నిజ దైవానికి నిరుపమాన నిర్వచనం

Originally posted 2016-10-18 20:29:16.

”తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయ పడుతూ ఉండే వారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉంది”. (ఖుర్‌ఆన్‌-67:12) దేవుణ్ణి చూడకుండా విశ్వసించడమే అసలు జీవిత పరీక్ష.

”తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయ పడుతూ ఉండే వారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉంది”. (ఖుర్‌ఆన్‌-67:12) దేవుణ్ణి చూడకుండా విశ్వసించడమే అసలు జీవిత పరీక్ష.

మొది నిర్వచనం:

”ఓ మానవులారా! మిమ్మల్నీ, మీకు పూర్వం ప్రజల్నీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి. తద్వారానే మీరు కాపాడ బడవచ్చు, భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు”. (ఖుర్‌ఆన్‌-2:21)

గ్రహించాల్సినవి:
1) కేవలం మనందరి సృష్టికర్త మాత్రమే ఆరాధనకు అర్హుడు.
2) మనల్ని, మన ముందు తరాలను, తర్వాతి తరాలను ప్టుించినవాడు ఒక్కడే.
3) ఆయన పుట్టించేవాడేగానీ, పుట్టిన వాడు కాదు. ప్టుినదేది దైవం కాదు.
4) మనకు ముందు, తర్వాతి తరాలున్నట్లు ఆయనకు పూర్వీకులు ఎవ్వరూ లేరు.
5) ఆయన్ను ఆరాధించడం ద్వారానే మనిషికి ఇహపరాల ముక్తి మోక్షాలు ప్రాపిస్తాయి.

విజ్ఞప్తి:

మొట్ట మొది మానవునికి నేడు ఆరాధించబడుతున్న వారి పేర్లయినా తెలిసే అవకాశం ఉందా? అతను ఎవరిని ఆరాధించి ఉంటాడు. మొది మానవుడు ఆదం (అ). ఆయన ఆరాధించింది తన నిజ ప్రభువయిన అల్లాహ్‌నే. అలాంటప్పుడు మనమూ ఆయన్నే కదా ఆరాధించాలి.

రెండవ నిర్వచనం:

”ఇలా ప్రకించు: ఆయన అల్లాహ్‌ా ఒక్కడే. అల్లాహ్‌ నిరపేక్షాపరుడు. ఆయన ఎవరినీ కనలేదు. ఆయన కూడా ఎవరికీ పుట్టిన వాడు కాడు. ఆయనకు సాటి సమానమయిన వాడు ఎవడూ లేడు”. (ఖుర్‌ఆన్‌-112: 1-4)

గ్రహించాల్సినవి:
1) ఒక్కడే అంటే, ముక్కోటిలోని ఒక్కడు కాదు, ముగ్గురిలోని మూడవ వాడూ కాదు. ఎవడో ఒకడు కాదు. సర్వోన్నత నామాలు, సర్వోత్కృష్ట గుణాలు గలవాడు. అఖండం, అమోఘం, అమేయం, అజేయం, అద్వితీయం.
2) ఆయన నిరపేక్షాపరుడు. ఆయనకు భాగస్వామి అవసరం లేదు. ఎవరి మీదా ఆయన ఆధార పడడు. అందరూ ఆయన మీద ఆధార పడినవారే. ఆయన్ను ఒకరు కొలిస్తేనే దైవం కాదు, మానవ జాతి మొత్తం కలిసి ఆయన్ను కొలవడం మానేసినా ఆయన ఆరాధ్యుడే. మానవ జాతి మొత్త కలిసి ఆయన్ను స్తుతించినా ఆయన ఆరాధ్యుడే. కొలవడం, కొలవక పోవడం వల్ల లాభ నష్టాలు మనిషికేగానీ, ఆయనకు కాదు. అదే మనిషి చేసుకున్న దేవుళ్ళ ను కొలవడం మానేస్తే అవి అంతరించి పోతాయి. దీనికి సుదీర్ఘ మానవ చరిత్రే సాక్షి. ఒకప్పుడు కొలవబడేవి ఇప్పుడు కొలవబడటం లేదు. ఒక ప్రాంతంలో కొలవబడేవి మరో ప్రాంతంలో కొలవబడటం లేదు.
3) ఆయన ఎవరినీ కన లేదు. ”ఆకాశాలను, భూమినీ ఆవిష్కరించిన వాడు ఆయనే. అల్లాహ్‌ాకు భార్యే లేనప్పుడు ఆయనకు సంతానం ఎలా కలుగు తుంది?”. (ఖుర్‌ఆన్‌-6:101) ఆయన అజన్యం, అజరం, అనిద్రం, అపారం. ”అరల్లాహ్‌ ఎవరినీ కొడుకుగా చేసుకో లేదు. ఆయనతోపాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా (భాగస్వామి) లేడు. ఒకవేళ అలాిందేదైనా ఉంటే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరయి పోయేవాడు. ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేెసేవాడు”. (ఖుర్‌ఆన్‌-23: 91)
4) ఆయన ఎవ్వరికీ పుట్టిన వాడు కాదు. ఆయనకు తల్లిదండ్రులు లేరు. అనాదం, అనంతం, అపూర్వం. తల్లిదండ్రి లేకుండా పుట్టిన ఆదం దైవం కాదు. ఎందుకంటే తను అల్లాహ్‌ా ద్వారా పుట్టించ బడ్డాడు గనక, తనకు పుట్టిన వారూ ఉన్నారు గనక. గర్భం దాల్చే స్త్త్రీి లేకుండా ఆదం ప్రక్కటెముకతో ప్టుిన ఆది నారీమణి హవ్వా దైవం కాదు. తండ్రి లేకుండా పుట్టిన ఈసా (ఏసు) దైవం కాదు, ఇక్కడ వింత పుట్టుక పుట్టిన వీరిది కాదు మహిమ, వారిని పుట్టించిన వానిది అసలు మహిమ.
5) ఆయన్ను పోలినదిగానీ, ఆయనకు సరిసమానమయినదిగానీ ఏది లేదు. పోలిక ఉంది అంటే దైవం కాదు, సరిసమానమయిది ఉంది అంటే దైవం కాదు. ”ఒకవేళ భూమ్యాకాశాలలో అల్లాహ్‌ కాక ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే ఈ రెండింలోనూ ఆరాచకం ఏర్పడేది”. (ఖుర్‌ఆన్‌-21:22)
ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌ నిరపేక్షాపరుడు కాకపోతే ఒక్కడు కాలేడు. ఆయనకు అవతార అవసరం ఉంటే ఆయన నిరపేక్షాపరుడు, ఒక్కడుగా ఉండజాలడు. ఆయనకు భార్య పిల్లలుంటే ఆయన నిరపేక్షా పరుడు, ఒక్కడు కాలేడు. ఆయనకు తల్లిదండ్రులుంటే ఆయన ఒక్కడు, నిరపేక్షాపరుడు కాలేడు. ఆయనకు పోలిక, సమానం ఉంటే ఆయన ఒక్కడు, నిరపేక్షాపరుడు కాలేడు.

మూడవ నిర్వచనం:

”ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని సృష్టించాడు. తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు. మరి ఆయనే మిమ్మల్ని చంపుతాడు. ఆ తర్వాత మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి! ఈ పనులలో దేన్నయినా చేయ గలవాడు……మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ా ఎంతో పవిత్రడు, ఉన్నతుడు”. (ఖుర్‌ఆన్‌ -30: 40)
గ్రహించాల్సినవి:
1) ఆయన సృష్టించేవాడేగాని, సృష్టించ బడినవాడు కాదు. ”ఇదీ అల్లాహ్‌ సృష్టి! ఆయన మినహా వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపిం చండి”. (లుఖ్మాన్‌: 11)
‘మానవుడు కూడా ఎన్నో వస్తువులను తయారు చేస్తున్నాడుగా’ అని కొందరు అనొచ్చు. అల్లాహ్‌ ఏమి లేని శూన్య స్థితి నుండి ప్టుించేవాడ యితే, మనిషి అల్లాహ్‌ సృష్టించినవాిలో నుంచి తీసుకుని, ఆయన తనకిచ్చి తెలివిని, శక్తిని, సామర్థ్యాన్ని వినియోగించి ఒక వస్తువును తయారు చేస్తాడు. కనుక తయారు చేసినవాడు, తయారయిన వస్తువు రెండూ అల్లాహ్‌ సృష్టే. ”మరలాంటప్పుడు సర్వాన్ని సృష్టించేవాడూ, ఏమీ సృష్టించలేని వాడూ ఇద్దరూ ఒక్కటేనా? మీరు బుద్ధి పెట్టి ఆలోచించరా?” (ఖుర్‌ఆన్‌-16:17)
2) ఆయన మీకు జీవనోపాధిని సమకూర్చాడు. అంటే ఆయన పోషించే వాడేగాని, ఒకరి పోషణ అవసరం ఉన్నవాడు కాదు. మనిషి పెట్టే నైవేద్యాల అవసరంగానీ, మనిషి కట్టే గుళ్ళు గోపురాల అక్కరగానీ అయనకు లేదు. అన్నింకి ఆశ్రయం అయిన ఆయనకు ఆశ్రయ అవసరం లేదు. అందరికీ అన్నం పెట్టే ఆయనకు నైవేద్య అవసరం లేదు. అందరికీ బట్టననుగ్రహించే ఆయన బట్ట కట్టాల్సిన, కప్పాల్సిన అవసరం లేదు. అందరికీ రక్షణ ఇచ్చే ఆయనకు సీసీ కెమరాల, సెక్యూరిటీ గార్డ్‌ల అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో నివసించే 7 వందల కోట్ల మందికి, మనిషి గ్రాహ్య పరిధిలోకి వచ్చిన అనన్య ప్రాణులకు, గ్రాహ్య పరిధిలోకి రాని అగణ్య ప్రాణు లకు ప్రతి రోజూ, ఎక్కడ ఎవరికి ఎంత కావాలో అంత ఉపాధిని లక్షల సంవత్సరాలుగా ప్రసాదిస్తూ వస్తున్న వాడు అల్లాహ్‌.అలాంటీ ఉపాధి ప్రదాత కన్నా మహోన్నతమయిన ఉపాధి ప్రదాత మరొకడు ఉన్నాడా?

3) ఆయనే మనల్ని చంపుతాడు. మనందరి జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. అంటే పుట్టి గిట్టే వాడు దేవుడు కాదు. ”ఎన్నటికీ మరణించని వాడూ, నిత్యుడూ అయిన అల్లాహ్‌ానే నమ్ముకో”. (ఖుర్‌ఆన్‌-25:58)

నాల్గవ నిర్వచనం:

”నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణి ఎరుగదు మరియు తాను రేపు ఏ గడ్డపై మరణిస్తుందో కూడా ఎవరికీ తెలీదు. అల్లాహ్‌ సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు”. (ఖుర్‌ఆన్‌-31:34)

అసలు జీవిత పరీక్ష:

అంతటి జ్ఞాన, శక్తిమాన్యుడు అయిన అల్లాహ్‌ ఎందుకు కనబడడు? అని కొందరు ప్రశ్నించవచ్చు. ”ఎవరి చూపులు కూడా ఆయన్ను అందుకో జాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకో గలడు”. (ఖుర్‌ఆన్‌-6:103)
”తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయ పడుతూ ఉండే వారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉంది”. (ఖుర్‌ఆన్‌-67:12) దేవుణ్ణి చూడకుండా విశ్వసించడమే అసలు జీవిత పరీక్ష.

అయదవ నిర్వచనం:

”అల్లాహ్‌ ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. సజీవుడు, ఆధార భూతుడు. ఆయనకు కునుకుగానీ, నిద్దురగానీ తాకదు. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనదే. ఆయన ఆనతి లేకుం డా ఆయన సమక్షంలో సిఫారసు చెయ్యగల వాడెవ్వడు? వారి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుమ్టుి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ ఆలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్ప వాడు”. (ఖుర్‌ఆన్‌-255)

చివరి మాట:

”ఆయనే అల్లాహ్‌. మీ ప్రభువు. ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడెవడూ లేడు. సమస్త వస్తువులను సృష్టించిన వాడు ఆయనే. కాబ్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే”. (ఖుర్‌ఆన్‌-6:102)

Related Post