Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

అజాన్‌ సందేశం

ఓ మానవుల్లారా! ఆయనే ఆది ఆయనకు ముందు ఏదీ లేదు. ఆయనే అంతం ఆయన తర్వాత ఏదీ ఉండదు. ఆయనే బాహ్యాం ఆయనకు మించింది ఏదీ లేదు. ఆయనే నిగూఢం ఆయన తప్ప ఏదీ లేదు. ఆయనే సర్వ శుభాలకు నిలయం. ఆయనే సర్వ శక్తులకు మూలం.

ఓ మానవుల్లారా! ఆయనే ఆది ఆయనకు ముందు ఏదీ లేదు. ఆయనే అంతం ఆయన తర్వాత ఏదీ ఉండదు. ఆయనే బాహ్యాం ఆయనకు మించింది ఏదీ లేదు. ఆయనే నిగూఢం ఆయన తప్ప ఏదీ లేదు. ఆయనే సర్వ శుభాలకు నిలయం. ఆయనే సర్వ శక్తులకు మూలం.

మనలో అజాన్‌ పలుకులు వినని వారు ఎవరుంటారు చెప్పండి! దివారాత్రుల్లో అయిదు సార్లు మనం అజాన్‌ పలుకుల్ని వింటున్నాము. నిజం చెప్పాలంటే విశ్వం మొత్తంలోని విశ్వాసులు అన్ని పలుకులకన్నా అధికంగా అజాన్‌ పలుకుల్నే వింటారు. ఆ విషయానికొస్తే ప్రపంచంలో ప్రతి ఘడియ మారుమ్రోగుతున్న ఏకైక శబ్దం అజాన్‌ అణి అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది. ఓ చోట ఫజ్ర్‌ అజాన్‌ అయితే, మరో చోట జుహ్ర్‌ అజాన్‌, ఇంకో చోట అస్ర్‌ అజాన్‌…జగతి మొత్తం అజాన్‌మయం.

అజాన్‌ పరమార్థం:

అల్లాహ్‌ మహా వివేకి. అజాన్‌ పలుపు ఇతర సముదాయాల మాదిరి కేవలంఓ పిలుపు, లేదా హెచ్చరికలా మాత్రమే ఉండకూడదని, అజాన్‌ పిలుపు ఇస్లాం ధర్మ పరిచయంలా ఉండాలని, అది ఆరాధనా రూపంగా కూడా ఉండాలని అజాన్‌ పలుకుల్ని నిర్దేశించాడు. ఇస్లామీయ ఆచరణల కు ముఖ్య ప్రాతిపదికలు – తౌహీద్‌, రిసాలత్‌, ఆఖిరత్‌. ఈ మూడు మూలాంశాలు ఇస్లాం ధర్మానికి పునారాళ్ళు. ఈ మూడు మౌలికాంశాలు మనకు అజాన్‌ రూపంలో వశ్వ వ్యాప్తంగా రోజుకి ఐదు సార్లు వినిపిస్తాయి.

నా పేరు నేరెళ్ళ రాజశేఖర్‌ మాది సనాతన క్రిష్టియన్‌ సంప్రదాయ కుటుంబం. మా సొంత ఊరు కర్నూలు జిల్లా చాగల మర్రి మండలం, చింతలచెరువు గ్రామం. , నవ యువకులలో ఉండే అన్ని లక్షణాలు వీరిలో ఉన్నా నమాజు సమయం కాగానే వీరందరూ మసీదుకు వెళ్ళేవారు. కానీ వీరిలా రోజూ 5 పూటల ప్రార్థన నా ఊహకందని విషయం. నాలో అలజడి మొదలయినది. ఎందుకంటే ఎంతో చిలిపిగా, ఉల్లాసంగా, జాలిగా గడిపే సమయంలో అజాన్‌ వినబడగానే వీరి ప్రవర్తన మారి పోయేది. ఏదో శక్తి వీరిని కమాండ్‌ చేస్తున్నట్లు నన్ను ఒంటరిగా వదిలేసి మసీదుకు వెళ్ళి పోయేవారు. ”ఇస్లాంలో నమాజుకు ఇంత ప్రాధాన్యత ఉందా? ఏ శక్తి వీరిని ప్రార్థన సమయంలో ప్రాపంచిక విషయాల నుండి ప్రార్థనా మందిరానికి తీసుకొని వెళుతు న్నది?” అన్న చింతన నాలో చిగుళ్ళు పోసు కుంది. మా ఇల్లు మసీదు కు ఆనుకునే ఉండేది. ప్రతి అజాను పిలుపు నాలో ఏదో అలజడి రేపేది. క్రమంగా సకల లోకాల సృష్టికర్త ఒక్కడే అని సృష్టికర్త నామమునే హృదయంలో ఆరాధించే స్థితికి చేరుకున్నాను. అయితే నా ఆరాధనకు రూపు లేఖలు లేవు. తర్వాత కొంత కాలానికి మిత్రుడు ఉమర్ సకుటుంబ సపరివారి సమేతంగా ఇస్లాం స్వీకరించాడు. ఇలాంటి గాధలు ఎన్నో! అయితే ఇంత ప్రభావం గల ఈ ఈ అజాన్‌ పలుకుల అర్తం ఎంత మందికి తెలుసు?

ఈ పలుకులు అరబీ ఉండటం చేత అనేక మంది ముస్లిమేతర సోదరులు అపోహకు గురయి ఉన్నారు. ముస్లింలు అక్బర్‌ చక్రవర్తిని దైవంగా కొలుస్తారా? ‘అక్బర్‌’ని అల్లాహ్‌కు సమానంగా భావిస్తారా? అకర్‌నే అమతగా స్తుతిస్తారెందుకు? అన్న సందేహం కొందరిది. నిజానికి ఈ భావన సరి కాదు. అక్బర్‌ అంటే మహోన్నతుడు, గొప్పవాడు. అల్లాహు అక్బర్‌ అంటే, అల్లాహ్‌ ఘనాఘనుడు అని అర్థం. అవగాహనా రాహిత్యంగా కబీర్‌ దాస్‌ చెప్పిన మాట కూడా గమనార్హం – ‘కంకర్‌ పత్థర్‌ జోడ్‌కె మస్జిద్‌ నయీ బనాయ్‌, తాఛడి ముల్లా బాంగ్‌దె కా ్య బహిరా హువా ఖుదాయ్‌’ రాళ్ళు, రప్పలు పేర్చి మస్జిద్‌ ఓ కొత్తది కట్టారు. ముల్లా కేకలు పెడుతున్నాడే, దేవుడేమయినా చెవిటి వాడా?. (అల్లాహ్ క్షమించుగాక!) అంటే అతని ఉద్దేశ్యంలో ముస్లింలు అజాన్‌ ద్వారా అల్లాహ్‌ను పిలుస్తారు అని. నిజానికి అజాన్‌ పిలుపు ద్వారా ప్రజలను ‘అల్లాహ్‌ ఆరాధన వైపునకు రండి’ అని పిలవడం జరుగుతుంది.

అల్లాహు అక్బర్‌ అని అజాన్‌లో 6 సార్లు పలకడం జరుగుతుంది. ఈ పలుకు ప్రతి రోజు పూర్వ సంద్యా సమయంలో సమస్త మానవాళిని సంబోధిస్తుంది. అ సమయం ఎలాంటి అంటే, సూర్యున్ని పూజించాలనుకున్న వాళ్లు దాని కోసం సమాయత్తమవుతుంటారు. విగ్రహాలను కొలిచేవారు వాటిని కొలిచేందుకు సిద్ధమవుతుంటారు. పదార్థ పూజారులు వారి ప్రయోజనాలకై ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. నిజమయిన అల్లాహ్‌ా దాసులు ఫజ్ర్‌ నమాజు కోసం సమాయత్తమవుతుంటారు. ఆ సమయంలో ఫురించబడే సత్య శంఖం అజాన్‌. మీరు భావిస్తున్న సూర్యాచంద్రనకత్రాలు దైవం కాదు, మీరు భ్రమిస్తున్న విగ్రహప్రతిమలు దైవం కాదు. మీరు ప్రాకులాడుతున్న మీ కోరికలు, ఐహిక వాంఛలు దైవం కాదు. అల్లాహ్‌ా ఒక్కడే నిజ ఆరాధ్యుడు. ఓ మానవుల్లారా! ఆయనే ఆది ఆయనకు ముందు ఏదీ లేదు. ఆయనే అంతం ఆయన తర్వాత ఏదీ ఉండదు. ఆయనే బాహ్యాం ఆయనకు మించింది ఏదీ లేదు. ఆయనే నిగూఢం ఆయన తప్ప ఏదీ లేదు. ఆయనే సర్వ శుభాలకు నిలయం. ఆయనే సర్వ శక్తులకు మూలం. ఆయనే కీర్తికి అసలు కారకడు. ఆయనే విశ్వ సామ్రాజ్యాధికారి. తాను తలచిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు, తాను తలచి వారి నూమడి రాజ్యాధికారాన్ని ఊడబెరుకుతాడు. తాను తలచిన వారికి కీర్తి శిఖరాలపై కూర్చోబెడతాడు, ఆతను తలచివారిని అప్రతిష్ట అడుసు పాల్జేస్తాడు. అందరూ దీనులే ఆయన ప్రసాదించిన వారు తప్ప, అందరూ నగ్నులే ఆయన తొడిగించినవారు తప్ప. అందరూ ఆకలిగొన్నవారే అయన తినిపిం చినవారు తప్ప. సృష్టి మొదలు నేటి వరకు, నేడు మొదలు ప్రళయం వరకు వచ్చిన, ఉన్న, రాబోవు వారందరూ కలిసి ఆయన్ను ఆరాధించే గొప్ప భక్తునిలా మారిపోయినా ఆయన ఘనాఘనుడే, ఆందరూ కలిసి పరమ నీచునిగా మారిపోయి ఆయన్ను ఆరాధించడం మానేసినా ఆయన ఘనాఘనుడే. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ – నిశ్చయంగా అల్లాహ్‌ తప్ప మరో నిజ ఆరాధ్యుడెవడూ లేడు.

సృష్టిలో ప్రతి ప్రాణీ, అది భౌతికంగా కనిపించేద అయినా, కనిపించనిదయినా, సూర్యచంద్ర నక్షత్రాలయినా, సముద్రాలు, అరణ్యాలు, అండ పిండ బ్రహ్మాండాల్లోని అనువణువు ఇచ్చే సాక్ష్యం అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడు అని. అవన్ని ఆయనే ఆజబద్ధులయి జీవిస్తున్నాయి. కాబట్టి వాటి మధ్యన ఘర్షణ లేదు. ఆ దృష్ట్యా అన్నీ ముస్లిములే. మనిషి ఈయాదార్థాన్ని విస్మరించిన కారణంగానే అధోగతికి పాలవుతున్నాడు, అశాంతి, అలజడులకు కారణం అవుతున్నాడు. సృష్టికి కర్త ఒక్కడే అని మనిషి అంగీకరిమచి ఆయన ఆధెశానుసారం జీవించిన నాడు అతని కావాల్సిన మానాసిక శాంతి, పరలోక మోకం రెండూ ప్రాప్తిస్తాయి. అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్ల్లాహ్‌: నిశ్చయంగా ముహమ్మద్‌ (స) అల్లాహ్‌ ప్రవక్త అని నేను సాక్యమిస్తున్నాను.

నిజ ఆరాధ్య దైవం అల్లాహ్‌ ఒక్కడే అని తెలుసుకున్న తర్వాత ఆభీష్టం ఏమిటి. ఆయనకు ఇష్టం లేనిది ఏమిటి? ఆయన్ను ఎలా ఆరాధించాలి? అన్న తదితర ప్రశ్నలకు సమాధానమే ఇది. ఈ నిమిత్తమే అల్లాహ్‌ ఒక లక్ష 24 వేల మంది దైబప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. ఆ పరంపరలో చిట్ట చివరివారు ముహమ్మద్‌ (స). ఆయన వచ్చింది మొదలు అంతిమ దినం వరకూ మానవాళి మొత్తానికి ఆయనే ఆదర్శం. ఈ రెండు సాక్య వచనాలు పలికే ఓ వ్యక్తి ఇస్లాం స్వీకరిస్తాడు. హయ్యా అలస్సలాహ్‌- నమాజు వైపునకు రండి! విశ్వాసం అంటే ఖవలుమ్‌ బిల్లిసాన్‌ అ తస్‌దీకూమ్‌ బిల్‌ జినాన్‌ వ అమలుమ్‌ బిల్‌ అర్కాన్‌. విశ్వాసం అంటే నోటి పలకడం, మనసుతో అంగీకరించడమే కాదు, దానికనుగుణంగా మన క్రియా జీవితం రూపొందాలి. అందులో మొదటి ఆచరణే నమాజు. అంటే మనం మన నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ను, ఆయన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి సున్నతు ప్రకారం ఆరాధించాలి. హయ్యా అలల్‌ ఫలాహ్‌: సాఫల్యాం వైపునకు రండి! సాఫల్యం- ఆస్తుల్ని కూడబెట్టడంలోనూ, మరే ఇతర ప్రాపమచిక విషయాలలోనూ లేదు. అది కేవలం అల్లాహ్‌ దాస్యంలోనే ఉంది. వీటితోపాటు ఫజ్ర్‌ అజాన్‌లో హయ్యా అలల్‌ ఫలాహ్‌ తర్వాత అస్సలాతు ఖైరుమిమ్మనన్‌ నౌమ్ – నిద్రకన్నా నమాజు గొప్పది. మేల్కొని ఉన్న స్థితిలో అంటారా, పనికన్నా గొప్పది, పరివారానికన్నా గొప్పది. మనకు సంబంధించిన ప్రతి దానికన్నా గొప్పది. అ తర్వాత తౌహీద్‌ పలుకులతో ప్రారంభమయిన అజాన్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అన్న తౌహీద్‌ పలుకులతోనే సమాప్తం అవుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే అజాన్‌ ఇస్లాం సందేశాన్ని సమస్త మానవాళికి చేరవేయాకలన్న సంకేతం మనకు రోజుకు అయిదు సార్లు అందిస్తుంది, ఇక మనం ఎమతగా స్పదిస్తున్నామో మనలో నిప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా బేరీజు వేసుకోవాల్సిన విషయం. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినా, నిర్వర్తించక పోయినా అజాన్‌ తన పని తాను చేసుకుపోతుంది. విశ్వ మానవాళికి విశ్వకర్త సదేశాన్ని నిర్విరామంగా, నిర్విఘ్నంగా చేరవేస్తూనే ఉంటుంది. సత్యార్తి గల గుండెల దప్పికను అది తీరుస్తూనే ఉంటుంది.

Related Post