మనిషి నిజదైవాన్ని గుర్తించాలి

మనిషి తన ప్రభువు విషయంలో మోసానికి గురయ్యాడు. తనను పుట్టించిన దైవాన్నే నిరాకరించాడు. సృష్టితాలను దైవాలుగా భావించి ఆశ్రయించాడు. వాటీ ముందర తల వంచుతున్నాడు. మనిషి తాను స్వతహాగా ఉనికిలోకి రాలేదని అతని ఉనికే చెబుతోంది. అతని తల్లి దండ్రులూ,అతన్ని రూపొందించలేదని, పంచభూతాలు యాదృఛ్చి కంగా కలవడం చేతనూ అతను పుట్టలేదని అతని రూపమే సాక్షమిస్తోంది.

మనిషి నిజదైవాన్ని గుర్తించాలి

ఈ మనిషి ఏమరుపాటుకు గురయి, తన కారుణ్య ప్రభువునే కాదంటున్నాడు. సృష్టితాలను దైవాలుగా నమ్మి ఆశ్రయిస్తున్నాడు.

వాస్తవం ఏమిటంటే, ఓ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడయిన దైవం అతన్ని పరిపూర్ణ మానవాకారంలో నిర్మించాడు. ఉత్తమమయిన రీతిలో అతన్ని మలిచాడు. ఇతర ప్రాణులతో పోల్చి చూస్తే, అందమ యిన అతని రూపం, అతనిలోని మహత్తర శక్తులు ప్రత్యేకంగా కనబడ తాయి. వాటిని చూసి కృతజ్ఞతా భావంతో అతని తల వంగి పోవల సింది. అతనికి ఈ ఉనికినీ, ఈ స్థితినీ ప్రసాదించిన వాని ఉపకారాన్ని గుర్తించ వలసింది. ఆయన అనుగ్రహించిన మేళ్ళను గుర్తించి ఆయన కు కృతజ్ఞుడయి, విధేయుడయి ఉండవలసింది. కాని ఈ మనిషి ఏమరుపాటుకు గురయి, తన కారుణ్య ప్రభువునే కాదంటున్నాడు. సృష్టితాలను దైవాలుగా నమ్మి ఆశ్రయిస్తున్నాడు. ఉదార స్వభావుడ యిన అల్లాహ్‌ పిలుస్తున్నాడు:

”ఓ మానవుడా! ఉదాత్తుడయిన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? (యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు. నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు. ఆపైన నిన్ను తగురీతిలో సముచితంగా మలిచాడు. తాను కోరిన ఆకారంలో నిన్ను రూపొందించాడు”. (అల్‌ ఇనఫితార్‌ 6-8)

మనిషి తన పుట్టుకను గురించి ఆలోచించాలి!

మనిషి తన వాస్తవికతను గురించి కాస్త గమనించాలి. కాని గమనిం చడం లేదు.తాను ఎలా పుట్టాడు? ఏ పదార్థం ద్వారా ఉనికిలోకి వచ్చాడు? ఎలాంటి నిస్సహాయ స్థితిలో భూమి మీద అతని జీవితం ప్రారంభమయింది? ఈ విషయాలను గురించి అతను ఆలోచించాలి. తన మూల వాస్తవికతను తెలుసుకోవాలి. మనిషి మాతృ గర్భంలో ఉన్నప్పుడే అతని లింగమేమి? అతని రూపు రేఖలు ఎలా ఉండాలి?

అతని రంగు ఏది? అతని ఎత్తు ఎంత?అతని శరీర దారుఢ్యం ఎలా ఉండాలి? అతని అవయవాలు ఏ మేరకు సవ్యంగా సంపూర్ణంగా ఉండాలి? అతని శరీర నిర్మాణంలో ఎంత వరకు లోపాలు ఉండాలి? అతని శారీరక శక్తి ఎంత? అతని మానసిక సామర్థ్యాలెన్ని? ఏ భూ భాగంలో ప్టుాలి? ఏ కుటుంబంలో ప్టుాలి? ఎలాిం వాతావరణం లో పెరగాలి? ఎక్కడ శిక్షణ పొందాలి? అతను ప్రపంచంలో ఎంత కాలం బ్రతికుాండు?ఈ అంశాలన్నీ అతని ఇష్టాయిష్టాలతో ఎలాిం ప్రమేయం లేకుండానే నిర్ణయమవుతాయి. నిర్ణయమయి పోయిన తరువాత అతను ఎలాిం మార్పూ చేర్పూ చెయ్య లేడు.

అంతే కాదు మనిషి తన ఇష్టంతో పుట్టనూ లేడు, తన ఇష్టంతో గిట్టనూ లేడు.అతను ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తాడు? అతనికి ఎలాంటి గోరీ నిర్ణయమయి ఉంది? అతను భూగర్భంలో సమాధి చేయ బడతాడా? లేదా సముద్రపు లోతు అతని సమాధి అవుతుందా? అగ్ని గుండంలో కాలి బూడిద అవుతాడా? లేదా క్రూరమృగం కడుపు అతని గోరీ అవుతుందా? అతనికే తెలియదు. అయితే అతని సాహ సం చూడండి. ఏ శక్తి సమక్షంలోనయితే అతను ఇంతగా నిస్సహా యుడో,అశక్తుడో ఆ శక్తినే తిరస్కరిస్తున్నాడు. తొలిసారి అతన్ని ప్టుించిన వాడే మరణాన్నిచ్చి తరువాత మళ్ళీ బ్రతికిస్తాడంటే ససేమీరా నమ్మనంటాడు. అతని ఈ తిరస్కార వైఖరిని ఖండిస్తూ సృష్టికర్త అయిన అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

”మనిషి నాశనంగాను! ఎంతి కృతఘ్నుడు వాడు! (అల్లాహ్‌) వాణ్ణి దేంతో పుట్టించాడు?ఒక్క వీర్య బిందువుతోనే పుట్టించాడు.ఆపైన అతని భాగ్యాన్ని నిర్ణయించాడు. తరువాత అతని జీవన మార్గాన్ని సుగమం చేశాడు. తరువాత అతనికి చావునిచ్చాడు. అతన్ని సమాధి లోకి చేర్చాడు.తిరిగి తాను కోరినప్పుడు అతన్ని మళ్ళీ బ్రతికించి లేపు తాడు. కానే కాదు అతను అల్లాహ్‌ తనకు ఆదేశించిన విధిని నిర్వర్తించ లేదు”. (80 అబస :17-23)

మనిషి ఎంత ఎదిగినా నిస్సహాయుడే!

మనిషి తన నిస్సహాయతను, అశక్తతను అంగీకరించక తప్పదు. అతను తన జీవన మనుగడ కోసం తనకు కావలసిన ఆహారాన్ని తానే స్వయంగా సమకూర్చుకోలేడు. అతను ఏ ఆహారన్నయితే అతి సామా న్యంగా భావిస్తూ, అతి సులభంగా ఆరగిస్తున్నాడో దాన్ని అతని కోసం ఎవరు ప్టుిస్తున్నాడు? ఎలా పుట్టిస్తున్నాడు? అతను దాన్ని గురించి ఎప్పుడయినా గమనించాడా?

మనిషి తన ఆహారాన్ని సమకూర్చుకోవడానికి చేసేదల్లా ఒక్కటే.దైవం తనకు అనుగ్రహించిన శక్తితో భూమి దున్నుతాడు.దైవం సృష్టించిన విత్తనాలు అందులో నాటుతాడు. కొన్ని ఎరువులను చల్లుతాడు.ఇంతకు మించి మనిషి ఏమీ చెయ్యలేడు. దీని తరువాత చేసేదంతా ఆ దైవమే.

అల్లాహ్‌ ఆజ్ఞతో సూర్యరశ్మి వల్ల సముద్రాల నీరు ఆవిరిగా మారి దట్టమైన మేఘాలు ఏర్పడతాయి.గాలులు వాిని మోసుకొని పోతాయి. గగన తనంలోని చల్లదనం వల్ల ఆ ఆవిర్లు మళ్ళీ నీళ్ల రూపు దాల్చి కురుస్తాయి.ఆ నీరు నేరుగా భూమిపైన కురిసి భూగర్భంలో ఇంకి పోయిన బావులు,ఊటల రూపమూ దాలుస్తుంది. కాలువలు, వాగులు, నదులుగానూ ప్రవహిస్తుంది. పర్వతాలపైన మంచు రూపంలో ఘనీభ వించి వర్షాకాలం కాని రుతువుల్లో తిరిగి కరిగి నదుల్లో ప్రవహిస్తుంది. అల్లాహ్‌ా ఆజ్ఞతో భూమి నీటితో కలిసి, విత్తనాలను చీల్చి, వాటికి కావలసిన ఆహారాన్ని అందిస్తుంది. మనిషి మనుగడ కోసం అవసరమయిన ధాన్యాలను, కూరగాయలను, పండ్లు ఫలాలను పండిస్తుంది. మనిషి జీవనోపాధికి మాంసం, క్రొవ్వు,పాలు, మీగడ లాిం అనేక పదార్థాల ను ఇచ్చే పశువుల కోసం కూడా మేతలు పండిస్తుంది. ఆ దైవం ఇన్ని సాధనాలను సృజించకపోతే మనిషి స్వయంగా తన ఆహారాన్ని భూమి నుండి ఉత్పన్నం చేసుకోగలిగే వాడా? ఎన్నికీ చేసుకోలేడు.

మనిషి ఎంతి నమ్మకద్రోహి! ఎంత విశ్వాస ఘాతకుడు! అతను అల్లాహ్‌ కరుణాకాక్షాలపైనే ఆధారపడి జీవిస్తూ, ఆయన అనుగ్రహించిన సామాగ్రినంతా ఎంతో సునాయాసంగా వినియోగించుకొని ప్రయోజనం పొందుతూ ఆయన్నే తిరస్కరిస్తున్నాడు.దైవ శాసనానికి కట్టుబడి నడుస్తున్న సృష్టిని పూజిస్తున్నాడు. తనలాగే నిస్సహాయుల యిన జీవుల్ని ఆరాధిస్తున్నాడు. సృష్టికర్త, పాలకుడు, స్వామి అయిన అల్లాహ్‌ా తన పట్ల మనిషి తిరస్కార వైఖరిని ఎత్తి చూపుతూ ఇలా సెలవిస్తున్నాడు:

”మనిషి కాస్త ఆహారాన్ని గమనించాలి.మేము పుష్కలంగా నీటిని కురిపించాము. మరి నేలను అద్భుతమయిన రీతిలో చీల్చాము. తరు వాత అందులో ధాన్యాలు, ద్రాక్ష, కూరగాయలు, జైతూన్‌ ,ఖర్జూరాలు, దట్టమయిన తోటలు, రకరకాల పండ్లు మేతలు పండించాము. ఇదంతా మీకూ, మీ పశువులకూ ఆహారంగా(చేశాము)”. (అబస:24-32)

మనిషి పరలోకాన్ని విస్మరించాడు.

మనిషి పుట్టుక లక్ష్యరహితంగా జరగలేదు. సృష్టికర్త మనిషికి బుద్ధీ వివేకాలు, మంచి చెడుల విచక్షణా జ్ఞానం, విధేయతావిధేయతల స్వేఛ్చ, తన సృష్టిరాశిలో అసంఖ్యాకమయిన వాిని వినియోగించు కునే అధికారాలను లక్ష్యశూన్యంగా ఇవ్వలేదు. మనిషి తన స్వామికి నచ్చినట్లు, స్వామి మెచ్చినట్లు సవ్యంగా వినియోగిస్తున్నాడా? లేదా?అన్నది అల్లాహ్‌ చూడకుండా ఉండడు. తీర్పుదినాన ప్రశ్నించ కుండా ఉండడు.

మనిషి ఐహిక జీవితం శాశ్వితం కాదు. ఒక రోజు తప్పకుండా అతను మరణించవలసి ఉంది. అతను మరణించి మట్టిలో కలిసిపో యినా లేక అగ్గిలో కాలి బూడిదయిపోయినా సర్వశక్తిమంతుడయిన అల్లాహ్‌ ప్రళయదినాన మానవులందరినీ ఒక్కసారిగా తిరిగి బ్రతికిస్తాడు. తన సన్నిధిలోకి రప్పించి వారి కర్మలను గురించి విచారిస్తాడు.

నేడు నిజదైవాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరిస్తున్నవారు, స్పష్టమయిన ఆధారాలు చూపెట్టినప్పటికీ నిజదైవానికి సృష్టితాలను సాటి కల్పిస్తున్న వారు, పరలోకాన్ని విస్మరించి దైవభీతి లేకుండా జీవిస్తున్నవారు, ఆత్మీయుల కోర్కెలను తీర్చడానికి నిర్భయంగా దైవాజ్ఞల్ని ఉల్లఘిస్తున్న వారు, తీర్పుదినాన పట్టుబడతారు. వారు చేస్తున్న పాపాలు, నేరాల దుష్పరిణామాలు తప్పకుండా వారి ముందుకు వస్తాయి. ఆనాడు ఇలాంటి పాపాత్ములను,నేరస్తులను ఆదుకోవడానికి ఆత్మీయులు సయితం ముందుకురారు.

తమ నిజప్రభువును మాత్రమే ఆరాధించేవారు, ఆయనకు విధేయత చూపేవారు, ఆయన దాసుల యెడల మంచిగా ప్రవర్తించేవారు, పాప కార్యాలకు దూరంగా ఉంటూ పరిశుద్ధమయిన జీవితం గడిపేవారు తమ ప్రభువు ప్రసన్నతకు అర్హులవుతారు. సఫలీకృతులవుతారు. ఈ వాస్తవాన్ని గురించే విశ్వప్రభువు అయిన అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”కడకు చెవులు దిమ్మెక్కిపోయే గావుకేక వినబడినప్పుడు… ఆ రోజున మనిషి తన సోదరుడి నుండి, తన తల్లి నుండి, తన తండ్రి నుండి,తన భార్య నుండి, తన పిల్లల నుండి దూరంగా పారి పోతాడు. ఆ రోజు ప్రతి ఒక్కరికీ తన సంగతి చూసుకోవటం గురించి తప్ప మరెవరిని గురించిన సృహ ఉండదు.ఆరోజు కొన్ని ముఖాలు మెరుస్తూ ఉంాయి. దరహాసాలతో, ఆనందోత్సహాలతో కళకళ లాడుతూ ఉం టాయి.మరికొన్ని ముఖాలు ఆ రోజున దుమ్ము కొట్ట్టుకుని ఉంాయి. మసిబారి ఉంటాయి. వీరే తిరస్కారులు, మహా పాపులు”. (80 అబస:33-42)

Related Post