ఖురాన్ ఘనత

 ఖుర్‌ఆన్‌ ఆవతరించి 1435సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది. మచ్చుకు కొన్ని గాథలు.

ఖుర్‌ఆన్‌ ఆవతరించి 1435సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది. మచ్చుకు కొన్ని గాథలు.

 

ఇది సర్వలోక ప్రభువు అవతరింపజేసిన (అద్భుత) వాణి. దీన్ని తీసుకొని నమ్మకస్తుడయిన దైవదూత స్పష్టమయిన అరబీ భాషలో నీ హృదయఫలకంపై అవతరింప జేశాడు,  (షు అ రా : 192)

ఖుర్‌ఆన్‌ అనే ఈ జ్ఞాన సాగరాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఈ గ్రంథ రాజం తెలియపర్చే యదార్థాల వరకు,అద్భుత విషయాల వరకు చేరుకోవడానికి మనకి ఎన్ని యుగాలు అవసరమో తెలియదు. ఈ గ్రంథ విశిష్ఠత గురించి కలం కదిలించి వ్రాయడం అంటే- కొన్ని కోణాలను మనిషకి తెలిసిన జ్ఞానం, అనుభవం కొద్దీ గ్రహించి చెప్పడమే అవుతుంది. ఈ గ్రంథ జ్ఞానాన్ని ఏ కలం, మరే పుస్తకం ద్వారానూ ఇనుమడింప జేయలేము. ‘ఇమామ్‌ ఫఖ్రుర్రాజీ (ర)’ ఇలా అభిప్రాయాపడ్డారు: ”ఖుర్‌ఆన్‌ అనే ఈ విజ్ఞాన భాండాగారమే గనక లేక పోయినట్లయితే ప్రపంచం మూడు వందల ప్రయో జనకర విద్యలను కోల్పోయి ఉండేది”.

ఆ మాటే పరమ పవిత్రుడైన అల్లాహ్  తెలియజేస్తున్నాడు: ”భూ మండలంలోని వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సీరాగా మారినా, ఆపై వాటికి జతగా మరో ఏడు మహా సాగారాలను సీరాగా చేసినా అల్లాహ్‌ా వాక్యాలు పూర్తి కావు. నిస్సందేహంగా అల్లాహ్  సర్వాధికుడు, వివేక వంతుడు”. (లుఖ్మాన్‌: 27) మచ్చుకు కొన్నింటిని ఇక్కడ పేర్కొనడం జగుతుంది.

అది వచ్చింది –

”మిమ్మల్ని కారు చీకట్ల నుంచి వెలిక తీసి కాంతి వైపు తీసుకుపోవడానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను (వచనాలను) అవ తరింపజేసినవాడు అల్లాహ్‌యే. నిశ్చయంగా ఆయన మీ యెడల మృదుస్వభావి, దయాశీలి.” (హదీద్: 9)

పవిత్ర ఖుర్‌ఆన్‌ మానవాళి పాలిట ఓ మహా దానుగ్రహం. ప్రపంచంలోని మరే అను గ్రహం దీనికి సరితూగదు. ఈ గ్రంథంలో భూత, భవిష్య, వర్తమానానికి సంబంధించిన సమాచారమూ ఉంది. సృష్టి, సృష్టి నిర్మాణం, సూర్యచంద్రనక్షత్ర భ్రమణ వివరాలూ ఉన్నాయి. గత జాతుల, ప్రవక్తల ఆదర్శాలూ ఉన్నాయి. విశ్వాసుల మధుర ఫలం స్వర్గం, అవిశ్వాసుల దుష్ఫలం నరక ప్రస్తావనలూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇహపరాల సాఫల్యాలు, సభ్యతా సంస్కా రాలు, గౌరవోన్నతులు, నీతినడవడికలు-అన్నీ ఈ ఉద్గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి. రాజా ధిరాజు అయిన అల్లాహ్‌ ఈ గ్రంథరాజం గురించి ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ప్రవక్తా! మేము ఈ గ్రంథాన్ని నీపై అవ తరింపజే శాము. అందులో ప్రతీ విషయం విశదీక రించబడింది. విధేయత చూపేవారికి ఇది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”.(నహ్ల్:89)

ఖురాన్ కొన్ని ప్రత్యెకతలు

1)అది సమస్త మానవాళి కోసం వచ్చిన గ్రంథం – యావత్తు ప్రపంచవాసులను హెచ్చరించే నిమిత్తం ఈ ఫుర్ఖాన్‌ (గీటురాయి)ని తన దాసునిపై అవతరింపజేసినవాడు ఎంతో శుభదాయకుడు.  (ఫుర్ఖాన్‌ -1)

2) సవ్యమైన బాట వైపు తీసుకెళ్ళే గ్రంథం – నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరిఅయిన (సవ్యమైన) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కా ర్యాలు చేస్తూఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫల ముందని శుభవార్తనూ అందజేస్తుంది. (ఇస్రా: 9 -10)

3) జాతుల భవితవ్యం ఖురాన్ – “నిశ్చయంగా ఈ గ్రంథ ఆధారంగా కొన్ని జాతులను కీర్తి శిఖరాల మీద కూర్చోబెడితే మరికొందరిని అధఃపాతాళానికి నెట్టి వేస్తాడు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

4) ఇది మనందరి కోసం, మానవులందరి కోసం వచ్చిన అంతిమ ధర్మ శాస్త్రం.  ఇది కాల్పనిక సిద్ధాంతం కాదు ఈ రోజు పాటించి రేపు వేదిలేయడానికి. ఇది సమస్త లోకాల ప్రభువు సమస్త మానవాళికి అనుగ్రహించిన శాశ్వత ధర్మ శాస్త్రం.

నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్)ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. (హిజ్ర్: 9)

”ఖురాన్ ను స్వతహాగా చదవడం నేర్చుకొని ఇతరులకు నేర్పించే వాడు మీలో ఉత్తముడు” అన్నారు ప్రవక్త (స)

“మీరు ఖురాన్ చదవండి. అది రేపు ప్రళయ దినాన తన్ను చదివే వ్యక్తి తరఫున సిఫారసు చేస్తుంది” అన్నారు ప్రవక్త (స) (బుఖారీ)

“రేపు ప్రళయ దినాన ఖురాన్ చదివే వ్యక్తితో – ఖురాన్ చదువుతూ వెళ్ళు. .. స్వర్గ అంతస్థులు అధిరోహిస్తూ వెళ్ళు… నువ్వెలాగైతె ప్రపంచంలో పారాయణం చేసే వాడివో అలానే పారాయణం చెయ్యి. నీ ఆఖరి అంతస్థు నువ్వు చదివే ఆఖరి ఆయతు దగ్గర ఉంటుంది”  అన్నారు ప్రవక్త (స)

ఖుర్‌ఆన్‌ మహా గ్రంథాన్ని పఠించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఏదోక దేశంలో, ఏదోక ఖండంలో, ఏదోక భూభాగంలో కాదు – ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నారు. వారిలో తెల్లవారూ ఉన్నారు, నల్లవారూ ఉన్నారు, అరబ్బులూ ఉన్నారు,ఆరబ్బేతరులు ఉన్నారు, ఆ విషయానికొస్తే 160 కోట్ల మంది ముస్లింలలో 25 శాతం మంది అరబ్బు ముస్లింలయితే 75శాతం మంది అరబ్బేతరులే. ఒక్క మాటలో చెప్పాలంటే ఖుర్‌ఆన్‌ చదవకుండా ప్రపంచంలో ఒక్క క్షణం కూడా గడవదు. ఏదోక చోట, ఏదోక రూపం లో అనునిత్యం ఖుర్‌ఆన్‌ పఠనం సాగుతూనే ఉంటుంది. ఖుర్‌ఆన్‌ ఆవతరించి 1435సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది. మచ్చుకు కొన్ని గాథలు.

అరబ్బు దేశమయిన అబూ దాబీని సందర్శించే నిమిత్తం వచ్చిన ప్రాన్స్ దేశస్తుడైన జొల్యాన్‌ అనే వ్యక్తి టాక్సీలో వెళుతూ తన జీవితంలో మొదటి సారి ఖుర్‌ఆన్‌ విన్నాడు. అతనికి భాష అర్థం కాకాపోయినా ఖుర్‌ఆన్‌ పారా యణం అతని హృదయాన్ని తాకుతున్నట్లు అనిపించి – ‘ఏమిటిది? అని’ ప్రశ్నించగా ‘అది అల్లాహ్‌ గ్రంథమయిన ఖుర్‌ఆన్‌’ అని బదులివ్వ డంతో పాటే – చూడండి సర్‌! మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోవాలంటే ఇస్లాం స్వీకరించండి! అని అన్నాడు ఆ టాక్సీ డ్రైవర్‌. జొల్యాన్‌ అంటున్నాడు: అతని ఆ మాట నాకో హెచ్చరికలా అనిపించింది. చివరికి  నేను పూర్తి అన్వేషణ జరిపి ఇస్లాం స్వీకరించేలా చేసింది.

అలాగే ఓ పెద్ద అధికారి, సెల్స్‌ టాక్స్‌ డిప్యూటి కమిష్నర్‌ దగ్గర పని చేసే ఓ ముస్లిం చఫ్రాసీ ఆయన ద్వారా ప్రమోషన్‌ అందుకున్న సంతో షంలో ఆయనకో గిప్టు ఇవ్వాలనుకున్నాడు. తానేమో పేదవాడు, ఏం గిప్టు ఇస్తే బాగుంటుంది అని తర్జన భర్జన పడ్డాడు. చివరికి ఆయన దగ్గరకు వెళ్ళి – ”సర్‌, నేను మీకు ఇవ్వబోతున్న గిఫ్ట్‌కు సరితూగ గలిగే వస్తువేది విశ్వం మొత్తంలో లేదు” అంటూ ఓ గిప్టు ప్యాకు అందిం చాడు. ఆఁ అంత పెద్ద గిప్టు ఇతను నాకేమివ్వగలడు అనుకొని తీసు కళ్ళి అల్మారాలో పెట్టి మరచి పోయాడు ఆ అధికారి. కాని పడకపై మేను వాల్చగానే ఛప్రాసీ మాటలు గుర్తుకొచ్చాయి. మరచి నిద్ర పోదా మనుకుంటే నిద్ర పట్టడం లేదు. అలానే మూడో వంతు రాత్రి గడిచి పోయింది. రాత్రి చివరి ఝామున లేచి ఆ గిప్ట ప్యాక్‌ తెరచాడు. అది హిందీ భాషలో ఉన్న ఖుర్‌ఆన్‌. ఏం రాయబడి ఉందో చదువుదాం అని తెవరబోయి ఆగిపోయాడు. పైన కవరుపై హిందిలో వ్రాయబడి ఉంది ‘పరిశుద్ధులే దాన్ని ముట్టుకుంటారు’ అని. వెళ్ళి చేతులు కాళ్ళు కడిగి వచ్చి చదవానారంభించాడు. ఆ రోజు మొదలయి ఆయన ఖుర్‌ఆన్‌ గ్రంథ పారాయణం చాలా రోజుల వరకు కొనసాగింది. గిఫ్టు ఇస్తూ ఛప్రాసీ చెప్పి మాట ఎంత వాస్తవమో ఆయనకు బోధ పడింది. అతను ఆ గిఫ్టు తనకిచ్చి ఉండకపోతే తాను ఎంతటి మహా భాగ్యాన్ని కోల్పోయేవాడో తనకర్థమయింది.

దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నాము, స్వయంగా పారాయణం చేయడమే కాక సుస్వరకర్తల స్వరంలో ఖురాన్‌ స్వర్ణకార ధ్వనిని వింటున్నాము. అల్‌హమ్దులిల్లాహ్‌ అయితే అన్ని ఉపద్రవాల నుండి మానవాళిని కాపాడే ఉగ్రంథంగా మనం విశ్వసి స్తున్న ఈ గ్రంథరాజాన్ని ఇతరుల వరకు చేరవేసే ప్రయత్నం చేశామా? మనం అందజేసే ఈ గిఫ్టు ఎందరి జీవితాల్ని మార్చగలదో ఎప్పుడ యినా ఆలోచించామా? ఏ విషయంలో ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం ఆలస్యం అమృతం విషం.

అల్లాహ్‌ మనందరికి ఆయన గ్రంథాన్ని ఆయన దాసుల వరకు చేరవెసే సద్బుద్ధిని ప్రసాదించాలని, ఖుర్‌ఆన్‌ను మన మనో వసంతం గా చేయాలని, ఆత్మ జ్యోతిగా, సకల సమస్యల్ని దూరం చేసే దివ్య ఔషధిగా చేయాలని కోరుకుంటూ…

Related Post