1) ప్రక్రుతి ధర్మం (Nature Law) ఏమిటంటే ఏ విత్తు నాటితే అదే మొక్క మొలవాలి. మంచి మొక్క నాటితే దానికి మంచి పంట పండాలి. అలాగే చెదు మొక్క నాటితే చెడు పంట పండాలి. కాని ప్రపంచంలో అలా జరగటం లేదు. ఉదాహరణకు ఈ ప్రపంచంలో అనేక నేరాలు చేసే వారు హాయిగా జీవితం గడుపుతున్నారు. అమాయకులు మంచివారు అనేక కష్టాలు కడగండ్లతో జీవిస్తున్నారు. ప్రక్రుతి ధర్మం ప్రకారం మంచి వారికీ మంచి జరగాలి. చెడ్డవారికి చెడు జరగాలి. కాని అలా జరగడంలేదు. అంటే ఇది ఇహలోకంలో జరగడం లేదు. కాబట్టి పరలోకంలో తప్పకుండా జరుగుతుందని విశ్వసించవచ్చు.
2) ఈ ప్రపంచంలో సరైన న్యాయం జరగడంలేదని వాస్తవం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని హత్య చేసిన వాడికి ఒక ఉరి శిక్ష లేదా ఒక జీవిత ఖైదు వేస్తే వంద మందిని చంపిన వాడికి వంద ఉరిశిక్షలు లేదా వంద జీవిత ఖైడులు విధించాలి. ఇదే ప్రకృతి ధర్మం. కాని ఇది ప్రపంచంలో సాధ్యం కాదు. దీనికోసం ఖచ్చితంగా పరలోకం ఉండి ఉండాలి.
3) ఈ ప్రపంచంలో అనేక మంది అమాయకులు హత్య చేయబడుతున్నారు. అనేక మంది అత్యాచారాలకు గురౌతున్నారు. వీరికి సరైన న్యాయం జరగకుండానే, చెడ్డవారికి శిక్ష పడకుండానే ఇహలోకం గడిచి పోతుంది. పరలోకం లేకపోతే మంచి, చెడులకు, ధర్మం, అధర్మాలకు అర్ధం లేదు.
మానవులకు చావు పుట్టుకలు ఏందుకు ఇవ్వబడ్డాయి?
దేవుడు మానవులను పరిక్షించడానికే సృష్టించాడు.
ఆయన మానవులకు శాశ్వతమైన ప్రతిఫలం (స్వర్గం) ఇవ్వడానికి ,
తాత్కాలికమైన జీవితాన్ని ఇచ్చి పరీక్షిస్తున్నాడు.
ఉదా :- ఖుర్ఆన్ వాఖ్యాన్ని గమనించండి
(దివ్య ఖుర్ఆన్67:3) మీలో సత్కర్మలు చేసేవారెవరో, దుష్కర్మలు చేసేవారెవరో పరీక్షించి చూడాలని మీకు జీవన్మరానలకు ప్రసాదించాను.
(దివ్య ఖుర్ఆన్ 21:35) పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. నేను మిమ్మల్ని పరిక్షించడానికే సృష్టించాను. మీరంతా నా వైపే మరలవలసి వుంది.
ఫమయ్యమల్ మిస్ఖాల జర్రతిన్ ఖైరైయ్యర
వమయ్యామల్ మిస్ఖాల జర్రతిన్ షర్రైయ్యర
(దివ్య ఖుర్ఆన్ 99:7) మీలో ఇసుమంత తప్పు చేసినా దాని ప్రతిఫలం పొందుతారు. ఇసుమంత మంచి పని చేసినా దాని ప్రతిఫలం పొందుతారు.
మరణాంతర జీవితం గురించి ధార్మిక గ్రంధాలు ఏమి చెబుతున్నాయి…?
(ఖుర్ ఆన్ 32: 10-11) ఈ ప్రజలు ఇలా అంటారు. మేము మట్టిలో కలిసి పోయి నశించి పోయిన తరువాత మళ్లీ మేము సమాధులలో నుండి బ్రతికించి లేప బడతామా? అసలు విషయం ఏమిటంటే వారు తమ నిజదేవుణ్ణి కలుసుకోవడాన్ని తిరస్కరిస్తున్నారు. వారితో ఇలా అను ” మీపై నియమించబడిన మృత్యు దూత మిమ్మల్ని పూర్తిగా కైవసం చేసుకుంటాడు. తరువాత మీరు మీ ప్రభువు వైపుకు మరలింపబడతారు.
(ఖుర్ ఆన్ 6: 12) ప్రళయం నాడు ఆయన మిమ్మల్ని తప్పకుండ సమావేశ పరుస్తాడు. ఇది అనుమానానికి ఏమాత్రం ఆస్కారం లేని యదార్ధం.
(ఖుర్ ఆన్ 67:6) తమ ప్రభువును తిరస్కరించినవారికి నరకయాతన తద్ద్యం. అది అత్యంత చెడ్డ గమ్య స్థలం!
(ఖుర్ ఆన్ 98:6) గ్రంధవహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరి కంటే చెడ్డ వారు.
(గీతా 9: 7) ఓ అర్జునా సమస్త ప్రాణి కోట్లు ప్రళయ కాలమున నా ప్రకృతిని జేరి అందు అణిగిఉందును. తిరిగి సృష్టి కాలమున దానిని నేను మరల సృజించుచున్నాను.
(బైబిల్ యోహాను 5:28-29) దీనికి ఆశ్చర్య పడకుడి ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదురు.
( మత్తయి 25: 46) అవిశ్వాసులు నిత్య శిక్షకును నీటిమంతులు నిత్యజీవమునకు పోవుదురు.
ఈ ప్రాపంచిక జీవితం అశాస్వతమైనది. ప్రతి ఒక్కరు వారి వారి కర్మల గురించి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది.
ఈ సందేశం మన ధార్మిక గ్రంధాల ద్వారా మనకు తెలిసింది.
మన సృష్టి కర్తకు సాటి కల్ల్పిస్తే కలిగే పర్యవసానం ఏమిటి…?
welcome to hell by tyger gr(ఖుర్ ఆన్ 67:6) ఆ ప్రభువును తిరస్కరించినవారికి నరకయాతన తధ్యం. అదేంత చెడ్డ గమ్య స్థలం !?
(ఋగ్వేదం 7:104:3) దుష్కార్యాలకు పాల్పడేవారిని లోతైన గోతిలోకి అంధకారంలో పదవేయండి. అక్కడ నుండి వారు బయటకు రాలేని విధంగా, వారిలో ఏ ఒక్కడూ ఏనాటికి తిరిగి బయటకు రాడు.
(ప్రకటనలు 21:8) పిరికి వారును, అవిశ్వాసులును,మాన్త్రికులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరునూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలుపొందుదురు
నిజ సృష్టి కర్తను మాత్రమె ఆరాధిస్తే ఫలితం ఏమిటి…..?
దేవుణ్ణి విశ్వసించి సత్కార్యాలు చేసే వాడికి శాశ్వత స్వర్గం
(ఖుర్ ఆన్ 98:7,8) ఎవరైతే విశ్వసించి మంచి కార్యాలు చేస్తారో వారే సృష్టిలో ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర నుండి శాస్వతమైన ఉద్యానవనాలు ఉన్నాయి.
(ఋగ్వేదం 9:113:7) Place me is the deathless undecaying world where the light of heaven is set and everlasting custre shines
(మత్తయి 25:46) అవిశ్వాసులు నిత్య శిక్షకునూ, నీతి మంతులు నిత్య జీవమునకును పోవుదురు.
మన ఇష్టం వచ్చి నట్లు జీవితం గడిపితే కలిగే పర్యవసానం ఏమిటి?
Ya shastra vidhi mustrujyavarthaate kaama kaaratah
na sa siddihi mahapokti na sukham na param gatim.
न शास्त्र विधि मुस्रुज्य वरताते काम कारतः
न स सिद्दिहि महापोक्ति न सुखम न परम गतिम्
(Bhagvad Geetha 16:23)
ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచి పెట్టి తన ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించునో అట్టివారు పురుషార్దసిద్దిని గాని, సుఖమునుగాని, ఉత్తమ గతియగు మోక్షము గాని పొందనేరడు.
Tri-vedam navakasyuedam dvaram nasanam atmanah
kamah drodhas tatha lobhas tasmad etat trayam.
त्रि वेदम नवकासयुएदम द्वारम नासनम् आत्मानः
कामः द्रोदास ताथा लोभास तस्मद एतत त्रयम
(భగవద్ గీత 16:21) కామము,క్రోధము,లోభము అను ఈ మూడునూ మూడు విధములగు నరక ద్వారములు. ఇవి జీవులకు నాశనము కలుగ జేయును, కాబట్టి ఈ మూడింటిని విడనాడ వలెను.
(ద్వితియోపదేశ కాండము 28:15) నేడు నీకాజ్ఞాపించు సమస్త ఆజ్ఞలు కట్టడములు,నీవు అనుసరించని యెడల నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
(ఖుర్ ఆన్ 4:57) మా వాక్యాలను తిరస్కరించిన వారికోసం మేము నరకాగ్ని సిద్దం చేసే ఉంచాము.
ఈ సందేశం మన ధార్మిక గ్రంధాల ద్వారా మనకు తెలిసింది.
ఈ ప్రాపంచిక జీవితం అశాస్వతమైనది. ప్రతి ఒక్కరు వారి వారి కర్మల గురించి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది.
నిజదేవుణ్ణి (సృష్టికర్తను) మాత్రమే విశ్వసించి ఆరాధించే వారికి, సత్కార్యాలు చేసే వారికి శాశ్వత స్వర్గం
సృష్టి కర్తకు సాటి కల్ల్పిస్తే కలిగే పర్యవసానం శాశ్వతనరకాగ్ని.