Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

నైతికం-అనైతికం

చట్టాలెన్నున్నా, ఎల్లలు ఎన్నున్నా, ప్రభు త్వాలు ఎన్నున్నా మానవులంతా ఒక్కటే, మాన వులందరి దైవం ఒక్కడే అన్న సాత్విక భావన అలవడాలి. అప్పుడు ఈ కన్యాశుల్కాలు, ఈ వరకంట వేధింపులు, మద్యం, మాదక ద్రవ్యా ల నిర్మూలన, కుల, వర్గ, భాష, వర్ణ, జాతి భేదాలు అంతమవ్వగలవు.

చట్టాలెన్నున్నా, ఎల్లలు ఎన్నున్నా, ప్రభు త్వాలు ఎన్నున్నా మానవులంతా ఒక్కటే, మాన వులందరి దైవం ఒక్కడే అన్న సాత్విక భావన అలవడాలి. అప్పుడు ఈ కన్యాశుల్కాలు, ఈ వరకంట వేధింపులు, మద్యం, మాదక ద్రవ్యా ల నిర్మూలన, కుల, వర్గ, భాష, వర్ణ, జాతి భేదాలు అంతమవ్వగలవు.

ఏది నైతికం? ఏది అనైతికం? ఏది నాగరికం? ఏది అనాగరికం? దీన్ని నిర్ణయించేది ఎవరు? ఎందుకు నిర్ణయించాలి? ఎవరికేది కావాలో వేరొకరు ఎందుకు నిర్ణయించాలి? అసలు నైతికత వ్యక్తిగతమా? సామాజి కమా? మనకు నైతికత అన్పించేది ఇంకొందరికి అనైతికంగా కనిపించవచ్చు కదా? అన్న ప్రశ్నలు ఎప్పుడోకప్పుడు అందరికీ కలిగేవే. ఈ గందర గోళానికి కారణమేమి? అంటే, మనిషి తనకు తానుగా శాసనకర్తగా భావించుకోవ డమే. తనకు నచ్చిన సిద్ధాంతాల్ని ఇతరుల మీద బలవంతాన రుద్దాలనుకోవడమే. దీనికి భిన్నంగా మనందరి నిజ కర్త, పాలకుడు, పరిపోషకుడు, సంరక్షకుడు అయిన అల్లాహ్‌ా నిర్దేశించిన జీవన సంవిధానాన్ని, నైతిక నియమా వళిని అనుసరించినట్లయితే అది అంద రికీ అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తన దాసులకు అనుమతించి, ఆమోదించింది నైతికం, ఆయన అనమతించనిది, ఆమోదించనిది అనైతికం.

నేడు ప్రపంచంలో ఆర్థికంగా, రాజకీయంగా, వైజ్ఞానికంగా, సాంకేతికంగా ప్రగతి పథంలో దూసుకు పోతున్నవారిలో అధికులు పారలౌకి కంగా అధోగతికి పాలయి ఉన్నారన్నది నిరాక రించలేని నిజం. తన మేధోమథనంతో మహా ద్భుతాల్ని ఆవిష్కరిస్తున్న మానవుడు, వైజ్ఞానిక రంగంలో కొంగ్రొత్త ఆవిష్కరణలను ప్రవేశ పెడుతున్న మానవుడు సాంఘిక దురాచారాల్ని దూరం చేయడంలో సఫలీకృతుడు కాలేక పోవడం శోచనీయం!

విలాస జీవితాకాంక్ష వెర్రి తలలు వేస్తున్నందు వల్ల, ధనార్జనా దాహం కుక్క గొడుగులు వేస్తున్న కారణంగా, దురభ్యాసాలు, దురల వాట్లు, దుర్వ్యసనాలు పెచ్చు మీరడం చేత అటు సమాజంలో సాత్విక చింతన, సంఘ శ్రేయోభిలాష, పరోపకార భావం సన్నగిల్లు తోంది. ఇటు కుటుంబంలో – భార్యాభర్తలు, పెద్దలు, పిన్నలు, బంధుమిత్రులు, స్నేహితుల మధ్య అనురాగం, అనుబంధం అంతంత మాత్రమే ఉంది. ‘సమిష్టిలో వృష్టి ఉంది’ అన్నట్టు ఈ సామాజిక, సంసారిక రుగ్మతలను దూరం చేసే నిమిత్తం సంఘ శ్రేయోభిలాషుల యిన ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. సంఘ జీవనంలో వ్యక్తుల, విలువల ఔన్న త్యాన్ని పెంపొందించడానికి సత్యం, ధర్మం, న్యాయం, సహకారం, సమరసభావం, నీతి, నిజాయితి, త్యాగం మొదలయిన సుగుణాలు మనుషుల్లో సృజించి, వారిని సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా చైతన్యవంతుల్ని చేయాల్సి ఉంది. వ్యక్తి శ్రేయస్సు సంఘ, సమాజ, దేశ శ్రేయస్సుతో ముడిపడి ఉం టుందన్న స్పృహను వారికి ఇవ్వాలి. మనిషిలో విశాల దృక్పథాన్ని, విశ్వ మానవ సౌభ్రాతృ త్వాన్ని పెంపొందించాలి. ప్రజలు నీతి మార్గం లో నడుచుకునేలా, పాపభీతి, పరలోకభీతితో జీవించేలా వారికి తర్పీదు ఇవ్వాలి. వారిలో నిద్రాణమయి ఉన్న భక్తి భావాల్ని, మానవత్వా న్ని రగుల్గొలిపి వారిని శాంతి కాములుగా, క్రాంతి మూర్తులుగా తీర్చిదిద్దాలి.
నేడు మనకు సాధారణంగా కనబడే సామా జిక ఆచారం-వరకట్న దురాచారం. వరకట్న వేధింపుల కారణంగా అసువులు బాసిన అబల సంఖ్య 2011లో 8,618 అయితే, 2012లో 8,233గా నమోదయింది. ఈ మహమ్మారి రోగం ఏళ్ళ తరబడి భారత సమాజాన్ని పట్టి పీడుస్తోంది. డబ్బున్నవారు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి వరుణ్ణి కొనుక్కుని మరి బీరాలు పోతుంటే, మధ్య తరగతి ప్రజలు లేని బడాయి కోసం కష్టాల పాలవుతుంటే, కనీసం కూటికి నోచుకోని వారి పరిస్థితి నాటి నాటికీ దయనీ యంగా తయారవుతోంది.

ధనికులకు పేదలంటే పట్టదు. పేదలకు ధని కులంటే గిట్టని వాతారణం ఎక్కడ మారణ హోమానికి దారీ తీస్తుందోనన్న భయమూ కలుగుతోంది. విద్యా హక్కు, వారసత్వ హక్కు లాంటి కొన్ని హక్కుల్ని పొందిన అబల కాస్త సబలగా తయారయిందిలే అన్న ఆత్మ సంతృప్తి ని వివాహ వ్యవస్థలో నెలకొన్ని వెర్రి ఆచారా లు ఎగరేసుకు పోతున్నాయి. అక్కడక్కడా మహిళ స్థితి కొద్దోగొప్పో మెరుగవుతూ కనబ డినా నేటికీ స్త్రీ పునర్వివాహ, ఆత్మరక్ష సమస్య శేష ప్రశ్నగానే గోచరిస్తోంది. ఈ పరస్థితి మారాలంటే, దేశ పౌరులుకు కేవలం బడి పాఠాలు వల్లె వెయించడం వల్ల సాంఘిక చైత న్యం చోటు చేసుకోదు. చట్టాలు ఎన్ని ఉన్నా మానసికంగా మనిషిలో, మనలో మార్పు రానంత వరకూ,మార్పు కోసం మనం పరిత పించనంత వరకూ అవి నిప్రయోజనమే. ఇదే విషయాన్ని విశద పరుస్తూ పరమోన్నత ప్రభు వయిన అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”ఏ జాతికయితే తన మనోమయ స్థితి మార్చు కునే చింతన ఉండదో అటువంటి జాతి స్థితిని అల్లాహ్‌ కూడా మార్చడు”. (అర్రాద్:11)
నేడు మనకు కనబడే సర్వసామాన్యమయిన మరో దుర్వసనం-మద్యపానం, మాదకద్రవ్యాల సేవనం, మగువ లోలత్వం. నిర్భయ కేసులో ని నేరస్థులపై శిక్ష కొరడా ఝుళిపించి ఆ శిక్ష అమలు కాక ముందే అనేక ప్రాంతాల్లో అనేక మంది మహిళామణుల మానం బూడిద పాల యింది. మొన్న ముంబాయిలో జర్నలిస్టు, నిన్న తెనాలిలో ఓ అమాయకురాలు, జార్ఖండ్‌లో మహిళా పోలీసు! అయితేనేం వాళ్ళు ఆడ కూతుర్లే! నేడు నేరప్రవృత్తి, ఆత్యాచార సం స్కృతి వెర్రితలలు వేస్తోంది. దీనికితోడు నేెర నిరోధం, విచారణ, శిక్షల విధింపు కూడా నత్త నడక నడుస్తుంది గనకే దుష్ట వర్తనులు చెలరేగి పోతున్నారు. ఈ జాబితాలో మంత్రి పుంగ వులు, మహిమాన్విత స్వరూపులు, మాఫియా గాళ్లు, మాదకద్రవ్య బానిసలు, విష సంస్కృతి ఊబిలో పీకల దాకా కూరుకుపోయిన కామాం ధులు, చుట్టుప్రక్కల తిరుగాడే బంధు రాబందు వులు, పోలీసు గద్దలూ-ఇలా అన్ని వైపులా మృగాళ్లే చుట్టు ముడుతుంటే మహిళ తన, మానాలకు రక్షణ ఏది? ఇది సరిపోదన్నట్టు బూతు సాహిత్యం, బూతు చిత్రాల మొదలు ఫేస్‌బుక్కుల వరకూ అన్నీ మహిళను నీచంగా చిత్రిస్తూ మదాంధుల ను కవ్విస్తున్నాయి.ఇది ఒక ప్రాంతానికి, రాష్ట్రా నికి పరిమితమయిన అంశం కాదు. ప్రపంచ మహిళల బాధామయ స్థితి. వేటూరి అన్నట్టు ‘మానభంగంలో మాతృ హృదయ నిర్వేదం’. ఇలాంటి అమానుష నేరా లకు, అనైతిక చర్యల కు కూడా కఠిన శిక్షలు పడకపోతే ఇక విచా రణ, నేర నిరోధం అన్న మాటలకు అర్థమే ఉండదు. నిర్భయ చట్టాల తీవ్రతకు విలువా ఉండదు.
ఆడకూతురి భద్రత అందని ద్రాక్షగానే ఉంది. అందుకే సంఘ సంస్కర్తలు, సంస్థలు కలిసి కట్టుగా లేచి నిలబడాల్సి ఉంది. సమాజంలోని అసమానతలపై, అశ్లీల వాతావరణంపై, అత్యా చార సంస్కృతిపై కలబడాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి వరకు జరిగే అఘా యిత్యాలను,అన్యాయాలను, అక్రమాలను నిలు వరించాల్సి ఉంది.అరికట్టేందుకు ముందుకు రాని అధినేతలను ప్రతిఘటించాల్సి ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తు న్నాడు: ”మా ప్రభూ! దుర్మార్గుల ఈ పురము నుండి మాకు విముక్తి నొసగు. మా కొరకు నీ వద్ద నుంచి ఒక రక్షకుణ్ణి నియమించి. మాకు అండగా నీ వద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పం పించు” అని వెడుకుంటున్న బలహీన పురు షుల, స్త్రీల, పసివాళ్ళ విమొచనకై మీరు అల్లాహ్‌ా మార్గంలో ఎందుకు పోరాడటం లేదు!? (నిసా: 75) మద్యం, మాదకద్రవ్యాల దుష్కృతి సమాజంలో విచ్చలవిడిగా పెచ్చరిల్లు తోంది. తాగుడు అనే ఈ వ్యసనానికి బానిస లైనవారు విర్వీర్యులు, నిస్తేజులు, రోగగ్రస్తులు, నిరుపేదలుగా మారి వీధి పాలవుతున్నారు.

”అపరాధాలన్నింటికి అమ్మ మద్యం” అన్నారు ప్రవక్త మహనీయ ముహమ్మద్‌ (స). మద్య పానం సర్వానర్థదాయకం. దీని వాతన పడి ఎన్నో కొంపలు కొల్లేర్లయ్యాయి. ఎన్నో బం గారు కుటుంబాలు బుగ్గి పాలయ్యాయి. ఎన్నో జీవితాలు నవ్వుల పాలయ్యాయి. ఒక్క మాట లో చెప్పాలంటే మద్యపానం, మాదక ద్రవ్యాల సేవనం కుటుంబ శ్రేయానికి, సంఘాభివృద్ధికి, దేశ ప్రగతికి, ప్రపంచ అభ్యున్నతికి గొడ్డలి పెట్టు. కాబట్టి స్లోపాయిజన్‌ అయిన మద్య పానం చాప క్రింద నీరులా మనకు తెలియ కుండా మనల్ని అధోగతి పాలు చేస్తున్న యదా ర్థాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మం చిది. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తు న్నాడు: ”నిశ్చయంగా మత్తు పానీయాలు, జూదం, పాచికల జోస్యం, దైవేతరాలయాలు- ఇవన్నీ పరమ జుగుప్సాకరమయిన విషయాలు. షైతాన్‌ చేష్టలు. కాబట్టి మీరు వాటికి దూరం గా ఉండండి. మిరలా చేస్తే సాఫల్యం చెంద వచ్చు”. (మాయిదా:90)

కాబట్టి మానవ జాతి సంక్షేమ దృక్పథంతో మద్యపానాన్ని, మాదకద్రవ్యాల సేవనాన్ని నిరో ధించి, అభ్యుదయ మార్గంలో జాతి ప్రజలు పయనించే కార్యప్రణాళికలను తయారు చేయాలి. పోతే,
మతం అన్నది మానవ హితాన్ని కోరేదయి ఉండాలి. అతనికి ఆత్మ శాంతిని ప్రసాదిం చేదిగా ఉండాలి. అంతేగాని మానవ ప్రాణాల ను హరించే మందు పాతరగాగానీ, మానవ మేధను కుంటు పరిచే మత్తు పదార్థంగా గానీ ఉండకూడదు. మనిషిలో మతం సృష్టించే భక్తి మానవ మనుగడకు తోడ్పడాలేగానీ, మానవ జీవితాల్ని అభాశుభాల పాలు చేయకూడదు.
మతం ముసుగులో జరిగే అనాగరిక ఆచా రాలు, అనైతిక చేష్టలు అంతమవ్వాలి. అంత మొందించే దిశగా మన అడుగులు సాగాలి. ఎందుకంటే ఈ అనాగరిక చర్యల వల్ల, ఈ నీతిమాలిన చేష్టల వల్ల మానవ జాతి కళంకి తం అవుతుంది. ఈ మూఢ నమ్మకాల వల్ల, ఈ అంధ విశ్వాసాల వల్ల సంఘంలో చోటు చేెసుకునే అపసవ్యతలు, అస్పృశ్య భావాలు సమాజాన్ని, దేశాన్ని తిరోగమనం వైపు తీసు కెళతాయి. ఈ దుష్కృతుల కారణంగా సమా జంలో వైజ్ఞానిక దృక్పథం అంతరిస్తుంది. మూర్ఖత్వం పెరుగుతుంది. ఇటువంటి మూఢ నమ్మకాలను అధికమించగలిగితే మన దేశం అభ్యుదయ బాటన పయనించగలదనడంలో ఎలాంటి సంశయం, సందేహం లేదు.

ఈ మూఢాచారాలకు మూల కారణం సులభ మార్గాలననుసరించి ఆర్థికంగా అందలం ఎక్కా లన్న కొందరి కాంక్షే. సులభ మార్గం గుండా సంపదను కూడబెట్టుకోవాలని ఆశించే కొంద రు ఇలా ఆధ్యాత్మిక ముసుగులో నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు ఆర్థిక నేరాల కు ఒడిగడుతున్నారు. ఈ ఆధ్యాత్మిక, ఆర్థిక ముసు గుల్లో సమాజంలో అల్లకల్లోలాన్ని, అరాచకాన్ని సృష్టిస్తున్నారు. అట్టివారందరూ షైతాన్‌ మూక కు చెందినవారే. చూడండి: ”నిశ్చయంగా మత్తు పానీయాలు, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషబావాన్ని సృజించాలని, అల్లాహ్‌ా స్మరణ నుండి, ప్రార్థన నుండి మిమ్మల్ని దూరంగా ఉంచాలని షైతాన్‌ కోరు కుంటున్నాడు. కనుక ఇకనయినా వాటిని మానుకోండి”. (మాయిదా: 91)
మానవజాతి అభ్యుదయ క్రమంలో కులం, మతం అడ్డు గోడలుగా ఉన్నాయి. మతం పేరుతో రక్తమాంసాలున్న సాటి ప్రజలను చిన్న చూపు చూసే దుష్కృతి అంతమవ్వాలి. వారిని ఒకే దేవుని దాసులుగా, సాటి సోదరులుగా అభిమానించే, గౌరవించే సంస్కారం అలవ డాలి. చట్టాలెన్నున్నా, ఎల్లలు ఎన్నున్నా, ప్రభు త్వాలు ఎన్నున్నా మానవులంతా ఒక్కటే, మాన వులందరి దైవం ఒక్కడే అన్న సాత్విక భావన అలవడాలి. అప్పుడు ఈ కన్యాశుల్కాలు, ఈ వరకంట వేధింపులు, మద్యం, మాదక ద్రవ్యా ల నిర్మూలన, కుల, వర్గ, భాష, వర్ణ, జాతి భేదాలు అంతమవ్వగలవు. వీటికితోడు మనిషి వ్యక్తిగత స్థాయిలోనూ, సామాజిక, దేశ స్థాయి లోనూ అక్రమార్జన మార్గాలకు దూరంగా మస లుకోవాలి. లంచం, వడ్డీ వంటి చీడలకు ఎడం గా జీవించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి. భౌతికావసరాలను తగ్గించు కుని, అధ్యాత్మిక చింతనను పెంచుకోవాలి.

Related Post