Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

మువ్వన్నెల జెండా మనది

 ''జఫరాన్‌ రంగు త్యాగానికి గుర్తు, ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచి ప్టిె తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపు రంగు మన ప్రవర్తనకు నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు మ్టితో మనకున్న అనుబం ధానికి, ఇతర జీవాలన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధార పడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోక చక్రం ధర్మపాలనకు గుర్తు. జీవమున్న ప్రతి చోట చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారత దేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగి పోవాలి. చక్రం శాంతి యుతమైన, చైతన్యవంతమయిన ప్రగతికి చిహ్నం''.

”జఫరాన్‌ రంగు త్యాగానికి గుర్తు, ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచి ప్టిె తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపు రంగు మన ప్రవర్తనకు నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు మ్టితో మనకున్న అనుబం ధానికి, ఇతర జీవాలన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధార పడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోక చక్రం ధర్మపాలనకు గుర్తు. జీవమున్న ప్రతి చోట చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారత దేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగి పోవాలి. చక్రం శాంతి యుతమైన, చైతన్యవంతమయిన ప్రగతికి చిహ్నం”.

127 కోట్ల ప్రజావాహిని తాము స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న చారిత్రక దినం ఆగస్టు 15. భిన్నత్వంలో ఏకత్వంగా రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా ఎర్రకోటపై యావత్‌ దేశ ప్రజల ఆశలకు సంకేతంగా ఎగిరి 68 వసంతాలు పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితమే 69వ స్వాతంత్ర దినోత్స వం అత్యంత ఘనంగా దేశంలోని ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ కనుల పండుగగా జురుపుకున్నాం. ఈ సందర్భంగా అందరి ప్రయోజనార్థం మన జాతీయ జెండా వివరాలు ఇక్కడ పొందు పరుస్తున్నాము.
భారత జాతీయ పతాకం ప్రస్తుతం ఉన్న రూపంలో 1947 జూలై 22వ తేదీన జరిగిన రాజ్యాంగ సభ ప్రత్యేక సమావేశంలో ఆమోదించ బడింది. త్రివర్ణ పతాకం అంటే మన దేశంలో జాతీయ పతాకమే. ఇదే భారత సైన్యం యొక్క యుద్ధ పతాకం కూడా. భారత జాతీయ పతాకాన్ని ఎందరో రూపొందించినప్పికీ ప్రస్తుతం ఉన్న పతాకాన్ని మాత్రం పామర్రు నియోజక వర్గం కృష్ణా జిల్లా వాసి అయిన పింగళి వెంకయ్య. జాతీయ పతాకాన్ని ఖాదీ బట్టతో మాత్రమే చేయాలని జాతీయ పతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. స్వాతంత్య్రం పొందక ముందు భారత జాతీయ కాంగ్రెసు 1921లో తెలుపు, ఆకు పచ్చ, ఎరుపు రంగులతో అనధికారం గా ఒక పతాకాన్ని రూపొందించింది. వాికి మతపరమయిన వివరణ ఉండేది. అయితే 1931లో మధ్యలో రాట్నము బొమ్మ గల పతాకాన్ని తన అధికార పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువిం మత పరమయిన ప్రతీకలు లేవు అని ప్రకించింది.

1947 ఆగస్టులో భారత దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్ని రోజుల ముందు ఏర్పాటయిన రాజ్యాంగ సభ, కాంగ్రెసు పార్టీ పతాకాన్నే అన్ని పార్టీలకు, ఆన్ని మతాలవారికి ఆమోదయోగ్యమయిన మార్పులు చేసి జాతీయ పతాకంగా స్వీకరించడానికి నిర్ణయించింది. అన్నింకంటే ముఖ్య మయిన మార్పు రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని చేర్చడం. అంతకు ముందున్న జెండాలోని రంగులకు మత పరమయిన అన్వయాలున్నందున స్వతంత్య్ర భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, జాతీయ పతా కానికి ఎటువిం మతపరమయిన అన్వయాలూ లేవని స్పష్టం చేస్తూ పతాక ప్రాధాన్యతను ఇలా వివరించారు: ”జఫరాన్‌ రంగు త్యాగానికి గుర్తు, ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచి ప్టిె తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపు రంగు మన ప్రవర్తనకు నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు మ్టితో మనకున్న అనుబం ధానికి, ఇతర జీవాలన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధార పడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోక చక్రం ధర్మపాలనకు గుర్తు. జీవమున్న ప్రతి చోట చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారత దేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగి పోవాలి. చక్రం శాంతి యుతమైన, చైతన్యవంతమయిన ప్రగతికి చిహ్నం”. ఈ వివరణతోపాటు జఫరాన్‌ స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతుకు; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలనే ఒక అనధికారిక అన్వ యం కూడా బాగా ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న జెండా నిర్మాణంలో తర్జనభర్జన సందర్బాలూ ఉన్నాయి. మల్లగుల్లాలు పడిన వేళలూ ఉన్నాయి.

ముందు జెండాలో మతపరమయిన చిహ్నాలుండటం చాలా మందికి నచ్చనప్పికీ 1924లో ఆలిండియా సంస్కృత కాగ్రెస్‌ హిందువులకు చిహ్నంగా కాషాయం రంగును, విష్ణు ధరించే గదను చేర్చాలని కోరింది. అదే సంవత్సరం హిందూ యోగుల, ముస్లిం సూఫీ, దర్వేషుల వైరాగ్యానికి చిహ్నమైన జేగు రంగును చేర్చాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. సిక్ఖులు తమ మత చిహ్నంగా పసుపు రంగును చేర్చా లని,లేనట్లయితే మతపరమైన సూచికలు పూర్తిగా తొలగించాలని కోరారు. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిీ 1931 ఏప్రిల్‌ 2న ఈ వివాదాలను పరిష్కరించడానికి ఏడుగురు సభ్యులతో ఫ్లాగ్‌ కమిీని నియ మించింది. ”జెండాలోని మూడు రంగులూ మతాలనుద్దేశించనవే కాబ్టి అభ్యంతరకరమైనవి” అని తీర్మానించింది. ఫలితంగా పూర్తి ఎర్ర మ్టి రంగులో, పైభాగాన రాట్నం గుర్తుతో ఒక కొత్త జెండా తయారయింది. దీన్ని ఫ్లాగ్‌ కమిీ ఆమోదించినా ఇది కూడా మతపరమయిన భావ జాలాన్నే సూచిస్తుందనే ఉద్దేశ్యంతో కాగ్రేస్‌ పార్టీ ఆమోదించ లేదు. పింగళి వెంకయ్య రూపొందించిన 1931 నాి జెండా. దీన్నే రెండవ ప్రపంచ యుద్ధంలో అర్జి హుకూమతె ఆజాద్‌ హింద్‌ వాడుకొంది. తర్వాత 1931 కరాచీ కాంగ్రెస్‌ సమావేశంలో పై నుంచి క్రిందకు వరుసగా జఫరాన్‌, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ప్టీలు, ఇధ్యలో చరఖాతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని స్వీకరిస్తూ జాతీయ జెండాపై తుది తీర్మానం ఆమోదించింది.

స్వతత్ర భారత దేశ జాతీయ పతాకాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగ సభ, 1947 జూన్‌ 23న బాబూ రాజేద్ర ప్రసాద్‌ అధ్యక్షన మౌలనా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, కె.ఎం. పణిక్కర్‌, సరోజిని నాయుడు, రాజాజీ, కె.ఎం. మున్షీ, బి.ఆర్‌.అంబేద్కర్‌లతో ఒక కమిీని నియమించింది. ఆ కమిీ 1947 జూలై 14న కాంగ్రెస్‌ పతాకాన్నే అన్నీ పార్టీలకు, మతాలకు ఆమోదయోగ్యమయ్యే మార్పులతో జాతీయ పతాకంగా స్వీకరించాలని తీర్మానించింది. ద్లాోం మత పరమయిన సూచికలేవీ ఉండరాదని నిర్ణయించింది. చరఖా స్థానంలో సారనాథ్‌ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ కొత్త పతాకాన్ని స్వతంత్ర బారత జాతీయ పతాకంగా ఉద్వేగభరిత వాతా వరణంలో 1947 ఆగస్టు 15 నాడు ఆవిష్కరించారు.

పతాక పరిణామం, రంగులు, వాడే బట్టకు వర్తించే నిర్ధేశాలు చాలా ఖచ్చితమయినవి. వీి ఉల్లంఘన శిక్షార్హమైన నేరం! జెండాపై వేసిన రంగులను బి.ఐ.ఎస్‌. పరీక్షించిన తర్వాతే అమ్మానకి అనుమతిస్తారు. 2002కు ముందు జాతీయ సెలవు దినాలలో తప్ప మిగతా సమయాల్లో జాతీయ పతాకాన్ని ప్రజలు ఎగురవేయడానికి అనుమతించే వారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత అధికారులకు మాత్రమే ఆ అధి కారం ఉండేది. ఈ నిబంధన తొలగించాలని కోరుతూ నవీన్‌ జిందాల్‌ అనే పారశ్రామికవేత్త జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం పౌరుడిగా తన హక్కు అని, దేశం పట్ల తన ప్రేమను ప్రకించుకునే మార్గమని హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయగా – అది కాస్త సుప్రీమ్‌ కోర్టుకెళ్లింది. ఈ విషయాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరయినా జాతీయ పతాకాన్ని ఎగుర వేయవచ్చని అనుమతిస్తూ జాతీయ పతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002 జనవరి 26న అమల్లోకి వచ్చింది. 2005 జూలైలో, భారత దేశ ప్రభుత్వం కొన్ని రకాల వినియోగాన్ని అనుమతింనికి సవరించారు. సవరించిన కోడ్‌ ప్రకారంలో దుస్తులలో జెండా వాడుకను నిషేధిస్తుంది. చేతి రుమాలు లేదా ఇతర వస్త్రాలపై ఎంబ్రాయిడింగ్‌ను నిషేధిస్తుంది. అదే విధంగా చినిగిన జెండాలు లేదా పాడయిపోయిన జెండాలు నాశనం చేయడానికి ఒక ప్రత్యేక పధ్దతి ఉంది. అలాంటి వాటిని మూలన పడేయటంగానీ, అగౌరవంగా నాశనం చేయడంగానీ చేయకూడదు. అలాిం వాిని కాల్చడమూ లేదా భూమిలో పాతి పెట్టడం చేయాలి. లేదా జెండా గౌరవాన్ని కాపాడే మరే ఇతర పద్ధతి ద్వారా మాత్రమే వాిని తొలగిం చాలి.

Related Post