మా నవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకు నేందుకు ఉరకలేస్తున్నాడు. సమా చార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురి ంచి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసుకునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం.
కనిపించేదే, వినిపించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం.
హేతువు మాటున చురకత్తి కదులుతుంది.
మనిషి బుద్ధి మార్గం తప్పుతుంది.
ఏదోక మాయ మనస్సుని క్రమ్ముకుంటుంది.
సత్యదర్శనం కరువవుతుంది.
కాబట్టి ఒక నిమిషం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం! మనం దేని కోసం పుట్టించ బడ్డాము? మన జీవిత లక్ష్యం ఏమిటి? సునిశిత మతి ఉంటే ఒక సూచన చాలు. లోతులు ముట్టే ఒక ఆలోచన చాలు.
సాధారణంగా ‘మానవ జీవిత లక్ష్యం ఏమిటి? అని మనం ఏ నలుగురిని అడిగామనుకోండి,వైవి ధ్యమయిన సమాధానాలు వినబడ తాయి. కారణం- ఆయా వ్యక్తుల ఆశయాలు, ఉద్దేశాలు ప్రాపంచిక మయినవి, పరిమితమయినవి మాత్రమే కావడం. వారు పరలో కం గురించి అక్కడ వారి కర్మలకు గాను వారికి లభించే శిక్షా బహు మానాల గురించి ఆలోచించకపోవ డమే.
మానవ జీవితం సప్త రంగులహరి విల్లు. మనిషి జీవితాన్ని ఏడుభాగా ల్లో విభజించవచ్చు.1) కుటుంబం. 2) ఆర్థికం 3) ఆరోగ్యం 4) ఆధ్యా త్మికం 5) వ్యక్తిగతం 6) వ్యాయా మం 7) సామాజికం. నేడు మనం కేవలం ఆధ్యాత్మిక లక్యం గురించి తెలుసుకోబోతున్నాము. ఎందు కంటే అదే మిగతా అన్నింటికి కేంద్రబిందువు గనక.
పెన్సిల్ ఉపమానం: ప్రతి వ్కక్తీ కొనగలిగేంతటి చౌకబారు వస్తువు పెన్సిల్. అ) మామూలపాటి ఈ పెన్సిల్ తనంటత తానుగా ఉనికి లోకి వచ్చిందా? లేదా దాన్ని తయారు చేసినవాడొకడున్నాడా?
‘పెన్సిల్ తనంతట తానుగా ఉని కిలోకి రాలేదు’ అన్నది మీ అందరి సమాధానం. తేలికపాటి పెన్సిల్ తనంతట తానుగా తయా రవ్వలేదు అంటే, ఈ సృష్టిబ్రహ్మాం డం, అందులోని మనం ఇట్టే యాదృచ్ఛికంగా, ఒక విస్పోటనం ద్వారా ఉనికిలోకి వచ్చేశాయను కోవడం ఎంతవరకుసహేతుకం?
”అది సరేగాని, మీరు వదిలే రేతస్సు గురించి ఎప్పుడయినా ఆలోచించారా? ఏమిటి, దాంతో మనిషిని సృష్టించేది మీరా? లేక మేము సృష్టిస్తున్నామా?… సరే! మీరు నాటే వస్తువును(విత్తనాన్ని) గురించి ఎప్పుడయినా ఆలొచిం చారా? ఏమిటి, దాన్ని మీరు పండిస్తున్నారా? లేక దానిని పండించేది మెమా?…..” (అల్ వాఖిఅహ్: 58-64)
అనగా సృష్టి, ఏ కర్తా లేకుండా ఉనికిలోకి వచ్చేసింది అన్నదీ సత్య దూరమే. సృష్టికి అనేక కర్తలు ఉన్నారు అనడమూ వ్యర్థ ఆలోచనే. ఇక –
ఆ) పెన్సిల్ రాయడం దానిలక్ష్యం గా తనకు తానే నిర్ణయించు కుందా, నిర్ణయించినవాడొకడు న్నాడా? ‘దాని తయారు చేసిన వాడే దాన్ని తయారు చేయక ముందే దాని లక్ష్యాన్ని నిర్ణయిం చాడు’ అనేది మీ సమాధానం. మరి చిన్న పెన్సిల్‌కే ఒక లక్ష్యాన్ని ఆ వస్తువు నిర్మాత నిర్దేశించిన ప్పుడు, సృష్టికే తలమానికమయిన మనిషి, మనిషి కోసం నిర్మించ బడిన ఈ విశ్వ వ్యవస్థ ఇట్టే అర్థ రహితంగా, లక్ష్యరహితంగా,గమ్య రహితంగా ఉనికి ఇవ్వడం జరి గిందా?
దివ్యఖుర్‌ఆన్, మోమినూన్ అధ్యా యం: 115వ వచనంలో మనం దరి సృష్టికర్త మనల్ని ఇలా ప్రశ్ని స్తున్నాడు: ”మేము మిమ్మల్ని ఏదో ఆషామాషిగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా వద్దకు
మరలి రావడమనేది జరగని పని అని భావిస్తున్నారా?”
”(ఆ విషయానికొస్తే) మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వాటిని -ఏ ఒక్కటినీ లక్ష్యరహితంగా పుట్టించలేదు. యాదృచ్ఛికంగా పుట్టామన్నది అవిశ్వాసుల భ్రాంతి మాత్రమే”. (స్వాద్: 27)
అంటే సృష్టికర్త మనిషిని ఈ భూమి మీద పుట్టించి, అతని జీవితానికవసర మయిన వస్తువులన్నింటిని సమకూర్చి పెట్టాడు. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు – ఒక్కటేమిటి, పరమాణవు మొదలు పంచభూతాల వరకూ అన్నీ మనిషి సేవ కోసమే పుట్టించాడు. మరి మనిషిని దేని కోసం పుట్టించి నట్టు?
దివ్యఖుర్‌ఆన్ 51వ అధ్యాయం, 56వ సూక్తిలో ఇలా సెలవియ్యబడింది: ”నేను మానవులను, జిన్నాతులను కేవలం నా ఆరాధన కోసం మాత్రమే పుట్టించాను”.
అంటే, సూర్యచంద్రనక్షత్రాలను పుట్టించి వాటి కోసం కొన్ని నియమనిబంధ నల్ని నిర్ణయించినట్లే మానవులకు కూడా కొన్ని నియమనిబంధనలుపెట్టాడు. వారందరి కోసం క్రమశిక్షణతో కూడిన జీవన సంవిధానాన్ని కేటాయిం చాడు. ఆయన నిర్దేశించిన ధర్మం ప్రకారం జీవిస్తే – మనిషి కుటుంబ జీవ నమయినా, అర్థిక, వ్యాయామ, సామాజిక, ఆరోగ్య, వ్యక్తిగత రంగాలన్నీ సక్రమంగా ఉంటాయి. ఆయా రంగాల్లో అతడు పడే శ్రమ దైవాజ్ఞబద్ధ మయి ఉన్నంత కాలం పుణ్యప్రదంగా, సత్కార్యంగా పరిగణించబడుతుంది. అది తోటి సోదరునితో అతని నగుమోము సంభాషణ అయినా, ప్రేమతో భార్యకు తినిపించిన ఒక ముద్దయినా ఆరాధనగా భావించబడుతుంది. కవి మాటల్లో చెప్పాలంటే,
ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలితముండబోదురా
సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా!
దేవుడొక్కడని విశ్వసించిన జీవితమగును శాంతిమయం
దైవదాస్యం చేసిననాడు కలుగును ఇహపర సాఫల్యం!
నీకు కలుగును ఇహపర సాఫల్యం!