Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ముస్లిం అంటే ఎవరు ? ఇస్లాం అంటే ఏమిటి ?

ఇతర మతాల మాదిరి ఒక వ్యక్తి తెగ పేరిట వెలసిన ధర్మం కాదు ఇస్లాం. ఎవరైనా సరే స్వచ్ఛ౦ద౦గా నిజ దేవుడి (అల్లాహ్)కి 'విధేయత చూపే వాడు ముస్లింగా పిలువబడతాడు. ఆ వ్యక్తి ఏ జాతి, ఏ తెగకు చెందినవాడైనాసరే. 'ఇస్లాం ఒక స౦పూర్ణ జీవన విధానం, ఇస్లాం సందేశ విశ్వజనీనత సర్వ కాలాల్లో, అన్ని దేశాల్లో వర్తిస్తుంది. అలా౦టి ఇస్లా౦ ధర్మానికి చెందిన ఆరు(6) ప్రధాన అంశాలు, ఐదు ఆరాధన పద్ధతులను ఇక్కడ తెలియజెయడం జరుగుతుంది.

ఇతర మతాల మాదిరి ఒక వ్యక్తి తెగ పేరిట వెలసిన ధర్మం కాదు ఇస్లాం. ఎవరైనా సరే స్వచ్ఛ౦ద౦గా నిజ దేవుడి (అల్లాహ్)కి ‘విధేయత చూపే వాడు ముస్లింగా పిలువబడతాడు. ఆ వ్యక్తి ఏ జాతి, ఏ తెగకు చెందినవాడైనాసరే. ‘ఇస్లాం ఒక స౦పూర్ణ జీవన విధానం, ఇస్లాం సందేశ విశ్వజనీనత సర్వ కాలాల్లో, అన్ని దేశాల్లో వర్తిస్తుంది. అలా౦టి ఇస్లా౦ ధర్మానికి చెందిన ఆరు(6) ప్రధాన అంశాలు, ఐదు ఆరాధన పద్ధతులను ఇక్కడ తెలియజెయడం జరుగుతుంది.

ముస్లిం అంటే … సామాన్య అర్థంలో పుట్టే ప్రతి శిశువు ఇస్లాం ధర్మం మీదే పుడుతుంది. వాస్తవ రూపంలో ముస్లిం కుటుంబం లో పుట్టినంత మాత్రాన ప్రతీ ఒక్కరు ముస్లిం కాలేరు. ఎందుకటే ఇది వంశ పారం పర్యంగా వచ్చేటువంటిది కాదు. కేవలం ఇది విశ్వాస పరంగా వచ్చే పదం. ఒక ముస్లిం ఇంట పుట్టే శిశువుని ముస్లిం అనే అంటాము. ఎందుకంటె శిశువు పుట్టింది ప్రక్రుతి ధర్మమైన ఇస్లాం మీదే, అ శిశువు తల్లిదండ్రులు కూడా ముస్లింలు గనక. ఎప్పటి వరకైతే అతని నుండి ఇస్లాం ధర్మం నుండి వేరు చేసే ఘోర పాపాలు చోటు చేసుకోవో అప్పటి వరకూ అతను ముస్లిమే. క్రియా రంగంలో ఆటను బలహీనుడై ఉన్న సరే. అంటే ”ముస్లిం కుటుంబం లో జన్మించే ఏ భాగ్యాన్నైతే అల్లాహ్ అతనికి కల్పించాడో దాన్ని పెద్దయి సార్థకం చేసుకోవాలి.

2). ముస్లిం అని ఎవరిని పిలవాలి ?

ముస్లిం అనే పదం సిల్మ్ అనే మూల పదం నుండి రావడం జరిగింది ,సిల్మ్ అంటే స్వీయ సమర్పణ అని అర్ధం, ముస్లిం అంటే తనను తాను దైవానికి సమర్పించుకోవడం, దేవుని ఇష్టాన్ని తన ఇష్టంగా మలుచుకోవటం, అతడు ఏ జాతికి చెందిన వాడైనా ఏభాష మాట్లాడే వాడైనా సరే . అతడు నిజ దేవుడు ఒక్కడు అని నమ్మి , అ నిజ దేవుడు పంపిన అంతిమ ప్రవక్తను(మహమ్మద్. స) విశ్వసిస్తే అతనిని ముస్లిం (దైవ విధేయుడు) అని పిలువవచ్చు. ముస్లిం కుటుంబం లో పుట్టినప్పటికీ దర్గానో లేక ఇతర సృష్టితాలనో పూజిస్తే అతను అల్లాహ్ దృష్టిలో ముస్లిం కాదు.

ఇస్లాం అంటే ఏమిటి ?
ప్రపంచ జనాభాలో ముస్లింలు ఐదవ వంతు ఉన్నారు. ఇస్లాం ఒక ప్రధాన ధర్మం. నిజ దేవుడు ఒక్కడే అని నమ్మి , ఆయనను మాత్రమె ఆరాధించడం అనేది ఇస్లాంలో అత్యంత ముఖ్యాంశం. సలాం మరియు సిల్మ్ అనే పదాల నుండి ఇస్లాం అనే పదం వచ్చింది. సలాం అంటే శాంతి సిల్మ్ అంటే సమర్పణ అని అర్ధం. అరబీ భాషలో ‘ఇస్లాం’ అనే పదానికి అర్థం ఒకే ఒక్క నిజ దేవుడి (అల్లాహ్)కి ‘విధేయత చూపడం.
ఇస్లాం ద్వారానే అంటే నిజ దేవుడి (అల్లాహ్)కి ‘విధేయత చూపడం ద్వారానే ఇహలోకంలోనూ, మరణానంతరం పరలోకంలోనూ సాఫల్యం సాధించవచ్చు.

ఇతర మతాల మాదిరి ఒక వ్యక్తి తెగ పేరిట వెలసిన ధర్మం కాదు ఇస్లాం. ఎవరైనా సరే స్వచ్ఛ౦ద౦గా నిజ దేవుడి (అల్లాహ్)కి ‘విధేయత చూపే వాడు ముస్లింగా పిలువబడతాడు. ఆ వ్యక్తి ఏ జాతి, ఏ తెగకు చెందినవాడైనాసరే. ‘ఇస్లాం ఒక స౦పూర్ణ జీవన విధానం, ఇస్లాం సందేశ విశ్వజనీనత సర్వ కాలాల్లో, అన్ని దేశాల్లో వర్తిస్తుంది. అలా౦టి ఇస్లా౦ ధర్మానికి చెందిన ఆరు(6) ప్రధాన అంశాలు, ఐదు ఆరాధన పద్ధతులను ఇక్కడ తెలియజెయడం జరుగుతుంది.

విశ్వాసానికి సంబంధించిన 6 అంశాలు

ఒకే నిజ దైవానికి సంబంధించిన వ్యక్తిగత పేరు అల్లాహ్

1. అల్లాహ్ యందు విస్వాసం:
ఒకే దేవుడి ప్రత్యేక అరబీ పేరు ‘ అల్లాహ్ ‘ ఆయనే ఆరాధనీయుడు, ఆయనకు భాగస్వాములు, ప్రత్యర్థులు, సమానులు అంటూ ఎవరూ లేరు. అల్లాహ్ తాను సృష్టించిన వాటిలా కాదు. ఆయన దైవత్వాన్ని దేనికి అపాదించలేము. అ౦టే – సృష్టికర్త, పోషకుడు, కరుణామయుడు, సర్వశక్తిమంతుడు, న్యాయమూర్తి. సమస్తమూ తెలిసినవాడు.
తన అధికారమూ, కార్యములరీత్యా అల్లాహ్ కు భాగస్వాములు లేరు. అల్లాహ్ ఆదేశం మేరకే జగత్తు సృష్టించబడింది. ఆయనే ఈ జగత్తులన్నింటినీ నడిపిస్తున్నదీ, నియంత్రిస్తున్నది. ఎంతో్ సమతుల్యమైన , సంక్లిష్టమైన ఈ సృష్టిని సృష్టిచడమన్నది ఆ
సర్వక్తిమంతుడికీ తప్ప మరొకరికి సాధ్యం కాదు కనుక ఈ విశ్వం తనంతట తాను సృజించబడ్డదన్నది అహేతుకం. క్రమానుగత లేక యాదృచ్ఛిక సంఘటనల పల్ల ఈ సృష్టి సృజించబడిందన్నది కూడా నమ్మలేము.

2. దేవదూతల య౦దు విస్వాసం:
జ్యోతి ను౦చి దేవదూతలను అల్లాహ్ సృజించాడు. వారెన్నడూ ఆయన ఆదేశాలను ఉల్లంఘించలేదు. కొందరు దేవదూతల వివరాలు వెల్లడించబడ్డాయి, ప్రవక్తలకు దైవ సందేశాన్ని చేరవేసే దేవదూత జిబ్రాయీల్ అనీ, జనుల ప్రాణాలు తీసుకునేది మృత్యుదూత
(ఇస్రాయీల్) అని తెలుపబడింది.

3. దైవ గ్ర౦థాల య౦దు నమ్మకం
మానవాళికి మార్గదర్శకత్వం, కరుణ చూపేందుకుగాను అల్లాహ్ దైవగ్రంథాలను తన సందేశహరులపై అవతరింపజేశాడు. వాటిలో తౌరాతు (పాత నిబంధన) గ్రంథం, మూసా(అ). కీస్తు (అ)లకు ప్రకటితమైన సువార్త ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) పై అవతరించిన దివ్యఖుర్ఆన్ ఉన్నాయి. అయితే వీటిలో దివ్యఖుర్ఆన్ తప్ప మిగిలిన గ్రంథాలు యథాతథ మూల రూప౦లో లేపు. అవి చెరుపబడటమో మార్చబడటమో పోగొట్టబడటమో జరిగాయి.
దైవాజ్ఞ అక్షర రూపమే దివ్యఖుర్ఆన్. అదే మానవాళికంతటీకీ చివరి దైవప్రకటన. అ౦దులో ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) సాధికారంగా చెప్పినవి, చేసినవి ఉన్నాయి. ఇస్లామీయ జ్ఞానానికి అదే ప్రాథమిక ఆధారం .

4. ప్రవక్తల యందు నమ్మకం:
అల్లాహ్ లక్షలాది ప్రవక్తలను పంపించాడని ముస్లింలు విశ్వసిస్తారు. దైవ సందేశం తెలుపడానికి ప్రతీ జాతికి కనీసం ఒక ప్రవక్తనైనా పంపించాడని నమ్ముతారు. ఈ ప్రవక్తలలో ఆదం (అ), నూహ్(అ), ఇబ్రాహీం(అ), దావూద్ (అ),యూసుఫ్(అ), మూసా(అ), ఈసా(అ) ముహమ్మద్
(స. అ. సం) ఉన్నారు. ఒకే దేవుని ఆరాధించమని పిలవడానికి, దేవునికి విధేయులై ఎలా ఉండాలో క్రియాత్మకంగా చూపేందుకు, సాఫల్యమార్గం ప్రజలకు చూపేందుకు వారొచ్చారు. అదే మహత్కార్యానికి వారొచ్ఛారు. మానవులుగా జన్మించిన వారిని ఆరాధి౦చడ౦, వారిని దేవుడికి మధ్యవర్తిత్వంగా ఉపయోగించడం నిషిద్ధం. ఏ రీతిలోనైనా ప్రవక్తలను ఆరాధించడం వారి ద్వారా దేవుని ఆరాధించడ౦ పూర్తిగా నిషిద్ధం. పైగా అది దేపుడొక్కడే అనేదాన్ని ఉల్లంఘి౦చడమే అవుతుంది.

దేవుని దైవత్వమందు ప్రవక్తలకు ఏమాత్రమూ భాగం లేదు
ప్రవక్త క్రీస్తు లేక ఈసా (క్రీస్తు అ. స) దేవుని ప్రవక్త అని ముస్లింలు విశ్వసిస్తారు. ఆయన కన్య మేరీకి జన్మించడమే ఓ అద్భుతం. దేవుని ఆజ్ఞతో ఆయన అనేక అద్భుతాలు చేశాడు. అనారోగ్యులను స్వస్థపరిచాడు, గుడ్డివానికి చూపును ప్రసాదించారు. తన తల్లిఫై పచ్చిన నిందను ఖ౦డి౦చే౦దుకుగాను అప్పుడే పుట్టిన శిశువుగా మాట్లాడెను. క్రీస్తు(అ)ను ముస్లింలు మన్నించి, గౌరవించినప్పటికీ ఆయనను ఆరాధించరు. ఆయనను దేవుని కుమారునిగా, ముగ్గురు దేవుళ్ళ భావన (ట్రినిటీ) ఒకరిగా అంగీకరించరు. ఆయనకు దైవత్వ గుణాలను ఆపాదించడాన్నీ అంగీకరించరు. దేవుడిలా అన్నాడు: “ఎవరినైనా తను కుమారుడుగా చేసుకోవడం అనేది అల్లాహ్ తగిన పద్ధతి కాదు. ఆయన పరమ పవిత్రుడు. ఏ విషయాన్ని గురించియైనా ఆయన నిర్ణయం తీసుకుంటే, ‘ అయిపో ‘ అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. (దివ్యఖుర్ఆన్ – 19: 35)

ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం)
మానవాళికి అ౦ది౦చబడిన చివరి ప్రవక్త ముహమ్మద్(స. అ. సం). దైవాదేశాలను ఎలా పాటిచాలన్నది ప్రయోగాత్మకంగా చూపేందుకు ఆయన ‘దివ్యఖుర్ఆన్ ‘ అనే దైవగ్రంథంతో వచ్చారు. నిజాయితీకి, న్యాయానికి, కరుణకు, ప్రేమానురాగాలకు, సత్యానికి, ధైర్యానికి ఆయన ఆదర్శం. కీస్తు(అ)ను ఆరాధించని విధంగానే ప్రవక్త ముహమ్మద్
(స.అ. సం) ని ఆరాధించరు. ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) ఇలా అన్నారు: మర్యం కుమారుడు కీస్తు(అ)ను క్రైస్తవులు స్తుతి౦చినంతగా నన్ను స్తుతించడంలో పరిమితులు దాటకండి. నేను కేవలం దైవదాసుణ్ణి మాత్రమే కనుక నన్ను దైవదాసునిగా, ఆయన సందేశహరుడిగా మాత్రమే కీర్తించండి”

5. తీర్పు దినమందు నమ్మకం
తీర్పు దినం అనే రోజున ప్రతి ఒక్కరూ సృష్టికర్త, ముందు నిలబడతారు. ఇహలోకంలో చేసిన వారి మంచి, చెడు కార్యములు ప్రశ్నించబడతాయి. వారి కర్మలు స్పష్టంగా చూపబడతాయి. వారి శరీరాకారాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విచారణకు గురౌతారు ఈ మహాదినాన న్యాయం చేసే అల్లహ్ అన్నింటినీ న్యాయంగా విచారిస్తాడు. ఏ ఒక్కరికీ అన్యాయం జరుగదు ప్రతి ఒక్కరి హక్కులు తిరిగి ఇవ్వబడతాయి. ప్రతి ఒక్కరికీ న్యాయం దక్కుతుంది. అది స్వర్గం లభించడమనే వరమే కావచ్చు లేక నరకాగ్ని అనే శిక్ష కావచ్చు.

6. దేవుని విధి యందు నమ్మకం
తీర్పు దినం లేకుంటే జీవితం అనుచితంగా గడుస్తుంది. ఎవరికీ ఈ ప్రపంచంలో న్యాయం లభించదు.
గతించిన, జరుగుతున్న, జరుగబోయె అన్నింటి గురించి అల్లాహ్ కు తెలుసు. మంచి చెడులను ఎ౦చుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరిగింది, అలాగే వారి మంచి, చెడులు లెక్కించబడతాయి. అయితే లెక్కల ఘడియలో మాత్రం వారికీ స్వేచ్ఛ ఉ౦డదు. వారి వివేచనా శక్తి పోతుంది. వాస్తవికతతో, స్వేచ్ఛకు విభేద౦ ఏర్పడదు. దేవునికి తెలిసి, ఆయన అనుమతితోనే వాన్తవిక సంఘటనలు తీర్పుదినాన పున: దర్శనమిస్తాయి. దేవుని శక్తి అన్ని౦టినీ ఆపేస్తుంది లేక జనుల స్వేచ్ఛను నిరోధిస్తుందని అర్థం కాదు జనుల నిర్ణాయక శక్తి నశించిపోతుంది అంటే దేవుడు బలవంతపెడతాడని కాదు. తాననుకున్నట్టే జరగడం కూడా దేవునికి ఆన౦దకర౦ కాదు.
ఆరాధనకు సంబంధించిన

5 మూలస్తంభాలు ముస్లిం జీవితానికి పునాది

అల్లాహ్ కు అన్నింటి మీద అధికారం కలదు, ఆయన అనుమతి లేకుండా, ఆయనకు తెలియకుండా ఏది జరుగదు.
1. విశ్వాస ప్రకటన
అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు. ప్రవక్త ముహమ్మద్(స. అ. సం) ఆయన సందేశహరుడు’ అన్నవిశ్వాస ప్రకటన జరగాలి. హృదయంలో దృఢ నిశ్చయ౦తో, విధేయపూర్వకంగా ఈ మాటలు పలకాలి. తదనంతరం దానిని ఆచరణలో పెట్టాలి. ఈ విశ్వాస ప్రకటనతో మిథ్యా దేపుళ్ళను తీరస్కరించడం అల్లాహ్ ఒక్కడే అరాధనీయుడని, ముహమ్మద్(స. అ. సం) ఆయన సందేశహరుడని చెప్పడం ద్వారా ముస్లింగా మారడం జరుగుతుంది.
2. రోజుకు ఐదు నమాజులు:
ఇస్లాం ఆరాధన మూలస్తంభాలలో రెండవది రోజుకు 5పూట్ల నమాజు చేయడం. నమాజు అన్నది సృష్టికర్తకు, మనిషికీ మధ్య వ్యక్తిగత, అధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. పైగా ఇది దేవుడికి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉన్నానన్న గుర్తు చేస్తుంది. ఈ ఐదు నమాజులు, వేకువ మధ్యాహ్నం, నడిమధ్యాహ్నం, సంధ్య, రాత్రి వేళల్లోఉంటాయి.నమాజుకు కొన్ని నిమిషాలు పడుతుంది. వాటిలో ఖుర్ఆన్ పఠించడం, దుఆలు, అల్లాహ్ నుస్తుతించడం వివిధ శరీర భంగిమలు ఉంటాయి. సమాజుకు ము౦దు ముస్లింలు తమ శరీరావయాలు కొన్నింటిని కడుక్కుంటారు. తద్వారా ఆధ్యాత్మిక, శారీరక పరిశుద్ధత కలిగేలా చూసుకుంటారు.

3. వార్షిక దాతృత్వం (జకాత్)
వార్షిక దాతృత్వం అనేది ప్రతి ముస్లిం విధి. (అనగా ఒక స్థాయి సంపద ఉన్నవారికి). పేదలకు, అగత్యపరులకు, అర్హులకు, ప్రయాణికులకు వార్షిక సంపదలో కేవలం 2.5 % శాతం దానమివ్వడం విధి. ఇది (జకాత్) సందను పవిత్రం చేస్తుంది. అది ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఆ ప్రయోజనాలలో ఒకటి, ధనవంతులు, పేదల నడుమ అ౦తరాన్ని తగ్గిస్తుంది. పైగా అందరి ఫ్రాథమిక అవసరాలు తీరేలా చూస్తుంది.

4. ఉపవాస దీక్ష పాటించడం
ప్రతి సంవత్సరం రమజాన్ నెలలో ముస్లింలు సూర్యోదయం ను౦చి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. ఆహార పానీయాలు తీసుకోరు. లై౦గిక స౦బంధాలకు దూరంగా ఉంటారు. ఉపవాసం అన్నది ఆధ్యాత్మిక పవిత్రతను పెంచుతుంది. సహనం అత్మ నియంత్రణను పెంచడమేకాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తు౦ది. శారీరకంగా, మానసికంగా సమర్థులైన ప్రతి ముస్లింకు ఉపవాసం విధిగా చేయబడింది. రోగగ్రస్తులు, మానసికంగా స్వస్థత లేనివారు, వయోవృద్ధులు, రుతుస్రావంలో ఉన్న మహిళలు, ప్రయాళణికులకు ఉపవాస దీక్ష ను౦చి మినహాయింపు ఇవ్వబడింది. గర్భస్త మహిళలు, శిశువులకు పాలుపట్టే మహిళలకూ మినహాయింపు ఇవ్వబడింది, ఎందుకంటే వారికి, లేక బిడ్డకు అది హానికరం కావొచ్చన్న ఉద్దేశంతో ఈ మినహాయింపు ఇవ్వబడి౦ది.

5. పవిత్ర యాత్ర: (హజ్ ప్రయాణం)

ఒకవేళ శారీరకంగా, ఆర్థికంగా బాగున్న పక్షంలో జీవితంలో ఒక్కసారైనా సౌదీ అరేబియాలో ఉన్న మక్కా నగరానికి పవిత్రయాత్ర తప్పక చేయాలి. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి ఒకసారి ఈ పవిత్రయాత్ర ఉంటుంది. ఈ హజ్ యాత్రలో ఆ దేవుడిని ఆరాధించేందుకు జాతి, రంగు, తెగ, హోదా, వయస్సు అనే భేదభావాలు లేకుండా ప్రపంచం నలుమూలల ను౦చి ముస్లి౦లు వస్తారు. ఈ హజ్ యాత్రలో త్యాగాలు (ఖుర్బాని) ప్రయాణం, వివిధ ప్రదేశాలలో ప్రార్థనలు ఉంటాయి. జీవితంలో లభించిన వరాలన్నింటికీ కృతజ్ఞతగా దేవుడికి మరింత విధేయులవ్వడానికి ఈ యాత్ర దోహదపడుతుంది.
ఆరాధన భావం

దేనివల్ల అల్లాహ్ ప్రీతి చెందుతాడో అలా౦టి క్రియ. ఇస్లా౦ ధర్మంలో ఆరాధన అన్నది పైన పేర్కొన్న కృతువులకే పరిమితమైవది కాదు. ఆరాధన అంటే అల్లాహ్ ప్రీతి కోసం చేసే అన్ని పనులు అన్న విస్తృత అర్థం ఇమిడి ఉంది. దేవుడి మార్గదర్శకం ప్రకారం ఉండే ఉద్దేశాలు, పనులు, దైనందిన కార్యకలాపాలన్నీ ఆరాధనలోకే వస్తాయి. ఉదాహరణకు చిరునవ్వు చి౦ది౦చడం, పొరుగువారితో మంచిగా ఉండడం, కుటుంబానికి మద్దతుగా ఉ౦డడ౦, నిజాయితీ, రోడ్డుపై ఉన్న చెత్త తొలగించడం వంటి పనులన్నీ ఆరాధన కిందికే వస్తాయి. ఇక్కడ గనునించాల్సిన విషయమేమిటంటే అల్లాహ్ కు ఎవరి ఆరాధనల అవసరం లేదు. కానీ మనకే ఆయన అపసరం ఉ౦ది. మన ఆరాధనలు మన ప్రయోజనాల కోసమే.

ముగింపు

పైన పేర్కొన్న విశ్వాసం, ఆరాధన పద్దతులే ఇస్లాం సారం. వాటిని ఆచరిస్తే ఇస్లాం ధర్మం ప్రజల ఆధ్యాత్మిక, శారీరక, మానసిక, సామాజిక అవసరాలు తీరుస్తు౦ది. ఇంకా ఇస్లామీయ జీవన మార్గాన్నే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆమోదించాడు. స్వర్గానికి తీసుకెళ్ళే ఏకైక మార్గం ఇస్లాం ధర్మమే.

Related Post