Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

అల్లాహ్ ఎవరు?

అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికి తెలిసిన ఆరాధ్యుడు. ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టి రాశులు ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే.

అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికి తెలిసిన ఆరాధ్యుడు. ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టి రాశులు ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే.

అల్లాహ్ భూమ్యాకాశాలకు మరియు సర్వానికి సృష్టికర్త. మీ సృష్టికర్త ను గురించి తెలుసుకొని, ఆతని ఆజ్ఞకు లోబడి ఎందుకు ఇస్లాం స్వీకరించాలో తెలుసుకొనండి. “దైవం గురించి మానవజాతి యెక్క తప్పుడు నమ్మకాలను, సిద్దాంతాలను సరిదిద్దడమే ఇస్లాం యెక్క ప్రధాన కర్తవ్యమని స్పష్టంగా అర్ధం చేసుకోండి”

విశ్వప్రభువుకు అన్ని విధాలా శోభాయమానమైన పదం ‘అల్లాహ్’
“అల్లాహ్” అనేది అరబీ భాషాపదం. ఇది “అల్” మరియు “ఇలాహ్” అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది. అల్ అనేది ఇంగ్లీషులో వాడబడే THE వంటి ఉపపదం – ఆర్టికల్. దీని అర్ధం నిర్దిష్టమైన, నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకూ ముందు ప్రస్తావించబడిన, ఏకైక మరియు వాస్తవమైన అని. అల్ (The) + ఇలాహ్ (God) = అల్లాహ్ (The God). ఇప్పుడు ఈ రెండు పదాలను (అల్ + ఇలాహ్)ను కలిపితే “అల్లాహ్” అనే పదం ఏర్పడింది. అదే విధంగా దాని ప్రత్యేక అర్ధం కూడా ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికి తెలిసిన ఆరాధ్యుడు. ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టి రాశులు ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వెల్లబుచ్చుతున్నవి మాత్రమే. అంతిమ లక్ష్యం వైపు పయనిస్తున్నవి మాత్రమే. తెలుగులో మనం ‘దేవుడు’ అంటాం. అరబీలో“అల్లాహ్” అంటారు. ఇంగ్లీషులో గాడ్ (God) అని అంటారు. ఇలా మానవుల ఆరాధ్యదైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. కాని ఇన్నిపదాల్లోకెల్లా “అల్లాహ్” అనేది ఎంతో విలక్షణమైన పదం. విశ్వప్రభువుకు అది అన్ని విధాలా శోభాయమానమైన పదం. అరబ్బీ మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు“దేవుడు” అనే పదానికి బదులుగా “అల్లాహ్” అనే పదాన్ని వాడుతారు. ఇంగ్లిష్ Bible లో God అని వాడిన చోటల్లా అరబిక్ Bible లో “అల్లాహ్” అనే పదం కనపడుతుంది.

అపోహ
ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో “అల్లాహ్” అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. ముస్లింలు, క్రైస్తవుల యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే “అల్లాహ్” అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ ఒక్కడే. దేవుడు ఎవరు? ఆయన అస్తిత్వం ఏమిటి? అనే విషయాల్లో యూదులు-క్రైస్తవులు-ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఉదా: క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వ భావన (Trinity) ను యూదులు తిరస్కరిస్తారు. ముస్లింలు కూడా దాన్ని తిరస్కరిస్తారు. అంతమాత్రం చేత ఆ మూడు మతాలకు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్ధం కాదు. ఎందుకంటే – విశ్వమంతటికి నిజదేవుడు ఒక్కడే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే – ఇతర మతాల వాళ్ళు కూడా అల్లాహ్ నే విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ ను ఏ విధంగా విశ్వసించాలో ఆవిధంగా విశ్వసించటం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకుని విశ్వసిస్తున్నారు.

అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు
అల్లాహ్ అంటే ముస్లిముల దైవం, ఇంకో పేరున మరోజాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ మరియు విశ్లేషణ దివ్య ఖుర్ఆన్ లో ఇలా ఉన్నది.
“మీరు చెప్పండి! ఆయన, అల్లాహ్ అద్వితీయుడు(ఒక్కడే). అల్లాహ్ నిరపేక్షాపరుడు (ఎవరి ఆధారము, అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే). ఆయనకు సంతానము ఎవరూ లేరు మరియు ఆయన ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులెవరూ లేరు.” సూరా అల్ ఇఖ్లాస్ 112:1 – 4
నీ ప్రభువు పుట్టుపూర్వోత్తరాలను, అయన వంశపరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవారాధకులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను డిమాండు చేసిన నేపధ్యంలో ఈ ఖుర్ఆన్ అధ్యాయం అవతరించింది.
అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్యుడు. ఆయనకు ఎవరి అవసరమూ లేదూ. ఆయన ఎవరిపైనా ఆధారపడిన వాడు కాడు. అందరికీ ఆయన అవసరం ఉంది. అందరూ ఆయన పైనే ఆధారపడి ఉన్నారు. అల్లాహ్ అందరికన్నా వేరైనవాడు, నిరపేక్షాపరుడు. ఆయనకు సంతానం లేదు. ఆయనకు తల్లిదండ్రులు సైతం లేరు. ఆయన ఎవ్వరినీ కూడా కుమారులుగా కాని, కుమార్తెలుగా గాని చేసుకోలేదు. ఆయన ఉనికిలో గాని, ఆయన గుణగణాలలో కానీ, ఆయన అధికారాలలో కానీ ఆయనకు భాగస్వాములు లేరు. ఆయనకు సరిజోడీ కూడా లేరు.
“ఆయన లాంటిది సృష్టిలో ఏదీ లేదు”. సూరా ఆష్ షురా 42 : 11
హదీస్ ఖుద్సీలో అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల ఈ విధంగా సెలవిచ్చాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

“మానవుడు నన్ను దూషిస్తున్నాడు. అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు. వాస్తవానికి నేను ఒక్కడినే. నేను నిరుపేక్షాపరున్ని. నేనెవరినీ కనలేదు. నేనెవరికీ పుట్టనూలేదు. నాకు సరిజోడీ కూడా ఎవరూ లేరు. ఈ విధంగా బహుధైవారాధకుల మూడనమ్మకాలు, అల్లాహ్ కు కుమారులను ఆపాదించే వారి మిధ్యా వాదాలు, దైవానికి భాగస్వాములను కల్పించేవారి యెక్క కాల్పనిక సిద్ధాంతాలు అన్నీ నిర్ద్వంద్వంగా ఖండించబడ్డాయి.

Related Post