app

విధివ్రాత నియమాలు – 7

ద్భుతమైన ఈ సృష్టి వెనక గల పరమార్థంలో ఒకటేమంటే ఇక్కడ సత్యాసత్యాల, ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ కొనసాగుతుంది. కొన్ని వేళల్లో సత్యం గెలుస్తోంది. మరికొన్ని సందర్భాలలో అసత్యం గెలుస్తుంది.

ద్భుతమైన ఈ సృష్టి వెనక గల పరమార్థంలో ఒకటేమంటే ఇక్కడ సత్యాసత్యాల, ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ కొనసాగుతుంది. కొన్ని వేళల్లో సత్యం గెలుస్తోంది. మరికొన్ని సందర్భాలలో అసత్యం గెలుస్తుంది.9) రోజులు, రాతలు ఎప్పుడూ ఒకేలాగుండవు:

 

 ”మీరు దెబ్బ తిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బ తిన్నారు. మేము ఈ కాల చక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము”.  (ఆలి ఇమ్రాన్:140)
 అద్భుతమైన ఈ సృష్టి వెనక గల పరమార్థంలో ఒకటేమంటే ఇక్కడ సత్యాసత్యాల, ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ కొనసాగుతుంది. కొన్ని వేళల్లో సత్యం గెలుస్తోంది. మరికొన్ని సందర్భాలలో అసత్యం గెలుస్తుంది. అయితే కడకు అల్లాహ్‌ా సత్యానికి గెలుపును, అసత్యానికి ఓటమిని ఇస్తాడు. ఉపకారం ద్వారం అపకారాన్ని దెబ్బ తీస్తాడు. ధర్మం ద్వారా అధర్మం నడ్డి విరుస్తాడు. ఆ విధంగా అసత్యం అధర్మం, అపకారాల మాడు బ్రద్ధలైపో తుంది. ఆఖరికి అది పరాభవంతో పతన మైపోతుంది. ఇది అల్లాహ్‌ా సంప్ర దాయం; తరతరాలుగా, యుగయుగాలుగా.
 నేడు అగ్రరాజ్యాలు కొన్ని పనిగట్టుకొని ఇస్లాంకు వ్యతిరేకంగా, ప్రవక్త (స) వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారానికి కంకణం కట్టుకున్నట్లు అన్పిస్తుంది. ముఖ్యంగా వారి చెప్పుచేతల్లో ఉన్న ప్రింటింగ్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల ద్వారా యూద, క్రైస్తవ లాబీలు ప్రజలలో లేనిపోని వదం తుల్ని వ్యాపింపజేస్తున్నాయి. ఇస్లాంను ఒక ఫోబియాగా చిత్రీకరించి పబ్బం గడువుకోవాలన్నది వారి ఉద్దేశ్యం. అలాగే శాంతి పేరుతో మార ణాయుధాల్ని పిచ్చోడి చేతిలో రాయిలా అడ్డదిడ్డంగా ప్రయోగించి ముస్లిం ప్రజలలో కలవరం, కలకలం సృష్టించాలనీ, వారి ధైర్యసాహసాలను నీరు గార్చి, వారు పరస్పరం విభేదించుకునేలా చేయాలన్నది వారి చిరకాల ఆశ. అయితే ముస్లింలు నేడే కాదు, నాడు సయితం ఈ రకమయిన వదంతులకు, పుకార్లకు ఏమాత్రం తొణకలేదు. సరికదా ద్విగుణీకృత విశ్వాసంతో సమధికోత్సాహంతో ప్రతికూల పవనాలకు ఎదురొడ్డడానికి సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా తెలియ జేస్తుంది:
 ‘అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి’ అని ప్రజలు వారితో అన్నప్పుడు ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబులుగా ”మాకు అల్లాహ్‌ చాలు, ఆయన చాలా మంచి కార్యాసాధకుడు” అని వారన్నారు.  (ఆలి ఇమ్రాన్:173)
 ”నిజానికి (ఈ విధమైనటువంటి పుకార్లు సృష్టిస్తున్న) వాడు షైతాన్‌. వాడు తన మిత్ర బృందం గురించి మిమ్మల్ని భయపెడుతున్నాడు. కనుక మీరు అవిశ్వాస మూకల (మోహరింపు)కు భయపడకండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయితే నాకు మాత్రమే భయపడండి”.  (ఆలిఇమ్రాన్:175)
  అల్లాహ్‌ా తన ప్రణాళికననుసరించి సత్య తిరస్కారులకు గడువు ఇస్తూ పోతాడు. తాత్కాలికంగా వారికి సిరిసంపదల్ని, సంతానాదుల్ని, అధికా రాలను కూడా ఇస్తాడు. దేవుడు వారి పక్షం వహించి అపారంగా అను గ్రహిస్తున్నాడని జనులు తలపోస్తారు. అయితే ఈ దైవకృప వారి పాలిట దేవుని గడువుగా పరిణమిస్తుందన్న సంగతి వారు ఎరుగరు. ఫలితంగా వారి పాపం పండుతూ పోతుంది. తిరస్కార వైఖరితో, తల బిరుసుతనంతో వారు ధరిత్రిలో చెలరేగిపోతారు. కడకు అల్లాహ్‌ా వారి పై తన కొరడాను ఝుళిపిస్తాడు. అంతిమ విజయం దైవభీతిపరులకే వర్తిస్తుంది.విధిరాత పట్ల సహనం:
 మనం నిత్యం అల్లాహ్‌ా ధ్యానంలో, ఆయన చింతనలో నిమగ్నులై ఉండేందుకు ప్రయత్నించాలి. నిరతం అల్లాహ్‌ాను స్మరిస్తూ, విశ్వంలోని ఆయన నిదర్శనాల నుండి గుణపాఠం గ్రహిస్తూ ఉండాలి. అట్టి సద్బుద్ధిని ప్రసాదించమని దీనాతిదీనంగా వేడుకోవాలి. ఖచ్చితంగా ఒక రోజు నశించిపోయే ఈ నరలోకం గురించిన మక్కువను తగ్గించుకుని పరలోక శాశ్వత జీవితం కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. అల్లాహ్‌ాకు అప్రియమైన అలవాట్ల నుంచి, ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించే చర్యల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. జీవితంలో ఎలాంటి విషమయ పరిస్థితులు ఎదురైనా, సమయం మనకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలం గా ఉన్నా పరిస్థితుల, పరిసరాల స్వరూపంలో ఎలాంటి పెను మార్పులు పొడచూపినా సరే మనం దైవ విధేయతా మార్గం మీదే నిలకడ, స్థయిర్యం కలిగి ఉండాలి. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు:
 ”విశ్వాసి వ్యవహారం చాలా వింతైనది. అతని వ్యవహారం మొత్తం అతని కొరకు మేలైనది ఉంటుంది. ఈ భాగ్యం ఒక్క విశ్వాసికి తప్ప మరెవరికి ప్రాప్తించలేదు. అతనికి ఆనంద ఘడియలు ఎదురైతే అందుకు అతను అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. అది అతని కోసం మేలు అవు తుంది. ఒక వేళ అతనికి కష్ట స్థితి ఎదురైతే అతను సహనం వహిస్తాడు అది కూడా అతనికి మేలే చేస్తుంది.”  (ముస్లిం)
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”విశ్వసించిన ప్రజలారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్‌ా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు.” (అల్‌ బఖర:153)
 సహనం రెండు రకాలు – ఒకటి: నిషిద్ధ నిషయాలను, పాపాలను విడనాడటం, వాటికి దూరంగా ఉండటానికి తన్ను తాను నిగ్రహించు కోవడం. భోగలాలసను, మనసైన వాటిని త్యాగం చేయటం. క్షణభంగుర మైన ప్రయోజనాలను వదులుకోవటం వల్ల మనసుకు కలిగే అసం తృప్తిని ఓర్పుకోవటం. రెండు: దైవాదేశాలను పాటించటంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను ఓర్పుతో, నేర్పుతో భరించటం. అంటే మనసుకు, శరీరానికి ఎంత ఇబ్బందిగా తోచినా అల్లాహ్‌ా ఏది ఇష్టమే అదే చేయాలి. దైవం ఇష్ట పడని విషయాల నుండి దూరంగా మసలుకోవాలి. కోర్కెలు, అభిరుచులు ఎంతగా ఉబలాటం చేసినా, ప్రాపంచికి తళుకుబెళుకులు ఎంతగా కవ్వించినా, షైతాన్‌, పసందైన పనులు ఎంత ప్రలోభ పెట్టినా దైవసమ్మతం కాని వాటిని పరిత్యజించాలి. ఇదే అసలు సిసలైన ఓర్పు సహనం!
 దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ఓర్చుకోలేని, తొలగించుకోలేని బాధాకరమైన కష్టాల్నుండి, దౌర్భాగ్యం సోకడం నుండి, చెడు తీర్పులు, నిర్ణయాల నుంచి, శత్రువుల పరిహాసం నుంచి మీరు అల్లాహ్‌ా శరణు వేడుకోండి.” (బుఖారీ, ముస్లిం)
 సకల మేళ్ళను సమకూర్చి పెట్టే, సకల చెడుల నుంచి కాపాడే ఒక దుఆను ప్రవక్త (స) మనకు నేర్పించారు అది- ”ఓ అల్లాహ్‌! నేను నీ నుండి నీ ప్రవక్త ముహమ్మద్‌ (స) అర్థించిన మేళ్ళన్నింటిని అర్థిస్తున్నాను. నీ ప్రవక్త ముహమ్మద్‌ (స) వేటి కీడు నుండి నీ శరణు వేడుకున్నారో వాటి కీడు నుండి  నేను నీ శరణు వేడుకుంటున్నాను. సహాయం కోరిన వ్యక్తికి సహాయం అందించగల సమర్థుడవు నీవే. బాధితుని దగ్గరికి చేర్చే వాడవు నీవే. మంచి పనులు చేసే సత్బుద్ధి, చెడుల నుండి కాపాడుకోవటానికి కావలసిన శక్తి సామర్థ్యం నీ నుండే లభిస్తుంది.” (తిర్మిజీ)
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.