నిరాశ నిషిద్ధం!

Originally posted 2016-10-18 19:43:54.

”మానవ మాత్రునికి ఒక లోయ నిండా బంగారం దొరికితే ఇంకో లోయ ఉంటే ఎంత బావుండు అంాడు. రెండు లోయల నిండా బంగారం దొరికినా మూడో లోయ కూడా ఉంటే ఎంత బావుండు అంాడు. మనిషి కడుపును కాి మ్టి మాత్రమే నింప గలదు” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌)

”మానవ మాత్రునికి ఒక లోయ నిండా బంగారం దొరికితే ఇంకో లోయ ఉంటే ఎంత బావుండు అంాడు. రెండు లోయల నిండా బంగారం దొరికినా మూడో లోయ కూడా ఉంటే ఎంత బావుండు అంాడు. మనిషి కడుపును కాి మ్టి మాత్రమే నింప గలదు” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌)

కటిక పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, అధర్మ భూషణం, అసత్య భాషణం, అనుమానం, ప్రేమ వైఫల్యం, ఆప్తుల విరహం, నిజ దైవం పట్ల విశ్వాస లేమి – ఇలా ఏదోక కారణం నిరాశకు. కానీ, ఆశకు మార్గాలు అనేకం. మనలోని ప్రతి ఒక్కరిలోనూ సమస్యను ఎదుర్కునే శక్తిసామర్థ్యాలు పుష్కలంగా ఉంాయి. మనం మోయలేని భారాన్ని దేవుడు మన మీద మోపడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిష్కరించుకోవడమే. పంట పోతే పంట వస్తుంది, బతుకు పోతే బతుకు రాదు. కాబట్టి మనం బతకాలి, నలుగురికి బతుకినివ్వాలి. ఆ నిమిత్తం పనికొచ్చే వ్యాసమే ఇది.

నిరాశ అంటే: నేను అనుకున్న, తల పెట్టిన కార్యం జరుగుతుందన్న నమ్మకాన్ని కోల్పోవడమే నిరాశ. ఇందులో కొంత పాత్ర భయానిది కూడా.

మానవ నైజం గురించి ఖుర్‌ఆన్‌; ”మేము మనిషికి మా కారుణ్యం రుచిని చూపి ఆ తర్వాత దాన్ని గనక అతన్నుంచి తిరిగి తీసేసుకుంటే అతను నిరాశ చెందుతాడు; కృతఘ్నుడిగా మారి పోతాడు”. (హూద్‌: 9)
”అదే అతనికి కలిగిన కష్టాల, నష్టాల తర్వాత మేము గనక కొన్ని అనుగ్ర హాల రుచిని చూపితే,’నా దురవస్థలన్నీ దూరమయిపోయాయి’ అని అంటాడు. నిశ్చయంగా అతను మిడిసి పడతాడు, గొప్ప చెప్పుకుాండు”. (హూద్‌; 10)
అంటే, లేమి కలిగితే నిరాశకు లోనయి నిజదైవం చేసిన మేళ్లన్నింనీ మరచి ఆయన్ను కొలవడం మానేస్తాడు. కలిమి కలిగితే ఇక దేవుని అవసరం తనకేం టన్న అహంభావంతో బీరాలు పోతాడు. తానే కష్టాల్ని అధిగమించినట్లు, కష్టం తనను చూసి తోక ముడిచినట్లు గొప్పలు పోతాడు.
”మరియు మేము ప్రజలకు కారుణ్యం రుచిని చూపించినప్పుడు వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ఒక వేళ వారి చేతులు చేసుకున్న చేతల వల్ల వారికి ఏదయినా కీడు కలిగితే మాత్రం పూర్తి నిరాశ చెందుతారు”. (అర్రూమ్‌: 36)
ఇంకా చెప్పాలంటే, ”మేలును అర్థించడంలో మానవుడు అలసిపోడు. అదే అతనికేదయినా కీడు వాటిల్లితే మాత్రం ఆశలన్నీ వదులుకొని పూర్తి నిరాశ జీవిగా మారి పోతాడు”. (ఫుస్సిలత్‌; 49)

నిరాశ ధర్మనిష్ఠుల దృష్టిలో:

‘నిజ భావంలో పండితుడు ఎవడంటే, అల్లాహ్‌ కారుణ్యం యెడల ప్రజల్ని నిరాశకు గురి చెయ్యనివాడు, అల్లాహ్‌ అవిధేయతకు బరి తెగించేలా వెసులు బాటును ఇవ్వనివాడు, అల్లాహ్‌ శిక్ష యెడల పూర్తి నిశ్చింతను కల్గించనివాడు’ అన్నారు హజ్రత్‌ అలీ (ర).
”వినాశనం రెండింలో ఉంది – నిరాశ, ఆత్మ స్తుతి”
”ఘోర పాపాలు మూడు-అల్లాహ్‌ విశాలత పట్ల నైరాశ్యత, అల్లాహ్‌ కారుణ్యం యెడల నిరాశ, అల్లాహ్‌ శిక్ష యెడల నిర్భయత”
– హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర).
”అల్లాహ్‌ కారుణ్యం యెడల నిరాశ చెందడం అంటే మనిషి తనును తాను వినాశనానికి గురి చేసుకోవడమే”
”నిరాశ చెందకు, లేదా కార్యశూన్యుడవయి కూర్చుండి పోతావు” – ఇబ్ను సీరీఁ (రహ్మ).
”అల్లాహ్‌ కారుణ్యం యెడల నిరాశకు గురి చేసేవారు, నిరాశకు గరయ్యే వారు తప్పు చేస్తున్నారు” – సుఫ్యాన్‌ బిన్‌ ఉయైనా (రహ్మ).
”పూర్తి నిశ్చింతా మంచి కాదు, పూర్తి నిరాశా మంచిది కాదు. ఖిబ్లా వాసు లకు సత్య మార్గం ఈ రిెంకీ మధ్యన ఉంది” – తహావీ (ర).

నిరాశ అవిశ్వాసుల లక్షణం:

”మార్గభ్రష్టులు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం యెడల నిరాశ చెందు తారు”. (అల్‌ హిజ్ర్‌: 56)
”అవిశ్వాస వర్గానికి చెందిన వారు మాత్రమే అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు”. (యూసుఫ్‌: 87)

నిరాశ కొన్ని సందర్భాల్లో మంచిదే:

ఆశకు అంతు లేదు. ”మానవ మాత్రునికి ఒక లోయ నిండా బంగారం దొరికితే ఇంకో లోయ ఉంటే ఎంత బావుండు అంాడు. రెండు లోయల నిండా బంగారం దొరికినా మూడో లోయ కూడా ఉంటే ఎంత బావుండు అంటాడు. మనిషి కడుపును కాటి మట్టి  మాత్రమే నింప గలదు” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌) కాబట్టి కొన్ని సందార్భలలో అత్యాశకు పోకుండా ఉండటమే కాదు అన్యుల ఆస్తుల వైపు ఆశగా చూడటం కూడా మానుకోవాలి.
హజ్రత్‌ ఉమర్‌ (ర) వేదిక మీద ప్రసంగిస్తూ ఇలా అన్నారు: ”నిశ్చయంగా లాలూచీ దారిద్య్రానికి దారి. అనాసక్తత నిరపేక్షతకు మార్గం. మనిషి ఒక వస్తువు యెడల ఆశను వదులుకుంటే అతను ఆ వస్తువు నుండి నిరపేక్షాపరుడయి పోతాడు”.
ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) ఇలా అన్నారు: ”చిత్తశుద్ధి, మరియు స్వీయ ప్రశంసా కాంక్ష, ప్రజల వద్ద ఉన్న వాిని యెడల లాలూచీ ఒకే హృద యంలో ఇమడజాలవు. ఒకవేళ ఉన్నా అవి, నీరు-నిప్పులా ఉంాయి. నీ ఆత్మ నిన్ను చిత్తశుద్ధి గురించి ప్రేరేపిస్తే, ముందు నువ్వు నిరాశ అనే కత్తిని చేబూని లాలూచీని అంతమొందించు. ఐహిక అనాసక్తత ఆయుధంతో స్వీయ ప్రశంసా కాంక్షను నియంత్రించు. ఈ రెండూ నువ్వు చెయ్యగలిగితే నీకు చిత్తశుద్ధి అనే సంపద దక్కుతుంది”.

నిరాశ రకాలు:

1) అల్లాహ్‌ కారుణ్యం యెడల ఆశను వదులుకోవడం.
2) కష్టాలు, నష్టాలు వైెదొలగవు అన్న నిర్ణయానికి వచ్చేయడం.
3) ప్రస్తుత స్థితికన్నా ఇంకా మెరుగయిన స్థితి కలుగదు అని భావించడం.
4) ధర్మోన్నతి, ధర్మపరాయణుల ఉన్నతి సాధ్యం కాదు అన్న ఆలోచన.
5) దుర్మార్గులు, దుర్నడత ప్రియులు, వ్యసన పరులు, పాపులు ఇక మారరు, వీరిలో మార్పు రాదు అని భావించడం.
”ఇంకా వారిలో ఒక వర్గం (ధర్మబోధకుల్ని ఉద్దేశించి) ‘అల్లాహ్‌ా నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయే వారికి నీతిబోధ చేసి ప్రయోజనం ఏమి?’ అని చెప్పగా, ”మీ ప్రభువు సమక్షంలో సంజాయిషీ ఇవ్వగలిగే స్థితి లో ఉండానికి (ఈ పని చేస్తున్నాము). బహుశా వారు ఈ నీతిబోధ ద్వారా దైవభీతిపరులుగా మారవచ్చు” అని వారు సమాధానమిచ్చారు. (అల్‌ ఆరాఫ్‌: 164)

నిరాశకు కారణాలు:

1) నిజ దైవమయిన అల్లాహ్‌ గురించి సత్యబద్ధమయిన అవగాహన లేక పోవడం: మనిషి తనకు తెలియని దానికి శత్రువు అన్నది తెలిసిందే. ఇబ్ను ఆదిల్‌ (రహ్మ) ఇలా అన్నారు: అల్లాహ్‌ కారుణ్యం యెడల నిరాశ అనేది కొన్ని విషయాల పట్ల అవగాహన లోపించడం వల్లనే చోటు చేసుకుంటుంది. అ) అల్లాహ్‌ాకు, తన సమస్యను తీర్చే శక్తి ఉందని తెలియకపోవడం. ఆ) తనుకు ఏం కావాలో దేవుడికి తెలీదు అని భావించడం. ఇ) అల్లాహ్‌ అవసరానికి, సహాయానికి, పిసినారితనానికి అతీతుడు అని గ్రహించకపోవడం. ఈ మూడు రకాల అవగాహన రాహిత్యం అతన్ని మార్గభ్రష్టత్వానికి గురి చేసి నిరాశ నిశీధిలోకి న్టెి నరక వాసుల జాబితాలో చేర్చేస్తుంది.

2) అల్లాహ్‌కు భయ పడటంలో అతిశయిల్లడం: ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) ఇలా అన్నారు: ”మనిషిని ఆశను పూర్తిగా వదులుకునేంతి భయం ఉండకూడదు. అల్లాహ్‌ కారుణ్యం యెడల ఆశను వదులుకునేంతి భయం మంచిది కాదు”. ఇమామ్‌ తైమియా (ర) గారి మాటను ఉటంకిస్తూ ఇలా అన్నారు: ”దైవభీతి పరిధి అల్లాహ్‌ అవిధేయతకు పాల్పడకుండా చేసేంతిదయినదై ఉండాలి. దానికన్నా మించింది నిష్ప్రయోజనకర భయంగా ఉంటుంది. అదే మనిషిని నిరాశకు లోను చేస్తుంది. అది అల్లాహ్‌ా ఆగ్రహాన్ని అధికమించిన కారుణ్యం యెడల అమర్యాద అవుతుంది”.
3) నిరాశ వాదుల సావాసం: ”మనిషి తన మిత్రుని మతధర్మం మీదే ఉం ాడు” అన్నారు ప్రవక్త (స). (అహ్మద్‌) కనుక నిరాశ వాదుల సావాసం నిరాశకు దారి తీస్తుందే తప్ప ఆశల పల్లకి ఎక్కించదు.
4) భౌతిక కారణాలతో ముడి పెట్టేది: ఓ నిరాశవాది ఓ వివేకితో జరిపిన సంభాషణ –
నిరాశవాది: నాకు శత్రువులున్నారు.
వివేకి: ”మరెవరయితే అల్లాహ్‌ాను నమ్ముకుాంరో వారికి అల్లాహ్‌ా ఒక్కడే చాలు” (అత్తలాఖ్‌: 3)
నిరాశవాది: వారందరూ నాకు వ్యతిరేకంగా కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారు.
వివేకి: ”మరియు దుష్ట పన్నాగాల కీడు ఆ పన్నాగాలు పన్నేవారి మీదే పడుతుంది”. (ఫాతిర్‌: 43)
నిరాశవాది: వారు చాలా మంది ఉన్నారు.
వివేకి: ”ఒక చిన్న వర్గం ఒక పెద్ద సమూహాన్ని అల్లాహ్‌ ఆజ్ఞతో జయించడం ఎన్నో సార్లు జరిగింది”. (అల్‌ బఖరహ్‌: 249)
5) ధర్మ విషయంలో మౌఢ్యాన్ని ప్రదర్శిస్తూ, ధర్మం కల్పించిన వెసులుబాటును వినియోగించుకోక పోవడం వల్ల చోటు చేసుకునే నైరాశ్యం.
6) ఫలితాల విషయంలో సహనం, సంయమనాన్ని పాటించక పోవడం వల్ల కలిగే నిరాశ. ”నేను దుఆ చేశాను, నేను ప్రార్థించాను. అయినా నా ప్రార్థన ఆలకించ బడలేదు అంటూ వాపోతూ దుఆ చెయ్యడమే మానేస్తాడు మనిషి” అన్నారు ప్రవక్త (స). (ముత్తఫఖున్‌ అలైహి)
7) ప్రాపంచిక వ్యామోహం.
8) ఖచ్చితమయిన నిర్ణయాత్మక శక్తి లేకపోవడం.
9) మార్పుకి సిద్ధం కాకపోవడం.
10) అన్యుల రాతా రీతుల యెడల ప్రతికూల స్పందన. కుళ్ళుబోతు తనం.

నిరాశ నుండి కాపాడే సాధనాలు:

1) అల్లాహ్‌ యెడల సత్య బద్ధమయిన అవగాహన కలిగి ఉండటం: ఆయన సర్వోన్నత నామాల,గుణగణాల అవగాహన కలిగి ఉండటం. అల్లాహ్‌ా కష్టా లన్నింని తీర్చగల సమర్థుడు, పాపాలన్నింని మన్నించగల ప్రభువు అని తెలిసిన తర్వాత నిరాశకు తావు ఉండదు.
2) అల్లాహ్‌ా యెడల సద్భావన కలిగి ఉండటం: ”నేను నా దాసుని భావనకు దగ్గరగా ఉంాను. అతను నా పట్ల కలిగి ఉన్న భావనకు అనుగుణంగా నేను అతనితో వ్యవహారం చేస్తాను”. (బుఖారీ)
3) అల్లాహ్‌ యెడల గట్టి  నమ్మకం కలిగి ఉండటం. ఆయనపై మనసును లగ్నం చెయ్యడం.
4) ఆశాభయాల మధ్యస్థ స్థితిలో ఉండటం: ఇమామ్‌ అహ్మద్‌ (ర) ఇలా అన్నారు: విశ్వాసి జీవితం ఆశాభయాల నడుమ ఉండాలి. అందులో దేని పాళ్ళు అధికమయినా సదరు వ్యక్తి వినాశనం ఖాయం.
5) విధిరాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం: ”ఏ ఆపదయినా సరే – అది భూమి లో వచ్చేదయినా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదయినా – మేము దానిని ప్టుించక మునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయడం అల్లాహ్‌ాకు చాలా తేలిక”. (హదీద్‌; 22)
ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) ఇలా అన్నారు: ”దాసుని జీవితంలో నచ్చని ఏదేని విషయం జరిగినప్పుడు అతన్ని ఆశవాదిగా మలిచే, అతని థను, దిశను మార్చే మేలిమి ఘ్టాలు ఆరు ఉంాయి. 1) తౌహీద్‌ ఘట్టం-తనకు అలా జరగాలని నిర్ణయించిన వాడు కేవలం అల్లాహ్‌ా మాత్రమే. ఆయన తలచింది అయి తీరుతుంది. ఆయన తలచనిది ఎన్నికీ అవ్వదు. 2) న్యాయ ఘట్టం – తన జీవితంలో ఏం జరగాలో ముందే ఖరారయింది. తన విషయంలో చేసిన అల్లాహ్‌ తీర్పు పూర్తి న్యాయబద్ధమయినది. 3) కరుణ ఘట్టం- తనకు జరిగిన దాని విషయంలో అల్లాహ్‌ా కోపంకన్నా కరుణ పాళ్ళె అధికం. ప్రతీకా రంకన్నా ప్రేమ పాత్రే మిన్న. 4) యుక్తి ఘట్టం – తనకు ఏది జరిగినా, అది అల్లాటప్పగా జరిగినది ఎంత మాత్రం కాదు. ప్రణాళిక బద్ధంగా ఆయన యుక్తి లోబడే జరుగుతుంది. ఆయన యుక్తి ఎన్నికీ వృధా అయ్యేది కాదు.5) ప్రశంసా ఘట్టం – అల్లాహ్‌ పూర్ణ ప్రశంసకు అర్హుడు, సంపూర్ణ స్తుతికి పాత్రుడు. ఆయన ఏది చేసినా అన్ని కోణాల దృష్ట్యా ప్రశంసాభరి తమే. లోపానికి, వంక పెట్టడానికి ఆస్కారమే లేదు. 6) దాస్య ఘట్టం – తను కేవలం అల్లాహ్‌ా దాసుడు మాత్రమే. దాసుని పని యజమాని ఆదేశ పాలన. ఆయన తీర్పుకి శిరసా వహించడం, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిం చడం. (అల్‌ ఫవాయిద్‌)
పై ఘ్టాలను దృష్టిలో పెట్టుకుంటే జీవితానికి సంబంధించిన ఏ ఘట్టమూ మనల్ని నిరాశకు గురి చేయజాలదు. మరే ఘటనా వెలుగుతూ ఉండాలను కునే మన జీవన జ్యోతిని ఆర్పజాలదు.
6) విపత్తు విరుచుకు పడినప్పుడు సహనం పాటించడం: ”బాధ కలిగిన ప్రథమ స్థితిలోనే సహనం” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ, ముస్లిం)

అలాగే ”తనకు ఎదురయిన కష్టం, నష్టం కారణంగా మీలో ఎవరూ మరణాన్ని కోరుకోకూడదు. ఒక వేళ ఆపద చాలా తీవ్రమయినదయితే, తప్పనిసరి అనుకుంటే ఇలా ప్రార్థించాలి: ”ఓ అల్లాహ్‌! జీవితం నా కోసం సంక్షేమంగా ఉన్నంత కాలం నన్ను బ్రతికి ఉంచు. ఒకవేళ మరణమే నా పాలిట శ్రేయస్కరం అయితే నాకు మరణాన్ని ప్రసాదించు”. (అబూ దావూద్‌)

వై మీ అనడం తప్పే, ట్రై మీ అనడం తప్పే:

నాకే ఎందుకీ కష్టాలు అనడమూ తప్పే, కష్టాలను రమ్నను చూద్దాం అనడమూ తప్పే. వచ్చిన కష్టానికి కలత చెందకూడదు, రాని కష్టాన్ని కవ్వించి రమ్మనకూడదు. ఎందుకంటే ”నిశ్చయంగా కష్టంపాటే సౌలభ్యం ఉంటుంది” (అష్షరహ్‌: 5) అంటున్నాడు అల్లాహ్‌.
7) స్వీకరించబడుతుంది అన్న నమ్మకంతో దుఆ: దుఆ చేసిన వ్యక్తి మూడింలో ఏదోకి తప్పకుండా లభిస్తుంది అన్నారు ప్రవక్త (స). 1) అతను కోరుకున్న అతనికి దక్కుతుంది. 2) అతని మీద రాబోయే ఆపద తొలగించ బడుతుంది. 3) అల్లాహ్‌ యుక్తి లోబడి పై రెండూ జరగని పక్షంలో ప్రళయ దినాన స్వర్గంలో అతని అంతస్థులను పెంచే అమల సాధ నం అవుతుంది.
8) కారకాలను ఆశ్రయించడం: ”నా కుమారుల్లారా! మీరు వెళ్ళి యూసుఫ్‌ను గురించీ, అతని సోదరుని గురించి బాగా వాకబు చేయండి. అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి”. (యూసుఫ్‌: 87)

9) ఐహిక అనాసక్తత: అల్లాహ్‌ ప్రాపంచిక లాభాలను ఇష్టమున్న వారిని, ఇష్టం లేని వారికీ ప్రసాదిస్తాడు. అయితే పరలోక ప్రయోజనాలు మాత్రం ఆయనకు ఇష్టమయిన వారికే లభిస్తాయి. అలా చూస్తే ప్రాపంచిక ప్రయోజనాలు, సౌఖ్యాలు, కనీస సౌకర్యాలు సయితం లభించని మహానుభావులు ఎందరో అగుపిస్తారు.

10) అవిరళ కృషి: ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నట్టు మనిషి పట్టుదలతో ప్రయత్నిస్తే సమస్య దానంతట అదే సమసి పోతుంది. ఇబ్నుల్‌ ఉథైమీన్‌ (రహ్మ) తన గురువు అబ్దుర్రహ్మాన్‌ సఅదీ (రహ్మ) గారి మాటను ఉటంకిస్తూ -”నహూలో కూపా వాసులకు గురువయిన కసాయీ (రహ్మ) నహూ విద్యను అర్జించే ప్రయత్నంలో విఫలమయ్యారు. కాసింత నైరాశ్యానికి గురయ్యారు, ఒక రోజు – ఓ చీమ ఆహారాన్ని మోస్తూ గొడ ఎక్కే ప్రయత్నం చేస్తోంది. అలా పైకి ఎగబ్రాకడానికి ప్రయత్నించినప్పుడల్లా జారి క్రింద పడి పోతున్నది. అయినా ప్రయత్నించడంలో ఓడి పోకుండా చివరికి కఠినమయిన ఆ కనుమను దాింది. గోడపైకి ఎక్కేసింది. అది చూసిన ఇమామ్‌ కసాయీ లోలోన ఇలా అనుకున్నారు: ”నిలకడ కలిగిన ఈ చీమ తన అవిరళ కృషితో తాను అనుకున్నది సాధించ గలిగినప్పుడు, నేను సృష్టి శ్రేష్టుడనయి ఉండి సాధించ లేనా?” కఠోర సాధన చేశారు,నహూ విధ్యలో గురువులకు మించిన గురువుగా చరిత్రలో ఖ్యాతి గడించారు. కాబట్టి మనం నకారాత్మకంగా స్పందించక, సకారాత్మక స్ఫూర్తితోి సత్ఫలితాలను రాబ్టాలి, రాబట్ట గలం!

Related Post