మేము ఆదం సంతతికి గౌరవప్రతిష్ఠలు ప్రసాదించాం. వారికి నేలపై, నీటిపై ప్రయాణం చేయడానికి వాహనాలు, తినడానికి పరిశుద్ధమైన ఆహారపదార్థాలు ఇచ్చాం. మేము సృష్టించిన అనేక సృష్టితాలపై వారికి ఎంతో ఆధిక్యత, ఔన్నత్యం ప్రసాదించాం (బనీ ఇస్రాయీల్:70)
మహిళా స్థాయి
నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీ సమానత్వం, సాధికారత పేరుతో స్త్రీ విముక్తి మహిళా వాదం తదితర ఇజాల పేర్లతోనూ మహిళను తన సహజ స్థానం నుండి దిగజార్చే ప్రయ త్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంటిని వదిలి బయటకు రాకుండా స్త్రీ విముక్తి లేక సాధికారత సాధ్యం కాదని నేటి మహిళా సంఘాల తమ ప్రచార హోరుల ద్వారా మహిళా సమాజాన్ని ఉత్తేజ పరుస్తు న్నాయి. ఈ ప్రచార ప్రభావంలో స్త్రీలు ఇరు క్కోవడం, పురుషులకు కూడా ప్రయోజనకారి గా వుండటంతో వీరు కూడా వంత పాడటం మొదలెట్టారు. ఇంటిలో పిల్లల పోషణ, శిక్షణ, గృహ నిర్వహణతోపాటు ఆమె డబ్బు సంపా దించే యంత్రంగా మార్చడం తనకు అన్ని విధాలా లాభదాయకమని పురుషుడు భావించి స్త్రీ తన సహజమైన స్థానాన్ని వీడిపోయేందుకు సహకరిస్తున్నాడు.నేటి కుటుంబ వ్యవస్థ బీటలువారడానికి ప్రధాన కారణం ఇదే.
మానవ సమాజపు సూక్ష్మ రూపమే కుటుంబం! ఈ కుటుంబ వ్యవస్థ, అందులోని సభ్యుల మానసిక స్థితి, వారి స్థానాలు సహజంగానూ, ఆరోగ్యవంతంగానూ వుంటేనే సమాజం ఆరోగ్యవంతంగా వుంటుంది. సమాజ నిర్వ హణకు, సమాజ సభ్యుల మధ్య పని విభజన ఎంత అవసరమో… కుటుంబంలోనూ పని విభజన అంతే అవసరం. అప్పుడే ఇటు కుటుంబం, అటు సమాజంలోని కార్యాలు సవ్యంగా, సహజంగా, సుందరంగా, సశాస్త్రీయంగా నెరవేరుతాయి. పని విభజన అనేది కేవలం ఆర్థిక పరమైన పరిభాష కాదు. అది బాధ్యతాయుతమైన సంక్షేమకర పరిభాష కూడా. స్త్రీ,పురుషులిరువురూ వారి వారి శారీరక, మానసిక, ప్రాకృతిక మరియు సహజసిద్ధమైన భిన్నత్వాల మూలంగా వారివారి కార్యక్షేత్రాలు విభిన్నంగా, ప్రత్యేకంగా వుండక తప్పదు. ప్రకృతిని, అందులోని జంతుజాలాలను, వాటి మధ్యనున్న వైవిధ్యాలను పరిశీ లిస్తే… ఈ విషయమే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
చట్టాల ద్వారా కల్పించబడిన హక్కులు కేవలం మహిళా హక్కులుగానేకాక మానవ హక్కులుగా చూడాలి. కేవలం మహిళలకోసమే అని చూస్తే మహిళలకే అన్నీ చేస్తున్నారన్న భావన మగవారిలో కలుగుతుంది. దీంతో మరిన్ని బేధాభిప్రాయాలు వచ్చే అవకాశాలుంటాయి. మహిళలకు అనుకూలమైన చట్టాలు తీసుకురావడం అవసరమే కానీ వాటిని మానవ హక్కులుగా చూడడం అత్యంత కీలకం. అందుకు అనుగుణంగా మగవారిలో కూడా అవగాహన కల్పించడం మరింత అవసరం. స్త్రీలు సమానత్వాన్ని సాధించడానికి వారి హక్కుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఒక అనుకూల వాతావరణం కల్పించడం అత్యవసరం. దానికి మొదటి అడుగుగా మగవారికి ఈ అంశాలమీద అవగాహన కల్పించడం, వాళ్ళు ఒక సపోర్టు సిస్టంగా తయారవడం అన్నదానిమీద దృష్టి పెట్టాలి. స్త్రీలు, పురుషులు సమానంగా ఉంటే ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం, విలువలు ఉంటాయి కాబట్టి ఒకరిపై ఒకరికి ఆధిపత్యం, అణచివేత ఉండవు. అందుకే సమానత్వం అనేది ముఖ్యం.
అధికార సంబంధాల ద్వారా వచ్చే అసమానతలే లింగ వివక్ష. స్త్రీ, పురుషుల మధ్య ఏవైనా భేదాభిప్రాయాలు వచ్చినా పురుషులదే పైచేయిగా ఉంటోంది. కార్మిక, కర్షక రంగాల్లో ఒకే రకమైన పని చేస్తున్నా వారి వేతనాల విషయంలో మాత్రం సమానత్వం ఉండడంలేదు. ముఖ్యంగా అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో ఈ తేడా బాగా కనిపిస్తోంది. ఈ లింగ వివక్ష అనేది విద్య, ఉపాధి, ఆరోగ్యం విషయాల్లో అధికంగా కనిపిస్తోంది. దీనివల్ల మహిళలు సమాజంలో స్వేచ్చగా భావ ప్రకటన చేయలేకపోవడం, అభివృధ్ధిలో పాలు పంచుకునే అవకాశాలు తక్కువ కావడంతో ఇది కొన్ని సందర్భాల్లో పరోక్షంగా, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కూడా సమాజాభివృధ్ధికి ఆటంకమవుతోంది. హింసలేని సమాజం ఏర్పాటు కావాలంటే దానికి రాజకీయ పట్టుదల చాలా అవసరం.
హిందూ మతంలో స్త్రీ
స్త్రీలకు తండ్రి ద్వారాగానీ, భర్త ద్వారాగానీ ఆస్తిలో హక్కు ఉండేది కాదు. జీవన వ్యవహారాల్లో స్త్రీ పరుషులు రెండు వ్యక్తిత్వాలుగా గుర్తించ బడేవారు కాదు. పురుషుడు యజమానిగాను, స్త్రీ అతని ఆస్తి గానూ పరగణించబడేది. ఈ కారణంగా భర్త నుండి విడాకులు పొంద డంగాని, వేరే వివాహం చేసుకోవడానికిగాని అనుమతి ఉండేది కాదు. ఒకవేళ భర్త మరణిస్తే పతితోపాటు సతిని కూడా చితిపై పేర్చి నిర్ధాక్షి ణ్యంగా కాల్చేసేవారు. ఒకవేళ ప్రాణాలు మిగిలినా వితంతువుగా మిగి లిపోయిన వనితామణులకు పునర్వివాహ అనుమతి అస్సలుండేది కాదు.ఇది సరిపోదన్నట్లు ‘నియోగం’అన్న ఆచారంతో ఆమెను మరింత కించపర్చడం జరిగేది. ‘నియోగం’ అంటే స్వామి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రాకాశికలో వివరించినట్లు – వితంతువు మహిళ తన మరిదితోగానీ, మరొక అపరిచిత పురుషునితోగాని వివాహం లేకుండా శారీరక సంబంధం కలిగి ఉండటం. అలాగే భర్త బ్రతికున్న స్త్రీలు కూడా అతని అనుమతితో సంతాన ప్రాప్తి కోసం పరపురుషునితో జత కట్టవచ్చు. సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది, కొన్ని వర్గాలలో సతి, బాల్య వివాహాలు, విధవా పునర్వివాహాల నిషేధం వంటివి భారతదేశంలోని కొన్ని వర్గాల సామాజిక జీవనంలో భాగమయ్యాయి. భారత ఉపఖండంమీద ముస్లిం ఆక్రమణ భారతీయ సమాజంలో పరదా ఆచారాన్ని తెచ్చింది. రాజస్థాన్ రాజపుత్రుల లో జౌహర్ ఆచారం ఉండేది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దేవదాసీలు లేదా ఆలయ స్త్రీలు లైంగికంగా వేధించబడేవారు.
ఇదిలా ఉంటే, నేటి హిందూ వివాహ చట్టాన్ని రూపొందిం చడంలో చాలా వరకు ఇస్లాంలోని సామాజిక చట్టాల ద్వారా ప్రయోజనం పొందడం జరిగిందని డిస్కవరీ ఆఫ్ ఇండియాలో స్వయంగా నెహ్రూ గారే పేర్కొనడం గమనార్హం.
యూద మతంలో స్త్రీ
బైబుల్ ఆదికాండం 3/16(జెనిసిస్) లో దేవుడి వాక్యం ఇలా వుంది:
Unto the woman he said, I will greatly multiply thy sorrow and thy conception, in sorrow shall thou bring forth children and thy desire shall be to thy husband, and he shall rule over thee.”
“నేను నీ దుక్కన్ని, ప్రసవ వేదనను అమితంగా పెందుతాను. నువ్వు భాధ తోటే బిడ్డలను కనాలి. ని కోరిక నీ భార్తదే. అతడు ని మీద అధికారం చేలాయిస్తాడు.
స్త్రీలు అత్యధికంగా అపరిశుభ్రంగా ఉంటారని యూదులు భావించ డమే కాక, బహిష్టు దినాల్లో వారిని అన్నింటికీ ఎడంగా ఉంచేవారు. అలాగే కుమారుడు లేని పక్షంలో మాత్రమే కూతురికి ఆస్తిలో హక్కుం టుంది. కూతుళ్లల్లో కూడా తర్వాతి వారికంటే మొదటి వారికే నాలుగు భాగాలంత వాటా ఉంటుంది. అదే విధంగా విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ బైబిల్ ఇలా అంటోంది: ”స్త్రీ తరఫు నుండి అభ్యంతరం లేకపోతే విడాకుల పత్రం వ్రాసి ఆమె ఇచ్చి ఆమె తన ఇంటి నుండి బహిష్కరించాలి”.
క్రైస్తవ మతంలో స్త్రీ
క్రైస్తవులు తౌరాత్ ధర్మ శాస్రానికే ప్రాధాన్యతనిస్తారు. అయితే క్రైస్తవంలో స్త్రీ యూదత్వంలోకంటే ఎక్కువగా అవమానించబడింది. ‘ఆది మానవుడు ఆదం (అ) స్త్రీయే ఆయన్ను మోస పుచ్చింది’ అని క్రైస్తవం సూచిస్తుంది. క్రైస్తవంలోని పాపం-పరిహారం అన్న విశ్వాసాని కి ఈ భావనే పునాది. అలాగే సెంట్ పౌలు ‘పురుషుడు స్త్రీని తాకక పోవడమే మేలు’ అన్న ప్రతిపాదననుసరించి క్రైస్తవ సమాజంలో ఒక సుదీర్ఘ కాలం వరకు సన్యాసత్వం అట్టహాసంగా అమలయింది. అప్ప ట్లో ఆడపడచు మానవ సమాజమ పాలిట వినాశకారిణిగా పరిగణించ బడేది. చివరి ఆమె రక్తం పంచుకు పుట్టిన పురుష పుంగవులు సయి తం ఆమెను ద్వేషించే దుస్థితి. అలాగే విడాకులు, పునర్వివాహ హక్కు స్త్రీకి ఉండేది కాదు.
డోమనిక్ క్రైస్తవ సన్యాసి అభిప్రాయం ప్రకారం – “Woman is the confusion of man, (Barbara Tuchman, Page num 211)
“ఆడదంటే మగవాడికి ఒక భ్రమ కారణం. సంత్రుప్తిపరచ శక్యం గాని మృగం, ఎప్పుడు వుండే ఆందోళన, అంతులేని సమరం, నిత్య నాశనం, కల్లోలానికి నెలవు, భక్తికి అవరోధం.”
“ఆడవాళ్ళకు శారీరక వాంఛలు ఎక్కువ. (ఎందుకంటే) వాళ్ళు మగవాడి పక్కటెముక నుండి పుట్టిన అసంపూర్ణ వికృత జంతువులు. మగవాడు విశిష్ట తరగతికి చెందినవాడు కాబట్టి క్రీస్తు మగవాడుగా పుట్టాడు.” – ( Walter Nigg, The Heretics: Heresy through the Ages, Edited and Translated by Richard and Clara winston, New York, Dorset press, 1962.)
“It is good thing for a man to have nothing to do with a woman.”
– (Bible, I Corinthians. 7:1)
“పురుషుడు ఆడదానితో సంభందాన్ని పూర్తిగా వదులుకోవడం మంచిది”. – బైబుల్, కోరింతియులు, 7:1
దాయ క్రైస్తవ దృక్పథం ప్రకారం ఆడదే అన్ని పాపాలకు మూలం.
“Of woman came the beginning of sin. And thanks to her, we all must die.” ( Bible Aprocrypha, Ecclesiasticus 25/13-26)
“ఆడదాని నుండి పాపం మొదలైంది. ఆమె మూలంగా మనమంతా చావాలి.” (బైబుల్ ఎపోక్రిఫా, ఎక్లేసియాస్టికస్ 25/13-26)
protestants లో ఒక వర్గమైన లుధరెన్ క్రైస్తవులువిట్టెంబర్గ్ అనే చోట సమావేశమై “ఆడవాళ్ళు మనుషులా కాదా?” అనే విషయం పైన తీవ్రంగా చర్చించారట.
“nothing deficient or defective should have been produced in the first establishment of things; so women ought not to have been produced then.” (Saint thomas Aquinas, Summa Theologica, New York&London, Blackfriars, McGrawHill, Eyre&Spothiswood. Question 92,35.)
13 వ శతాబ్దానికి చెందినా సుప్రసిద్ధ క్రైస్తవ విద్వాంసుడు, చర్చి అధిపతి సెయింట్ థామస్ ఆక్వినాస్ ….. దేవుడు స్త్రీ లను సృష్టించి పొరపాటు చేసాడని అభిప్రాయపడ్డాడు. “సృష్టి యొక్క మొదటి విడతలోనే లొపభుఇస్తమైన వస్తువులను సృష్టించి ఉండకూడదు. కాబట్టి దేముడు అడదాన్ని అప్పుడు సృస్టించకుండా వుండాల్సింది.”
10వ శతాబ్దానికి చెందినా క్రైస్తవ ప్రముకుడు Odo of cluny ఇలా ప్రకటించాడు:
“To embrace a womanish to embrace a sack of manure.”
“ఆడదాన్ని కౌగలించుకోవడం ఒక పెంట బస్తాను కౌగాలించుకున్న దానితో సమానం.”
6వ శతాబ్ది లో council of Macon అనే బిషప్పు ల సమావేశం జరిగింది. ఆ సమావేశం లో “ఆడడానికి ఆత్మ వుందా లేదా” అనే విషయం మీద బిషప్పులందరూ చర్చించి ఓట్లు వేసి “ఆడద్దనికి ఆత్మ ఉండదు” అని తీర్మానించారు.
6వ శతాబ్ది కి చెందిన క్రైస్తవ తత్వవేత్త బోధియస్ (Boethius) తన గ్రంధం the consolation of philosophy లో ఇలా రాసాడు:
“Woman is a temple built upon a sewer.” “ఆడదంటే మురికి గుంత మీద కట్టిన గుడి వంటిది.”
2వ శతాబ్ది లో Alexandria కు చెందినా సెయింట్ క్లిమొంట్ ఇలా రాసాడు:
“Every women should be filled with shame by the thought that she is a woman.” ( the Natural Inferiority of women, Compiled by Tama Starr, New York, Poseidon press, 1991, page 45)
“ప్రతీ ఆడది తాను ఆడదై పుట్టినందుకు సిగ్గుతో నిండిపోవాలి.”
ప్రోతస్ట్oటు మత ప్రముకుడు మార్టిన్ లుధెర్ ఇలా రాసాడు:
“If a woman grows weary and at last dies from child nearing, it matters not. Let her die from bearing, she is there to do it.”
“ఆడది పిల్లలను కని, కని కృశించి చస్తే చావని, పరవాలేదు. పిల్లలని కనడమే ఆమె పని.”
టెరటులియన్ చర్చి ఫాదర్ ఇలా రాసాడు :
“Each of you women is an Eve…… You are the gate of Hell, you are the temptress of the forbidden tree; you are the first -deserter of the divine law.”
“మీ ఆడవాళ్ళుల్లో ప్రతివొక్కరు ఒక హవ్వ ….. (ఓ స్త్రీ!) నువ్వు నరకానికి ద్వారానివి, నిషిదవృక్షం వైపు ఆకర్షించినదానివి , నువ్వే దైవ శాసనాన్ని ధిక్కరించిన మొదటి దానివి.”
కొత్త నిభందన ఎలా చెప్తుంది –
Let the woman learn in silence with all subjection. But I suffer not a woman to teach, nor to usurp authority over the man, but to be in silence. for Adam was first formed, then Eve. And Adam was not deceived, but the woman being deceived was in the transgression. – ( Bible, I Timothy, 2:11-14)
“ఆడది మౌనంగా, లొంగి వుండడం నేర్చుకోవాలి. ఆడది భోధించ కూడదు, మగవాడిమీద అధికారాన్ని చెలాయించ కూడదు. అణిగి మణిగి వుండాలి ఎందుకంటే ఆదాము ముందు రూపొందాడు. తరువాత హవ్వ. ఆదాము మోసపోలేదు. హవ్వ మోసపోయి, దారి తప్పింది. ( బైబుల్, తిమోతి, 2:11-14)
ఈరాన్‌లో స్త్రీ
ఈరాన్ స్త్రీల విషయంలో విచిత్ర వాదానికి దిగింది. ‘మజ్‌దక్’ అన బడే వ్యక్తి ప్రతిపాదన మేరకు – స్త్రీలు పురుషుల ఉమ్మడి సొత్తు. తత్ఫ లితంగా వారిని ఆస్తిని పంచుకున్నట్లు పంచుకునేవారు. ఈ వికృతా చారం ఎంతగా ప్రబలిందంటే వావివరసులనేవి పూర్తి తుడిచి పెట్టుకు పోయాయి. ఈ పొకడకు వ్యతిరేకంగా మరొక సిద్ధాంతి ‘మాని’ పేరుతో ఒక ఉద్యమం లేవదీశాడు.ఇది మరో అనర్థానికి దారి తీసింది. అతడు భార్యాభర్తల సంబంధాన్ని కూడా అధర్మమని ఖరారు చేశాడు. ఈ రెండు అతివాదాల నడుమ నలిగింది మాత్రం అతివలే.
రోము, గ్రీకు సమాజంలో స్త్రీ
గ్రీకులలో అడపడచులు అంగడి వస్తువులా అమ్మబడేవారు. నేటి కట్నం అనే రాక్షస ఆచారం కూడా వారినుండి సంక్రమించినదే.చట్టం రీత్యా ఒకే భార్య కలిగి ఉండే అనుమతి ఉండేది. కాని చట్ట విరుద్ధమ యిన అక్రమ సంబంధాలకు ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. ప్రొఫె సర్ ‘లీకి’ ప్రకారం-గ్రీకులో అశ్లీలత, నీతి బాహ్యత విడాకులు ఎంత గా ప్రబలాయంటే వేశ్యల వద్దకు వెళ్లడం వినా జాతి నాయకుల వంటి వారికి సయితం మార్గాంతరం ఉండేది కాదు. గ్రీకు సంస్కృతి నుండే రోము సంస్కృతి పుట్టుకు వచ్చింది. తత్కారణంగా ఇవే దురాచారాలు వారిలోనూ ఉండేవి.
అరేబియాలో స్త్రీ
ఏ భూభాగం నుండయితే ఇస్లాం కాంతి ప్రసరించిందో అక్కడ కూడా ఆడపిల్లల స్థితి చాలా దారుణంగా ఉండేది. ఆడ శిశువు పడితే సజీ వంగా పాతి పెట్టేవారు. ఆస్తిలో స్త్రీకి ఎలాంటి వాటా ఉండేది కాదు. సవతి తల్లుల్ని వివాహమాడే దురాచారం ఉండేది. వితంవుల విషయం లో న్యాయసమ్మతమయిన చట్టంఉండేది కాదు.భారత దేశంలో పాండ వుల మాదిరిగానే ఏక సమయంలో ఒక స్త్రీకి నలుగురేసి భర్తలుండే వారు. ఈ వివాహాన్ని ‘రహత్’ వివాహంగా పిలిచేవారు. ‘రవికల పండుగ’ మాదిరి భార్యలను మార్చుకునే నికృష్ట ఆచారం కూడా ఉండేది.
ప్రస్తుత సమాజంలో స్త్రీల పరిస్థితి సమాజంలో స్త్రీల స్థితి కొత్తదీ కాదు, పూర్తిగా పరిష్కరించబడనూలేదు. ఇస్లాం గురించి చెప్పేటప్పుడు స్త్రీలకు స్వేచ్చ లేదనీ, ఇంటివరకే– వంటవరకే పరిమితమైపోయిందనీ ప్రచారం చేస్తారు.కొందరైతే పరదా మూలంగా స్త్రీల స్వేచ్ఛ, ఎదుగుదల ఆగిపోయిందని గంటల కొద్దీ చెబుతూ పోతారు. వారందరికి ఒకే ప్రశ్న చాలు. అదేమిటంటే – యూరోప్, అమెరికాలాంటి నాగరికత దేశాలలో, అక్కడే పుట్టి పెరిగిన ఆడవారు ఇస్లాం ఎందుకు స్వీకరిస్తున్నారు. అక్కడి స్త్రీలు పాశ్చాత్య దేశాలు ఇస్తున్న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని విడిచి, స్త్రీల స్వేచ్ఛకు అడ్డువేసే ఇస్లాం ను ఎందుకు అవలంబిస్తున్నారు?
పాశ్చాత్య దేశాల ‘స్వాతంత్ర్యాన్ని’ తిరస్కరించుట
పాశ్చాత్య ప్రపంచం ప్రకృతిపై తిరుగుబాటు చేసి సామాజిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఫలితంగా కుటుంబ వ్యవస్థ అంతరించి పోతోంది. వ్యక్తికి తన వంశం ఏదో తెలియయని దౌర్భాగ్య స్థితి. ఈ వికృత పోకడ అందరికంటే అధికంగా అబలను అవమానం పాలు చేసింది. ఆమె బ్రతుకు తెరువు కోసం బయట వెళ్ళాల్సిన గత్యంత రానికి కారణం అయింది. తాను బైట పని, ఇంటి పని, వంట పని, భర్త ఒంటి పని కూడా చేయాలి. వాణిజ్య ప్రకటనల్లో తానే అంగడి బొమ్మనవ్వాలి. సిగ్గు, సిరిని వదిలేసి, మానం మర్యాదను తగలేసి వీరు చేసే ఈ వర్తకం పూర్తి మానవతకే కళంకం. పూర్వపరాల్లోకెళితే –
పాశ్చాత్య దేశాల స్వాతంత్ర్యం స్త్రీలను దిగజార్చుతుంది, అదే ఇస్లాం వీరిని ఉన్నత స్థానం ఆపాదిస్తుంది. వారు స్త్రీల కొత్త సమస్యలు లేవనెత్తి పాత సమస్యలను వదిలేస్తున్నారు. మీడియా పురుషులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అందుకే అక్కడి స్త్రీలు ఇస్లాం వైపు మొగ్గు చూపుతున్నారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అన్నారు: మీరూ, మీ భార్యలూ సంతోషంగా (సగౌరవంగా) స్వర్గంలో ప్రవేశించండి.ఖుర్ఆన్ సూరా జుఖ్రుఫ్ 43:70
విటన్నింటికీ భిన్నంగా ఇస్లాం ప్రసాదించిన సామాజిక చట్టం అతివల ఆత్మ గౌరవానికి, మహిళల మానం, మర్యాదలకు పెద్ద పీట వేసింది. ఇస్లాం స్త్రీకి ప్రసాదించిన సామాజిక స్థాయిని సంక్షిప్తంగా ఇక్కడ పొందు పరుస్తున్నాము.
ఇస్లాం ధర్మంలో స్త్రీ
ముహమ్మద్ ప్రవక్త (స) ప్రభవనకు పూర్వం సమాజం ఎలా ఉండేదో ఊహిస్తే ఒళ్లు జలదరిస్తుంది. అజ్ఞానాంధకార విష వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమాజమది. ‘కర్రగల వాడిదే బర్రె’ అన్న చందంగా బలవంతుడు బలహీనుడిని పీక్కుతినేవాడు. బడుగు, బలహీన వర్గాల హక్కులు, నిర్దాక్షిణ్యంగా కాలరాయబడేవి. అవినీతి, అక్రమాలు, దోపిడి, దౌర్జన్యాలు, సారాయి, జూదం, అశ్లీలత, వడ్డీ పిశాచం, హత్యలు, అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ ఖననం, భ్రూణహత్యలు తదితర సామాజిక నేరాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. ఆ కాలంలో స్త్రీజాతికి అసలు ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఉనికినే అంగీకరించేది కాదు ఆనాటి పురుషాధిక్య సమాజం.
మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారు ప్రభవించిన సమయానికి నిస్సహాయులు, అణగారిన రెండు వర్గాలు ఉండేవి. ఒకటి స్త్రీల వర్గం, రెండవది బాలిసల వర్గం. అలాంటి సమాజంలో, అలాంటి వాతావరణంలో జన్మించిన ముహమ్మద్ ప్రవక్త (స) తన ఇరవై మూడేళ్ల దైవ దౌత్యకాలంలో అంతటి ఆటవిక సమాజాన్ని అన్నివిధాలా సమూలంగా సంస్కరించారు. దేవుని ఏకత్వం, పరలోక విశ్వాసం అన్న భావజాలాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించి, దేవుని ముందు జవాబుదారీ భావనను ప్రోది చేశారు. అన్ని రంగాల్లో, అన్ని విధాలా పతనమై పోయిన ఒక జాతిని కేవలం ఇరవైమూడేళ్ల కాలంలో సంపూర్ణంగా సంస్కరించడమంటే మామూలు విషయం కాదు. యావత్తూ అరేబియా ద్వీపకల్పం విగ్రహారాధనను వదిలేసి, దేవుని ఏకత్వం వైపు పరివర్తన చెందింది. తెగల మధ్య అంతర్ యుద్ధాలు అంతమై, జాతి సమైక్యమైంది.
అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితం, శిశుహత్యలు, అత్యాచారాలు అన్నీ పూర్తిగా సమసిపోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుండి స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్లూనుకుంది. అన్నిరకాల అసమానతలు అంతమైపోయాయి. బడుగు, బలహీనవర్గాల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ముహమ్మద్ మాత్రమేనని ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూలగ్రంథాలు ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది.
మేధావి అన్నాదోరై (మద్రాసు నగరంలో మహానగర తీరాన)
మహనీయ ముహమ్మద్ (స) అన్ని వర్గాల ప్రజలతోపాటు ముఖ్యంగా ఈ ఇరు వర్గాల పట్ల మరింత కారుణ్యంతో వ్యవహరించారు. ఇస్లాం స్త్రీలకు గౌరవాన్నిచ్చింది అనడానికి నిద ర్శనం ఖుర్‌ఆన్‌లో 176 వాక్యాలు గల ఒక పూర్తి సూరా (అధ్యాయం) స్త్రీల కోసమే అవతరించింది. ఆ సూరా పేరు ‘అన్నిసా- స్త్రీలు’. ఖుర్ ఆన్‌లోని మరో సూరాకు పుణ్యస్త్రీ పేరయిన ‘మర్యం’అని పెట్టబడింది. అలాగే అల్లాహ్‌ా విశ్వాసుల కోసం ఆదర్శంగా తోటి విశ్వాసుల్ని పేర్కొ ంటూ ఇద్దరు స్త్రీలను-ప్రవక్త ఈసా (అ) గారి మాతృమూర్తి హజ్రత్ మర్యమ్ మరియు నియంత ఫిర్‌ఔన్ సతీమణి హజ్రత్ ఆసియా బిన్త్ ముజాహిమ్ (అ)ల పేర్లను ప్రస్తావించాడు అంటే అల్లాహ్ స్త్రీలకు ఏ స్థాయి గౌరవాన్ని ఇచ్చాడో ఇట్టే అర్థమవుతుంది.
20వ శతకంలో పాశ్చాత్య దేశాల్లో స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, విమోచన లభించిందని ప్రజలు అనుకుంటున్నారు. వాస్తవానికి స్త్రీల విమోచన పురుషుల ద్వారానో, స్త్రీల ద్వారానో మొదలు కాలేదు. మానవ జాతి మేలు కోసం పంపబడిన తన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా అల్లాహ్ దీన్నిఏడవ శతకంలో అవతరింపజేశాడు. ఇస్లాంలో ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా స్త్రీల హక్కులు, బాధ్యతలు తెలియజేయబడ్డాయి.
ముస్లిం దేశాల్లో లింగవివక్ష ఒకరకంగా తక్కువే అని చెప్పొచ్చు. పుట్టకముందు లింగ పరీక్షలు లేకపోవడం, ఏదైనా కారణాలచేత పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసినా అబార్షన్ వంటివి చేయించకపోవడం వంటివి దీనికి ముఖ్య కారణాలు. ఇవన్నీ ఇస్లామిక్ పధ్ధతికి వ్యతిరేకం. అయితే ఆయా దేశాల్లో కూడా వెనుకబడిన ప్రాంతాల్లో ఈ లింగ వివక్ష అనేది కనిపిస్తుంది. నిరక్షరాస్యత, ప్రభుత్వ పథకాలు ఆయా ప్రాంతాలకు సరిగ్గా చేరకపోవడం వంటికి దీనికి ప్రధాన కారణం. అలాగే అక్కడి పరిసరాలు, సాంస్కృతిక పధ్ధతులను అనుసరించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)సూక్తులు =- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొన్ని ప్రసిద్దిగాంచిన సూక్తులు :”తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది.” ఇబ్న్ మాజా 2771.
ఒక వ్యక్తి ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ను నేను ఎవరికి ఎక్కువగా సేవ చేయాలి అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నీ తల్లి అని మూడు సార్లు అన్న తరువాత, నీ తండ్రి, ఆ తరువాత నీ దగ్గరి బంధువులు అని అన్నారు. సహీహ్ అల్ బుఖారీ వాల్యూం 8:2, సహీహ్ అల్ ముస్లిం 6181
అబూ హురైరా (రజి అల్లాహు అన్హు) సెలవిచ్చారు : ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి, భార్యలను బాగా చూసుకొనేవాడే మీలో అందరికంటే మంచివాడు, ఒక ముస్లిం తన భార్యను అసహ్యించుకోకూడదు, ఒక విషయంలో ఆమె తప్పు చేసినా ఆమెలోని మంచి విషయాన్ని చూసి ఆమె తప్పులను మన్నించాలి, భార్యతో చాలా మంచిగా ఉండే భర్తయే ఉత్తమ విశ్వాసి” అని అన్నారు. సహీహ్ అల్ ముస్లిం 3469, తిర్మిజీ 278.
నిర్ధారణ
ఏ మనిషైతే స్త్రీని గౌరవించి, ఆమెతో న్యాయంగా మెలుగుతాడోఅతనే నిజమైన మగాడు మరియు మర్యాదస్తుడు, అదే ఎవడైతే ఆడవారిని అవమానపరుస్తాడో అతడు చాల చెడ్డ వ్యక్తి అని ఇస్లాం బోధిస్తుంది.
“అందరికంటే ఉత్తమమైన వ్యక్తిత్త్వం గలవాడు పూర్తి విశ్వాసి. మీలో మీ ఇంటివారితో ఉత్తమంగా మేలిగేవాడే అందరికంటే ఉత్తముడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు.తిర్మిజి1162
వివరాల్లోకెళితే –
సమానత్వంకన్నా న్యాయమే ప్రాధానం
ఇస్లాం స్త్రీపరుషుల మధ్య సమానత్వం, సమాన స్థాయి గురించి ఆదే శించిందని సాధారణంగా కొందరు అంటుంటారు. ఇది నిజం కాదు. ఇస్లాం ఇద్దరి మధ్య న్యాయం గురించి ఆజ్ఞాపించింది. న్యాయం అంద రికి వారి ప్రతిభాపాటవాలను పరిగణలోకి తీసుకోకుండా సమాన స్థాయిని కల్పించడం కాదు. అర్హతను బట్టి తగిన స్థానాన్ని ఇవ్వడం. స్త్రీ పురుషుల సామర్థ్యాలలో ప్రకృతి రీత్యా వ్యత్యాసం ఉంది. ఈ తేడా ను గమనించకుండా ఇద్దరిపై ఒకే విధమయినటువంటి బాధ్యతలను మోపడం ఎంత మాత్రం న్యాయం అన్పించుకోదు. అందరికీ అన్నీ ఇచ్చేయడం కాదు, ముందు వారి సామర్థ్యాలను చూడాలి. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు, పండితులు, పామరులు, ధనవంతులు, పేదవారు-అందరిపై ఒకే విధమయిన టువంటి బాధ్యత ల్ని మోపడం ఏ విధంగానూ వివేకం అన్పించుకోదు. కాబట్టి బాహ్య ప్రపంచానికి అనుకూలంగా పురుషుడి సృజన జరిగింది గనక ఇస్లాం బైటి వ్యవహారాలు పురుషునికి అప్పగించి, ఇంటి వ్యవహారాలు స్త్రీకి అప్పగిస్తోంది. దీనర్థం ఒకరి స్థాయి ఎక్కువ, మరొకరి స్థాయి తక్కువ అని ఎంత మాత్రం కాదు.
ఖుర్ఆన్
ఇస్లాం లో స్త్రీ అయినా, పురుషుడైనా అల్లాహ్ కు సమానం. వారి కర్మలకు చెందినంతవరకు స్త్రీ అయినా, పురుషుడైనా మంచి పనికి మంచి బహుమానం మరియు చెడ్డ పనికి ఘోరమైన శిక్ష అనుభవిస్తారు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి – కాని ఉత్తమ రీతిలో! కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకింత ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు.ఖుర్ఆన్ సూరా బఖరా 2:226
హదీస్
ఖచ్చితంగా స్త్రీలు పురుషులు సమాన భాగాలు. తిర్మిజి,113; సహీహ్ హుత్ తిర్మిజిలో అల్బాని గారు దిన్ని ధ్రువీకరించారు.
ముస్లిం స్త్రీలకు1400సంవత్సరాల క్రితం ఏ పాత్రలు, బాధ్యతలు, హక్కులు ఇవ్వబడ్డాయో అవి నేటి స్త్రీలకు – పాశ్చాత్య దేశాల్లో – కూడా లేవు. సమాజంలో సమతూకం కోసం ఇవి అల్లాహ్ తరఫున అవతరింపజేయబడ్డాయి. ఒక్కోచోట ఏదైనా తప్పినట్టు కనిపిస్తే అది వేరేచోట పూర్తి గావించబడుతుంది. ఇస్లాం ముస్లింలకే కాదు పూర్తి మానవాళికి ఆచరించదగ్గ జీవనసరళి.
స్త్రీలు ఇస్లాంవైపుకు ఎందుకు మరలుతున్నారు
ప్రస్తుతం మీడియా ఇస్లాం పై అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ, లేని పోని అభాండాలు వేస్తున్నప్పటికీ, ఇస్లాం స్త్రీలను నొక్కిపెడుతుందని చెబుతున్నప్పటికీఅల్లాహ్ కృప వల్లప్రపంచంలో వేగవంతంగా ప్రజలు స్వీకరిస్తున్న ధర్మం ఇస్లాం.ఇందులో విశేషమేమిటంటే ఇస్లాం స్వీకరిస్తున్న వారిలో ఎక్కువ శాతం ‘స్త్రీలే’.
స్త్రీ, పురుషునిలో ఒకే ఆత్మ
6వ శతాబ్ది లో council of Macon అనే బిషప్పు ల సమావేశం జరిగింది. ఆ సమావేశం లో “ఆడడానికి ఆత్మ వుందా లేదా” అనే విషయం మీద బిషప్పులందరూ చర్చించి ఓట్లు వేసి “ఆడద్దనికి ఆత్మ ఉండదు” అని తీర్మానించారు.
పురుషులకంటే తక్కువ స్థాయి గల సృష్టిరాసిగా స్త్రీని భావించడాన్ని ఖుర్‌ఆన్ ఖండిస్తోంది: ”మానవులారా! మీ రపభువుకు భయ పడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఆదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు”. (దివ్యఖుర్‌ఆన్-4:1)
స్తీ శాశ్వత వ్యక్తిత్వం గలది
protestants లో ఒక వర్గమైన లుధరెన్ క్రైస్తవులువిట్టెంబర్గ్ అనే చోట సమావేశమై “ఆడవాళ్ళు మనుషులా కాదా?” అనే విషయం పైన తీవ్రంగా చర్చించారట. (వివరాలకు చుడండి – Karen Armustrong, The Gospel According to women: Christianity’s creation of the sex war in the west. New York, Donbleday, 1986)
స్త్రీని శాశ్వతమయిన వ్యం గలది ఇస్లాం పేర్కొంటుంది. ”మంచి పనులు చేసేవారు-పరుషులయినా, స్త్రీలయినా వారు విశ్వాసులయిన పక్షంలో స్వర్గంలో ప్రవేశిస్తారు”. (దివ్యఖుర్‌ఆన్-4: 125)
సామాజిక హక్కు
2వ శతాబ్ది లో alexandria కు చెందినా సెయింట్ క్లిమొంట్ ఇలా రాసాడు:
“Every women should be filled with shame by the thought that she is a woman.” ( the Natural Inferiority of women, Compiled by Tama Starr, New York, poseidon press, 1991, page 45)
“ప్రతీ ఆడది తాను ఆడదై పుట్టినందుకు సిగ్గుతో నిండిపోవాలి.”
తల్లి స్థానం
ఆరోగ్యకరమైన సమాజానికి-ఆరోగ్యకరమై న మానసిక, తాత్విక చింతనలు కలిగిన మనుషులు అవసరమవుతారు. ఇటువంటి మానవులు ఆకాశం నుండి ఊడిపడరు. నేల నుండి పుట్టుకు రారు. ఏఫ్యాక్టరీలోనూ తయా రు కారు. వారు తల్లి గర్భం నుండి జన్మి స్తారు. అమ్మ ఒడిని మొదటి బడిగా వారు జన్మతః పొందుతారు. మొట్టమొదటి ఉపాధ్యా యురాలిగా, శిక్షకురాలిగా వారు తమ తల్లిని సహజసిద్ధంగా పొందుతారు. ఉపాధ్యాయురాలి బాధ్యతను నిర్వర్తించడం- శిక్షకురాలి కర్తవ్యాన్ని నిర్వహించడం తల్లి యొక్క మొట్టమొదటి బాధ్యతగా ఉంటుంది. తన తల్లి ద్వారా శిక్షణ పొందడం బిడ్డ యొక్క జన్మ హక్కుగా కూడా వుంటుంది. ప్రకృతిలో సంఘ జీవనం గల జంతుజాలాన్ని గమనిస్తే ఈ సత్యమే ప్రస్ఫుటంగా మనకుగోచరిస్తుంది.
మాతృత్వం గురించి చెబుతూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది.” ఇబ్న్ మాజా 2771. ఈ విధంగా సామాజిక వృద్ధి, సాఫల్యానికి కారకులు స్త్రీలవుతారు. మానవుని ఎదుగుదలకు మొదటి మెట్టు అతని తల్లి అవుతుంది. ఎందుకంటే తల్లి చూపించే వాత్సల్యం, భద్రత, ఇచ్చే శిక్షణ వల్లే మానవుడు, మంచి పౌరునిగా ఎదుగుతాడు. అందువల్లే ప్రతి స్త్రీ విద్యావంతురాలై ఉంటే ఇటు మానవులకు, అటు సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది.
స్త్రీకి సహజ ఆభరణాలయిన బిడియం, నాజూకుతనం, ఓర్పు, ప్రేమ, మాతృత్వపు మాధుర్యాలతోపాటు ప్రత్యేక శరీర ఆకృతి ఆమె సొంతం. సంతానానికి శిక్షణ, బాధ్యతల నిర్వహణ వంటి సహజ వరాల నుండి ఆమె ను దూరం చేసి మోయ లేని భారాన్ని ఆమెపై రుద్ది మగువను మానసిక వత్తిడికి, ఆందోళన కు గురి చేస్తున్నారు.
ఖుర్‌ఆన్ – మహిళ
1) ”ఆయన మిమ్మల్ని (స్త్రీ పురుషులను) ఒకే ప్రాణి నుండి పుట్టించాడు.” (ఖుర్‌ఆన్-4:1)
2) ”పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి.” (ఖుర్‌ఆన్-2:228)
3) ”తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది.” (ఖుర్‌ఆన్-4: 7)
4) ”మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది.” (ఖుర్‌ఆన్-2: 178)
5) ”మీ స్త్రీలు మీకు దుస్తులు. మీరు వారికై దుస్తులు”.(ఖుర్‌ఆన్-2:187)
6) ”తల్లి బలహీనతపై బలహీనతను సహించి కడుపున మోసింది.. రెండేళ్ళు పాలు తాగించింది.” (ఖుర్‌ఆన్-31: 14)
7) ”విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరికొకరు సహచరు లు, వారు మేలు చెయ్యండని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు. నమాజ్ ను స్థాపిస్తారు. జకాత్‌ను ఇస్తారు అల్లాహ్‌ా పట్ల, ఆయన ప్రవక్తల పట్ల విధే యత పాటి స్తారు…. విశ్వాసులైన ఈ పురుషులకూ, స్త్రీలకు అల్లాహ్ వాగ్దానం చేశాడు, క్రింద కాలువలు ప్రవహించే తోటలను వారి కి ఇస్తాను అని. వారు వాటిలో శాశ్వతంగా ఉం టారు. నిత్యమూ కళకళలాడే ఆ ఉద్యాన వనాలలో వారి కొరకు పరిశుద్ధమైన నివాసా లుంటాయి.” (ఖుర్‌ఆన్ 9:71,72)
8) ”ఎవరైనా సౌశీల్యవతులైన స్త్రీలపై నింద మోపి నలుగురు సాక్షులను తీసుకురాకపోతే వారిని ఎనభై కొరడా దెబ్బలతో కొట్టండి. వారి సాక్ష్యాన్ని ఇక ఎన్నడూ అంగీకరించ కండి”. (ఖుర్‌ఆన్ 24 : 4)
యాజమాన్యపు హక్కు:
ఆమెకు షరీయతు సరిహద్దుల్లో ఉంటూ వ్యాపారం, ఉద్యోగం చేసు కునే అనుమతి ఉంది. తన సొమ్మును ధర్మం ఆమోదించిన ఏ విష యంలోనయినా ఖర్చు చెసుకునే హక్కు ఆమెకుంది. ఆమె భర్త అయినా సరే ఆమె అనుమతి లేనిదే ఆమె ఆస్తిని ముట్టుకునే అధి కారం, హక్కు అతనికి లేదు. ఈ విషయం గురించి ఖుర్ఆన్ ఇలా అంటుంది: “అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో దానికోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:32
”ఒకవేళ స్త్రీలు సంతోషంతో తన మహర్ సొమ్ము నుండి కొంత భాగం ఇచ్చినట్లయితే దానిని మీరు ఖర్చు పెట్టుకోవడం ధర్మసమ్మ తమే”. (దివ్యఖుర్‌ఆన్-4: 4)
వారసత్వపు హక్కు;
ముస్లిం స్త్రీకి బంధువుల వారసత్వపు హక్కు ఉంటుంది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.” ఖుర్ఆన్ సూరా నిసా 4:7
పౌర హక్కులు
ఇస్లాంలో స్త్రీలకు తమ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. తను తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరించ వచ్చు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది.” (ఖుర్ఆన్ సూరా బఖరా 2:256) ఇస్లాం స్త్రీలను తమ అభిప్రాయాలను, భావనలను పంచుకునే అవకాశం ఇస్తుంది. అనేక సార్లు స్త్రీలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను ధర్మం గురించి, అర్థశాస్త్రం గురించి, సామాజిక వ్యవహారాల గురించి ప్రశ్నించేవారు మరియు తమ అభిప్రాయాలను తెలియజేసేవారు అని హదీసుల ద్వారా తెలుస్తుంది. ముస్లిం స్త్రీకి తన భర్తను ఎంచుకునే హక్కు ఉంది. చట్టపరమైన విషయాలలో ముస్లిం స్త్రీ సాక్ష్యం తీసుకోబడుతుంది. వాస్తవికంగా, ఏ విషయాలలో స్త్రీలకు జ్ఞానం ఉందో ఆ విషయాలలో వారి సాక్ష్యానికి విలువ ఇవ్వబడుతుంది.
విద్య హక్కు:
విద్య అంటే అక్షరాస్యత మాత్రమే కాదు, తమ స్థితి, పరిస్థితి పట్ల సమగ్ర అవగాహన కల్పించేది. అటువంటి విద్య ద్వారా మహిళలను స్వశక్తివంతులను చేయడం మా ముఖ్యోద్దేశం. చట్టాలపై అవగాహనా కార్యక్రమాలతోపాటు వారికి చట్టాలపై శిక్షణ ఇప్పిస్తాము. స్త్రీల సమస్యలు, వారి పరిస్థితి పట్ల అవగాహన పెంచుకోవడం, ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి వెళ్ళడానికి కలసికట్టుగా పనిచేయడం వంటివి కూడా ఇందులో భాగాలే. విద్య, సహజవనరులు, ఆస్తుల సమీకరణ, పరిపాలనలో స్త్రీల భాగస్వామ్యం, సామాజికాంశాలు..
విమర్శించే హక్కు:
పురుషుల వలే స్త్రీలకు సయితం ఇంటి వ్యవ హారాల్లో కాక, సామాజిక, ధార్మిక వ్యవహారాల్లోనూ విమర్శించే హక్కు ఉంది. కొన్ని విషయాలలో హజ్రత్ అలీ (ర) గారితో విశ్వా సుల మాత అయిన ఆయిషా (ర)గారు విభేదించడం, స్వయంగా అప్పటి ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ (ర) గారిని ఓ సాధారణ మహిళ ‘మహర్’ విషయమయి నిలదీయడం, ఆయన కూడా తన అభిప్రాయాన్ని విరమించుకుని ‘మదీనాలో ఉమర్‌కంటే తెలిసి వారున్నార’ని అంగీకరించడం వంటి సంఘటనలు దీనికి మచ్చుతునకలు.
నికాహ్ హక్కు:
ఇస్లాం పరిపూర్ణమవ్వక ముందు ఏ సమాజం లోనూ వివాహం కోసం అమ్మాయి అనుమతి ఆచారం ఉన్నట్లు కనబడదు. ”అవివాహిత వనితలతో వారి వివాహం గురించి అభిప్రా యం కోరాలి” అని, ”కన్నె పిల్లలతో వివాహం కోసం వారి అనుమతి కోరాలి”అని దైవప్రవక్త ముహమ్మద్ (స)వారు నొక్కి వక్కాణించడమే కాక, ‘తన తండ్రి తన అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించాడు’ అని ఓ అమ్మాయి దావా వేయగా, ప్రవక్త (స) ఆ పెళ్ళిని రద్దు చేయించారు. ”ఇస్లాంలో వివాహానికి ముందు అమ్మా యితో తప్పనిసరి అనుమతి పొందే విధానం నాకు ఎంతో నచ్చింది” అని ఓ సందర్భంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి అభిప్రాయ పడటం గమనార్హం!
స్త్రీలకు భద్రతా హక్కు:
ఇస్లాంలో ఒక ప్రధాన చట్టం ‘అమాన్’ చట్టం. అమాన్ అంటే రక్షణ కల్పించడం. ఈ హక్కును ఇస్లాం పురుషుల వలే స్త్రీలకు సయితం ఇచ్చింది. ఈ హక్కు గల వారు ఇతరులను రక్షణ కల్పించవచ్చు. అలా రక్షణ పొందిన వ్యక్తి మీద దాడికి దిగడానికి అనుమతి ఉండదు.”మీరు ఎవరికి రక్షణ కల్పిం చారో నేను కూడా వారికి రక్షణ ఇచ్చాను” అని ప్రవక్త (స) మక్కా విజయం సందర్భంగా హజ్రత్ ఉమ్మె హానీ(ర)గారితో అనడం దీనికి ప్రబల నిదర్శనం. ఇలా చెప్పుకుంటూపోతే, విద్యా హక్కు, ఫత్వా హక్కు, ఉద్యోగ హక్కు, ఆస్తి హక్కు, ఖులా హక్కు మొదలయిన ప్రధాన హక్కులన్నింటిని ఇస్లాం మహిళకు ప్రసాదించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్లాం పడతి ప్రగతికి సోపానం. దీనికంటే శ్రేయస్కరమయిన వ్యవస్థ మరొకటి లేదు. లభించదు. ఇందులో వారికి గౌరమూ ఉంది. రక్షణా ఉంది.
భార్య హక్కులు
ఖుర్ఆన్ లో ఇలా సెలవియ్యబడింది: “మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే; ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు- మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి!ఆయన మీ మధ్య ప్రేమనూ, దయాభావాన్నీ పొందుపరచాడు. నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.” ఖుర్ఆన్ సూరా రూమ్ 30:21. ఇస్లాంలో పెళ్లి కేవలం శారీరికమైన కోరిక తీర్చే సాధనం మాత్రమే కాదు. ఇది అల్లాహ్ తరఫున ఓ సూచన మరియు సంకేతం. ఈ బంధుత్వంలో అల్లాహ్ ఆదేశానుసారం పరస్పర హక్కులు, బాధ్యతలు ఇమిడి ఉన్నాయి. అల్లాహ్ స్త్రీ, పురుషులను ఇచ్చి పుచ్చుకునే ప్రకృతి ధర్మంపై పుట్టించాడు. ఖుర్ఆన్ లో తెలియజేయబడిన చట్టాలను అనుసరించిన మీదట వీరి మధ్య సామరస్యపూర్వకమైన సంబంధం స్థాపితమవుతుంది.
పురుషులను అల్లాహ్ స్త్రీల సంరక్షకులుగా చేశాడు. పురుషులు కుటుంబ బాధ్యతలను కూడా నెరవేర్చాలి. జీవితాన్ని అల్లాహ్ ఆదేశానుసారం గడపండని తన కుటుంబాన్ని ఆదేశించడం కూడా అతని బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత. కుటుంబ సభ్యుల పట్ల దయాగుణం కలిగి ఉండడంభార్య బాధ్యతల్లో ఓ ముఖ్యమైన బాధ్యత. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: “తమ ప్రవర్తనలో మంచివారే ఉత్తమ విశ్వాసులు. మీ భార్యలతో మంచిగా ఉండేవారే మీలో ఉత్తములు.”
భార్య బాధ్యతలు
హక్కులతోపాటు బాధ్యతలు కూడా వస్తాయి. కావున వారి భర్తల బాధ్యతలు వారిపై కొన్ని ఉన్నాయి. ఖుర్ఆన్ లో వివరించబడింది: “తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ (తమ శీలాన్నీ, భర్త సంపదను) కాపాడుతారు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:34. భార్య తన భర్త రహస్యాలను కాపాడాలి. ఎట్టి పరిస్థితిలోనూ భార్య తన భర్త పరువు, గౌరవాలు కాపాడుతూ ఉండాలి. భార్య తన భర్త సంపదను కూడా కాపాడాలి. ఆమె తన ఇంటిని, ఆస్తులను – దొంగతనానికి, నష్టానికి – గురికాకుండా రక్షించాలి. ఇంటి ఖర్చుల్లో దుబారా ఖర్చు కాకుండా చూడాలి. తన భర్త ఇష్టపడని వ్యక్తిని ఇంటిలోనికి రానివ్వకూడదు. భర్త వేటిపైనైతే ఖర్చు చేయకూడదు అంటాడో వాటిపై ఎలాంటి ఖర్చు చేయకూడదు. భర్తతో అన్ని విషయాలలో పరస్పరం సహకరించుకోవాలి. అల్లాహ్ కు క్రుతఘ్నుడితో సహకారం కుదరదు. అల్లాహ్ ఆజ్ఞకు విరుద్ధంగా ఏదైనా చేయమంటే ఆమె అతని మాటను త్రోసివేయాలి. భర్త కూడా భార్యను చులకనగా చూడకూడదు. అంతేకాదు, ఆమె అవసరాలను, సంతోషాలను దృష్టిలో ఉంచుకోవాలి.
మానవ హక్కులు
ఇస్లాంలో స్త్రీలు కూడా అల్లాహ్ను ఆరాధించబడే విషయంలో ప్రశ్నించబడతారు. వారు మంచి ప్రవర్తన విషయంలో ఒకరిని ఒకరు మించిపోవడానికి ప్రయత్నించాలి. మానవత్వపరంగా ఇస్లాంలో స్త్రీ పురుషులు సమానులు. ఖుర్ఆన్ లో ఓ సూరా పేరు ‘సూరా నిసా’ అనగా ‘స్త్రీ’ అని ఉంది. అందులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి,దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:1. స్త్రీ అయినా, పురుషుడైనా జన్మించే విధానం ఒకటే కావున వారు మానవతా దృష్ట్యా సమానులు. కొన్ని మతాలు భావించేటట్లు స్త్రీలు దుష్ట శకునం కారు, పురుషులు కూడా పుట్టుకతో చెడ్డవారు కారు. అలాగే ఎవరిపై ఎవరికీ ప్రాధాన్యత లేదు, ఎందుకంటే అది సమానత్వానికి విరుద్ధం అవుతుంది.
ముగింపు/ నిర్ధారణ
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు:“(చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారం లోనయినా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికిగానీ, స్త్రీకి గానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త!).” ఖుర్ఆన్ సూరా అహ్జాబ్ 33:36
స్త్రీ హోదా
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సున్నత్ (హదీసు) లలో స్త్రీ భార్యగా, సోదరిగా, కూతురుగా నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు.
స్త్రీ ప్రాముఖ్యత ఆమెపై మోయబడిన బాధ్యతల ద్వారా వ్యక్తమౌతుంది. ఆ బాధ్యతలను ఒక పురుషుడు కూడా మోయలేడు. అందువల్లే ప్రతి వ్యక్తి తన తల్లికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూపాలని అల్లాహ్ ఆదేశించాడు. ఈ కారణంగా తండ్రిపై తల్లికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది.
అల్లాహ్ సెలవిస్తున్నాడు :“ మరియు అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: ‘మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా చేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది. మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞూడవై ఉండు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది.” సూరా లుఖ్మాన్ : 31:14
“మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించము. అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి అతనిని పాలు విడిపించే వరకు ముప్ఫై నెలలు అవుతాయి.” సూరా అల్ అహ్ ఖాఫ్ : 46:15
మా నవ పురోగమన పోరాటం అనేక రూపాల ఆధారంగా జరిగింది. అజ్ఞానం నుండి, భయం నుండి, దోపిడి నుండి, పెత్తనం నుండి, నియంతృత్వ భావన నుండి, బానిసత్వం నుండి, అణచివేత నుండి విముక్తి నొందడానికి కృషి చేస్తూనే ఉన్నాడు మనిషి. ఈ కార్య సాధన కోసం అసాధారణ త్యాగాలు చేస్తూ వచ్చాడు మనిషి. విశ్వంలోని జనవాహిని సమానంగా గౌరవించబడాలని, ఆదరించబడాలని అభిలషించారు మానవోత్తములు కొందరు. ఆ విధంగా లోకవాసులంతా సమరస భావంతో విరాజిల్లాలని, వారిలో సోదర భావం వెల్లి విరియాలని ఆకాంక్షించారు ఆ పురుషోత్తములు.
ఈ ఆశయ సిద్ధి కొరకు పురుషులతోపాటు అపూర్వ త్యాగాలు చేసిన ఆడపడుచులు సయితం అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారిలో కొందరు ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక పరమైన త్యాగాలకు పేరెన్నికగంటే మరి కొందరు కార్య దీక్షకు, పశ్రాంత చిత్తానికి పత్రీకలయ్యారు. కొందరు అసమాన నాయకత్వ లక్షణాలలో పస్రిద్ధి పొందగా, ఇంకా కొందరు కమ్రశిక్షణకు, ధైర్యసాహసాలకు మచ్చుతునకలయ్యారు.
ఈజిప్టులో ప్రవక్త మూసా (అ) ఫిరౌన్ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చినప్పుడు గాని, పాలస్తీనాలో ప్రవక్త ఈసా (అ) అంధానుసరణకు వ్యతిరేకంగా గళం విప్పినప్పుడు గాని, అరేబియాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) విశ్వ మానవ సోదరభావంతో కూడిన సత్య శంఖాన్ని పూరించినప్పుడుగాని పురుషులతోపాటు స్త్రీలు సయితం సహజంగానే స్పందించారు. తమవంతు సహాయం అందించారు. నిరుపమాన త్యాగాలూ చేశారు. పురుషుల్లాగే స్త్రీలూ అమరగతి నొందారు. సంఘ బహిష్క రణకు, ఏలికల వైషమ్యానికి బలయ్యారు. ఇలా తమ ధన, మాన, ప్రాణ త్యాగాలతో లోకశాంతి సిద్ధిస్తుందని పురుషులు మాదిరి వారూ కలలు కన్నారు. ఆ కలల్ని నిజం చేసే దిశలో పయనించి పరమోన్నత ప్రభువు సన్నిధికి పయన మయిన పడతులెందరో! లోకశాంతికి సంబంధించిన గురుతర బాధ్యతలను స్వీకరించడానికి వారు ఏనాడూ వెనుకాడి ఎరుగరు. సమరస భావం సమానత్వం, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కరుణ, దయ, జాలి, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం – తౌహీద్ ప్రాతిపదికలపై ఆధునిక సత్సమాజాన్ని నిర్మించాలనే తపనలో అలనాటి సుమతులు, సదయులు అహరహం శ్రమించారు. విశ్వ మానవ కళ్యాణం నిమిత్తం అంటే- వర్గ, వర్ణ, ప్రాంత, భాష, జాతి తర తమ భేదరహిత సమరస సమాజాన్ని వారు ఆకాంక్షించారు. ఈ మహోన్నత లక్ష్య పునాదులు నూహ్‌ా ప్రవక్త నాటి నుండే పాదులు వేసుకున్నాయన్నది గమనార్హం.
కూపస్థ మండూకాల్లా పడివున్న ఇస్రాయీల్ సంతతి ప్రజలు ప్రవక్త మూసా (అ) పిలుపుతో భావ దారిద్య్రం నుండి తేరుకొని స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశించారు. అప్పటికే వారిపై ఎన్నో ఆంక్షలు ఉండేవి. 70 వేల పసికందుల్ని కోల్పోవాల్సి వచ్చిన నికృష్ట సందర్భం కూడా అదే. అయినా వారు అధైర్య పడలేదు. కరుణ ఆభరణాల్లో సంకల్పాల వజ్రాలు పొదిగి, కూర్మి కవచాలు తొడిగి సమర క్షేత్రంలో సమరస స్ఫూర్తితో దూసుకుపోయారు. స్రీలు సయితం సమాజంలోని సగ భాగం గనుక కర్తవ్య పరాయణత పారీణతతో ప్రతి ఒక్క పడతిలో చైతన్యం పెల్లుబికింది. జాతి విముక్తి కోసం పోరాటపటిమను కొన సాగించమని కొండంత ధైర్యాన్నిచ్చి సాగ నంపారు అలనాటి వీర నారీమణులు.
అప్పట్లో త్యాగాలు చేసిన మహిళా లోకంలో ఆసియా బిన్తె ముజాహిమ్‌కు గొప్ప ఖ్యాతియే లభించింది. అప్పటి నిరంకుశ చక్రవర్తి ఫిరౌన్‌కు స్వయాన భార్యగా, ఈజిప్టు దేశానికే మహారాణిగా సకల భోగభాగ్యాలు అనుభవించే వీలు ఉన్నప్పటికీ ఆమె వాటిని ఖాతరు చేయలేదు. తన చేతుల మీదుగా, తన ఒడిలోనే పెరిగి పెద్దయిన మూసా ప్రవక్త సత్య పిలుపుని విని ఉత్తేజితురాలై తన సువర్ణ సౌధాన్ని, అందలి పసిడి ఆభర ణాల్ని, వజ్ర వైఢూర్యాలు నిండిన జీవితాన్ని సన్యసించి సత్య పక్షం వహిం చింది. సత్య ధర్మ పరివ్యాప్తికి స్వయంగా ఫిరౌన్ రాజ భవనంలోనే పాదులు వేసి, అసత్య నిర్మూలనకై అవిరళ కృషి సలిపి త్యాగ ధనురాలయింది. పర్యవసానం చాలా భయంకరంగానే పరిణమించింది. సత్యాన్ని విడనాడమని షైతాన్ స్వభావుడు ఫిరౌన్ ఎంత ఒత్తిడి చేసినా, చివరికి సజీవంగానే శిలువపై వ్రేలాడదీసి అవయవాల్ని ఒక్కొక్కటిగా కోసినా, గుండెల్లో గునపాలు గుచ్చినా , తలలో మేకులు కొట్టినా తొణకక, పట్టు సడలని విశ్వాసంతో ధర్మోన్నతి కోసం ‘రబ్బిజ్‌అల్లీ ఇన్‌దక బైతన్ ఫిల్ జన్నహ్’ (ప్రభూ! స్వర్గంలో నా కోసం నీ తరఫున ఒక నిలయాన్ని నిర్మించు) అంటూ తుది శ్వాస విడిచింది. ఆ విధంగా అలనాటి అనువంశిక దౌర్జన్యంపై తన చెర్నాంకోలును ఝుళిపించింది. అలా అనితర సాధ్య ధైర్యసాహసాల్ని, మొక్క వోని సహనాన్ని పదర్శించిన ఆ మహిళా మూర్తిని సత్య దేవుడైన అల్లాహ్ ప్రశంసిస్తూ మానవ జాతి మనుగడకు మణి కుసుమంగా పేర్కొన్నాడు: ”మరి అల్లాహ్ విశ్వాసుల కొరకు ఫిరౌను భార్యను ఆదర్శంగా పేర్కొంటు న్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది: ‘నా ప్రభూ! నా కోసం నీ దగ్గర – స్వర్గంలో – ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని దాష్టికా న్నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు”. (తహ్రీమ్: 11)
అదే రాజ మహలులోని పని మనిషి కూడా తక్కువేమీ కాదు. ఫిరౌన్ రాజ భవనంలో స్వయాన అతని ముద్దుల కూతురికి సేవకురాలిగా పని చేసే విశ్వాస మహిళ ఆమె. స్వేచ్ఛా పిపాసతో రగిలిపోయిన, సత్య జ్యోతి ప్రభావంతో వెలిగిపోయిన అబలగా భావించబడే సబల ఆ స్త్రీ మూర్తి. ‘అన రబ్బుకు ముల్ ఆలా’ అన్న ఫిరౌన్ దురహంకార గర్జనతో స్తబ్ధత ఆవరించిన ఆ సమాజంలో సత్యాగ్ని కణాన్ని రాజేసిన ఆ మాతృమూర్తి విశ్వాసం శక్తివంత మైనది. అసలే బానిసరాలు. ఆపై అబలయి కూడా ఆమె ప్రదర్శించిన సాహసం, సమయస్ఫూర్తి సాటి లేనిది. ఫిరౌన్ రాజభవనంలో సత్య శంఖం పూరించింది. ఆమె సత్య ప్రచార శైలికి ముగ్దురాలయి ‘ఆసియా బిన్తె ముజా హిమ్’ ఇస్లాం స్వీకరించింది. ఇది తెలుసుకున్న ఫిరౌన్ ఆమె నలుగురు బిడ్డల్ని సలసలకాగే నూనెలో పడేసి వేయించేశాడు. ఆ నలుగురిలో ఒకడు పాలు త్రాగే పసికందు కూడా ఉన్నాడు.
అయినా ఆమె తొణకలేదు సరికదా ”నన్ను సయితం ఈ నూనెకి ఆహుతి చేశాక మా అందరి ఎముకల్ని ఒకే చోట సమాధి చెయ్యండి. రేపు ప్రళయ దినాన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ సద్వచనం పలుకుతూ మేమంతా సమాధి నుండి లేస్తాము’ అని ఘంటాపథంగా ప్రకటిం చింది. ఆమె చూపిన ధైర్యసాహసాల్ని మెచ్చుకుంటూ మేరాజ్ సందర్భంగా ఏడు ఆకాశాలపైన దైవ దూతల నాయకుడు జిబ్రయీల్ ద్వారా ప్రవక్తలందరి నాయకుడైన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారికి ఆమె దృష్టాం తాన్ని విన్పించాడు దేవుడు. అట్టి ‘సత్య బాంధవి’ అయిన ఆ వీర వనిత చరిత్రలో చిరస్మరణీయురాలయింది.
ఆ పరంపరలో పరమ పవిత్రమైన పుణ్యస్త్రీ అయిన జైనబ్ (ర)నూ విస్మరిం చలేము. ఆమె మహా నిరాడంబర జీవి. సిగ్గు సిరులే ఆమె ఆభరణాలు. నిస్వార్థ సేవే ఆమె స్వరూపం. సాత్విక ప్రేమానురాగాలే ఆమె నైజం. అనాథ బాలలు, వితంతువులు, నిరుపేదలు అభాగ్యజీవులే ఆమె అనుఁగు సంతానం. ప్రజా సేవే ఆమె ఊపిరి. సంస్కరణా భిలాషే ఆమె మూల ధనం. సత్య ధర్మోన్నతియే ఆమె ప్రాణం. ఆ సత్య వ్యవస్థపై ఆమెకు ఎనలేని అభిమానం. మక్కా మదీనాల్లోని నిరుపేదలతోనే గడిపేది. దీన జనంపై తప్ప మరి దేని పైనా ఆమెకు మమకారం లేదు. వారి క్షేమం కోసమే అహరహం శ్రమించేది. వారి ధ్యాసలోనే ఆమె అసువులు బాసింది. ఇటు ప్రజా సేవ, అటు దైవ సేవలో సమతౌల్యంతో జీవితాన్ని సార్థకం చేసుకుని ‘ఉమ్ముల్ మసాకీన్’ అన్న ప్రశంస స్వయానా ప్రవక్త (స) నోట పొందిన ధన్యజీవి విశ్వాసుల మాత హజ్రత్ జైనబ్ (ర).
ఆ విషయానికొస్తే – సత్యోద్యమంలో, విద్యార్జనలో, ప్రవక్త (స) వారి ప్రవచ నాల్ని ప్రజలకు ప్రబోధించడంలో హజ్రత్ ఆయిషా (ర) మహా ధీరోదాత్త. దాదాపు ”2210” హదీసలను ఉల్లేఖించిన ఘనత స్త్రీలలో ఆమె ఒక్కరికే దక్కింది. ప్రవక్త (స) వారి సత్య సూక్తులకు, పరలోక మోక్ష సిద్ధాంతాలకు ప్రభావితురాలయిన ఆమె తర్వాతి కాలంలో ‘జమల్ రణ రంగం’లో పాల్గొన్నారు. అప్పట్లో ధార్మిక ఫత్వాలు జారీ చేసిన ధర్మ పండితురాలు. అనేక మంది సహాబాలు ఆమె వద్ద శిష్యరికం పొంది ధార్మిక విద్యార్జన చేసేవారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ పరంపరలో హజ్రత్ మర్యమ్ (అ), హజ్రత్ ఖదీజా (ర), హజ్రత్ ఫాతిమా (ర), హజ్రత్ అస్మా (ర), హజ్రత్ ఉమ్మె సలమా (ర), హజ్రత్ ఉమ్మె తలహా (ర) లాంటి వారెందరో ఉన్నారు. వీరంతా ‘ప్రకృతి ధర్మం’ నుండి ప్రేరణ పొందిన నారీమణులే. ఇస్లాం మెచ్చిన వనితలే.
కాలంతోపాటే విలువలు కూడా మారినాయి. అన్ని రంగాలలోనూ కల కంఠి ముందంజ వేస్తున్నప్పటికీ ఆమె కంట వొలికే కన్నీళ్ళు మాత్రం తగ్గటం లేదు. కారణం ఆధునిక దోపిడీ! నవ నాగరికత పేరిట జరిగే ఎక్స్‌పాయిటే షన్!! సబ్బు బిళ్ళ మొదలుకుని షేవింగ్ బ్లేడు అమ్మకం వరకు ప్రతి దానికీ మాననీమణి సిగ్గు సిరిని అంగడీలో ప్రదర్శించే మగ మారాజు స్వార్థానికి ‘ఆమె’ అవలీలగా బలైపోతున్నది. తల్లి కడుపులో ప్రాణం పోసుకుంటోందని తెలిసిన క్షణం నుంచే ‘భ్రూణ హత్య’ ఆలోచనతో మొదలయ్యే ఈ ఎక్స్‌పాయిటే షన్ ఆమె జీవితంలోని అన్ని థలలోనూ జరుగుతున్నఇద. దానికి బదులు మానవ మనుగడలో ఆమె ‘సగమ’ని, సగాలు రెండూ ఒకటైతేనే గాని జగానికి ఓ నిండుదనం రాదని గ్రహించే సహృద యత పెంపొందాలి. కోమలాంగికి ఆమె కార్య క్షేత్రంలో నిరాటంకంగా పురోగ మించే వ్యవస్థను ఏర్పరచాలి. అదే మహిళాభ్యుదయం. అదే మహిళాభిరామం!!
మన భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషులు సమానులని 1950లో చట్టం అమల్లోకి వచ్చినా అది కాస్తా పురుషా హంకార చుట్టమై కూర్చుంది. 1961లో వరకట్న నిషేధం చట్టం వచ్చినా, 1956లో వితంతు వివాహాలకు వీలు కల్పిస్తూ శాసనం పుట్టినా, సుమారు 200 సం నాడు సతి సహగమన వ్యతిరేక చట్టం అమల్లో వచ్చినా ఇంకా స్త్రీలపై అనేక విధాల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం శుల్కం చెల్లించి కన్యల్ని అమ్మే, కొనేవారు, ప్రస్తుతం వరకట్నం ఇచ్చి భర్తల్ని కొంటున్నారు, అమ్ముకొంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లోనూ బలి పశువు స్త్రీయే.
చివరిగా ఒక మాట చెప్పక తప్పదు. ఎవరు సంకెళ్ళలో బంధించబడ్డారో వారే బంధ విముక్తికై స్థిర చిత్తంతో పోరాడాలి. ‘స్త్రీ స్వర్గానికి సోపానం’ అని ప్రవక్త మహాశయుల వారు ప్రకటించి ఆ ఆశయ సిద్ధికై ప్రజల్లో చైతన్య కణాల్ని రాజేసినట్లే స్త్రీలు సయితం తమ శక్తి యుక్తుల్ని వాడి స్వేచ్ఛాసమానత్వాన్ని సాధించుకునే దిశగా పయనించి సమాజాన్ని, దేశాన్ని అభ్యుదయ పథాన నడిపించిన నాడే భవిష్యదర్శనం సుఖ శాంతులకాలవాలమవుతుంది. ఇక్కడ విస్మరించరాని విషయమేమిటంటే స్త్రీల భాగస్వామ్యం లేనిదే సమాజ పురోగాభివృద్ధి అసాధ్యం. పురుష సహకారం లేనిదే అది సాధ్యం అవదు. అంటే- స్త్రీ లేని పురుష ప్రపంచాభివృద్ధి బలహీనపడితే, పురుషుడు లేని స్త్రీ సమాజ అభ్యుదయం కుంటుపడుతుంది. సంసార రథం సాఫీగా సాగదు. సంతానం సత్పౌరులుగా ఎదగరు. ఈ మటుకు విలువలు, బాధ్యతలు మృగ్యమైన ఏ దేశం అభివృద్ధిని పొందలేదు. ఈ పరిణామ ప్రక్రియలో స్త్రీల పాత్ర ఏపాటిదై ఉండాలి? అంటే- 1) స్వయం ఉద్ధరణ. 2) సమాజం యావత్తులో పరివర్తనం తీసుకురావాల్సిన బాధ్యత.
ఆ మేరకు తల్లులుగా వారు ముందు తమ కుటుంబాల్లోనే సమరస భావానికి పునాదులు వేయాలి. పిల్లల్లో చిన్న నాటనే విశాల భావాన్ని ప్రోది చేయాలి.. స్త్రీ పురుషుల విషయంలో మహా ప్రవక్త (స) చేసిన హితవుల్ని పిల్లలకు బాల్య థ నుండే నూరిపోయాలి. వారిలో తమ చెల్లి, తల్లి, పిన్నీల పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని పెంపొందించాలి. సత్య నిరతి, సోదర ఆవం, ప్రేమ, కరుణ, దయ, క్షమ, పరోపకార పారీణత వారిలో నిత్య గుణాలుగా రూపొందాలి. ‘తల్లి ఒడి ప్రాథమిక బడి’ గనుక – తల్లుల ఈ శిక్షణ – సంతాన వ్యక్తిత్వాన్ని సంరక్షిస్తుంది. కుటుంబంలో శాంతిని నింపుతుంది. ఆ దరిమిలా సమాజంలో, దేశంలో శాంతి, అభ్యున్నతి, ప్రగతి, పురోగాభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయల్లా విరాజిల్లుతుంది. స్త్రీలందరూ తమ ఈ కర్తవ్యాన్ని గుర్తించి అహరహం పరిశ్రమించినప్పుడే విశ్వ జనులందరికి సౌభాగ్యం ఇనుమడిస్తుంది. అందు నిమిత్తం కర్తవ్యం మహిళా లోకాన్ని పిలుపునిస్తోంది! స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా స్రీలందరూ సహజంగానే స్పందిస్తారని ఆశిస్తూ….