Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

చెడును మంచితో నిర్మూలించు!

మసిని పసిమి చెయ్యాలన్నా, మిసిమి భావాలను సర్వతా వ్యాపింపజేయాలన్నా, నేల నాలుగు చెర గులా ప్రేమానురాగాలు పరిమళించాలన్నా మన వద్ద ఉన్న మార్గం మానవ సేవ. భిన్న సంస్కృతుల కు నెలవయిన భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో న్యా బద్ధంగా ఉండాలి మన పవ్రర్తన.

మసిని పసిమి చెయ్యాలన్నా, మిసిమి భావాలను సర్వతా వ్యాపింపజేయాలన్నా, నేల నాలుగు చెర గులా ప్రేమానురాగాలు పరిమళించాలన్నా మన వద్ద ఉన్న మార్గం మానవ సేవ. భిన్న సంస్కృతుల కు నెలవయిన భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో న్యా బద్ధంగా ఉండాలి మన పవ్రర్తన.

”ముల్లును ముల్లుతోనే తియ్యాలి”, ”వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి” అన్న నానుడి అన్ని పరిస్థితులకు అనుకూలించకపోవచ్చు. ”చెడును అత్యుత్తమ మంచితో తొలగించు” (దివ్యఖుర్‌ ఆన్‌-41: 34) అన్న అల్లాహ్‌ ఆదేశం అందరికీ అన్ని వేళలా ఆచరణీయం. చెడును మంచి ద్వారా ఎదుర్కో వడం మనలోని అత్యుతమ నైతికతకు నిదర్శనం. అపకారాన్ని ఉపకారం ద్వారా పారద్రోలడం, కీడును మేలు ద్వారా త్రుంచటం, దౌర్జన్యాన్ని మన్నింపుల వైఖరి ద్వారా నిర్మూలించడం,  కాఠిన్యం- కరకుదనాన్ని కరుణతో జయించడం, ఆగ్రహాన్ని నిగ్రహంతో ఆపటం, అసభ్యకరమయిన విష యాలను హుందాగా దాట వేయడం, కుసంస్కారాన్ని సంస్కారంతో దెబ్బ తీయడం, అవాంఛనీయ, అసహ వాతావరణాన్ని ఓర్పుతో, ఉత్తమ సహనంతో ఎదుర్కోవడం – నిస్సందేహంగా సాహసోపేత మయిన కార్యం. చెడు చేటు చేస్తుంది, మంచి కీడు చెయ్యదు. ఆ విషయానికొస్తే, ”మంచీ- చెడు ఎట్టి  స్థితిలోనూ సమానం కాలేవు”. (దివ్యఖుర్‌ఆన్‌-41:34)
 ఫలితం – శతువ్రే మితుడ్రవుతాడు. అంటి అంటనట్లుగా ఉండేవాడే ఆత్మబంధువవుతాడు. ఇది అక్షరం గీసిన రాత కాదు, అక్షరుడయిన అల్లాహ్‌ ఆడిన మాట: ”ఆ తర్వాత నువ్వే చూస్తావు. నీకూ -తనకూ మధ్య బద్ధ విరోధం ఉన్న అతను సయితం నీకు పాణ్ర స్నేహితుడయి పోతాడు”. (దివ్య ఖుర్‌ఆన్‌- 41:34) అయితే ఓ షరతు – ఓర్పు,సహనం. ” ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్ట వంతులు మాత్రమే పొందగలుగుతారు”.  (41:35)
 మసిని పసిమి చెయ్యాలన్నా, మిసిమి భావాలను సర్వతా వ్యాపింపజేయాలన్నా, నేల నాలుగు చెర గులా ప్రేమానురాగాలు పరిమళించాలన్నా మన వద్ద ఉన్న మార్గం మానవ సేవ. భిన్న సంస్కృతుల కు నెలవయిన భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో న్యా బద్ధంగా ఉండాలి మన పవ్రర్తన. నిజాయితి పత్రి ముస్లిం నైజమని, మోసం, దగా అతనికి శోభించదని నిరూపించాలి. పేదల పాలిట పెన్నిధి అని, అభాగ్యుల కోసం అండ అని, బడుగు, బలహీనుల పాలిట రక్షణ, ఇదే శిక్షణ ఇస్లాం ప్రతి పౌరుని ఇస్తుందని రుజువు చెయ్యాలి. ఇస్లాం శాంతి ధర్మమని, అందరి శ్రేయోసాఫల్యాలను కొరుకునే జీవన సంవిధానం అని తెలియజేయాలి.
780 సవత్సరాలు మన పూర్వీకులు పరిపాలించిన స్ఫయిన్‌ చరిత్ర  మనకు గుణపాఠం అవ్వాలి. అక్కడ మస్జిద్‌ ఖుర్తుబా ఉన్నట్టే దాదాపు 1000 సంవత్సరాలు పరిపాలించిన భారత దేశ రాజధాని ఢిల్లీలో కూడా జామె మస్జిద్‌ ఉంది. అక్కడ నేటికీ సందర్శకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న జహరా  పట్టణం ఉన్నట్టే ఇక్కడ సయితం అనేక పట్టణాల్లోని అనేకానేక కట్టడాలున్నాయి. ఒక సమయం వచ్చింది అవేమీ పనికి రాలేదు. ఇకనైనా మనం మేల్కోక పోతే ఓ సమయం వస్తుంది ఇవేమి పని రావు. గత వైభవాన్ని చూసకొని గంతులెయగయడం అంటే మన మనుగడ మార్గంలో గుంతలు త్రవ్వుకోవడమే. పతనా దిశకు పయనించడమే. అందుకు ఖుర్‌ఆన్‌  చూపే దిక్సూచి ఇది: ”నిశ్చ యంగా అల్లాహ్‌ ఆ  జాతి దుస్థితిని దూరం చెయ్యడు ఏ జాతికయితే తన మనోమయ స్థితిని మార్చుకునే చింతన ఉండదో”. (అరఅద్‌: 11)
 ‘విభజించి-పాలించు’ అన్నది ఎవరి విధానమయినా కావచ్చుగాక, మనం మాతం అల్లాహ్‌ త్రాడును గట్టిగా  పట్టుకోవాలి. విభేదాల్లో పడకుండా జాగ్రత్త  పడాలి. ముస్లిం సఖ్యతకు, సమైక్యతకు ముప్పు వాటిల్లకుండా చూసుకోవాలి. ”ఒక ముస్లిం మరో ముస్లిం కొరకు ఒక పిష్టమయి కట్టడం లాంటి  వాడు. అందులో ఒక భాగం మరో భాగాన్ని బల పరుస్తూ ఉంటుంది” (ముత్తఫఖున్‌ అలైహి) అన్న ప్రవక్త  (స) వారి మాట మనందరికీ శిరోధార్యం అవ్వాలి. పాంతీయ, పాక్షిక, పంథా సంబంధిత విష యాలను  ముస్లిం సమాజ ఉనికి రక్షణ కోసం సమిధ చెయ్యడానికి సిద్ధమవ్వాలి. నేటి  మన  ఉపమానం ‘మల్టీ హైవే’ వింది. ఏక సమయంలో మనం అనేక రంగాల మీద దృష్టి సారించాల్సి ఉంది. ఆక్సిజన్‌ మరియు హైడోజ్రన్‌ కలయికతో మనిషి దాహం తీర్చే జలం తయారయినట్టే, వివిధ పంథాల, మస్లక్‌ల కలయికతో ముస్లిం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనడంలో సందే హం లేదు. అందుకు కావాల్సిన దైవభీతిని, పరలోక చింతనను ప్రతి ఒక్కరు ప్రోగు  చేసుకోవాలి.
 చివరిగా – ‘హక్కుల ఉల్లంఘన’ కేవలం ముస్లింలకు మాత్రమే  ఉన్న సమస్య కాదు. దేశంలోని ఇతర అల్ప సంఖ్యాకుల సమస్య కూడా. ఆ విషయానికొస్తే దేశంలో 80 శాతం దళితుల సమస్య. కనుక వారందరితోనూ సంత్సంబందాలు కలిగి ఉండాలి. వారి సమస్యను మన సమస్యగా వారి బాధను మన బాధగా భావించాలి. అందరూ కలిసి అందరి కోసం సమిష్టి పోరుకు సిద్ధమవ్వాలి! అవసరమయిన చట్ట సవరణలు చేయిపించాలి!

Related Post