ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిందూ మత గ్రంథాలలో

Originally posted 2016-05-15 11:32:42.

muhammad-in-vedas

ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవారై యుంటారు ఒక మ్లేచ్చుడు (నిరక్ష్యరాస్యుడు) పరదేశస్తుడైన ఒక భోదకుడు తన శిష్యులతోపాటు పాటు వస్తాడు. ఆయన పేరు ముహమ్మద్.భవిష్య పురాణం ప్రతి సర్గ పర్వం ౩: అధ్యాయం ౩ ఖాండం ౩ శ్లోకం 5-8

హిందూ మత గ్రంథాలను రెండు విధాలుగా విభజించవచ్చు మొదటిది శృతి రెండవది స్మృతి. (శృతిదైవం యొక్క మూలానికి చెందినదిగా భావిస్తారు)శృతిఅనగా దేవుని దగ్గర నుంచి అవతరించినవి. స్మృతి అనగా దైవజ్ఞానంతో మనిషి భోధించిన విషయాలు (స్మ్రుతిఅనగా మనిషితయారు చేసి భోధించిన విషయాలు).
శృతి లోని వివిధ పుస్తకాలు: ధార్మిక గ్రంథాలైన వేదాలు. అరణ్యకాస్,బ్రాహ్మణస్,ఉపనిషత్.

స్మృతి లోని వివిధ రకాల పుస్తకాలు: పురాణాలు,ఇతిహాసాలు అవి రామాయణo మరియు మహాభారతం. అలాగే మనుస్మృతి ఈ పుస్తకాలను హిందువులు విశ్వసిస్తారు.

ఋగ్వేదంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

సంస్కృతి పదం సుశర్మ. దీని అర్థం పొగడబడేవాడు. దీనిని అరబీలో తెలుసుకుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అర్థం. ఋగ్వేదం అధ్యాయం1, సూక్తం 53, మంత్రం 9

సామవేదంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
అహ్మది పితూహు పరమేధా మృతస్య జాగ్రణి అహం సూర్యో ఇవాజన:
అహ్మద్ అనే అతను తన ప్రభువు నుండి ధర్మశాస్రం(ఖుర్ ఆన్ )ను పొందారు. ఆయన ప్రవక్తలకు తండ్రి లాంటి వాడు. ఆ ధర్మశాస్త్రం ఎంతో జ్ఞానపూరితమైనది సూర్యుని కాంతిలాగా ఆయన వెలుగును పొందాడు. సామవేదం ప్రతి సర్గం అధ్యాయం 6 , మంత్రం 8

భవిష్య పురాణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

ఏతన్ మినస్తరే మ్లేచ్చ ఆచార్య సమన్వితః

మహామద ఇతిఖ్యాతః శిష్యశాకా సమన్వితః

సృపశ్చేవ మహామద ఇరుస్తల నివాసినిమ్.

ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవారై యుంటారు ఒక మ్లేచ్చుడు (నిరక్ష్యరాస్యుడు) పరదేశస్తుడైన ఒక భోదకుడు తన శిష్యులతోపాటు పాటు వస్తాడు. ఆయన పేరు ముహమ్మద్.భవిష్య పురాణం ప్రతి సర్గ పర్వం ౩: అధ్యాయం ౩ ఖాండం ౩ శ్లోకం 5-8

ఆయనను మానవాళికి గర్వకారణ౦గా సూచిస్తారు.

ఆయనచెడునిఅంతమొందిస్తాడు.మరియుబహుదైవారాధననుఅంతమొందిస్తాడు.

ప్రవక్తకుశత్రువులనుంచి రక్షణఇవ్వబడుతుంది.

భాగవత పురాణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

ఆయన(సఅసం)కు 8 మంచి గుణాలు ఉండేవి,ఐశ్వర్యవంతుడు, గుర్రపుస్వారీ చేసేవాడు,కత్తితో యుద్ధం చేసేవాడు. ప్రపంచానికి ఒక రక్షకుడుగా పంపబడ్డాడు. ఆయన ఎటువంటి తుపాకీ లను, అణుబాంబులను వాడలేదు.భాగవత పురాణం 12:2:29

1.నరాశంస: అనగా ప్రశంసించబడే వాడు అనే ప్రస్తావన కూడా వుంది. ఋగ్వేదం – 1:13: 3, యజుర్వేదం – 29:27

ముగింపు

పైన తెలిపిన ఆధారాలను మనం గమనిస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి కోసం మార్గదర్శకంగా పంపబడ్డాడు.

అల్లాహ్ సుబ హానహు వత’ఆల ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు:

ఎవరైనా ఇస్లాం ను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయేవారిలో చేరిపోతాడు.ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:85

Related Post