Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఈ ఘోరాలకు బాధ్యులెవరు?

   నేటి బాలలే రేపటి యువతరం. యువతీ యువకుల మధ్య పరస్పర ఆకర్షణలు సహజము. కాని అవి పెడద్రోవ పట్టకుండా  ఉత్తమ సభ్యతా సంస్కారాలు, మంచి నడవడికలు నేర్పవలసిన బాధ్యత    మొట్ట  మొదట కుటుంబంలో తల్లిదండ్రులపై ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు కూడా ఎదిగే పిల్లల ఉత్తమ గుణగణాలు, మంచి లక్షణాలు పెంపొం దించేందుకు తమ వంతు ధార్మిక నైతిక విలువలను బోధించాలి.


నేటి బాలలే రేపటి యువతరం. యువతీ యువకుల మధ్య పరస్పర ఆకర్షణలు సహజము. కాని అవి పెడద్రోవ పట్టకుండా ఉత్తమ సభ్యతా సంస్కారాలు, మంచి నడవడికలు నేర్పవలసిన బాధ్యత మొట్ట మొదట కుటుంబంలో తల్లిదండ్రులపై ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు కూడా ఎదిగే పిల్లల ఉత్తమ గుణగణాలు, మంచి లక్షణాలు పెంపొం దించేందుకు తమ వంతు ధార్మిక నైతిక విలువలను బోధించాలి.

 

మాతృమూర్తికి అత్యున్నత గౌరవం ప్రసాదించబడే మన భారత దేశంలో స్త్రీలపై, అమ్మాయిలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలపై దౌర్జన్యాలు, శారీరక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితం శ్రీ లక్ష్మి అనే విద్యార్థిని మనోహర్‌ అనే యువకుని ప్రేమను తిరస్కరించిందనే నెపంతో పట్టపగలు తరగతి గదిలోనే తోటి విద్యార్థుల ఎదుట నిర్దాక్షిణంగా నరికి చంపిన సంఘటన కాని, హాస్ట్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆయెషా మీరా హత్య కాని, అలాగే ఈ మధ్య వరంగల్‌ పట్టణంలో ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థినులపై జరిగిన యాసిడ్‌ సంఘటన కాని – ప్రదేశాలు ప్రాంతాలు మారాయి తప్ప సంఘటనా కారణాలు, కారకాలు మాత్రం అవే. అమ్మాయిలను ప్రేమ పేరుతో వెంటాడటం, బ్లాక్‌మెయిల్‌ చేయటం, వ్యవహారం బెడిసికొడితే తట్టుకునే మనో నిబ్బరం లేక పైశాచిక దాడులకు పాల్పడటం పరిపాటి అయిపోయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజం, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించడం, ఈ సంఘటనలను ఖండిస్తూ నినదించడం, దోషులను శిక్షించాల్సిందిగా కోరడం, తర్వాత వాటిని మరిచిపోవడం లాంఛనంగా జరిగిపోతున్నాయేగాని వీటికి గల కారణాలను అన్వేషించి, వాటికి తగిన పరిష్కారాలను సూచించడం, అలాగే వాటిని అమలు పర్చడంలో సహకరించడం మాత్రం అంతంత మాత్రమే లేదా శూన్యం అని కూడా చెప్పవచ్చు.

నేటి బాలలే రేపటి యువతరం. యువతీ యువకుల మధ్య పరస్పర ఆకర్షణలు సహజము. కాని అవి పెడద్రోవ పట్టకుండా
ఉత్తమ సభ్యతా సంస్కారాలు, మంచి నడవడికలు నేర్పవలసిన బాధ్యత మొట్ట మొదట కుటుంబంలో తల్లిదండ్రులపై ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు కూడా ఎదిగే పిల్లల ఉత్తమ గుణగణాలు, మంచి లక్షణాలు పెంపొం దించేందుకు తమ వంతు ధార్మిక నైతిక విలువలను బోధించాలి. అలాగే తల్లిదండ్రులు, గరువులు ఉత్తమమైన ఉదాత్తమైన ఆదర్శనీయ లక్షణాలు కలిగి విద్యార్థులకు ఆదర్శప్రాయులుగా నిలవాలి. ఈ అదర్శవంతమైన లక్షణాలను పుణికిపుచ్చుకునేందుకు, ఆచరించేందుకు అనువైన వాతావరణం కూడా సమాజం కల్పించాలి. అలాగే సమాజాన్ని – ముఖ్యంగా యువతరాన్ని – అతిగా ప్రభావితం చేసే సినిమాలు, ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా సామాజిక బాధ్యతను విస్మరించి కేవలం లాభాపేక్షతో, కార్పోరేట్‌ సంస్కృతిని, ప్రతి విషయాన్ని సంచలనాత్మకం చేయడం ద్వారా తమ టి.ఆర్‌.పి. రేటుని పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మన సంస్కృతిలో భాగం కాని యువతీ యువకుల డాన్స్‌ ప్రోగ్రాములు, లేట్‌నైట్‌ పార్టీలు పబ్‌ కల్చర్‌లకు అతిగా ప్రచారం కల్పించి వీటి ద్వారా యువతీ యువకుల మధ్య ఉండే సహజ ఆకర్షణలను ప్రమాదకరమైన పెడద్రోవ పట్టించేందుకు మార్గం సుగమం చేయడం జరుగుతూ ఉంది. సినిమాలలో, టీ.వీ షోలలో, సీరియల్స్‌లో అశ్లీల అసభ్యకర సన్నివేశాలను, నేరప్రవృత్తిని పెంచే సంఘట నలను ప్రసారం చేయడం ద్వారా యువత క్షణికావేశాలకు, కామోద్రేకాలకు లోనయ్యే అవకాశాలే ఎక్కువ. అలాగే ఫ్యాషన్‌ షోల పేరుతో అర్ధనగ్న ప్రదర్శనలు, ముప్పాతిక నగ్న దుస్త్తులు ఎదుటివారిలో సెక్స్‌ కోరికలు రెచ్చగొట్టే విధంగా కవ్వింపులు కూడా అమ్మాయిలపై అఘాయి త్యాలకు కారణభూతమవుతున్నాయి. అందంగా అలంకరించుకోవడం, దేవుడు ప్రసాదించిన అందానికి మెరుగులు దిద్ది ఆకర్షణీయంగా కనబడటంలో తప్పు లేదేమో కానీ, అది గనక హద్దు మీరితే ప్రమా దాలను ఆహ్వానిస్తుందని తెలుసుకోక పోవడం శోచనీయం.

ఇక్కడ స్త్రీ పురుషుల విచ్చలవిడి కలయికను నిరసించిన, ఒకవేళ స్త్రీలు బయటికి పర పురుషుల సమక్షంలో తిరుగాడే అవసరమైతే పరదా పద్ధతిని పాటించవలసిందిగా పురమాయించిన ఇస్లామీయ పద్ధతి స్త్రీలకు రక్షణ కల్పిస్తుందని ముస్లిం సమాజాల్లో రుజువైంది. ఈ పరదా పద్ధతి ఇతర సమాజాల్లో కూడా స్త్రీలకు రక్షణ కల్పిస్తుందని దృఢంగా నమ్మగలము.
తిలా పాపం తలా పిడికెడు !
చేదు విత్తనాలను నాటి తీపి ఫలాలను ఆరగించాలనుకోవటం సమంజసమా?

కాలేజీ క్యాంపస్‌లో తమ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని తల్లిదండ్రులు ఒకవైపు డిమాండు చేస్తూనే, ఈ కాలేజీలు అరాచకానికి ఆలయమవుతున్నాయని మరో వైపు గగ్గోలు చెందటం శుద్ధ అవివేకం కాదా?

దోషులను శిక్షించే చట్టాలు, న్యాయస్థానాలుండగా పోలీసులు హడావిడిగా నిందితులపై ఎన్‌కౌంటర్‌ జరిపి ఫైల్‌ క్లోజ్‌ చేయడం దేన్ని సూచిస్తుంది?

సినిమాలలో మితిమీరిన అశ్లీలాన్ని, హింసా ప్రవృత్తిని, విశృంఖలత్వాన్ని జొప్పించే సినీ ప్రముఖులకు యువతలో సభ్యతాసంస్కారాలు క్ష్షీణిస్తున్నాయని వాపోయే నైతిక హక్కు ఎక్కడుంది?
రచయితలు, సంఘ సంస్కర్తలు ఒకవైపు యువతీయువకుల విచ్చలవిడి కలయికను ప్రోత్సహిస్తూనే, మరో వైెపు మన సామాజిక వ్యవస్థను తూలనాడటం ఎంత వరకు సహేతుకం?

Related Post