అంతకు పూర్వం ఏ శతాబ్దిలోనూ సుదీర్ఘ ప్రపంచ చరిత్ర ఇన్ని మార్పులు చూడలేదు. లోకం మొత్తం కాంతి కానక, కటిక చీకట్లలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మహా ప్రవక్త ముహమ్మద్ (స) జన్మించారు. నిఖిల జగతిలో విశ్వకర్త శాసనాన్ని అక్షరాలా పాించే ఆదర్శ సమాజాన్ని నెలకొల్పి తనువు చాలించారు ఆయన. ఆయన హితోక్తుల శుభ జల్లుల వెల్లువలో మిథ్యాశక్తులన్నీ కొట్టుకుపోయాయి. సర్వత్రా ఏకేశ్వరోపాసనా నినాదాలు మారుమ్రోగాయి. దాస్య శృంఖలాలు మోయలేక ఒంగిపోయిన మానవ శిరస్సులు ధైర్యంతో శిఖరాలయి నిలిచాయి. బానిస సంకెళ్ళకు మూగబోయిన గొంతులు ఒక్కసారిగా స్వేచ్ఛా గీతాన్ని ఆలాపించాయి. నిస్సహాయులకు అండ లభించింది. అనాథలకు ఆశ్రయం దొరికింది. స్త్రీకి గౌరవం దక్కింది. బడుగు జీవులకు బలం చేకూరింది. ఆయన హితోక్తుల మహాస్త్రాల ధాికి పైశాచిక హృదయాల పాచికలు మన్ను గరిచాయి. కుమతుల కుయుక్తులు ఎందుకూ కొరగాకుండా పోయాయి. సుమతుల్లో శాంతిశ్రేయాలు పరిఢవిల్లాయి. అది ప్రపంచ ఆయుధాగారంలోనే లేని సత్యతా కరవాలం. మనుషుల్ని కాదు, మనసుల్ని జయించడం దాని ప్రత్యేకత. ఇటువంటి అనన్య అద్భుత ప్రత్యేకతల చరిత్రే మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారి చరితము.
మహా ప్రవక్త (స) సమస్త లోకాల పాలిట కరుణాఝరి. ఆయన ప్రజల మనిషి. ప్రజల కోసం జీవించిన మనిషి. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావడానికి అవిరళ కృషి సలిపిన ఆదర్శమూర్తి. చివరి ఘడియల్లో సయితం ‘ఉమ్మతీ, ఉమ్మతీ’ – నా జనం నా జనం అంటూ పరితపించిన మానవ శ్రేయోభిలాషి, పరాత్పర వ్యక్తి ఆయన. అయితే ఇతర ప్రవక్తల్లా తన జాతి జనులను, దేశ ప్రజలను ప్రేమించడం, వారిలో చైతన్య బీజాలు నాటడం వరకే ఆయన పరిమితం అవ్వలేదు. ఆయన అంతిమ దైవ ప్రవక్త. సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన దయా రూపం. సాత్విక ప్రేమ స్వరూపుడయిన ఆ మానవ మహోపకారి ఒక భాషకో, ప్రాంతానికో, జాతికో, దేశానికో పరిమితం ఎలా కాగలరు? జాతి అభిమానిగానో, విప్లవాత్మక సంస్కర్తగానో మాత్రమే ఆయన్ను భావి తరాల వారు తలచుకుాంరని చెప్పడానికి ఏ మాత్రం వీలు లేదు. క్రాంతకారుడైన ఆయన చేసిన ప్రబోధనం నిఖిల విశ్వానికి సంబంధించినది. ఆయన విశ్వనాయకుడు. విశ్వ జనులందరి కోసం ఆ విశ్వకర్త ప్రభవింపజేసిన ఋషిశ్రేష్ఠుడు. ఆయన కమనీయ జీవిత చరిత్ర నిఖిల మానవాళికి పఠనీయం.
కొందరు సంకుచిత స్వభావులు ఆయన్ను ‘అరబ్బు ప్రవక్త’గా పేర్కొనడం వెనుక ఏ దురుద్దేశ్యం దాగుందో తెలియదుగానీ;నిజానికి ఆయన స్థానం వారి అభూత కల్పనలకన్నా ఎంతో ఉన్నతమైనది. ఆయన దృష్టిలో మక్కా విజయం ప్రపంచ బానిస దేశాల విముక్తి సాధనలో ఒక భాగం మాత్రమే. శాశ్వత సత్యాలను ప్రజల జీవితాల్లో నిత్యం ప్రతిబింబింపజేసేందుకు ఆయన పడిన శ్రమ శ్లాఘనీయం. అందుకే ఆయన మూర్తీభవించిన సత్యం అయ్యారు. నైతిక సమగ్రతకు ప్రతి రూపంగా నిలిచారు. ఆయన ప్రవచనాలు జీవిత సత్యాలకు ఆనవాలు. అవి ఆయన విలక్షణమైన బుద్ధికీ, వినిర్మల శీలానికీ, ప్రవక్త పదవికి ప్రతీకలు. దివ్యగ్రంథాల క్షీరసాగరాన్ని మధించి తీసిన వెన్న ముద్దలు. అవి అరబ్బులకే కాదు, ఆంగ్లేయులకే కాదు, పారసీకులకే కాదు, భారతీయులకే కాదు, చైనీయులకే కాదు నిఖిల జగతికి ప్రాతః పఠనీయాలు, ఆదర్శనీయాలు, ఆచరణీయాలు.
‘వడ్డి ఇచ్చువాడొకడు తీసుకునింకొకడు, సాక్షిగా ఉంటడు మరియొక్కడు – ఈ మువ్వురూ శాపగ్రస్తులే’ అని ధన స్వామ్య ధ్వజవాహకులపై దండెత్తిన ధీరోదాత్తుడు ఆయన (స). ‘మనము బాటసారులము, కొన్నాళ్ళకు తిరిగి ఇంికి చేరుట తథ్యము’ అని ఐహిక జీవిత వాస్తవికతను ఎరుకపరచి మనిషిలో మానవత్వాన్ని నింపిన ధీర గంభీరుడు ఆయన (స). ‘ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్’ – వికృత చిత్తవృత్తి నిరోధకము దైవ నామ స్మృతి (మనసును మైల కాకుండా కాపాడే రక్షక కవచం దైవ నామ స్మరణ). అది కంఠము నుండి కాదు ఎదలో పలికిన సద్గతి’ అని అలవోకగా అర్థమయ్యేటట్లు చెప్పిన ప్రవక్త శిఖామణి ఆయన. ‘సద్వచనం – లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ ఒక వంక, అనంత విశ్వాలు ఒక వంక నిలిపిన; సద్వచన పళ్ళమే వరణీయమౌతుంది’ అని ఎలుగెత్తి చాిన చల్లని చంద్రుడు ఆయన (స). ‘సత్య ప్రియునికి నిందాస్తవములు తుల్యమ్ములు పొగిడిన అతడు రెచ్చిపోడు, తెగద్టిన ఉరిమి పడడు’ అన్న మాటకి అక్షర రూపంగా నిలిచిన ఆదర్శప్రాయుడు ఆయన (స). ఆంతరంగిక నివాసమందు ఒకే కాలమ్మున ప్రతిష్ఠించ వీలు పడదు ప్రభువు భీతిని, ఐహిక ప్రీతిని’ అని ఉద్బోధించిన ఉదయ భాస్కరుడు ఆయన (స). ‘సకల అవ లక్షణాలకు మాతృక మత్తుపానీయం, మధుపానం కడు హేయం – అది చెడులన్నింకి మూలం’ అని మతుల తుప్పును వదలగ్టొిన మహితాత్ముడు ఆయన (స). ‘శాంతిని సాధించ ానికి కలిమి, బలిమి సరిపోదు, అనురాగమున మించిన ఆయుధమ్ము వేరొకి లేదు’ అని నిరూపించిన శాంత వదనుడు ఆయన. ‘నిరపేక్షత ధనంతో రాదు, తనలో విశ్వమును పొదిగిన వాడే సిసలైన సంపన్నుడు, నిరపేక్షాపరుడూను’ అని ‘సిరి’ గురించి స్పష్టంగా వివరించిన ప్రవక్త శ్రీ ఆయన. ‘కన్నొక్క తీరు, నోరొక్క తీరు, మనసింకొక్క తీరు వర్తించువాడే కపి’ అంటూ రెండు నాల్కల ధోరణిని నిరసించిన నిజ భక్తాగ్రేసరుడు ఆయన.