Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఉన్నత నైతిక ప్రమాణాల ఇస్లాం

సత్ప్రవర్తన సత్భావానికి సోపానం. మనిషి అందరి యెడల సత్ప్రవర్తన, సద్భావం కలిగి ఉండాలి. మేలుకి సంబంధించిన ఏ పనిని అల్పమయినదిగా భావించకూడదు. ''ఏ మంచి కార్యాన్ని అల్పంగా భావించకు. చివరికి నీ సోదరునితో నీ నగుమోము సంభాణ అయినా సరే'' (ముస్లిం హథీసు గ్రంథం)

సత్ప్రవర్తన సత్భావానికి సోపానం. మనిషి అందరి యెడల సత్ప్రవర్తన, సద్భావం కలిగి ఉండాలి. మేలుకి సంబంధించిన ఏ పనిని అల్పమయినదిగా భావించకూడదు. ”ఏ మంచి కార్యాన్ని అల్పంగా భావించకు. చివరికి నీ సోదరునితో నీ నగుమోము సంభాణ అయినా సరే” (ముస్లిం హథీసు గ్రంథం)

ప్రవర్తన ఓ అద్ధం. ఏ మనిషి ప్రతిబింబమయినా అందులోనే. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నన్ను ఉత్తమ నైతిక ప్రమాణాల పరిపూర్తికై పంపడం జరి గింది”. (ముస్నద్‌ బజ్జార్‌)
సత్ప్రవర్తన సత్భావానికి సోపానం. మనిషి అందరి యెడల సత్ప్రవర్తన, సద్భావం కలిగి ఉండాలి. మేలుకి సంబంధించిన ఏ పనిని అల్పమయినదిగా భావించకూడదు. ”ఏ మంచి కార్యాన్ని అల్పంగా భావించకు. చివరికి నీ సోదరునితో నీ నగుమోము సంభాణ అయినా సరే” (ముస్లిం హథీసు గ్రంథం) అని ఓ సందర్భంలో అంటే, ”సత్ప్రవర్తన సంపూర్ణ విశ్వాసానికి ప్రతీక”(మిష్కాత్‌) అని వేరొక సందర్భంలో అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా ఉపదేశించాడు: ”మీరు ప్రజలతో మంచి మాటలే మ్లాడండి”. (బఖరహ్‌:83)
ఇస్లాం మనిషికిచ్చే శిక్షణలో ‘మనిషి తన సోదరునిపై అత్యాచారం జరప రాదు. అతనిపై ఎవరయినా దౌర్జన్యానికి పాల్పడితే అతన్ని ఒంటరిగా వదలకూడదు. మనిషికి ప్రాప్తమయి ఉన్న ధనం, దేహ దారుఢ్యం, అందం, వంశోన్నతి, విద్యాధిక్యత విం ఏ కారణం వల్లనయినా సరే తన సోదరుణ్ని తనకంటే అల్పునిగా భావించకూడదు’ అన్నది ప్రధానమయినది.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగేకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
అన్న కవి మాట ప్రకారం మనిషి ఆర్జించే విద్యా-విజ్ఞానాలు, ధనం-ఐశ్వ ర్యాలు, పదవీ అధికారాలు, పేరుప్రతిష్టలు అతనిలో వినయాన్ని పెంచాలే గానీ, అహాన్ని ఎంత మాత్రం కాదు. అహం అనేది అనేక విధాల అనర్థాల కు మూలం. అహంకారి, మృగ గుణ దురహంకారి – తనలోని మహత్తును గొప్పదని ఎంచి, తన సత్తాకు తానే మత్తెక్కి, కళ్ళు పైకెక్కి, ఎత్తలేని బరునెత్తి, కించిత్తయినా కదపక లేక విసుగెత్తి ఎత్తయిన శిఖరాల నుండి పడి చిత్త వ్వడం ఖాయం. అలా చేయడం వల్ల ఉన్న పరువు కాస్త ఊడటం తప్ప ఒరి గేది ఏమి లేదు. మనం అల్లాహ్‌ దాసులం. దాసులకు గర్వాహంకారాలు ఏ విధంగానూ శోభించవు. గర్వాన్ని ప్రదర్శించి ప్రయోజనం పొందిన వారు ఎవరు చెప్పండి! అసలు గర్వాన్ని ఎందుకు ప్రదర్శించాలి? అల్పమయిన నీి బిందువుతో ప్టుినందుకా? రేపు చచ్చి కాి మ్టిలో కలిపోయి కనిపించ కుండా పోతామందుకా? ఎందుకు? ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది:
”నీవు భూమిలో నిక్కుతూ నడవకు. నువ్వలా నడవడం వల్ల భూమిని చీల్చనూ లేవు, పర్వతాల ఎత్యుకు ఎదగనూ లేవు”. (బనీ ఇస్రాయీల్‌: 37) మనిషికి సత్ప్రవర్తనకు మధ్య ఏదయినా అడ్డు తగులుతుందంటే – అది అహం మాత్రమే. అహంకారులను అల్లాహ్‌ా సుతరామూ ఇష్ట పడడు. రేపు ప్రళయ దినాన వారి వైపు కన్నెత్తి కూడా చూడడు. ”మరి ఎవరి హృదయం లోనయితే అవగింతి అహం కూడా ఉంటుందో అతను స్వర్గపు సువాసన ను సయితం ఆఘ్రాణించ లేడు” అని, ”గర్విష్టులను ప్రళయ దినాన ప్రజలు చీమల్లా తొక్కుకుంటూ వెళతారు” అని మహనీయ ముహమ్మద్‌ (స) హెచ్చరించి ఉన్నారు.
ప్రతి రోజూ పిల్లలే సలామ్‌ చేయాలనుకునే తండ్రి ఒక్క రోజు కూడా వారికి సలామ్‌ చేయడు. ఎప్పుడూ తన క్రింద పని చేసే కార్మికులే సెల్య్‌ూ క్టొాలి అనుకునే అధికారి, ఒక్క పూట కూడా వారికి సెల్య్‌ూ చెయ్యడు. కారణం – అహం!? అల్లాహ్‌ా తర్వాత సృష్టి మొత్తంలో శ్రేష్ఠులయిన అంతిమ దైవప్రవక్త (స) వారికి లేని అహం వీరికెందుకో అర్థం కాదు. ఆయన (స) పిల్లలకు సలామ్‌ చేెసేవారు. ప్రేమగా వారి తల నిమిరేవారు. ఋతువుకు సంబంధించిన ఏదేని ఫలం వస్తే దాన్ని ముందు పిల్లల్లో పంచి పెట్టేవారు. కాబ్టి మనమూ ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుచుకోవాలి.
”పాత్రలో ఉన్న పదార్థమే నిండాక బైికొస్తుంది” అన్నట్టు సమాజం ఏ పంథాను అనుసరించినా, ప్రజలు ఎలా ప్రవర్తించినా మనం మాత్రం సత్ప్రవ ర్తన, సద్భావన, న్యాయం, ధర్మం, పరోపకారం, ఉత్తమ సంస్కారం లాిం విధానాలనే అవలంబించాలి. ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీరు ‘అమ్మిఆ’గా రూపొందకండి”. అంటే, జనులు మాతో మంచిగా వ్యవహరిస్తే మేము కూడా వారి యెడల మంచిగా వ్యహరిస్తాము. ఒకవేళ వారు మా పట్ల చెడుగా వ్యవహరిస్తే మేము కూడా వారి యెడల చెడుగా వ్యవహరి స్తాము అన్న చందంగా ఉండకండి. లోకులు మీ యెడల మంచిగా మసలు కున్నా మీరు మంచిగానే మసలుకోండి. వారు చెడుగా ప్రవర్తించినా మీరు మాత్రం మంచిగానే ప్రవర్తించండి”. (మిష్కాత్‌)
మనిషి దౌర్బల్యాల పుట్ట. అతనిలో ఎన్నో బలహీనతలు. అయితే వాిని అలానే వదిలేస్తే-చెదలు పుస్తకాల గుట్టల్ని స్వాహా చేసినట్లే ఈ బలహీనతలు మనిషిని పిప్పి చేసి పారేస్తాయి. కాబ్టి మనలోని బలహీనతల్ని ప్రవక్త (స) వారి ప్రవర్తనా శైలీ అన్న అద్దంలో చూసుకొని చక్కబెట్టుకోవాలి. వంద వ్యాసాలు, వేల ప్రసంగాలు చూపని ప్రభావం ఒక్క ప్రవర్తన చూపుతుంది అన్న ఎరుకతో జీవించాలి.
మనిషి కారణంగానో, అకారణంగానో కోపోద్రేకానికి లోనవుతూ ఉంటాడు. కోపంలో సహనం, నీతి, విచక్షణ అన్నింనీ కోల్పోతూ ఉంాడు. న్యాయా న్యాయాలను ఖాతరు చేయడు. ధర్మాధర్మాలను ప్టించుకోడు. యుక్తా యుక్తాల గురించి ఆలోచించడు. అలా ‘తన కోపమే తనకు శత్రువు’ అన్నట్లు చాలానే కోల్పోతాడు. ఈ విషయంలో ప్రవక్త (స) వారి అమృత పలుకు అనుసరణీయం. ”శత్రువును మల్ల యుద్దంలో చిత్తు చేసేవాడు కాదు వీరుడు. కోపోద్రేకానికి లోనయినప్పుడు నిగ్రహం కలిగి ఉండేవాడే సిసల యిన ధీరుడు”. (ముస్లిం). మరో సందర్భంలో ఆయన అన్న మాట – ”మూడు విషయాలు విశ్వాసం, నైతికతకు సంబంధించినవి. 1) మనిషి కోపానికి లోనయినప్పుడు మిథ్యా అడుసు తొక్క కూడదు. అసత్య భావ జాలానికి గురి కాకూడదు. 2) ఆనంద డోలికల్లో ఓలలాడుతున్నప్పుడు ఆ ఆనందం అతన్ని సత్యమార్గం నుండి దూరం చెయ్యకూడదు. 3) అధికారం, ఆధిక్యత చేజిక్కాక తనది కాని దేని జోలికీ వెళ్ళ కూడదు”. (తబ్రానీ)

Related Post