Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఖుర్ఆన్ గ్రంథం ముహమ్మద్ (స) రచన కాదు

జనులు వ్రాసేటప్పుడు తప్పులు చేస్తుంటారు. అంటే అక్షరదోషాలు, వ్యాకరణం, వైరుధ్య ప్రకటనలు, అవాస్తవికతలు, తప్పుడు సమాచారం, తదితరములైన తప్పులు చేస్తుంటారు.(దివ్యఖుర్ఆన్ – 2:23)" మేము మా దాసుని పై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దానివంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి.

జనులు వ్రాసేటప్పుడు తప్పులు చేస్తుంటారు. అంటే అక్షరదోషాలు, వ్యాకరణం, వైరుధ్య ప్రకటనలు, అవాస్తవికతలు, తప్పుడు సమాచారం, తదితరములైన తప్పులు చేస్తుంటారు.(దివ్యఖుర్ఆన్ – 2:23)” మేము మా దాసుని పై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దానివంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి.

ఖుర్ఆన్ గ్రంథంలో వైరుధ్యాలు లేవు

(దివ్యఖుర్ఆన్ – 4: 82) “ఇది (ఖుర్ఆన్) అల్లాహ్ తరపు నుండి కాక వేరొకరి తరపు నుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధాలైన విషయాలు ఉండేవి. ”

జనులు వ్రాసేటప్పుడు తప్పులు చేస్తుంటారు. అంటే అక్షరదోషాలు, వ్యాకరణం, వైరుధ్య ప్రకటనలు, అవాస్తవికతలు, తప్పుడు సమాచారం, తదితరములైన తప్పులు చేస్తుంటారు.(దివ్యఖుర్ఆన్ – 2:23)” మేము మా దాసుని పై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దానివంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయాన్నయినా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. ”
ఖుర్ఆన్ పేర్కోన్న అంశాలలో మీకలాంటి వైరుధ్యాలు ఎక్కడా కనబడవు. అది శాస్త్రీయ వివరణల్లోనైనా సరే. అంటే నీటి వలయం, పిండోత్పత్తి, భౌగోలిక, ఖగోళ, చారిత్రక, భవిష్య సూచనలు వంటి ఏవిషయాలలోనూ మీకు ఆ వైరుధ్యాలు కానరావు.

ఖుర్ఆన్ గ్రంథం ముహమ్మద్ (స) రచన కాదు ?

ప్రవక్త ముహమ్మద్(స.అ.స౦) నిరక్షరాస్యులని చరిత్ర వల్ల తెలుస్తోంది. ఆయనకు చదువను, రాయను రాదు. శాస్త్రీయంగా, చారిత్రకంగా ఖచ్చితంగా విషయాలు చెప్పగలిగే రీతిలో ఆయన ఏ రంగంలోనూ చదువుకోలేదు. ఓ మహత్తరమైన గ్రంథాన్ని రూపొందించేంత సాహిత్యమూ ఆయనకు లేదు. ఖుర్ఆన్ లో పేర్కొన్న పూర్వ జనులు, నాగరికతలు ఏ మనిషి సాధికారంగా చెప్పలేనట్టివి.
(దివ్యఖుర్ఆన్ – 4: 82) “ఇది (ఖుర్ఆన్) అల్లాహ్ తరపు నుండి కాక వేరొకరి తరపు నుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధాలైన విషయాలు ఉండేవి. ”
(దివ్యఖుర్ఆన్ – 2: 163) దివ్యవార్త ఉద్దేశ్యమ నిజమైన ఒకే ఒక్కదేవుణ్ణి నమ్మడం కోసం ” మీ దేవుడు, ఆ కృపాకరుడు తప్పమరొక దేవుడు లేడు.”
(దివ్యఖుర్ఆన్ – 10: 7) “అల్లాహ్ పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే గ్రంథము కాదు ఈ ఖుర్ఆన్. ”

దిన్య ఖుర్ఆన్ గ్రంథమంతటా అసలైన ఒకే దేవుడిని నమ్మమనే ముఖ్యాంసం పేర్కొనబడింది, తనకు భాగస్వాములు, కుమారుడు, సమానులు లేరని, తను తప్ప వేరెవరూ అరాధనీయులు కాదని దేవుడు చెప్పాడు. దేవుడితో పోల్చదగినది ఏది లేదు. ఆయన సృస్టీంచినవి ఏవి ఆయనను పోలి ఉండవు, మానవ గుణాలు, పరిమితులు దేవుడికి ఆపాదించడాన్ని దివ్యఖుర్ఆన్ ఖండిస్తుంది.
ఖుర్ఆన్ మిధ్యా దేవుళ్ళందరినీ తిరస్కరిస్తుంది
(దివ్యఖుర్ఆన్ – 4: 36)” మీరంతా అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు.
అల్లాహ్ ఒక్కడే ఆరాధనీయుడు. కనుక మిథ్యా రేవుళ్ళందరినీ తిరస్కరించాలి. దైవిక గుణాలను అల్లాహ్ కు తప్ప ఇతరులకు ఆపాదించడాన్ని దివ్యఖుర్ఆన్ తిరస్కరిస్తుంది.

పూర్వగాథలు తెలిపేందుకు
పూర్వపు ప్రవక్తలైన ఆదమ్ అ ), నూహ్(అ), ఇబ్రాహీం (అ), ఈసా(అ), మూసా(అ) వంటి మహాత్ముల గాథలతో సహా ఉపయోగకరమైన గుణపాఠాలను, గతి౦చిన విషయాలను ఖుర్ఆన్ వివరించింది.
(దివ్యఖుర్ఆన్ – 12: 111) “పూర్వపు ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధీ, స్పృహ ఉన్నవారికి ఒక గుణపాఠం ఉన్నది.”

ఖుర్ఆన్ గ్రంథం తీర్పుదినాని మనకు గుర్తు చేసేంపెదుకు

ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే, పైగా తీర్పుదినాన చేసిన కర్మల లెక్కలు దేవుడుకి చెప్పుకోవలసిందే.
(దివ్యఖుర్ఆన్ – 21: 47) “కచ్చితంగా తూచేటటువంటి తరాజులను మేము ప్రళయం నాడు ఏర్పాటు చేస్తాము ఏ వ్యక్తికైనా రవ్వంత అన్యాయం కూడ జరగదు.” నిర్దేశించిన మార్గంలోనే జీవించమంటుంది
ఒకే దేవుడిని ఆరాధించమని, మనిషికి నిర్దేషించిన మార్గంలోనే అతడు జీవించాలని దివ్యఖుర్ఆన్ ఉద్భోదిస్తుంది. ఇస్లాంలో ఆరాధన అన్నది సమగ్రమైనది. అంటే అల్లాహ్ కు ప్రీతికరమైస రీతిలో, ఆయన కోరుకునే రీతిలో మాటలు చేతలు (ప్రైవేట్ గా లేక పబ్లిక్ గా) ఉండాలని అంటుంది. అలదుకే అల్లాహ్ ఆదేశాల మేరకు ముస్లింలు దైవారాధన చేస్తారు. ఆయన నిర్దేశించిన మార్గంలోనే జీవించే ప్రయత్నం చేస్తారు.
ఆరాధన ఎలా ఉండాలన్నది ఖుర్ఆన్ తెలిపింది. ఆ ఉదాహరణలే ఇవి:

ప్రార్థించండి :

(దివ్యఖుర్ఆన్ – 22: 77) “విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయ్యండి. మీ ప్రభుపుకు దాస్యం చెయ్యండి, మంచి పనులు చెయ్యండి. దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుంఎదని అశించవచ్చు. ”

 

Related Post