Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

సకల చింతలకు చికిత్స పరలోక చింతన

Originally posted 2018-04-04 18:48:28.

ఖుర్‌ఆన్‌లో ప్రాపంచిక జీవితాన్ని ఒక క్రీడగా, మాయావస్తువుగా అభి వర్ణించడానికి కారణం- క్రీడ మనిషిని ఉల్లాస పరిస్తే, మాయ మనిషి మోస పుచ్చుతుమది, లేనిది ఉన్నట్టుగా నమ్మబలుకుతుంది. అసలు వాస్తవాల పట్ల ఏమరుపాటుకు గురి చేస్తుంది.

ఖుర్‌ఆన్‌లో ప్రాపంచిక జీవితాన్ని ఒక క్రీడగా, మాయావస్తువుగా అభి వర్ణించడానికి కారణం- క్రీడ మనిషిని ఉల్లాస పరిస్తే, మాయ మనిషి మోస పుచ్చుతుమది, లేనిది ఉన్నట్టుగా నమ్మబలుకుతుంది. అసలు వాస్తవాల పట్ల ఏమరుపాటుకు గురి చేస్తుంది.

అందమైన ఈ జీవితం ఏదోక రోజు అంతమయిపోతుంది. మన శ్రమ ను, కృషిని అశాశ్వతమయిన ఐహిక జీవితానికే ధారపోసి పరలొకాన్ని విస్మరించడం అంటే, నకిలీ నగల మోజులో అసలు సిసలయిన పసిడి విలువను గుర్తించక నష్టపోవడమే. అందుకని ప్రాంపంచిక జీవితాన్ని పరలోకలో సుమధుర ఫలాలను అందించే పంట పొలంగా వినియోగిం చుకోవాలి. ఏదోకనాడు నశించిపోయే తాత్కాలిక తటాకం కోసం అనం తమైన, అనశ్వరమైన పరలోకాన్ని పాడు చేసుకోవడం ఏ విధంగానూ వివేకం అన్పించుకోదు. ప్రాపంచిక జీవితం పరలోక సాఫల్యానికి సాధ నంగా ఉపయోగ పడాలే గానీ, మరులు గొలిపే ఈ అందమైన ప్రపం చం పరలోకంలో కష్టాల్ని, నష్టాల్ని మిగిల్చేదిగా మారకూడదు. సార్వభౌమాధికారి అయినా అల్లాహ్‌ ఇలా ఉపదేశిస్తున్నాడు: ”మీకు ఏదయితే ఇవ్వబడిందో అది ప్రాపంచిక జీవిత సామగ్రి, దాని అలంకరణ మాత్రమే. అయితే అల్లాహ్‌ా వద్ద ఉన్నది మాత్రం అత్యుత్తమమయినది, శాశ్వతమయినదీను. ఏమిటీ, మీరు ఆ మాత్రం గ్రహించరా?” (దివ్యఖుర్‌ఆన్‌-28:60)
అంటే, ఇహలోక జీవితం, అందులోని వెలుగు జిలుగులు, హంగులు, ఆర్భాటాలు ఏవీ శాశ్వతం కాదు.వేటికీ స్థిరత్వం లేదు. అయినా నరుడు దాన్నే నాకంగా భావిస్తున్నాడు. దాని వ్యామోహంలోనే కొట్టు మిట్టాడు తున్నాడు. ”మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యత ఇస్తు న్నారు. నిజానికి పరలోకం ఎంతో మేలైనది”. (దివ్యఖుర్‌ఆన్‌-87: 16, 17) ”మొత్తానికి ప్రాపంచిక జీవితం ఒక మభ్య పెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు”. (దివ్యఖుర్‌ఆన్‌-57:20)
ఖుర్‌ఆన్‌లో ప్రాపంచిక జీవితాన్ని ఒక క్రీడగా, మాయావస్తువుగా అభి వర్ణించడానికి కారణం- క్రీడ మనిషిని ఉల్లాస పరిస్తే, మాయ మనిషి మోస పుచ్చుతుమది, లేనిది ఉన్నట్టుగా నమ్మబలుకుతుంది. అసలు వాస్తవాల పట్ల ఏమరుపాటుకు గురి చేస్తుంది.
చూడండి! జింక శబ్దానికి వశమవుతుంది. అందుచేత వేటగాడు వేణువు మీద మృదు మధురమైన సంగీత తరంగాలను పలికిస్తాడు. వాటికి పరవశం చెందిన జింక వేటగాడి వశమైపోతుంది.
మిడుత ‘మంట’ రూపాన్ని చూసి ముగ్దులయి దాన్ని సమీపిస్తుంది. మంటకు కాల్చే తత్వం ఉందని అది గ్రహించదు. అందులో పడి ప్రాణాలు కోల్పోతుంది.
ఏనుగుకు ‘స్వపర్శ’ పట్ల ఆకర్షణ ఉంటుంది. మగ ఏనుగు, ఆడ ఏనుగును చూడగానే ఉద్వేగానికి గురై వేగంగా దాని వైపుకు దూసుకు పోతుంది. ఆ ఆవేశంలో, ఆత్రంలో తనకూ ఆడ ఏనుగుకూ మధ్య ఆకు లతో కప్పబడిన పెద్ద గొతిని అది గమనించదు. ఒక్క తప్పటడుగులోనే గుంత అట్టడుగుకు చేరుకుంటుంది. జీవిత ఖైదీగా మిగిలిపోతుంది. ఏనుగు ఏంతో బలమయిన జంతువు అయినప్పటికీ అది తనకున్న స్పర్శ సుఖానికి లోనై జీవిత పర్యంతం స్వేచ్చను కొల్పోతుంది.
చేప ‘రుచి’కి లోబడుతుంది. ‘ఎర’ కు ఆకర్షితమయి గాలం యొక్క కొక్కానికి గుచ్చబడిన ఎరను తనకు బాగా ఇష్షమయిన ఆహారంగా చూస్తుంది. దాన్ని పొందాలని వెళ్లి పూర్తి జీవితాన్నే కోల్పోతుంది.
తేనెటీగ గంధానికి ఆకరితమవుతుంది. తామర పువ్వులోని మకరందా న్ని ఆస్వాదిస్తూ మైమరచి, ఆ పువ్వులోనే సూర్యాస్థమయం వరకూ ఉండి పోతుంది. ఆ పుష్ప దళాలు ముసుకుపోగానే దానిలో చిక్కుకు పోయి ప్రాణాలు కోల్పోతుంది.
పై ప్రాణులలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇంద్రియ సుఖం కోసం అర్రులు చాచి, ఆయా బలహీనతల వల్ల మరణాన్ని కొని తెచ్చుకుంటాయి. అటువంటప్పుడు అన్ని పంచేద్రియాలకూ లోబడి ఉన్న మనుషుల, మన సంగతి ఇంకా ప్రమాదకరమయినదన్న సంగతి ఇట్టే అర్థమవుతు ది.
కాబట్టి అల్లాహ్‌ సెలవిచ్చినట్లు –
”ప్రాపంచిక జీవితం మిమ్మల్మి మోస పుచ్చడం గానీ, మాయావి (షైతాన్‌) మిమ్మల్ని ఏమరుపాటుకి గురి చెయ్యడం గానీ( జరగకూడదు సుమా!” (లుఖ్మాన్‌:33) అన్న యదా ర్థాన్ని ఎరిగి ‘ఒక బాటసారిలా, ఒక అపరిచయ వ్యక్తిలా మనం జీవిస్తూ, కోరికలకు కళ్లెం వేెసే మృత్యును గుర్తు చేసుకుంటూ పరలోక చింతనను కలిగి ఉన్నట్లతే ఆ ఒక్క చింతన మన సకల చింత లకు చెక్‌ పెట్టి చక్కటి చికిత్సను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Post