Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

నిజం నిదుర పోకూడదు

 ‘ధర్మానికి నూకలు చెల్లాయి, మానవత్యం మాన్యత  కోల్పోయింది’  అని శాంతి విఘాతకులు అంటే ఎందుకు నిరాశకు గురవుతున్నావు? సన్నగిల్లిందా ధైర్యం? సళ్ళిపోయిందా శౌర్యం? రగిలే వేసవిలో ఇంతగా వణుకు తున్నావు. అయ్యే మనిషీ! గులాంగిరీ గుదిబండను మెడలో వేల్రాడ దీసుకున్నవా?

‘ధర్మానికి నూకలు చెల్లాయి, మానవత్యం మాన్యత కోల్పోయింది’ అని శాంతి విఘాతకులు అంటే ఎందుకు నిరాశకు గురవుతున్నావు? సన్నగిల్లిందా ధైర్యం? సళ్ళిపోయిందా శౌర్యం? రగిలే వేసవిలో ఇంతగా వణుకు తున్నావు. అయ్యే మనిషీ! గులాంగిరీ గుదిబండను మెడలో వేల్రాడ దీసుకున్నవా?

”నిరంకుశ పాలకుని ముందర నిజం చెప్పడం మనిషి చేసే అత్యుత్తమ ధర్మపోరాటం” అన్నారు పవ్రక్త ముహమ్మద్‌ (స). (తిర్మిజీ)
  నిజాన్ని-సత్యాన్నే అన్ని సమయాల్లోనూ చెప్పాలి. నిజం చెప్పడమే నేరమ నిపించే సందర్భాలలో నిజాన్ని మరీ మరీ చెప్పి తీరాలి. నీతికి నిలబడ వద్దని, నిజాన్ని నిలబెట్టవదని అంతరాత్మ ప్రబోధనాన్ని అమ్ముకునే అక్రమా ర్కులు కోరుతారు-అది వారి వృత్తి, పవ్రృత్తి.  నిరాశకు గురవ్వక, నిర్బంధానికి నెరవక పడగెత్తే ముళ్ళ మధ్య అడుగెయ్యడం, మంచితనం మంటల్లో మరణించడం  పక్రృతి, పత్రి విశ్వాసి సంస్కృతి – నాటి  నుండి నేటి  వరకు.
 దేశాభివృద్ధి ఆరు లైన్ల హైవేలో దూసుకుపోతున్నది అన్న మాట ఒక వైపు వినబడుతోంది. సమాచార, సాంకేతిక విప్లవం మనిషిని ఏది అంటని పాద రసంలా మార్చి వేసిందన్న వాదన మరో వైపు వినబడుతోంది. ఈ రెండు వాదనల మధ్య వినబడే మరో మాట-‘అలా సమాధిలా అంగుళం మేరన్నా కదలకుండా పడుంటే ఎలా? కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకు తెల్సి చావదు’ అన్నది. విధానాల రూపంలో జరుగుతున్న అమానవీయ చర్యలను ప్రశ్నించాల్సిన  సమాజం కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవడం ఆ సమాజ నిస్తేజానికి సంకేతం. ఇలాంటి  దుస్థితినే పై మాట నిలదీస్తుంది.
 ఎన్నాళ్ళని అందకుండా ఉంటుంది ఈ ఆకాశం, దాన్ని ముక్కలు ముక్క లుగా తరగండి అంటారు – ‘అందనిదే అకాశం’ అని తెలియని తామస గుణ తుంటరులు. ఎన్నాళ్ళని కలవకుండా ఉంాయి ఈ ఆష్ట దిక్కులు, వాటి  ముక్కుల్ని చెక్కేయండి అంటారు – ‘కలవనివే దిక్కులని’ తెలియని కలహాకారులు. కదలకుండా క్షణమయినా నిలబడదెందుకు ఈ గాలి? దాన్ని పీడీ చట్టం క్రింద బంధించండి అంటారు – ‘నిలవనిదే గాలి’ అని తెలియని నురుగు స్వభావ సుంఠలు. చచ్చినా చెలియకట్టను దాటదెందుకు ఈ సముద్రం? పెట్రోలు  పోసి తగలేయండి అంటారు – ఉపరి తల స్వభావంతో ఊగిసలాడే ఊసరవెల్లులు – ‘నిలిచినదే సంద్రం’ అని తెలియక. వసంతాన్ని నిట్టు నిలువునా పాతేయండి ఎండు మోళ్ళకు పచ్చని గుండెలిచ్చినందుకు అంటారు వికృతి పిపాస ప్రబుద్ధులు – ‘వికసించేదే వసంతం’ అని తెలియక. మండుటెడారిలో కన్నీటి  చుక్కయినా పుట్టకుండా చేసినందుకు కరుణను పూడ్చేయండి అంటారు బురద ఆలోచన భ్రష్టులు  – ‘కరిగేదే కరుణ’ అని తెలియక. కాస్త నిశిత దృష్టితో ఆలోచిస్తే ఇదే పరిస్థితి కొంత కాలంగా దేశంలో నెలకొని ఉంది. బాబ్రీ నుండి దాద్రీ వరకు. కామన్‌ సివిల్‌ కోడ్‌ నుండి కరెన్సీ మార్పు వరకు.
 ‘ముంగిట్లో  నిలిచిన అధినేతను, మూడు దిక్కులు గెలిచిన విధేతను. నిలువరేమీ మీ తలలు వంచి, కొలువరేమి మీ గుండెలు సమర్తించి’ అని గొంతు చించుకుంటే ప్రయోజనం లేదు. భజన సేన కాదు భారత పౌరులు అక్షర ధర్మసేన. నరోత్తములకే అందిస్తారు నమస్సులు, దురాత్ములకు కాదు. కారుణ్యానికే వంచుతారు శిరస్సులు కాఠిన్యానికి కాదు.
 ప్రతి కాహాళం తన శౌర్యం పలకాలని, ప్రతి పతాక తన పేరిట నిలవాలని, ప్రతి మకుటం తన కాలిగోటిలో ప్రతిఫలించాలని, ప్రతి హృదయం తన విచ్చుకత్తికి ప్రణమిల్లాలని రాజ్యదాహంతో ఉన్న లోభం తెంచేయాలనుకుంటుంది ఆత్మీయతును చిదిమేయాలనుకుంటుంది ఆప్యాయతను. అయినా మనం నిలబడాలి, బల పడాలి. తల పడాలి, కల బడాలి. అడుగెయ్యాలి, అడిగెయ్యాలి, కడిగెయ్యాలి.
 ‘ధర్మానికి నూకలు చెల్లాయి, మానవత్యం మాన్యత  కోల్పోయింది’  అని శాంతి విఘాతకులు అంటే ఎందుకు నిరాశకు గురవుతున్నావు? సన్నగిల్లిందా ధైర్యం? సళ్ళిపోయిందా శౌర్యం? రగిలే వేసవిలో ఇంతగా వణుకు తున్నావు. అయ్యే మనిషీ! గులాంగిరీ గుదిబండను మెడలో వేల్రాడ దీసుకున్నవా? ఆత్మవంచన రంగద్దాలను అంతరాత్మకు తొడుక్కున్నావా? వాక్‌స్వేచ్ఛకు తిలోదకాలిచ్చి నీ స్వేచ్ఛ గొంతుకను నువ్వే నులుముకు న్నావా? భావ దారిద్య్ర  బంగారు సంకెళ్లను భవిత పాదాలకు వేసుకు న్నావా? తుచ్ఛ ఇచ్ఛ ఇనుప కచ్చడాలతో నిన్ను నువ్వు బంధించుకున్నావా? లే, కర్తవ్యం పిలుస్త్తోంది చూడు: ”మా ప్రభూ! దుర్మార్గుల యొక్క ఈ పురము నుండి మాకు విముక్తి నొసగు. మా కొరకు నీ వద్ద నుండి ఒక రకకుణ్ణి నియమించు. మాకు (అండగా)నీ వద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పంపించు” అని వేడుకుంటున్న బలహీన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ విమోచనకై మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడటం లేదు?!” (దివ్యఖుర్‌ఆన్‌-4: 75)
 అల్ప సంఖ్యాకులు, ద్వితీయ స్థాయి పౌరులు అని చులకన చేస్తే, నీటి  గుండె లల్లాడి పోయెనా నిప్పుల వెల్లువ పుడుతుందని నిరూపిం చాలి మనం.  అధికారం అన్నది వారి నుడుగే ఉందని మిడిసి పడితే, సమయమొస్తే ప్రతి గాలి వీచిక తుఫానయి తుడిచి పెడుతుందని రుజువు చెయ్యాలి మనం. అగ్ర రాజ్యం వారిదని ఉగ్రవాదాన్ని రుద్దజూస్తే, ఒత్తిగిల్లి పడి ఉన్న విత్తులో ఒకట వృక్షం పుడుతుందని తెలియ జెయ్యాలి మనం.  ఇసుక దిబ్బలు ఏమి పింంచగలవని ఈసడించు కుంటే. ఓపిక ఉంటే ప్రతి ఎడారిలో జలఝరి పుట్టించగలమని నిరూపించాలి మనం. తలవంచి రుకూ, సజ్దాలు చేస్తూ తరలే జనశక్తిని పరిహసిస్తే, ప్రార్థించే ప్రతి పెదవి గళం విప్పుతుందని, ప్రతి చెయ్యి ఉక్కు పిడికిలి బిగిస్తుందని తెలియజెయ్యాలి మనం. దేశ ప్రజల మధ్య సఖ్యతను కాపాడేందుకు,సమైక్యతకు పెంచేందుకు ప్రయత్నించాలి మనం. ఎక్కడిది నువ్వెక్కిన ఆసనం? ఎవరిది నువ్వు వల్లించే భాషణం? సాటి  మనిషిపై స్వారీ చేస్తూనే చాటుతావా ప్రేమ శాసనం? అని ప్రశ్నించాలి మనం.

Related Post