ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎందుకు అనుసరించాలి?

Originally posted 2014-05-15 20:32:48.

 

అవతరించినదాన్నే అనుసరించమని ఆయనకు ఆజ్ఞ

వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, మమ్మల్నికలిసే నమ్మకం లేనివారు ”ఇది తప్ప వేరొక ఖుర్‌ఆన్‌ను తీసుకురా లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి” అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకే మాత్రం లేదు. నా వద్దకు ‘వహీ’ ద్వారా పంపబడే దానిని నేను(యధాతథంగా) అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే ఒక మహాదినమున విధించబడే శిక్షకు భయపడుతున్నాను.” ”అల్లాహ్‌ కోరితే దీన్నినేను మీకు చదివి వినిపించటంగానీ, అల్లాహ్‌ దాని గురించి మీకు తెలియజేయటంగానీ జరిగి ఉండేదే కాదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను నా జీవితకాలంలో ఓ పెద్దభాగం మీ మధ్యనే గడిపాను. అసలు మీరు బుద్ధిని ఉపయోగించరా?” అని అడుగు.
సూరా యూనుస్ 10:15 ,16

(ఓ ప్రవక్తా!) బహుశా నీ వద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్నివదలివేస్తావేమో! ”ఇతనిపై ధనాగారం ఎందుకు అవతరించలేదు? పోనీ, ఇతనితోపాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు?” అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి.చూడు! నువ్వు భయపెట్టే వాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లాహ్‌.

ఏమిటీ, అతనే (ప్రవక్తే) ఈ ఖురానును కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? ”మరైతే మీరు కూడా ఇలాంటి పది సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే, అల్లాహ్‌ను తప్ప మీరు పిలువగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి” అని(ఓప్రవక్తా!) వారికి చెప్పు.

మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే, ఈ ఖుర్‌ఆన్‌ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందనీ, ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేనేలేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లింలవుతారా?
సూరా హూద్ 11:12-14

వారికి చెప్పు: “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (రేపు) నా పట్లా, మీ పట్లా జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలీదు. నా వద్దకు పంపబడిన సందేశాన్ని(వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.” సూరా ఆహఖాఫ్ 46:9

ఆయన్ని విశ్వసించాలని అజ్ఞ

అల్లాహ్‌ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ”నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి” అని చెప్పాడు. తరువాత ఆయన, ”ఈ విషయాన్నిమీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?” అని ప్రశ్నించగా, ”మేము ఒప్పుకుంటున్నాము” అని అందరూ అన్నారు. ”మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతో పాటు నేనూ సాక్షిగా ఉంటాను” అని అల్లాహ్‌ అన్నాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3:81

సాక్షిగా, శుభావార్తాహరునిగా, హెచ్చరికచేసేవారుగా పంపబడ్డారు

అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించరాదు (అని వాటిలో చెప్పబడింది). నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని. సూరా హూద్ 11:2

”నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే” అని వారికి చెప్పు. సూరా అల్ హిజ్ర్ 15:89

(ఓ ముహమ్మద్‌ – సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవుకావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.
సూరా ఆష్ షుఅరా 26:194

ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకుని) సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. సూరా అల్ ఆహ్ జాబ్ 33:45

(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు. సూరా నబా 34:28

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. సూరా అల్ ఫత హ్ 48:8

విశ్వాసుల సాక్షి

అదే విధంగా మేము మిమ్మల్ని ఒక ”న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్‌)గా చేశాము- మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త(సల్లల్లాహుఅలైహివసల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలోఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగిపోయేవారో తెలుసుకునే(పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ ‘ఖిబ్లా’గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్‌ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్‌ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్‌ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమకృపాశీలుడు.
సూరా అల్ బఖర 2:143

కేవలం హెచ్చరించేవారు మాత్రమే

ఏమిటీ, తమ సహవాసిపై ఏమాత్రం ఉన్మాద ప్రభావం లేదన్నవిషయాన్ని గురించి వారు ఆలోచించలేదా? అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే (అతను ఎంత మాత్రం ఉన్మాది కాడు).
సూరా అల్ ఆరాఫ్ 7:184

(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: ”అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించేవారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” సూరా అల్ ఆరాఫ్ 7:188

అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించరాదు (అని వాటిలో చెప్పబడింది). నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని. సూరా హూద్ 11:2

”నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే” అని వారికి చెప్పు. సూరా హిజ్ర్ 15:89

ఈయన పూర్వం హెచ్చరించిన ప్రవక్తల మాదిరిగానే హెచ్చరించే ప్రవక్త. సూరా అన్ నజ్మ్ 53:56

మఖామమ్ మహముదా (కీర్తించబడిన స్థానం) గలవారు

రాత్రిపూట కొంత భాగం తహజ్జుద్‌ (నమాజు)లో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను”మఖామె మహ్‌మూద్‌”కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు. సూరా బనీ ఇస్రాయీల్17:79

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు పూర్వం ప్రపంచం ఎలా ఉండేది

అంధకారం నుంచి వెలుగు వైపుకు తీసుకువస్తారు

అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను)చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేoదుకు ఒక ప్రవక్తను పంపాడు . మరేవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచారణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు . నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమ ఉపాధిని వొసాగాడు. ( సూరె అత్ తలాఖ్ 65 :11 )

ప్రముఖ ముస్లిమేతరులు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమన్నారు
మైఖేల్ హె చ్ ఆర్ట్

నేను ప్రపంచంలోని అత్యంత ప్రభావ శీల వ్యక్తుల్లో ముహమ్మద్ ప్రవక్త కు మొట్టమొదటి ప్రాధాన్యత నివ్వడం కొంత మంది పాఠకులకు కొంత ఆశ్చర్యమూ, మరికొంతమందికి ప్రశ్నార్తకము కావచ్చు. కాని చరిత్ర మొత్తంలో ఈ ఒక్క వ్యక్తీ మాత్రమే ఆధ్యాత్మికంగాను,లౌకికంగాను మహోన్నతమైన,అపూర్వమైనా విజయాలు సాధించారు. ఆయన వ్యక్తిత్వం చరిత్రలో ఎవరికి సరిపోలనిది కావడం మూలంగానే ఆయన్ని నేను అత్యంత ప్రభావశీల ఏకైక వ్యక్తిగా భావిస్తున్నాను

అనిబిసెంట్ (ది లైఫ్ టీచింగ్స్ అఫ్ ముహమ్మద్)

ఆరేబియాకు చెందిన ఆ గొప్ప ప్రవక్త గురించి అధ్యయనం చేసిన వారికి , ఆయన ఎలా భోధించారో ఎలా జీవించారో,తెలిసిన వారికి ఆయన పట్ల ఆదరభావం తప్ప మరో భావం కలగడం ఆసాధ్యం. ఆయన మహోన్నత ప్రవక్త. ప్రభువు పంపిన గొప్ప సందేశహరులలో ఒకరు . నేను మీ ముందు ఉంచుతున్న వాటిలో చాలా విషయాలు మీకు తెలిసే ఉంటాయని నేను అనుకుంటాను. అయినా నా అనుభవం ఏమిటంటే ఆ విషయాలను నేను పునరధ్యాయనం చేసినప్పుడల్లా మహానీయుడైనా ఆ అరబ్బు భోదకుని పట్ల ఓ క్రొత్త ప్రశంసా భావం ఓ క్రొత్త ఆదరభావం ఏర్పడుతుంది నాలో.

ప్రో రామకృష్ణ రావు మైసూర్ (యూనివర్సిటిలో తత్వశాస్త్రంలో రిటైర్డ్ ప్రొఫెస్సర్)

ముహమ్మద్ ప్రకటించిన విశ్వజనీన సోదరత్వ సిద్దాంతం, మానవ ఏకత్వపు భావన, మానవాళి సామాజిక ప్రగతి కొరకు ఆయన అందజేసిన గొప్ప వర ప్రసాదాలు. ఈ ధర్మాలను ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ భోధించాయి. కాని,ఇస్లాం ప్రవక్త ఈ సిద్దాంతాలను వాస్తవ ఆచరణలో పెట్టారు. అయితే దాని విలువను మానవాళి బహుశ ఇకపైనే గుర్తించగల్గుతుంది. అంతర్జాతీయతా స్ఫూర్తి జాగృత మయినప్పుడు, పటిష్టమయిన మానవ సౌబ్రాత్రభావన ఉనికిలోనికి వచ్చినప్పుడు, దీనికి గుర్తింపు లభిస్తుంది.

లా మార్టిన్ హిస్టోరి డి లా టర్కీ ఫారిస్ 1854 vol.II PP 276-77

ఈ సిద్దాంతంలో రెండు అంశాలున్నాయి. దేవుని ఏకత్వం, దేవుడు నిరాకారుడన్న భావం. మొదటిది దైవమేంటో తెల్పుతుంది. రెండవది దేవుడు ఏమికాడో తెల్పుతుంది. ఒకటేమో మిధ్యా దేవుళ్ళను పడదోస్తే రెండవది మాటలతో భావాన్ని నిర్మిస్తుంది. తత్వవేత్త ఉపన్యాసకుడు, మత ప్రచారకుడు, శాసనకర్త, యుద్దవీరుడు, భావాల విజేత హేతుబద్ధ సిద్దాంతాలు, విగ్ర రహిత మత విధానాల నిర్మాత, ఇరవై ఇహలోక సామ్రాజ్యాలు, ఓ ఆధ్యాత్మిక సామ్రాజ్య ఆవిష్కర్త ఆయనే ముహమ్మద్, మానవుని ఔన్నాత్యానికి సంబంధించిన అన్ని ప్రమాణాలతో కొలిచి, ఆయన్ను మించిన వారెవరన్నా ఉన్నారా? అని మనం ఆశ్చర్యపోతాం!

మేధావి అన్నాదోరై (మద్రాసు నగరంలో మహానగర తీరాన)

మన సమాజంలో వివేకాన్ని మేలుకొలువ వలెనని మాలాంటి వారు హెచ్చరించినపుడు, మమ్మల్ని తరిమి తరిమి కొట్టి దూరంగా పొమ్మంటున్నారు. అయితే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం , రకరకాల దేముళ్లను, పలు దేవతా విగ్రహాలను పూజించే టటు వంటి ప్రజలకి-“నువ్వు మొక్కవలసినది ఈ విగ్రహానికి కాదు, నువ్వు వెల్ల వలసింది ఈ కోవెలకు కాదు “అని చెప్పగల గుండె ధైర్యంతో, అందులోనూ అటువంటి మోటు మనుషులకి తమ సందేశాన్ని, ఆత్మస్థైర్యంతో సిద్దాంత పూర్వకంగా చెప్పగలిగారు. అందుకనే ఆయనని మహోన్నత వ్యక్తీ అని గౌరవించి , అభిమానిస్తున్నాను. ఆనాడు మహా ప్రవక్త ప్రేరణ వల్ల కలిగిన ఆత్మ బలం, ఇప్పుడు, ఈనాడు ఆ మార్గం స్వీకరించిన వారికి కూడా వున్నదీ అంటే- అందుకు ఆశ్చర్యపడనక్కర లేదు

Related Post