ఇది పురుషాధిక్యత, పురుషాహంకార విధానం కాదా?

Originally posted 2014-04-09 19:49:42.

12_61_52_web - Copy

1. ఇస్లాం పురుషులకు నలుగురు స్త్రీలను వివాహం చేసుకునే హక్కు కల్పించడం, ఇది పురుష ఆధిపత్యానికి ఒక నిదర్శనం కాదా. ???

ఇస్లాం ను విమర్శించే ముందు ఒకే భార్య ఉండాలన్న నిబంధన ఉన్న ఏదైనా ఒక దార్మిక గ్రంధం చూపించండి. భారతదేశ పురాణాల కథలు చూసినచో (ఉదా:– వేదాలు, రామాయణం, మహాభారతం, తాల్ముద్, గీతలలో) ఒక భార్య కంటే ఎక్కువమంది భార్యలు ఉన్నవారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తుంది. ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం తప్పు అని ఎక్కడా ఉండదు. ( ఉదా :-దశరథ రాజు రాముని యొక్క తండ్రికి ఒకరికన్న ఎక్కువ భార్యలు, కృష్ణునికి లెక్కలేనన్ని భార్యలు. బైబిల్ లో చూసినట్లయితే అబ్రహామునకు ముగ్గురు భార్యలు, సోలోమానుకు వందల మంది భార్యలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
1954 సం\” లో ఓ హిందూ చట్టాన్ని తెచ్చారు, ఒక భార్య ఉండగా మరో స్త్రీని వివాహమాడరాదని, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే 1400 సం” లకు పూర్వమే ఒకే భార్య కలిగి ఉండటమే మేలు అని వివరించింది ఇస్లాం. అంతేకాదు ఒకరికంటే ఎక్కువ మందిని వివాహమాడితే వారికి (భార్యలకు) సరియైన న్యాయం చేయండి అని, అదే విషయాన్ని దివ్యఖుర్ఆన్ లోచూడండి.

అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ, నలుగురిని గానీ వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించ లేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే చేసుకోండి. దివ్యఖుర్ఆన్ (4:3)

ఇదే సూరాలో మరొక చోట ఇలా ఉంది మరియు మీరు ఎంతకోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయ మాన స్థితిలో వదలకండి. దివ్యఖుర్ఆన్ (4:129)

పై రెండు ఖుర్ ఆన్ వచనములను బట్టి తెలిస్తున్నది ఏమిటంటే భార్యలకు సరైన న్యాయం చేయగలిగినప్పుడే ఒకరికంటే ఎక్కువ మంది అంటే నలుగురు వరకు వరకు వివాహం చేసుకునే హక్కు ఉంది. లేకుంటే లేనట్లే కదా. ఒక భార్య కలిగి ఉండటమే మేలు అన్నది కూడా తెలుస్తుంది.
ఇస్లాంను నిందించే ముందు ఇస్లామ్కు పూర్వం పరిస్థితి ఎలా ఉండేదో ఒక్క సరి చుడండి. అరబ్బులలో అయితే ఓ పురుషుడు ఎంత మంది నైన వివాహం చేసుకునే హక్కు ఉండేది. కొత్త భార్య వస్తే పాత భార్యను నిర్లక్షం చేసేవాడు, లేదా ఆమెనూ విడిచిపెట్టేవాడు. పురుషుడు ఎన్ని బాధలు పెట్టిన అతని వద్దనే పడి ఉండ వలసిందే. ఆమె బాధను చెప్పుకునే అవకాసం కూడా ఉండేది కాదు. అలానే స్త్రీని తన ధన బలంతో, భుజబలంతో వసపరచుకునే వాడు ఇటువంటి దురక్రుత్యలనుఆపేందుకు ఇస్లాం ఇటువంటి ఎన్నో నియమాలు విధించింది. వివాహం చేయించేటప్పుడు ఖాజీ అంటే (వివాహం జరిపించే పద్దతి) పెళ్లి కుమార్తె కు ఈ పెళ్లి నీకు సమ్మతమేనా? లేదా? అని ముందు అడుగుతాడు. ఆమెకు సమ్మతమైతేనే వివాహం జరిపిస్తాడు. లేదంటే ఆయన వివాహం జరిపిoచడు. అలానే వివాహం జరిగిన తర్వాత ఆమెను భర్త వేదిస్తున్నా, లేక ఇతర కరాణాల వల్ల ఆమె అతని నుండి విదిచిపోవచ్చు. దీనినీ (ఖుల) అంటారు.
ఇస్లాం స్త్రీ లకు ఎన్నో హక్కులను కల్పించి వారి ఆత్మాగౌరవాన్ని పెంచింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఖుర్ఆన్ లోగల నియమ నిబంధనలు పాటించుటవలన ఎన్నో ప్రయోజనాలు శాస్త్రియపరంగా కూడా కనిపిస్తాయి. ఒక పురుషునకు నలుగురు స్త్రీలు వరకు వివాహమాడే అర్హత కల్గింది. అంటే అందులో పరమార్ధం ఉంటుంది.

అదేమిటో కొన్నింటిని మీ ముందు ఉంచుతాను చూడండి. వైద్య శాస్త్రం ప్రకారం పురుషుల కంటే మహిళల ఆయుష్యు ఎక్కువ అని కొన్ని సర్వేల వల్ల తెలుస్తుంది. మగ శిశువు కంటే ఆడ శిశువుకే వ్యాది నిరోధిక శక్తి అధికంగా ఉంటుంది. ఆడ శిశువులకన్నా మగ శిశువులే ఎక్కువగా చనిపోతూ ఉంటారు. పెధవాల్లలో కూడా పురుషులే అధికంగా చనిపోతారు. యాక్సిడెంట్ ల వలన, యుద్ధాల వలన స్థ్రీలకన్న పురుషులే ఎక్కువగా చనిపోతూ ఉంటారు. మన భారతదేశంలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా చనిపోతు ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు స్కానింగ్ ద్వారా కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా అని తెలుసుకొని ఆడబిడ్డ అయితే గర్భలో చంపేస్తున్నారు. ఇది ఎంత నిక్రుష్టమో ఆలోచించండి.

అమెరికాలో అయితే పురుషుల కంటే స్త్రీలు 7.8 మిలియన్ల మంది అధికంగా ఉన్నారు. కేవలం న్యూ యార్క్ పట్టణంలో 1 మిలియన్ మంది స్త్రీలు పురుషులకంటే ఎక్కువమంది ఉన్నారని తెలుస్తుంది. ఇక అమెరికాలో ఉన్న పురుషులతో 1/3 వంతు స్వలింగాసంపర్కులు ఉన్నారు. మొత్తం అమెరికాలో 2. మిలియన్ల మంది స్వలింగ సంపర్కులు ఉన్నారు. వీరు ఎలాను వివాహబంధానికి దూరంగా ఉంటారు. బ్రిటన్ లో అయితే పురుషుల కంటే స్త్రీలు 4 మిలియన్ల మంది అధికంగా ఉన్నారు. జర్మనీ లో 5 మిలియన్ లు , రష్యాలో 9 మిలియన్లు ప్రపంచం మొత్తం మీద ఎంత మంది స్త్రీలు ఉన్నారో అల్లాహ్ కే తెలియాలి.

ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసిన స్త్రీల సంక్య ఎక్కువ. ఒక పురుషుడు ఒక్క స్త్రీ నే వివాహమడాలనే నిబంధన కచ్చితంగా అమలు చేస్తే మిగిలిన స్త్రీల సంగతి ఏమిటి? వివాహబంధం లేకుండా ఉండిపోవాలా? మరి ప్రకృతి సిద్ధమైన శారీరక వాంచలు తీరేది ఎలా? వారికి పిల్లలు, సంసారo , కుటుంభo వంటివి ఎలా ఎర్పడుతాయి? మరి వారి వాంఛలు అక్రమ సంబంధాల ద్వార తీర్చుకోవాలా ? ఒక పురుషునకు రొండో భార్య ఉండడం గౌరవంగ ఉంటుందా లేక స్త్రీకి, స్త్రీయే చుసుకోవడమా? బజారుపాలు కావడమా? ముస్లింలు చట్టపరoగా ఇద్దరినీ వివాహం చేసుకుంటే తప్పు అని అరచిగీపెట్టిన వారు ఈ సమాజం లో పెద్ద మనషులుగా చలామణి అయ్యేవారిలో ఎంతోమంది అక్రమ సంభందం పెట్టుకొని సెంచరీలు కొట్టేవారు లేరా ? చట్ట వ్యతిరేకంగా ఇద్దరేసి ముగ్గురేసి భార్యలు కల్గి ఉండటం మనం చూడటం లేదా? 1951 నుండి 1961 సం॥లో కమిటి వారు హింధూ వివాహాలు, ముస్లిం వివాహాలు రెండో పెళ్లిళ్ళపై సర్వే చేసారు. ఆ కమిటి వ్రాసిన సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే ఇద్దరు భార్యలు ఉన్న వారు ముస్లిమేతరులు 5.06% ఉంటే, ముస్లింలు 4.31% మంది ఉన్నట్లు వెల్లడించారు.

ఇద్దరు భార్యలు కల్గినవాడు ఉత్తమమైన ముస్లిం అని ఎక్కడ ఉండదు. ముస్లిం సమాజం అతనికి ఎదో గొప్ప పని చేసినట్లు పరిగనoణిచదు. ఇస్లాం ఒక స్త్రీ నుండి నలుగురు స్త్రీల వరకు వివాహం చేసుకునే హక్కు కల్పించినా, కొన్ని నియమాలు పెట్టింది. ఆ నియమాలు పాటించే శక్తి ఉన్నవాడే బహు భార్యలు కల్గి ఉండేందుకు అర్హుడు. అవి ఏమిటో మీరు ఖుర్ఆన్ వచనములలో చూసారు. భార్యల మధ్య న్యాయం చెయ్యడం మీకు కష్టం అని కూడా చెప్పబడింది.

2. ఇస్లాం పురుషునకు ఒక భార్య కల్గి ఉండగా మరోక స్త్రీని , ఇద్దరిని గాని ముగ్గురిని గాని, నల్గురి వరకు వివాహమాడే హక్కు కల్పించింది. మరి అదే హక్కు స్త్రీలకు ఎందుకు కల్పించలేదు?

ఇస్లాంలో కొన్ని చోట్ల స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, కొన్ని చోట్ల పురుషునికి ఇవ్వబడింది. తండ్రి స్థానం గొప్పదా ? అంటే తల్లి స్థానం 75% గొప్పది. తండ్రి స్థానం 25% మాత్రమే. దేవుడు స్త్రీ పురుషుల శరీరాలను వేర్వేరు ఆకారాలుగాను, వేర్వేరు స్వభావాలు కల్గి ఉన్నట్లు సృష్టించాడు. స్త్రీ శరీరం కొమలంగాను నాజుకుగా ఉంటుంది . స్త్రీకి బిడ్డను కనే అద్రుష్టం, వారి రొమ్ములలో పిల్లవాడు పుట్టిన తరువాత పుష్టికరమైన పోషక పదార్ధాలను కల్గిన పాలను సమకూర్చాడు. పురుషుని శరీరం దృడంగా, బలంగా ఉండేలా చేసాడు. అతడు కష్టపడి తన వాళ్ళను పోషించుకోగాల్గుతున్నాడు. స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలంటే మొదటి పిల్లవాడ్ని నేను కన్నాను, కాబట్టి రెండో పిల్లవాడ్ని నీవు నవమాసాలు మోసి కను అంటే వీలు అవుతుందా? లేదా మొదటివాడికి నేను పాలు పెట్టను రెండవ వాడికి నీవు పాలు పెట్టు అంటే వీలు ఉంటుందా? అల్లానే పురుషునకు ఒక భార్య కల్గి ఉండగా మరో భార్యతో కూడా కాపురం చెయ్యవచ్చు. అదే స్త్రీకి అయితే భర్త ఉండగా మరో భర్తతో కాపురం చేస్తే వివిధ సమస్యలు వస్థాయి . అవి ఏమిటంటే :

ఒక వ్యక్తికి (పురుషునకు) నలుగురు భార్యలు ఉన్నవారికి కల్గిన సంతానానికి తల్లి ఏవరో గుర్తించడం సులువు. అదే స్త్రీకి నలుగురు పురుషులను పెండ్లడితే ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రి ఏవరో చెప్పడం అసంభవం. తాద్రి ఏవరో తెలియని పిల్లల మానసికి పరిస్థితి అంత బాగుండదని మానసిక వైద్యులు చెబుతుంటారు .అందుకనే వేశ్యలకు పుట్టిన పిల్లలు అనారోగ్యంగా వుంటారు . అంతేకాదు ఆమె తన నలుగురు భర్తలకు సరైన న్యాయం చెయ్యలేదు. పైగా శారీరిక రుగ్మతలు సుడ వచ్చే అవకాశాలు అఎకువ. కాబట్టి స్త్రీకి ఒక భర్త ఉండటమే సముచితం. భర్త చనిపోయిన లేక భర్త విడాకులు ఇచ్చిన కొంతగడువు ముగిసిన తరువాత మరో వివాహం (పునర్వివాహం) చేసుకునే హక్కు కల్పించింది కేవలo ఇస్లాo మత్రమే.

మరియు మీలో ఎవరైనా మరణించి, భార్యలను వదలిపోయినట్లైతే (అలాంటి విధవలు) నాలుగు నెలల పది రోజులు (రెండవ పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. వారి గడువు పూర్తి అయిన తరువాత వారు తమకు ఉచితమైనది, ధర్మసమ్మతంగా చేసుకుంటే మీపై దోషంలేదు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును. (ఖుర్ఆన్ 2వ సూర బఖర 234వ వాక్యం )

1400 సం॥ పూర్వమే ఇస్లాం స్త్ర్కి స్వేచ్చ ఇచ్చిన్ది. మరే మతంలోలో ఇలాంటి స్వేచ్చ ఇవ్వబదలెధు. మన భారత చరిత్రలో చూస్తే సతీ సహగమనం ఉండేది . ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో (బీహార్ , ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్, ఒర్రిస్సాలలో) కొన్ని చోట్ల ఉన్ది. తన భర్త చనిపోతే మరొక పెళ్లి చేసుకునే హక్కులేదా?

Related Post