Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

యే భారత్‌ దేశ్‌ హమారా కిస్కీి నజర్‌ లగీ ఇసే?

'చీకటి తొలగక ముందే చెడు చేసెయ్యాలి'అన్నది వారి ఎత్తుగడే అయి ఉండొచ్చు గాక, దీపం ఉండగానే మనం మాత్రం ఇల్లు చక్క బెట్టుకోవాలి. పరిస్థితులు మరింత విషమించక ముందే 'గోరంత ఆలస్యం కొండంతి నష్టానికి దారి తీస్తుంద'న్న స్పృహతో మేధావులు, ఆలోచనాపరులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు భాష, ప్రాంత, కుల, మత బంధనాలను అధికమించి  ముందుకు రావాలి.

‘చీకటి తొలగక ముందే చెడు చేసెయ్యాలి’అన్నది వారి ఎత్తుగడే అయి ఉండొచ్చు గాక, దీపం ఉండగానే మనం మాత్రం ఇల్లు చక్క బెట్టుకోవాలి. పరిస్థితులు మరింత విషమించక ముందే ‘గోరంత ఆలస్యం కొండంతి నష్టానికి దారి తీస్తుంద’న్న స్పృహతో మేధావులు, ఆలోచనాపరులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు భాష, ప్రాంత, కుల, మత బంధనాలను అధికమించి ముందుకు రావాలి.

అనేక విశిష్ఠతలను తనలో లీన పర్చుకున్న మన దేశం విశ్వంలోనే విశిష్ఠమయినది. ఇక్కడ స్వార్థప్రియత్వంకన్నా సాత్విక భావాలనే ఎక్కువ ఆదరించడం జరిగింది. ఇక్కడ భౌతిక అవసరాలకన్నా ఆత్మకు కావాల్సిన ఒనరుల మీదే ఎక్కువ శ్రద్ధ చూపడం జరిగింది. ఇక్కడ సదా సత్యాన్వేష కులు, శాంతి కాముకులు, త్యాగశీలురు పెద్ద ఎత్తున ఉంటూ వచ్చారు. ‘సోనే కీ చిడ్యా’ అనేది భారత దేశానికి అక్షరాల అతికే ప్రశంస. నేల బంగారం, మణిమాణిక్యాలను అందినట్లే భారత భూమి ఆనేక మంది జాతీయ రత్నాలను, బంగారు మనుషులను ప్రపంచానికి అందించింది. సత్య ప్రచారం, శాంతి స్థాపన కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వారు మన పూర్వీకులు. అలాంటి అన్నపూర్ణ నేలపై ఏ డేగ కళ్ళు పడ్డాయో తెలియదు గానీ ప్రజా సేవే శ్వాసగా, దేశాభ్యున్నతి, అభివృద్దే ఆశయంగా ముందుకు సాగాల్సిన భారత యువ శక్తిని ప్రక్క త్రోవలు పట్టించే ప్రయత్నం గట్టిగానే జరుతున్నది. మత హింస, అసహనం పెచ్చరిల్లుతున్నది. అందరి కోసం అందరూ పోరాడి తెచ్చుకున్న స్వాతంత్య్రయాన్ని ఏ కొందరి కోసమో బలి పశువును చేయడం జరుగుతున్నది. స్వేచ్చ తెచ్చి ప్టిెన బాధ్యతను సజావుగా నెరవేర్చకుండా బాధ్యతా రహితంగా వ్యహరంచడం జరుగు తున్నది. ప్రజల నుండి వారి స్వేచ్ఛను బలవంతంగా లాక్కునేందుకు కుట్రలు పన్నడం జరుతున్నది. ఈ దీనావస్థను చూసే ఓ కవి ఇలా అన్నాడు:

యే భారత్‌ దేశ్‌ హమారా కిస్కీ నజర్‌ లగీ ఇసే?
యే థా జన్నత్‌ కా నజారా కిస్కీ నజర్‌ లగీ ఇసే?

అధికార దాహం మహా చెడ్డది. అది పొందేంత వరకూ దాన్ని పొందడానికి ఆరాచకాలు, అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడటం. అది లభించాక దాన్ని నిలుపుకోవడం కోసం మరి కొన్ని దహన కాండలకు, దారుణాలకు తెగ బడటం. నారు పోసి, నీరు పోసి పంట పండించే రైతు పంట పండక, పండినా సరయిన ధర లభించక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మధ్య ధళారులు మాత్రం మస్తుగా మాగాణాలు నింపుకంటున్నారు. మురికి వాడ ల్లో, చెట్ల క్రింద, ప్లాస్టిక్‌ పట్టాల గుడారాల్లో ఒంటి మీది పట్టుమని పది మూరల బట్ట కూడా లేకుండా బ్రతుకు బండిని బరువుగా లాగుతున్న భారత నారీమణుల్ని ఏ భధ్రకాళి వచ్చి కాపాడటం లేదు, స్త్రీ స్వేచ్ఛా నినాదాలు చేసే ఏ ఒక్క సంస్థ పట్టించుకోవడం లేదు. గుక్కెడు మంచి నీళ్ళ కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసి పిల్లల రోధన ఎవడికీ విన్పించడం లేదు. పని కోసం తిరిగి తిరిగి దొరల కార్లు ఆగే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర భిక్షారులు గా, చిల్లర కంటే ఛీత్కారాలే ఎక్కువగా సంపాదించే భారత పౌరుల గురించి ఎవ్వడూ ఆలోచించడు. ఈ బాధలను భరించ లేక, ఈ అఘాయి త్యాలకు తాళ లేక ఆత్మ స్థయిర్యాన్ని కోల్పోయి ఆత్మాహుతికి పాల్పడితే ఈ సంఘటనలతో తమకెలాంటి సంబంధం లేనట్లు, వారు భారత పౌరులే కానట్టు ముఖం చాటేస్తారు. 90 యేండ్ల వృద్ధుడు గుడిలోకి వెళతానంటే సజీవ దహనం చేస్తారు. గో మాంసం తిన్నాడనో, దాచుకున్నాడనో ఏదొక నేపంతో ఊరు ఊరంతా కలిసి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంటారు. మూగ జీవాలు ఎన్నో ఉన్నా ఒక్క ఆవును మాత్రమే రాజకీయ పావుగా వాడుకుంటారు. హక్కు మాటున మహీళామణుల్ని వివస్త్రల్ని చేసి యావత్తు భారత దేశం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తిస్తారు.

యే ఖూన్‌ బహ్‌రహా అపనోఁ కా అరె దేఖోనా!
క్యా హాల్‌ హువా హై సప్‌నోఁ కా ఆరే సోచోనా!
హర్‌ మాఁ కీ ఛాతి సిసక్‌ రహీ హై ఆరే దేఖోనా!
సుహాగ్‌ లుా హై బెహ్‌నోఁ కా అరే సోచోనా!

నేటి ఈ ప్రాణాపాయ, ప్రమాదకర ప్రవాహాన్ని నిలువరించి నియంత్రిం చక పోతే ఈ చీకటి శక్తుల చేతులో మనం సయితం బలి కాక తప్పదు. ఈ దేశం ఆ దేశం అన్న తేడా లేకుండా విశ్వ వ్యాప్తంగా ఉన్న విశ్వాసుల కు, శాంతి కాముకులకు, సత్య ధర్మ ధ్వజవాహకులకు ఇవి ఇలాంటి ఇతర సంఘటనలు కొత్త ఏమి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇంత కన్నా బలంగా అధికార ఉన్మత్తతతో ఉన్నాదులుగా, ఉగ్రవాదులుగా వ్యహ రించిన, వ్యవహరిస్తున్న దాఖలాలు కోకొల్లలు. నాడు గానీ, నేడు గానీ ఈ ప్రతిఘాతకులకు, ప్రగతి శత్రువులకు వారి వద్ద ధనం ఉందనీ, అధికా రం ఉందనీ, వారు స్వగృహంలో నెయ్యితో దీపాలు వెలిగించి బయట మారణ హోమంతో చలి కాచుకుంటున్నారని, అమాయక ప్రజల శవాల మీద రాజకీయ జూదమాడుకుంటున్నారని భయపడి ఉంటే నేడు ప్రపం చం ఈ ప్రగతిని చూసి ఉండేది కాదు. ఎన్ని హంగులు, ఆర్భాలు చేసినా చీకటి ఎన్నడూ గెలిచింది లేదు, అంతిమ విజయం మాత్రం వెలుగుకే. కాబట్టి సహనం కరువయిన ఈ సమాజాన్ని గొప్ప సహిష్ణుత, సామరస్యం గల సమాజంగా మార్చడానికి పూనుకోవాలి. అసహానికి, అసంతృప్తికి లోనయిన ఆత్మల్ని తట్టి లేపి వారి ఆంతర్యంలో పేరుకు పోయిన మత జాఢ్య బూజును దులిపి, సాటి మనిషిని అర్థం చేసుకునే తత్వాన్ని నింపాలి.

ఎందరో ఉండగా వారెవరికీ పట్టని ఈ సంస్కరణ అవసరం మాకేంటి? అని కొందరు ప్రశ్నించవచ్చు. పెక్కు మంది ప్రజలు మీకులాగా విద్యావంతులు కారు. ముంచుకు రాబోత్ను ప్రమాదాన్ని మీరు గ్రహించినంతగా వారు గ్రహించ లేరు. కుమతులు, కుత్సిత బుద్ధి, కుటిల నీతిపరులు ఎలా ఉంటారో? ఏం చేెస్తారో వారికి తెలియదు. అలాంటి వారి రాతారీతుల పట్ల కూలం కషంగా తెలిసిన విద్వావంతులయిన మనమే చేతులెత్తేస్తే నేటి మన మౌనం భావి తరాలకు వీడని శాపంగా పరిణమిస్తుంది. ‘చీకటి తొలగక ముందే చెడు చేసెయ్యాలి’అన్నది వారి ఎత్తుగడే అయి ఉండొచ్చు గాక, దీపం ఉండగానే మనం మాత్రం ఇల్లు చక్క బెట్టుకోవాలి. పరిస్థితులు మరింత విషమించక ముందే ‘గోరంత ఆలస్యం కొండంతి నష్టానికి దారి తీస్తుంద’న్న స్పృహతో మేధావులు, ఆలోచనాపరులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు భాష, ప్రాంత, కుల, మత బంధనాలను అధికమించి ఇప్పటికే వారి నిరసన గళాన్ని వారికి చేతనయిన పద్దతిలో తెలియజేస్తున్నారు. చరిత్రను చదివిన మనం సయితం మనవంతు కృషిగా వారికి బాసటగా నిలచి ధర్మం నాలుగు పాదాల నడిచేలా, యావత్తు ప్రపంచం గర్వించే మార్పుకి శ్రీకారం చుట్టాలి. నేడు మొత్తం ప్రపంచం మన వైపే చూస్త న్నది, మనల్ని ప్రశ్నిస్తున్నది.

భూల్‌ గయే హో కరమ్‌కో అప్నే కైసే భారత్‌ వాసీ హో?
భూల్‌ గయే గాంధీ కె సప్నే కైసే భారత్‌ వాసీ హో?
గైర్‌ హువె హైఁ సారె అప్నే కైసే భారత్‌ వాసీ హో?

Related Post