన పవిత్ర సన్నిధికి వచ్చే వారిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించేవారు. ఓ సారి ఓ రాయబారి ఆయన సన్నిధికి రాగ, ”మర్హబన్‌ గైర ఖజాయా వలా నదామా – మీ రాక శుభప్రదం. అవమానంగానీ, పశ్చాత్తాపం గానీ మీకు కలుగదు” అని స్వాగతం పలి కారు”. (బుఖారీ1/101)
అరబీలో ‘మర్‌హబన్‌’ అంటే, స్వాగతం అన్న అర్థం మాత్రమే కాదు. అది విశాలతను సూచించే పదం. అనగా, మీ కోసం మా ఇంట్లో, మా మనస్సులో విస్తృత చోటు, విశాల స్థానం ఉంది, మీ రాక మాకు ఎంత మాత్రం ఇబ్బందికరం కానే కాదు అని.అబూ జహల్‌ వంటి కరడుగట్టిన శత్రువు కుమారుడు ఇక్రమా మక్కా విజయానంతరం ఇస్లాం స్వీకరించి ప్రవక్త (స) వారి సన్నిధిలోకి రాగ, ప్రవక్త(స) ఎంతో ప్రేమగా ఆయనకు స్వాగతం పలికారు.ఒకప్పుడు ఇక్రమా కూడా ఇస్లాం మరియు ముస్లింల కు బద్ధ శత్రువుగా వ్యహరించారన్నది గమనార్హం!

పాఠశాలలో కొత్త విద్యార్థులు అతిథుల వంటి వారు. వారికి ఆ పరిసరాలు కొత్త, పరిచయాలు కొత్త, కొత్త ప్రదేశంలో వారికి అంతా కొత్తకొత్తగానే ఉంటుంది. కాసింత సంతోషం, కాసింత భయం,బెరుకు,కాసింత ఆందోళన వారిలో అంతర్లీంగా ఉంటుంది. కొత్త వాతావరణంలో వారు ఇమడాలంటే అక్కడ ముందు నుండి ఉన్నవారు అటువంటి వాతావరణం కల్పిస్తేనే సాధ్యం అవుతుంది. అలా జరగని పక్షంలో వారు కంగారు పడతారు. ఒకరిని కంగారు పెట్టడం కరుణ హృదయుల లక్షణం కాదు.

కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) ఇలా అన్నారు: ”మాలోని పిల్లల (జూనియర్స్‌) పట్ల కరుణ, వాత్సల్యంతో వ్యహరించని వారు, మాలోని పెద్దల (సీనియర్స్‌) పట్ల గౌరవభావంతో మెలగని వారు మాలోని వారు కారు”. (మజ్మవుజ్జవాయిద్‌: 8/14)

అలా అని అసలు హాస్యానికి ఇస్లాంలో తావు లేదని ఎంత మాత్రం కాదు. ఆరోగ్య ప్రధానమయిన హాస్యాన్ని ప్రోత్సహిస్తుంది ఇస్లాం. ఆ విషయానికొస్తే ఆరోగ్య ప్రధానమయిన హాస్యాన్ని ప్రవక్త (స) వారు అనుమతించడమే కాక, స్వయంగా గొప్ప హాస్యాన్ని పండించిన సంద ర్భాలు అనేకం. అయితే ప్రమాదకర, అసహ్యకర, అపకీర్తి పాలు చేసే హాస్యాన్ని ఇస్లాం సుతరాము అనుమతించదు. ఖుర్‌ఆన్‌ ఇలా ఉద్బోధి స్తుంది: ”ఓ విశ్వాసుల్లారా! పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములయి ఉండొచ్చు. అలాగే స్త్రీలు తోటి స్త్రీలను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరి కంటే వారే ఉత్తమురాల్లయి ఉండొచ్చు”. (హుజరాత్‌: 11)

ఓ సారి కొందరు ప్రవక్త (స) వారితో కలిసి ప్రయాణం చేస్తు న్నారు. మార్గం మధ్యలో విశ్రాంతి కోసం ఆగారు. బాగా అలసి పోయి ఓ వ్యక్తి నిద్ర పోతున్నాడు. అతన్ని ఆట పట్టించే నిమిత్తం కొందరు అతనికి త్రాడును దాచేశారు. తను నిద్ర మేల్కొన్నాక త్రాడు కనబడకపోయే సరికి కంగారు పడ్డాడా వ్యక్తి. (అందరూ అతని వాలకాన్ని చూసి లోలోన నవ్వుకోసాగారు.) అది గమనిం చిన ప్రవక్త (స) ”ఓ ముస్లిం మరో ముస్లింను ఆట పట్టించడం, పరేషాన్‌ చేయ డం ఎంత మాత్రం తగదు” అని గట్టిగా మందలించారు. (అబూ దావూద్‌: 2/83)

అందరి సద్గతిని ఆకాంక్షించాల్సిన విద్యార్థులే తోటి విద్యార్థుల దుర్గతికి కారకులవ్వడం అవమానకరం! ఇటువంటి వెకిలి చేష్టలను ఇస్లాం ధర్మంతోపాటు ప్రపంచ మతాలన్నీ ముక్త కంఠంతో ఖండిం చాయి. భారత పౌరులుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమి టంటే, దేశ ఆర్థిక రంగాన్ని, ఆధ్యాత్మిక రంగాన్ని, రక్షణ శాఖను, వైజ్ఞానిక రంగాన్ని ఏలేవారు ఇక్కడే తయారవుతారు. వారు బాగుం టేనే దేశం బాగుంటుంది. ఓ మేధావి చెప్పిన మాట గమనార్హం! ”విధ్యార్థుల సిలబస్‌ని నాకు చూపించండి, ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండ బోతుందో నేను చెబుతాను”. ఒకరిని బాధ పెట్టి సంతోషించే తరం తన తర్వాతి తరాలకు ఏం ఇవ్వగలదో ఆలోచించాల్సిన తరుణ మిది. తన స్వార్థం కోసం అమాయక జీవితాల్ని బలి తీసుకునే యువ తరం దేశాన్ని ఎలా కాపాడగలదో అలోచించాల్సిన సమయమిది. తమ తోటి విద్యార్థుల యెడల అనుచితంగా, అమర్యాదగా, అనైతికం గా వ్యహరించే యూత్‌ ఉన్నత నైతిక ప్రామాణాల్ని ఎలా నెలకొల్ప గలదో యోచించాల్సిన ఘట్టమిది.
కాబట్టి పిల్లలకు చదువుతో పాటు సంస్కారం, వికాసం, విషయ అవగాహనను సయితం బోధించగలగాలి. ఒక్క మాటలో చెప్పా లంటే, పాఠశాలలు నిర్మించి విధ్యార్థుల్ని – డాక్టర్‌, ఇంజనీర్‌, లాయర్‌, పోలీస్‌, జర్నలిస్టు, సైనికుడు, సైంటిస్టు, రాజకీయవేత్త, వ్యాపారవేత్తల్ని తయారు చేయడం సులభమే కానీ, వారిని మన సున్న, మనిషి(మంచి)తనం ఉన్న మనిషిగా, విలువల్ని కాపాడే మహా మనీషిగా తీర్చిద్దిడం కాస్త ప్రయాస, శ్రమతో కూడుకున్న కార్యమే. మౌలానా హాలీ (ర) గారిమాటల్లో చెప్పాలంటే,

దైవదూతలు కూడా మనుషులు కాగలరు కానీ,
మనిషిగా ఎదిగే క్రమంలో కాస్త శ్రమ అధికం

కాబట్టి ఈ కీచక క్రీడ అంతమవ్వాలంటే, అమ్మానాన్నలతో పాటు, గురువులు, ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలలోని ఉపాధ్యా యులు పిల్లలకు దిక్సూచి లాంటి వారు. వారి బంగారు భవిష్య త్తుకి పునాదులు వేసే గొప్ప నైపుణ్యం కావాల్సిన తాపి పనివారు. వారు వేసే పునాదుల్ని బట్టే వారి చదువు-సంస్కారం అంతస్తులు పెరగడమో, కూలడమో జరుగుతుంది. అందులో తప్పు జరిగిం దంటే, ప్రథమ వ్యక్తులయిన తల్లిదండ్రుల్ని, గురువుల్నే నిందించ డం జరుగుతుంది.
అందరి అవగాహన నిమిత్తం ర్యాగింగ్‌కి సంబంధించిన కొన్ని సూచనల్ని ఇక్కడ పొందు పరుస్తున్నాము.

ర్యాగింగ్‌ నిరోధక చట్టం

ర్యాగింగ్‌ను కొంత మంది చాలా తేలికగా తీసుకుంటారు. మరి కొందరు ఆ పదం వింటేనే గజగజ వణికిపోతారు. డైనమిక్‌ క్రికె టర్‌ సురేష్‌ రైనా, బిగ్‌బీ అమితాబ్‌ మొదలయిన ప్రముఖులు కూడా ఒక థలో ర్యాగింగ్‌ యాతనను అనుభవించిన వారే. సురైష్‌ రైనాకయితే స్పోర్ట్స్‌ కాలేజీలో ఎదురయిన అనుభవం ఎంత భయంకరమయినదంటే, దాన్నుండి కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది. అంటే, అన్ని రోజులూ తను కాలేజీ ముఖం చూడలేదు. ఇలాంటి అనేక కారణాల మూలంగా 1997లో ‘ర్యాగింగ్‌’ అన బడే ఈ కీచక క్రీడను అరికట్టడానికి సిబిఐ మాజీ డైరెక్టర్‌ రాఘ వన్‌, యుజిపి, గైడ్‌లైన్స్‌తో సుప్రీం కోర్టు ‘ర్యాగింగ్‌ నిరోధక చట్టం’ పెట్టింది.

ర్యాగింగ్‌ నిరోధక కమిటీ

సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి కళాశాలలోనూ ర్యాగింగ్‌ నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో స్వచ్ఛంద సంస్థ, పోలీసు శాఖ, కళాశాల నిర్వహాకులు, విద్యార్థుల తల్లిదం డ్రులు, మానసిక నిపుణులు ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. వీరం దరిని సమన్వయ పరచి కమిటీ ఏర్పాటు చేసే బాధ్యత కళాశాల పైనే ఉంటుంది.

యాంటి ర్యాగింగ్‌ స్క్వాడ్‌

ఇది అకస్మియ తనిఖీలు చేస్తుంది. విద్యార్థుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. తరగతి, హాస్టల్‌ గదుల్లో, లైబ్రరీ, క్యాంటీన్‌, బస్సులు, బస్‌ స్టాప్‌లలో నిఘా పెడుతుంది. ర్యాగింగ్‌ అవకాశాలున్న ప్రతి చోట ఈ స్క్వాడ్‌ పరిశీలిస్తుంది. యాంటి ర్యాగింగ్‌ కమిటీల తీరుతెన్నుల్ని సయితం ఇది అధ్యయనం చేస్తుంది.

కళాశాల యాజమాన్యాలపై తనిఖీలు

యాజమాన్యానికి సంబంధించి సెక్షన్‌ 4 చట్టం ప్రకారం ర్యాగింగ్‌ జరిగినప్పుడు అందిన ఫిర్యాదు ఆధారంగా కాలేజీ యాజమాన్యం తప్పనిసరిగా విచారణ జరపాలి. బాధ్యులయిన వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలి. ఒకవేళ ఫిర్యాదుకు స్పదించ కుండా ఉంటే సెక్షన్‌ 4 ప్రకారం యాజమాన్యంపై చర్యలు తీసు కునే అవకాశం ఉంది. నేరం నిరూపితమయితే ఆ కళాశాలకు ప్రభుత్వం అందించే నిధులు ఆపి వేయబడతాయి. కాలేజీ గుర్తింపు తొలగించ బడుతుంది. యుజిసి నిధులు కూడా రాకుండా నిలిచి పోయే అవకాశం ఉంది.

విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం

ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిని 6నెలలు జైలు శిక్ష పడితే, అతను సదరు కాలేజీలో చదువుకోవడానికి అనర్హుడవుతాడు. ఇతర విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష. తీవ్రంగా గాయ పరిస్తే, అత్యాచారం చేస్తే 5యేండ్లు జైలు శిక్ష. ఈ స్థితిని కూడా దాటి విద్యార్థి ఆత్మహత్యకు కారణమయితే 10 ఏళ్ళు జైలు శిక్ష. నేరం రుజువయితే రెండున్నర లక్షల జరి మానా విధించే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారం శిక్షా కాలం 6నెలలకంటే ఎక్కువ ఉంటే ఏ కాలేజీలోనూ అతనికి చదువుకునే అవకాశం ఉండదు.

మార్గదర్శకాలు

ర్యాగింగ్‌ నిరోధానికి కోర్టు స్పష్టమయిన మార్గదర్శకాలు జారీ చేసింది. కాలేజీ యాజమాన్యం ర్యాగింగ్‌ చట్టానికి సంబంధించిన పత్రాలు నోటీసు బోర్డులో ఉంచాలి. ర్యాగింగ్‌ పరిధిలో వచ్చే అం శాలను కరపత్రాలు ప్రచురించి అందజేయాలి. శిక్ష తాలూకు వివ రాలు వారికి తెలియజేయాలి.

తల్లిదండ్రులు

పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు ర్యాగింగ్‌ జరుగుతుంది అని భయ పెట్టడంకన్నా, ఒకవేళ ర్యాగింగ్‌ జరిగితే ఎలా ఎదుర్కోవాలో తెలియజేయాలి. పిల్లల్ని మరీ రిస్టిశిక్షన్‌తో కాకుండా కాస్త బోల్డ్‌గా పెంచాలి. పిల్లలు ర్యాగింగ్‌ కీచక క్రీడకు బలవుతున్నారు అన్న ఏ కాస్త అనుమానం వచ్చి నేరుగా కాలేజీకి వెళ్ళి కనుక్కోవాలి. వారికి సంబంధించిన అన్ని సమస్యలు తల్లిదండ్రులతో చర్చించేలా కమ్యూనికేషన్‌ లైన్‌ ఎప్పుడూ తెరిచే ఉంచాలి.

Related Post