1. హిందూ ప్రజానీకంలో దేవుని భావన!
సాధారణంగా హిందూమతం అంటేనే బహుదైవత్వపు మతంగా భావించబడుతుంది. చాలా మంది హిందువులు తాము అనేకమంది దేవుల్లపై విశ్వాసం కలిగివుండటం చేత ఈ విషయాన్ని నిస్సంకోచంగానే ఒప్పుకుంటారు. కొంతమంది హిందువులు ముగ్గురు దేవుళ్ళ భావనలో విశ్వాసం కలిగి ఉంటారు. కొందరు ముక్కోటి దేవతలను ఆరాధిస్తారు. ఇంకొంతమంది ముప్ఫై మూడు కోట్ల దేవతలపై విశ్వాసం. అయితే విద్యావంతులైన హిందువులు, తమ దివ్య గ్రంధాలను బాగా అధ్యయనం చేసిన హిందువులు మాత్రం కేవలం ఒకే ఒక్క దేవుణ్ణి మాత్రమే విశ్వసించాలని, ఆయన్నే ఆరాధించాలని బల్ల గుద్ది చెబుతారు.
దేవుణ్ణి అర్ధం చేసుకోవటంలో ముస్లింలకు – హిందువులకు మధ్య ఉన్న భేదాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. భగవంతుడు – సృష్టి, రెండూ వేరు వేరు కావని హిందువులు భావిస్తారు. వారి ప్రకారం సృష్టిలోని ప్రతి వస్తువు, అది సజీవమైనదైనా, నిర్జెవమైనదైనా సాక్షాత్తు అది భగవద్ స్వరూపమే! కనుకనే సగటు హిందువు ప్రతి వస్తువును దేవినిగా తలుస్తాడు. అతని దృష్టిలో చెట్లు, పుట్టలు, రాళ్ళు, రెప్పలు, చంద్రుడు, సూర్యుడు, కోతులు, పాములు అన్నీ భగవద్ స్వరూపాలు. చివరకు మనిషి కూడా దైవాంశమే!
ఇస్లాం బోధన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. మనిషి తననూ, తన చుట్టుప్రక్కల ఉన్న వస్తువులను కేవలం ‘దేవుని సృష్టి’గా మాత్రమే చూడాలని ఇస్లాం ధర్మం చేబుతుంది. అవి భగవద్ స్వరూపాలు ససేమిరా కావంటుంది. అందుకుని ముస్లింలు సృష్టిలోని వసువులన్నింటినీ దేవుడు సృష్టించినవిగా మాత్రమే గుర్తిస్తారు. మరో మాటలో చెప్పాలంటే సృష్టి మొత్తం దేవునికి చెందినదని ముస్లింల నమ్మకం. చేట్లుపుట్టలు, రాళ్ళురప్పలు, సూర్యచంద్రులు, కోతులు, పాములు, మనుషులు అందరూ దేవునికి చెందిన వారు, దేవుని దాసులు.
2. హిందూ మాత గ్రందాల ప్రకారం దేవుని భావన!
హిందూ మత గ్రంధాలను పరిశీలిస్తే వాస్తవానికి హిందూ మతంలో దేవుని భావన ఏమిటో మనకు అర్ధం అవుతుంది.
భగవద్గీత
హిందూ మత గ్రంధాలన్నిటిలో కెల్లా ప్రఖ్యాతిగాంచినది భగవద్గీత.
(భగవద్గీత 7:20) “ఎవరి బుద్ధినయితే భౌతిక వాంఛలు ఆవహిస్తాయో వారు చిల్లర దేవుళ్ళకు ఆత్మా సమర్పణ చేసుకుంటారు. ఇంకా స్వయం కల్పిత ఆరాధనా విధానాల ద్వారా ప్రత్యేక నియమాలను, నిబంధనలను అనుసరిస్తారు.”
భౌతికవాదులైన ప్రజలు నిజదేవున్ని వదలి మిధ్యాదేవుళ్ళను పూజిస్తారని పై భగవద్గీత వాక్యం చెబుతుంది.
(భగవద్గీత 16:21)”కామము, క్రోధము, మూడును మూడు విధములగు నరక ద్వారములు. ఇవి జీవునకు నాశనము కలుగజేయును. కాబట్టి ఈ మూడింటిని విడనాడవలెను. ”
దేవుడు అవతరింపజేసినా గ్రంధాలను మనం చదవాలి. ఆ గ్రంధాలలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు అనుగుణంగా మనం జీవితం గడపాలి. మనొవాంఛలకు దాసులై జీవించకూడదు. గీతోపదేశం. క్రింద పేర్కొనబడిన భగవద్గీత వాక్యాలను గమనించండి.
(భగవద్గీత 16:23)”ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిన్చునో అట్టివాడు పురుషార్ధ సిద్ధిని గాని ఉత్తమ గతియగు మోక్షమును గాని పొందనేరడు.”
ఆ తర్వాతి వాక్యం ఇలా అంటుంది.
(భగవద్గీత 16:24)”ఏది చెయ్యవచ్చు? ఏది చేయకూడదు అన్న కార్యాకార్య విచక్షణలో శాస్త్రమే నీకు ప్రమాణం! శాస్త్ర ప్రమాణంగా చెప్పబడినది ఏదో విశదంగా తెలుసుకో! అలా,శాస్త్రోక్తమైన కర్మలనే కర్యాకర్యములు తెలిసి ఉత్తమగతిని పొందు ”
ఉపనిషత్తులు
హిందువులు ఉపనిషత్తులను తమ పవిత్ర గ్రంధాలుగా భావిస్తారు.
ఈ క్రింద పేర్కొనబడిన ఉపనిషత్ దైవత్వ భావనను విశదీకరిస్తున్నాయి.
ఛాందోగ్య ఉపనిషత్తు (6:2:1) “ఏకం యెవద్వితీయం” (एकम यवद्वितीयम)
“ఆయన ఒక్కడే రెండవ వాడు లేడు”
శ్వేతాశ్వతర ఉపనిషత్తు (6:9)”న చస్య కశ్చిత్ జనిత నచాదిపః” (न चास्य कश्चित् नचादिपः)
“ఆయన పై అధిపతులు, యజమానులు లేరు”
అని వుంది. అంటే సర్వశక్తి సంపన్నుడు అయిన దవానికి తల్లిగాని, తండ్రిగాని లేరు. ఆయనకంటే ఉన్నతుడెవరూ లేరు అని అర్ధం.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు లోనే 4వ అధ్యాయము, 19వ మంత్రంలో ఇలా చెప్పబడింది.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు (4:19)”న తస్య ప్రతిమ ఆస్తి” (न तस्य प्रतिम अस्थि)
“ఆయనకు ఎలాంటి ప్రతిమ, ప్రతిరూపము లేదు”
శ్వేతాశ్వతర ఉపనిషత్తు (4:20)”న సందృశే తిష్ఠతి రూపమస్య ( न सन्द्रुसे तिष्ठति रूपमस्य
న చక్షుసా పశ్చతికశ్చనైనమ్” न चक्षुपा पश्चाति कस्च नैनम)
“ఆయన రూపము ఎవరి కళ్ళలోనూ ఇమడదు, ఆయన్ని ఏ కళ్ళూ చూడలేవు”
వేదాలు
హిందూ మత గ్రంధాలన్నిటిలోనూ వేదాలు అత్యంత పవిత్రమైనవిగా, పుణ్యప్రదమైనవిగా భావించబడతాయి.
ప్రధానంగా నాలుగు వేదాలు ఉన్నాయి.
ఋగ్వేదం
ఋగ్వేదం వేదాలన్నిటిలో ప్రాచీనమైనది. హిందువుల చేత అత్యంత పవిత్రంగా భావించబడే మతగ్రంధాల్లో ఒకటి. ఋగ్వేదంలో ఇలా ఉంది.
వేదాల్లో కెలా ప్రచీనమైనదీ, పవిత్రమైనదీ అయిన రుగ్వేదంలో మొదటి పుస్తకం, 164వ సూక్తంలో 46వ మంత్రం ఇలా చెబుతుంది.
(ఋగ్వేదం 1:164:46) “ఏకం సద్ విప్రా బహుదా వదంతే” एकम सद विप्र बहुदा वदंते
(ఋగ్వేదం 1:164:46)”సత్యం ఒక్కటే; దైవం ఒక్కడే; ఋషులు ఆయన్ని వివిధ పేర్లతో పిలుస్తారు”
దైవం అంటే విష్ణు అని, ఆయన పాముతల పై శయనిస్తాడని, సముద్రంలో నిడురిస్తాదని, గాలిలో గరుడ పక్షి పై ప్రయానిస్తాడని ఆయనకు నాలుగు చేతులు, ఒక చేతిలో విష్ణుచక్రం, మరో చేతిలో సంఖం ఉంటాయని వర్ణిస్తే మాత్రం పోరాబాటవుతుంది.
ఎందుకంటే అలా వర్ణించడం వేదాలకు, ఉపనిషత్తులకు వ్యతిరేకం. వేదాలలో ఉపనిషత్తులలో ఆయనకు ప్రతిమ గాని, ప్రతిరూపం గాని లెవనీ ఉంది.
(ఋగ్వేదం 8:1:1) “ఆయన ఒక్కరినే స్తోత్రం చేయండి ఆయనే ఆరాధనలకు అర్హుడు”
(ఋగ్వేదం 6:45:16)”యఏక ఇత్తము ష్తుహి” य येक इत्तमु शतुही
“ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలి”
హిందూ మత బ్రహ్మ సూత్రం
“ఏకం బ్రహ్మం, ద్వితీయ నస్తనెన్ ననస్తే కించన్”
అర్ధం : దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, అసలు లేనే లేడు, కొంచెం కూడా లేడు.
నిజదైవం తప్ప మరో దేవుడు లేదని పైన పేర్కొనబడిన ఋగ్వేద మంత్రాలు చాలా స్పష్టంగా ఘోషిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు. ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తే ఆ నిజదేవుడు. కనుక మనం నిజదైవం స్థానంలో వేరొకర్ని ఆరాధించే ముందు దీనిగురించి చిత్తశుద్ధితో యోచించాలి.
మన కర్మలు దేవుడు అవతరింపజేసినా గ్రందాల ప్రబోధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నప్పుడు మనం సన్మార్గంలో ఉన్నామని ఎలా చెప్పగలం? పరలోకంలో ముక్తి పొడగాలమని ఎలా ఆశించగలం? చెప్పండి. ఎటువంటి పక్షపాతానికి లోనుకాకుండా హిందూ ధర్మ గ్రంధాలను అధ్యయనం చేసినప్పుడు మాత్రమే హిందూ మతంలోని వాస్తవ దైవ భావనను మనం అర్ధం చేసుకోగలం.
యజుర్వేదం
సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మానవ శరీరాలతో అభివర్ణించతానని కూడా యజుర్వేడంలోని ఈ క్రింది సూక్తులు ఖండిస్తున్నాయి.
“న తస్య ప్రతిమ ఆస్థి”
(యజుర్వేదం 32:3) “ఆయనకు పోలిక ఎవరూ లేరు”
విష్ణువు అనేది ఋగ్వేదంలో దేవుని గురించి ప్రస్తావించబడిన మరో అందమైన గుణం. ఇది ఋగ్వేదం రెండవ పుస్తకంలో ఉంది. “విష్ణు”ను మన భాషలోనైతే “ప్రభువు” అని చెప్పుకోవచ్చు. దాన్నే అరబీ భాషలోకి అనువదిస్తే “రాబ్బ్” అవుంతుంది. ఆ శక్తిమంతుడైన దేవుణ్ణి ‘రాబ్బ్’ అని పిలిచినా లేక “ప్రభువు” అని పిలిచినా, “విష్ణువు” అని పలికినా ఆయనకు అభ్యంతరం ఉండదు. కాని ‘విష్ణువు’ అనగానే సామాన్య ప్రజల ఊహల్లోకి ఒక ప్రత్యేకమైన ఆదారం వస్తునిడ్. ఆ ఆకారానికి నాలుగు చేతులుంటాయి. ఒక కుడి చేతిలో చక్రం ఉంటుంది. ఒక ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. ఆ ఆకారం ఒక పక్షి మీద స్వారీ చేస్తూ ఉంటుంది. విష్ణువు అని చెప్పి ఆ విధంగా ఊహించుకోవటానికి మాత్రం అస్సలు అనుమతి లేదు. అలా చేయటాన్ని నిజదైవం ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించడు. ఇంతకు ముందు చెప్పబడినట్లు ఇది శ్వేతాస్వతర ఉపనిషత్తు 4:19 వాక్యానికి విరుద్ధం.
(యజుర్వేదం 40:8) “షుధామ పోష్విధం” —- “ఆయనకు శరీరము లేదు. ఆయన పరిశుద్ధుడు”
యజుర్వేదం లోని అధ్యాయం 9వ మంత్రంలో …
“ఆంధః తమ ప్రవిశ్యంతి యే ఆసంభూతి ముపాసతే” अन्धः तम प्रविष्यन्ति ये असम्भूति मुपासते
(యజుర్వేదం 40:9) ‘ఆసంభూతి (గాలి, నీరు, నిప్పులాంటి సహజ అంశాన్ని) ఆరాధించే వ్యక్తులు చీకటిలోకి ప్రవేసిస్తునారు’ అంటే నరకంలోకి ప్రవేశిస్తారు అని అర్ధం.
ఆ తర్వాత అదే అధ్యాయం లో
“తతో భూయ యివతే తమోయో ఊ సంభూత్యాగరతః” “ततो भूय इवते तमोयो ऊ सम्भू त्यागरतः”
(యజుర్వేదం 40:9) సంభూతి అంటే ఆట వస్తువులు, బొమ్మలు, విగ్రహాలు. వీటిని ఎవరైతే ఆరాధిస్తారో వారు మరింత అంధకారంలోకి అంటే మరింత నరకంలోకి ప్రవేశిస్తారని అర్ధం.
(యజుర్వేదం 31) “అప్పుడు విరాట్ ను సృష్టించడం జరిగింది.” “ఆ తర్వాత భూమి సృష్టించబడింది”
(యజుర్వేదం 13:4) “ఆదిలో హిరణ్యగర్భ్య, అనగా ఏకైక సృష్టికర్త ఉన్నాడు. ఆయన సూర్యుణ్ణి, భూమిని పోషిస్తున్నాడు. శుభప్రదమైన ఆయన్ని మేము ప్రస్తుతిస్తున్నాము ”
గాయత్రి మంత్రం వాస్తవికత
ఓం భూర్ భువత్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయః
(యజుర్వేదం 36:3) “ఓ దేవా! ఓ సచ్చిదానందా! ఓ నిత్యసుద్ధుడా! శుభప్రదమైనవాడా! జన్మమరణాది క్లేశరహితుడా! నిరాకారుడా! సర్వజ్ఞుడా! అన్నీ ఎరిగినవాడా! ప్రభువా! విశ్వపాలకుడా! ఓ సర్వాంతర్యామీ! ఓ కృపా సాగరా! నీవు విశ్వానికి జీవానివి. నీవు శుభప్రదమైన వాడివి. మా దుఃఖాలను, బాధలను చెరిపివేయడానికి నీ ఒక్క చూపు చాలు. నీవు విశ్వానికి ప్రభువువి. సర్వ సర్వసృష్టికర్తవి. నీ పవిత్ర ఆధిక్యతను గూర్చి నీకు యోగ్య మైన రీతిలో నిన్ను ప్రస్తుతించుదుమా?! నీవు మా బుద్ధికి సరైన మార్గం చూపేటందులకు. నీవు మా దేవుడివి. మా స్తోత్రానికి, మా పూజకు ఏకైక అర్హుడివి. నీకు సరిసమానమైనవాడు, నీకంటే ఉన్నతమైన వాడు మరేవడూ లేడు. నీవే మా సృష్టికర్తవు, పాలకుడవు, న్యాయ కారివి, నువ్వు మాత్రమే సంతోషాన్ని ప్రసాదించగలవు.
ప్రియ మిత్రులారా!
పై వేద మంత్రంలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. దేవుడు ఒకే ఒక్కడు. ఆయనకు సరిసమానులు ఎవరో లేరు. మనం ఆయన్నోక్కణ్నే పూజించాలి, ఆరాధించాలి. ఇక్కడ గాయత్రి మంత్రం గురించి మరికొద్దిగా తెలుసుకుందాం. నిజానికి ఇదో వేద మంత్రం. అసలు “గాయత్రి” అనేది ఒక సంస్కృత పదం. ‘గాయ’మరియు ‘అత్రి’ అనే రెండు పదాలతో ఈ పదం సృజించబడింది.
గాయ : అంటే గొంతు నుండి వెలువడే స్వరం.
అత్రి : అంటే స్తుతి
ఆ విధంగా “గాయత్రి” అంటే మన స్వరంతో విశ్వ ప్రభువును స్తుతించటం అన్నమాట. ఈ మంత్రంలో దేవుడు సత్యాన్ని తేటతెల్లం చేస్తున్నాడు. తన ఉనికికి ఒక ప్రత్యెక రూపం అంటూ ఏమీ లేదని ఆయన స్వయంగా ఈ మంత్రంలో ప్రకటించాడు. కాని ప్రజలు ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా ప్రజలు చేస్తున్న మరో ఘోరం ఏమిటంటే, ‘గాయతి’ని వారు స్త్రీ రూపంగా భావించి ఆమెను ఆరాదిస్తునారు. కనుక “గాయత్రి” అనేది ఓ మిధ్యా దైవం. నిజదేవుని స్థానంలో ప్రజలు ఊహించుకుంటున్న ఓ కల్పితదైవం. మనుషులు చేస్తున్న ఈ అనాచారాన్ని సర్వశక్తి మంతుడైన దేవుడు ఎంతవరకు క్షమిస్తాడు?!
(యజుర్వేదం 40:1) “మహోన్నతుడైన పరిపాలకుని చేత ఈ విశ్వం సృజించబడింది, ఈ పూర్తి ప్రకృతి పరిధిలోని ప్రతి ప్రపంచం కూడాను ఆయన నిజదేవుడు. ఆయనకు భయపడండి. మానవులారా! ఏ సృష్టి ఉనికి సంపదను అన్యాయంగా దాచకండి. అన్యాయమైన ప్రతి విషయాన్నీ తిరస్కరించండి. స్వచ్చమైన ఆనందాన్ని అనుభవించండి. ”
(యజుర్వేదం 13:4) “ఓ మానవులారా! దేవుడు సృష్టికి పూర్వం కూడా ఉన్నాడు. సూర్యుడు మొదలగు తేజోవంతమైన లోకాల ప్రభువు, ఆధారభూతుడు ఆయన. సృష్టించబడిన దానికి, సృష్టించబోయేదానికి ఆయన యజమాని. అప్పుడూ ఉండేవాడు, ఇప్పుడు ఉండేవాడు. ఎప్పటికీ ఉంటాడు. పృథ్వి మొదలుకొని సూర్యలోకము వరకు ఆయన సమస్తాన్ని సృష్టించి వాటిని పోషిస్తున్నాడు. శాశ్వత శుభప్రదమైన అస్తిత్వం ఆయనది. మేము చేస్తున్నట్లు మీరందరూ కూడా ఆయన్నే ప్రస్తుతించాలి.”
(యజుర్వేదం 30:8) “ఆయన ఎన్నడూ ఏ సరీరంతోనూ అవతరించలేదు. ఆయన ఎన్నడూ జన్మించలేదు. ఆయన ఎన్నడూ విభజించబడడూ. వేర్వేరు కాడు. శరీరావయవాలు, నరాల వ్యవస్థకు అతీతుడాయన. ఆయన ఎన్నడూ ఏ తప్పూ చేయడు. ఆయనకు బాధ కలుగదు. దుఃఖం అంటదు. అజ్ఞానం లాంటి అవగుణాలు ఆయనివి కావు.”
యజుర్వేదంలోని ఓ ప్రార్ధనా వాక్యం ఇలా ఉంటుంది.
(యజుర్వేదం 40:16) “సుఖములు ఇచ్చేవాడవు, స్వప్రకాశవంతుడవు, సర్వజ్ఞుడవు అయిన ఓ ప్రభూ! నీవు మమ్మల్ని శ్రేష్ట మార్గములో నడిపించి మాకు సంపూర్ణ జ్ఞానమును ప్రసాదించు. కుటిల పాపాచరణ రూపమైన మార్గం నుంచి మమ్మల్ని దూరం చేయి.”
ఖుర్’ఆన్ లోనూ సరిగ్గా ఇలాంటి ప్రార్దనే ఒకటుంది.
(ఖుర్’ఆన్ 1: 6-7) “మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి మార్గం, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు).”
సామవేదం:
(సామవేదం 7 : 3 : 8 : 1 6: 2 : 3 : 2) “శరీరంలోని ప్రధాన శక్తులు మొత్తం శరీర వ్యవస్థను నియంత్రించినట్లు, దానిని పాలించినట్లు యావత్ విశ్వ వ్యవస్థను నియంత్రించే, దానిని పాలించే ఓ ప్రాణా! మేము నే సన్నిధిలో వంగుతున్నాము.
అధర్వణ వేదం:
(అధర్వణ వేదం 20:58:3) “దేవో మహా అసి” దేవుడు నిశ్చయంగా మహోన్నతుడు”
(అధర్వణ వేదం 11:2:1) “ఆయన ఇంద్రుడు (సర్వ శక్తి మంతుడు, సర్వాదిక్యుడు).”
(అధర్వణ వేదం 14:1:1) “దేవుడు కాలానికి అతీతుడు. వినాశనం లేనివాడు. సూర్యుడు, బూమి,
ఇంకా ఇతర గ్రహాలన్నింటికీ పర్పోషకుడు.”
భ్రమల చీకట్లను పారద్రోలే సుప్రభాతము!
“కౌసల్యా సుప్రజా రామా! – కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా! రామా!
“పూర్వా సంధ్యా ప్రవర్తతే” – సూర్యోదయానికి వేళ అవుతుంది.
“ఉత్తిష్తా! నరశార్దూలా” – నరులలో పులివంటి వాడా! నిదుర లే!
“కర్తవ్యం దైవ మహ్నికం” – ఆ దైవాన్ని ఆరాధించుట నీ ప్రధమ కర్తవ్యం.
ప్రియ మిత్రులారా!
పైన పేర్కొనబడిన సుప్రభాత వాక్యాలు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాని మనలో చాలా మందికి ఆ వాక్యాల అర్ధం ఏమిటో తెలియదు. ఒకవేళ మనం పైన పేర్కొనబడిన సుప్రభాత వాక్యాలను ఒకసారి గనక క్షుణ్ణంగా చదివి అదం చేసుకుంటే, రాముడు కూడా మనలాంటి మానవ మాత్రుడేనని, తల్లి కౌసల్యకు పుట్టినటువంటి బిడ్డ అని, ఆయన స్వయంగా ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సర్వ సక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధించేవారన్న సంగతి స్పష్టంగా మనకు బోధపడుతుంది.
మనం నిజంగా రాముడిని ప్రేమించే వరమైతే, ఆయన్ను అనుసరించాలని అభిలషిస్తున్నట్లయితే ముందుగ మనం ఆయన తన జీవితాంతం ఏ దేవున్నైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆ ఏకైక దేవుణ్ణి ఆరాధించాలి.
క్రింద పెర్కొనబడుతున్న ఉపనిషత్ శ్లోకం దేవునికి తల్లిదండ్రులు లేరని స్పష్టం చేస్తోంది. కనుక రాముడు దేవుడు కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా ప్రతి రోజూ దైవిక విధులను ఆచరించి మనదరిని సృష్టించిన ఆ పరమ ప్రభువును ఆరాధిస్తూ ఉండేవారని తెలుస్తుంది.
“న చస్య కశ్చిత్ జనిత నచాదిపః” (न चास्य कश्चित् नचादिपः) శ్వేతాశ్వతర ఉపనిషత్తు (6:9)
“ఆయన పై అధిపతులు, యజమానులు లేరు”
సాయి బాబా ప్రవచనాలు :
సాయి బాబా తన జీవితాంతం ఈ క్రింది ప్రవచనాలు తరచూ పలుకుతూ ఉండేవారు.
“సబ్ కా మాలిక్ ఏక హై” – “सब का मालिक एक है !” అందరి దేవుడు ఒక్కడే.
“అల్లాహ్ మాలిక్ హై” – “अल्लाह मालिक है!” అల్లాహ్ యే దేవుడు.
“అల్లాహ్ భలా కరేగా” – “अल्लाह भला करेगा!” అల్లాహ్ మాత్రమే మేలు చేస్తాడు.
మిత్రులారా!
సాయి బాబా ఒక ఫకీర్. ఓ నిజమైన ముస్లిం (విశ్వాసి). ఆయన ప్రతి రోజూ చేయవలసిన విధి నమాజులను క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉండేవారు. ఖుర్’ఆన్ చదివేవారు. ఉపవాసం పాటించేవారు. అవసరాల్లో ఉన్నవారికి సహాం చేసేవారు.
“ప్రతి రోజు ఉదయం సాయి బాబా చాలా పెందలకడనే నిద్ర లేస్తారు. అన్నింటి కంటే ముందు నమాజులు ఆచరిస్తారు.”
(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 139వ పేజి)
తానూ ఓ దైవదాసుడినేనని సాయి బాబా స్వయంగా చెప్పి ఉన్నారు.
“నేను దేవుని దాసుణ్ణి. దేవుడు ప్రభువు మరియు యజమాని”
(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయిబాబా ది మాస్టర్” 228వ పేజి)
దేవుని పేరు ప్రస్తుతించమని, ధర్మగ్రందాలను అధ్యయనం చేయమనీ సాయి బాబా ప్రజలను ఎల్లప్పుడూ బోధిస్తూ ఉండేవారు.
“పని చేయండి, దైవనామాన్ని స్మరించండి. ధర్మగ్రందాలు చదవండి. పరస్పరం విద్వేషాలు,
జగడాలు మానుకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడతారు.”
(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 232వ పేజి)
అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడని సాయి బాబా చాలా స్పష్టంగా చెప్పారు.
“నిరు పేదలను కాపాడేవాడు అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరో దేవుడు లేనే లేడు”
(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 235వ పేజి)
తాను అల్లాహ్ దాసున్ణని సాయి బాబా చెప్పుకునే వారు.
“నేను ఎవరికీ నౌకరును కాను. నేను కేవలం అల్లాహ్ దాసుణ్ణి” “అల్లాహ్ నామమే శాస్వతమైనది”
(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 236వ పేజి)
అయితే సాయి బాబా గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా మనం అల్లాహ్ ను వదిలి పెట్టి సాయి బాబా ను ఎలా పూజించాగలం? మనం నిజంగా సాయి బాబాను ప్రేమిస్తున్నట్లయితే ముందు ఆయన బోధనలను ఆచరణలో పెట్టాలి. ఆయన జీవితం గడిపిన విధంగా మనమూ జీవితం గడపాలి. ఆయనే దేవుడైతే “సబ్ కా మాలిక్ ఏక్ హై ఎందుకు అంటారు? సబ్ క మాలిక్ మై హో అంటారు కదా? (అందరికీ దేవుణ్ణి నేనే అని) అంటారు కదా! కాని ఆయన జీవితంలో ఎన్నడు ఆ మాట చెప్పలేదు.