
ఇస్లాం అనే పదం సిల్మ్, మరియు సలామ్ అన్న ధాతువు నుండి వచ్చిన పదం. దానర్థం విధేయత, సమర్పణ, శాంతి. అనగా సమస్త లోకాల సృష్టికర్తకు ఆజ్ఞాబద్ధులయి జీవించినట్లయితేనే మనిషికి కావా ల్సిన శాంతి, సుస్థిరత, సంతృప్తి ప్రాప్త మవుతుంది.
సకలోకాల సృష్టికర్త ఒక్కడే.
ఆయనొక్కడే సృష్టి చరాచరాలను పుట్టించిన వాడు. ఆయన సృష్టి మొత్తాన్ని పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు, కాపాడుతున్నాడు. భూమ్యా కాశాల్లోని అణువణువుపై ఆయన అధికారమే నడుస్తుంది.
ఆ నిజకర్త, స్వామి, పాలకుడు, పరిపోషకుని పవిత్ర నామమే అల్లాహ్‌ా.ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. అయన నిరపేక్షా పరుడు, ఎవరి అవసరమూ అక్కర లేనివాడు. ఆయనకు సంతానం గానీ, భార్యగానీ లేదు. ఆయన కూడా ఒకరికి సంతానంగా లేడు. ఆయనకు సరి సమానమయిన వాడెవడూ లేడు. ఆయన్ను పోలినదేది లేదు.
ఆయనే మనిషి భౌతిక అవసరాలను తీర్చడంతోపాటు ఆత్మ, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే ఏర్పాటు సయితం చేశాడు. ఈ మార్గ దర్శకత్వం ద్వారా మనషి ఇహపరాల సాఫల్య బాటన పయ నించాల న్నది ఆయన అభిమతం. ఈ ఆత్మ, ఆధ్యాత్మిక అవసరం పేరే ధర్మం. అదే ఇస్లాం.
ఇస్లాం అనే పదం సిల్మ్, మరియు సలామ్ అన్న ధాతువు నుండి వచ్చిన పదం. దానర్థం విధేయత, సమర్పణ, శాంతి. అనగా సమస్త లోకాల సృష్టికర్తకు ఆజ్ఞాబద్ధులయి జీవించినట్లయితేనే మనిషికి కావా ల్సిన శాంతి, సుస్థిరత, సంతృప్తి ప్రాప్త మవుతుంది.
అల్లాహ్ ఆమోదించిన జీవన విధానం ఏమిటి? ఆయన అభీష్టం ఏమిటి? ఆయనకు విదేయత ఎలా చూపాలి? ఇత్యాది విషయాల వివరణకై ప్రవక్తలను పంపాడు. వారు మానవాళికి మాధవుని ఇష్టా యిష్టాల గురించి తెలియజేసే వారు.
అవనిపై పాదం మోపిన మొదటి వ్యక్తి ఆదమ్ (అ). అల్లాహ్ ఆది మానవులయిన ఆదమ్ (అ) వారిని ప్రవక్తగా చేసి పంపాడు. తన సంతానానికి అల్లాహ్‌ా మెచ్చిన మార్గం చూపడానికి.
తర్వాత ప్రవక్త ఆదమ్ (స) సంతానం వివిధ భూభాగాల్లో నివా సం ఏర్పచుకుంది.వారి భాషలు, రూపు, రంగులు వేర్వేరుగా రూపొం దాయి.1లక్ష 24వేల మంది ప్రవక్తలను వేర్వేరు కాలాల్లో, వేర్వేరు భాషల్లో, వేర్వేరు జాతుల్లో ప్రభవింపజేశాడు అల్లాహ్‌ా.
ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే -అదే ‘లా ఇలాహ ఇల్ల ల్లాహ్‌ా’ – అల్లాహ్‌ా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు. అయితే కాలానికను గుణంగా ధర్మశాస్త్రం మారుతూ ఉండేది.
చివరిగా కట్టకడపటి ప్రవక్తగా ముహమ్మద్ (స) వారిని పంపాడు. ఆయనపై తన ధర్మాని సంపూర్ణం చేశాడు. ఆయనపై పరిపూర్ణ ధర్మ శాస్త్రాన్ని, గ్రంథాన్ని అవతరింప జేశాడు. ఇక మీదట ఏ ప్రవక్తా రాడు, మరే గ్రంథం అవతరించదు.
అనాదిగా వివిధ ప్రవక్తల మాధ్యంగా అల్లాహ్‌ా మానవాళికి మార్గదర్శకత్వం వహిస్తూ వచ్చాడు. ఆ పరంపర అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్(స)వారి ప్రభవనంతో పరిసమాప్తం అయింది. ఆరాధ నలుగానీ, ఆచార వ్యవహారాలుగానీ, హక్కులుగానీ, నైతిక విలువలు గానీ, వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, జాతీయ, అంతర్జాతీయ విష యాలుగానీ అన్నింటికి చక్కనయిన పరిష్కారం ఇస్లాంలో ఉంది.
ఇహలోకం, ఇక్కడి జీవితం అశాశ్వతమయినది. ఏదోక రోజు అందరూ నశించవలసినవారే. ప్రళయం ఘడియలు తప్పకుండా సంభవించి తీరతాయి. పునరుత్థాన దినాన అందరూ తిరిగి లేప బడ తారు. అందరికీి వారి కర్మల లెక్కలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
ఎవరయితే అల్లాహ్‌ాను, అంతిమ దినాన్ని, ఆయన ప్రవక్తలను, ముఖ్యంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారిని విశ్వసించి, దానికనుగుణంగా జీవిస్తారో వారు స్వర్గంలో ప్రవేశించి, అల్లాహ్‌ా ప్రసన్నతను, ఆయన దివ్యధర్శనా భాగ్యాన్ని పొందుతారు.
ఇక ఎవరయితే అల్లాహ్‌ాను, అంతిమ దినాన్ని, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారిని విశ్వసించరో, ప్రవక్త (స) వారి ఉపదే శాలకనుగుణంగా జీవించరో వారు అల్లాహ్‌ా కారుణ్యానికి దూరమై, ఆయన ఆగ్రహానికి గురయి నరకాగ్నిలో ప్రవేశిస్తారు.
నరకముక్తి, స్వర్గప్రాప్తియే అసలు విజయం. అది, విశ్వసించి సత్కర్మలు చేసిన వారికే లభిస్తుంది.
ప్రతి విశ్వాసి -ముస్లిం తప్పనిసరిగా అల్లాహ్‌ా విధులను నిర్వర్తిం చాలి. ఉదాహరణకు-రోజుకు అయిదు పూటల నమాజు, రమజాను పూర్తి మాసపు ఉపవాసాలు, అర్థిక స్థోమత కలిగిన వ్యక్తి జకాతు చెల్లింపు, స్థోమత గల వ్యక్తి హజ్జ్ నిర్వర్తన.
అలాగే కబీరా గునాహ్‌ా (మహాపరాధాల)కు దూరంగా మసలు కోవాలి. ఉదాహరణకు-షిర్క్-అల్లాహ్‌ాతోపాటు ఇతరుల్ని సాటి కల్పిం చడం, తల్లిదండ్రుల అవిధేయత, వ్యభిచారం, వడ్డీ వ్యాపారం, మద్య పానం, జూదం మొదలయినవి.
మన జీవితం ప్రవక్త (స) వారి ఆదర్శానికి ప్రతిబింబంగా ఉం డేలా చూసుకోవాలి. ఉదాహరణకు-తినడం త్రాగడం, నిద్రించడం మేల్కొనడం,వివాహం,వ్యవహారాం, వ్యాపారం, సుఖం-ధుఃఖం, మొద లయిన విషయాల్లో ప్రవక్త (స) వారి సంప్రదాయాన్ని అనుసరించాలి.
ప్రపంచంలో నివసించేవారు, ఏ భాష గల వారయినా, ఏ రంగు గల వారయినా, రాజయినా, ప్రజయినా, ధనికయినా, పేదయినా, యజ మానయినా, నౌకరయినా,స్వేచ్ఛాపరుడయినా,కట్టు బానిసయినా -వారు సత్యాన్ని అన్వేషించి అల్లాహ్‌ా వారి కోసం సమ్మతించి ఆమో దించిన ధర్మం ఇస్లాంను స్వీకరించాలి. ఎందుకంటే అది తప్ప అల్లాహ్‌ా వద్ద మరే మత ధర్మం స్వీకరించబడదు గనక.
ఎవరయితే తన నిజప్రభువును గ్రహించి, ఆయన సమ్మతించి ఆమోదించిన ధర్మమయిన ఇస్లాంను స్వీకరించాలనుకుంటారో – వారు క్రింది వాక్యాలను మనసా, వాఛా, కర్మణ – త్రికరణ శుద్ధితో పలకాలి.
అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు – అల్లాహ్‌ా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. మరియు ముహమ్మద్ (స) ఆయన ప్రవక్త, ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.