సంతృప్తి-అసంతృప్తి

Originally posted 2016-12-20 11:38:54.

సంతృప్తి అన్నది ఏ ఒక్కదానితో, ఏ ఒక్క దశతో ముడి పడి ఉన్న అంశం కాదు. ఎందుకంటే సంతృప్తి అన్నది భౌతికం కాదు మానసికం.

సంతృప్తి అన్నది ఏ ఒక్కదానితో, ఏ ఒక్క దశతో ముడి పడి ఉన్న అంశం కాదు. ఎందుకంటే సంతృప్తి అన్నది భౌతికం కాదు మానసికం.

సంతృప్తి అంటే తనకు లభించిన దానితో తృప్తి చెందుతూ,మరింత ఉన్నతి స్థితికి చేరుకునేందుకు ధర్మబద్ధమయిన రీతిలో ప్రయత్నిస్తూ జీవించి ప్రశాంతంగా మరణించడం. సంతృప్తి జీవితపు ఏదోక దశలో లభించే వస్తువు కాదు. అది జీవిత అన్ని అంగాల్లోనూ, అన్ని రంగాల్లోనూ నిరంతరం అస్వాధించాల్సిన సుగుణం. అయితే ఉన్న దాంతో సంతోషించక ఇంకా ఇంకా కావాలన్న పోరాటం, కోరికలు ఆరాటమే మనిషి అసంతృప్తికి అసలు కారణం.సంతృప్తి మనిషిలో సహనాన్ని,సహిష్ణుతను, సర్దుకుపోయే గుణాన్ని, మృదుత్వాన్ని పెంచితే, అసంతృప్తి అసహనాన్ని, పర హననాన్ని, ధ్వేషాన్ని, కాఠిన్యాన్ని పెంచుతుంది. ఆ మాటకొస్తే ఒక మనిషి మినహా దేవుని సృష్టి మొత్తం సంతృప్తిమయమే. కొండలు, కోనలు, వాగులు, వంకలు, పక్షులు, వృక్షాలు, జల చరాలు, సకల చరాచరాలు-దేన్ని మీటినా సంతృప్తి రాగమే ఆలాపిస్తాయి. ఎటోచ్చి అసంతృప్తి, అసూయతో రగిలిపోతున్నది, రాగధ్వేషా ల రాజేసి ఆజ్యం పోస్తున్నది మనిషే. ఆది మానవుడు ఆదమ్‌ (అ)ని సకల సౌఖ్యాలు, సౌకర్యాలు నిండిన స్వర్గంలో దేవుడు వసింపజేస్తే ‘నిషేధిత వృక్ష ఫలాన్ని’ చవి చూసేంత వరకు షైతాన్‌ ఆయనలో అసంతృప్తి జ్వాలల్ని రగిలిస్తూనే ఉన్నాడు. నాడు ప్రారంభయిన షైతాన్‌ ఈ దుష్ప్రేరణ నేటికీ అనే రూపాల్లో మనుషుల్ని కకావికలం చేస్తూనే ఉంది. మనిషి సంతోషాన్ని, సంతృప్తిని హరించే ఓ దుర్లక్షణం గురించి తెలియజేస్తూ ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: ”తస్మాత్‌ జాగ్రత్త! అసూయ నుండి దూరంగా ఉండండి. నిప్పు కట్టెల్ని కాల్చి బూడిద చేసినట్లే నిశ్చయంగా అసూయ అన్నది మనిషి సత్కర్మల్ని భస్మీపటం చేసి వేస్తుంది”. (అబూ దావూద్‌)
దేవుడు మనిషి ప్రసాదించిన అనుగ్రహాల్లో అగ్ర భాగాన ఉన్న అనుగ్రహం విశ్వాసం అయితే దాని తర్వాతి స్థానం సంతృప్తి అనే వరప్రసాదానిదే. ఈ రెండూ ఒక వ్యక్తికి లభించాయి అంటే అతని మించిన అధృష్టవంతుడు లేడు. ప్రవక్త (స) ఇలా అన్నారు:
”ఎవరయితే ఇస్లాం స్వీకరించి, అవసరా నికి సరిపడ ఉపాధి కూడా కలిగి ఉండి, ఉన్నంతలో సంతృప్తి చెందే గుణాన్ని అల్లాహ్‌ అతనికి ప్రసాదింనట్ల యితే అతనికి మించిన భాగ్యవం తుడు లేడు. వాస్తవమయిన సాఫల్యం అంటే అతనిదే”. (ముస్లిం)
నేడు అధిక శాతం మంది సంతృప్తిని, మంచి చదువుతో, మంచి ఉద్యోగంతో, మంచి సంసారంతో, మంచి సంతానంతో, మంచి కలిమితో ముడి పెట్టి చూడటం పరిపాటి. కానీ సంతృప్తి అన్నది ఏ ఒక్కదానితో, ఏ ఒక్క దశతో ముడి పడి ఉన్న అంశం కాదు. ఎందుకంటే సంతృప్తి అన్నది భౌతికం కాదు మానసికం. మనిషి తనను ఏ స్థితిలో చూసుకుంటున్నాడు అన్నది బాహ్య కలిమిలేములకన్నా మానసిక కలిమిలేములతోనే ఎక్కువ ముడి పడి ఉంటుంది. ఈ యదార్థాన్ని ప్రవక్త (స) ఇలా విపులీకరించారు:
”ఓ అబూ జర్‌! సంపద బాగా పెరిగి పోవడమే సంపన్నత అనుకుంటున్నావా?” అని తన సహచరుణ్ణి అడిగారు. అందుకాయన (ర): ‘అవును ఓ దైవ ప్రవక్తా!’ అన్నారు. ”సంపద తరిగిపోవడమే పేదరికం అనుకుంటు న్నావా?” అని మళ్ళి అడిగారు. ‘నేనైతే అలాగే భావిస్తున్నాను’ అన్నారు అబూ జర్‌ (ర). అదే విషయాన్ని మూడు సార్లు అడిగిన తర్వాత ఇలా అన్నారు: ”అసలు సంపన్నత హృదయంలో ఉంటుంది” అన్నారు ప్రవక్త (స). (తబ్రానీ) వేరొక ఉల్లేఖనంలో – ”సంపన్నత అనేది అధిక సంపద, అధిక సామగ్రి ద్వారా లభ్యమయ్యేది కాదు. అసలు సంపన్నత హృదయ సంపన్నతే” అన్నారు ప్రవక్త (స).

మన సజ్జన పూర్వీకుల్లో ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (ర) మహా గొప్ప హదీసువేత్త. అలనాటి ప్రభువుల వితండ వాదాన్ని బాహటంగా తిరస్కరించి ధీశాలి. పర్యవసానం ఆయన జీవితం మొత్తం గృహ నిర్బంధన, చిత్రహింసలు, కొరడా దెబ్బలతో ఓ యాతనలా గడిచింది. అయినా అసంతృప్తి అన్నది ఆయన జీవితంలో ఏ మూలనా కన బడదు. పైగా అప్పటి అందరూ పండితులకన్నా గొప్ప సంతృప్తిగా అయన జీవించనట్లు తెలుస్తుంది.
ఎంత తిన్నా కడుపు నిండని ‘ఆకలి రోగి’లా ఉంటుంది అసంతృప్తి అన్న మహమ్మరి బారిన పడిన వ్యక్తి పరిస్థితి. అన్సార్లలోని కొంత మంది ప్రజలు దైవప్రవక్త (స) వారిని యాచించారు. ఆయన (స) వారడిగింది ఇచ్చారు. అయినా (వారు సంతృప్తి చెందక) మళ్ళి అడిగారు. దైవప్రవక్త (స) మళ్ళీ ఇచ్చారు. వారు అడగ్గా అడగ్గా అలా ఇస్తూ ఇస్తూ ఆయన వద్ద ఉన్నదంతా అయిపోయింది. ఏమి మిగల లేదు. (అయినా వారు మాత్రం అడగటం మానుకోలేదు). అప్పుడు దైవప్రవక్త (స) వారితో ఇలా అన్నారు:
”చూడండి! నా దగ్గర ఉన్న ధన సంపదనుగానీ, బయట నుంచి వచ్చిన దాన్ని గానీ మీకు ఇవ్వకుండా నేనేమీ దాచి పెట్టుకోను. (కానీ ఇలా కొసరి కొసరి అడిగి తీసుకోవడం వల్ల సంపన్నత, సంతృప్తి, సంతోషం ప్రాప్తం కాదని మాత్రం తెలుసకోండి). అల్లాహ్‌ సంప్రదాయం ఏమిటంటే, ఎవరయితే ఇతరుల ముందు చేయి జాచి యాచించే దుస్థితి తమకు రాకూడదని బలంగా కోరుకుంటారో అలాంటి వారికి అల్లాహ్‌ సహాయం చేస్తాడు. వారిని యాచించే దుస్థితి నుండి కాపాడుతాడు. మరెవరైతే నిరపేక్షతను కోరుకుంటారో అల్లాహ్‌ వారికి ఇతరుల మీద ఆధార పడే దీనావస్థ రాకుండా రక్షిస్తాడు. ఇంకెవరయితే దీనావస్థలో సయితం గుండెను దిటవు చేసుకుని సహనం వహిస్తారో అల్లాహ్‌ వారికి సహన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక దాసునికి లభించిన భాగ్యాలన్నింలో సహనం అంతటి భాగ్యం మరొకటి లేదు” అన్నారు ప్రవక్త (స). (అబూ దావూద్‌)\
వేరోక సందర్భంలో ఓ సహాబీని ఉద్దేశించి – ”ఓ హకీమ్‌! నిశ్చయంగా ఈ ధనం అందరికీ ఇంపైనది, పసందైనది, తియ్యనైనది. ఎవరయితే దీన్ని అత్యాశకు పోకుండా స్వీకరిస్తారో వారికి అందులో శుభం, సంతృప్తి ఒసగ బడుతుంది. మరెవరయితే మనసులో అత్యాస ఉంచుకొని దీన్ని తీసుకుంతారో వారికి అందులో శుభం, సంతృప్తి ఉండదు…….పై చేయి క్రింది చేయికన్నా మేలైనది”. (ఇచ్చే స్థితి ఎప్పుడూ గొప్పదే, పుచ్చుకునే పద్ధతి ఎప్పడూ చెడ్డదే). అది విన్న ఆ సహాబీ (ర) ఇలా అన్నారు: ‘ఓ దైవప్రవక్తా! ఏ శక్తి స్వరూపుని చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతు న్నాను. తమరితో అడగగటమే చివరి సారి. నేను ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లేంత వరకూ ఎప్పుడూ ఎవ్వరి వద్ద ఏమి తీసుకోను అని మాటిస్తున్నాను’. అని. (బుఖారీ, ముస్లిం)
అలా ప్రవక్త (స) వారికి ఇచ్చిన మాటకు జీవితాంతం కట్టు బడ్డారు. ప్రవక్త (స) వారి మరణానంతరం ముగ్గురు ధర్మ ఖలీపాల కాలంలో ఎవరు ఎంత చెప్పినా నయా పైసా కూడా పెన్షన్‌ తీసుకోకుండా, ఎవరి నుండి ఎలాంటి కానుకను సయితం స్వీకరించకుండానే ఆత్మ సంతృప్తితో జీవించి 120 సంవత్సరాల వయసులో ప్రశాంతంగా తనువు చాలించారు.

Related Post