Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

శాంతి నగరం మక్కా

ప్రాంతాల్ని, దేశాల్ని, రాజ్యాల్ని సయితం అల్లాహ్‌ా నామరూపాల్లేకుండా చేెసే స్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గృహ రక్షణ లోక రక్షణ. ఈ గృహ వినాశనం, లోక వినాశనం.

ప్రాంతాల్ని, దేశాల్ని, రాజ్యాల్ని సయితం అల్లాహ్‌ా నామరూపాల్లేకుండా చేెసే స్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గృహ రక్షణ లోక రక్షణ. ఈ గృహ వినాశనం, లోక వినాశనం.

అందులో ప్రవేశించిన వ్యక్తి రక్షణ పొందుతాడు. అంటే, అది మార్గదర్శక కేంద్రమే కాదు, పుణ్యక్షేత్రమే కాదు, రక్షణ కేంద్రం కూడా. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”గౌరవప్రద గృహమైన ‘కాబా’ను అల్లాహ్‌ మానవాళి మనుగడకు సాధనంగా చేశాడు”. (అల్‌ మాయిదా: 97)
‘ఖియామల్లిన్నాసి’లో మానవులు అంటే, పూర్వపు ప్రజలు, ప్రస్తుతం ఉన్నవారు, ప్రళయం వరకూ వచ్చే జనులందరు అన్న అర్థం ఒకటి.    ఈ ప్రకారం ‘కాబా’ ఉనికి సమస్త మానవాళి మనుగడకు కారభూతం అవుతుంది. ఈ గౌర వప్రదమైన గృహం ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచం ఉంటుంది. ప్రపంచంలో ప్రగతి పచ్చతోరణాల కళకళలూ ఉంటాయి. అలాగే ఈ గృహం ఎప్పటి వరకు గౌరవించబడు తుందో లేెదా ఈ గృహాన్ని గౌరవింవారు ఎప్పటి వరకు బ్రతికుంటారో అప్పటి వరకే ప్రజా – తన, ధన, మానాలకు గౌరవం- రక్షణ ఉంటుంది. ఈ విశ్వాన్ని అంతం చేెయాలని విశ్వకర్త తలచినప్పుడు కాబా గృహం కూల్చివేయబడుతుందని పలు హదీ సుల ద్వారా రూఢీ అవుతుంది. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”(ప్రళయ సమీపంలో) ఎలాంటి గౌరవ మర్యాదలు లేని పొట్టి కాళ్ళ నీగ్రో కాబాను నిర్మానుష్యంగా మార్చేస్తాడు”.       (బుఖారి, ముస్లిం)
  అంటే ఆ నీగ్రో వ్యక్తికన్నా ముందు ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా  ఈ గృహాన్ని పూర్తిగా నేలమట్టం చేయడం ఎవరి తరం కాదు. 70 వేల ఏనుగల సైన్యంతో వచ్చి అబ్రహాను నాశనం చేసినట్లే ఈ గృహానికి చెడు తలపెట్టాలనుకొని పన్నాగాలు పన్నే ప్రజల్ని, ప్రాంతాల్ని, దేశాల్ని, రాజ్యాల్ని సయితం అల్లాహ్‌ నామరూపాల్లేకుండా చేెసేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గృహ రక్షణ లోక రక్షణ. ఈ గృహ వినాశనం, లోక వినాశనం.
కాబా గృహాన్ని ‘బైతుల్‌ హరామ్‌’ (పవిత్ర గృహం, గౌరవమర్యాదల గృహం) అని అన డానికి ప్రధాన కారణం – దాని పరిధిలో వచ్చే ప్రాంతంలో వేటాడటం, చెట్లు నరకటం ఇత్యాధివి నిషేధించబడ్డాయి. ఆఖరికి కన్న తండ్రిని చంపిన దుర్మార్గుడు తారస పడినా ఆ పరిధిలో ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతించబడలేదు. అంతేకాక, ఈ ప్రాంత జనుల నివాసానికి, మనుగడకు యోగ్యమైన ప్రాంతంగా ఖరారు చేయబడింది అంటే, ఈ పవిత్ర గృహ మూలంగా మక్కా వాసుల జీవనం సుఖప్రద మవ్వటమేకాకూండా, ఆర్థికంగా అది వారికి బలం చేకూరుస్తుంది. అనగా, మక్కా ప్రజలకు లేదా సవూదీ ప్రజల కు లభించే ఈ స్వాగతసన్మానాలు, గౌరవవా దరణలు కాబా గృహ కారణంగానే. ఈ కాబా గృహం వల్లనే మక్కాలోని జనులు సుఖశాం తులతో వర్థిల్లుతున్నారు. ప్రపంచం మొత్తం అశాంతి అల జడులమయమై ఉన్నా అక్కడ మాత్రం శాంతి సుస్థిరతలున్నాయి.
 ఇంతటి గౌరవం ఒక్క మక్కాకే ఎలా దక్కింది అంటే, దైవ ప్రవక్త (స) వారి ఈ హదీసు చదవాల్సిందే. ”నిశ్చయంగా అల్లాహ్‌, ఈ పట్టణాన్ని భూమ్యాకాశాలను పుట్టించిన నాటి నుండే పవిత్రంగా చేశాడు. అది ప్రళయం వరకూ అల్లాహ్‌ అనుగ్రహించిన ఔన్నత్యంతో పవిత్రంగానే చూడబడుతోంది”.  (బుఖారీ, ముస్లిం)
  నేడు మానవులు అనేక స్థలాలను, ప్రదే శాలను పవిత్రంగా చేసుకున్నారు. ఆ స్థలం, ఆ ప్రాంతం ఏ సమాజానికి, మరే  మతానికి సంబంధించినదైనా కావచ్చు. మక్కా అంతటి పవిత్రత, గౌరవం వాటిలో ఏ ఒక్కటికీ లేదు అన్నది మాత్రం విర్వివాదాంశం. ఎందుకంటే, మక్కాకు లభించిన పవిత్రత సనాతనం, నిత్య నూతనం, దైవ ప్రసాదితం. ఇతర ప్రాంతాల కు లభించినది మానవ కల్పితం, కృత్రిమం, క్షణికం. ఏ నిమిషం మనిషి చేసిన సిద్ధాం తాలు దేనిక కొరగాకుండా పోతాయో  మరుక్ష ణం ఆయా స్థలాలు, ఆలయాలు తమ పవిత్ర తను కోల్పోతాయి. స్వయం మనిషే తన స్వహస్తాలతో వాటిని కుప్పకూలుస్తాడు. అయితే మక్కా, మక్కాలోని కాబా అటువంటిది కాదు. దీనికి సుదీర్ఘమైన మానవ చరిత్రే ప్రత్యక్ష  సాక్షి!
 అల్లాహ్‌ ఈ పట్టణంలోని కాబా గృహం వైపు ముఖం త్రిప్పి నమాజు చేయవలసిందింగా ఆదేశించాడు: ”(ఓ ప్రవక్తా!) ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మస్జిదె హరామ్‌ వైపునకే త్రిప్పు. మీరు ఎక్కడ ఉన్నాసరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి-జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి (ఇలాగే చేయండి). వారిలో దుర్మార్గులకు (వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంత మాత్రాన మీరు వారికి) భయపడకండి. నాకు మాత్రమే భయపడండి నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించటానికి, మీరు సన్నార్గ గాములు అవటానికి”.(అల్‌బఖర: 150)
 ‘కాబా’ వైపు ముఖం త్రిప్పి నమాజు చేయండి అన్న ఆజ్ఞ ఒకటి, రెండు కాదు- మూడుసార్లు చెప్పబడింది. దీన్నిబట్టి ఈ విషయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది. ఈ దిశ మార్పును దేవుడు తన అనుగ్రహాల పరిపూర్తి గా, సన్మార్గ భాగ్యానికి ప్రతీకగా అభివర్ణిం చాడు. అలాగే దైవాదేశాలను శిరసావహించే మనిషి సదా గౌరవపురస్కారాలకు అర్హుడవు తాడనీ, సన్నార్గ భాగ్యం కూడా అతన్ని వరి స్తుందని స్పష్టం చేశాడు.  ఇన్ని విశిష్ఠతల కారణంగానే అల్లాహ్‌ ఈ పట్టణాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు:
”శాంతియుతమైన ఈ నగరం సాక్షిగా!”.  (తీన్: 4)  ”ఈ నగరం తోడుగా!” (బలద్‌; 1)
 అల్లాహ్‌ ఈ ఆయతులలో మక్కా నగరంపై ఒట్టేసి విషయం చెబుతున్నాడంటే, దీన్ని బట్టి ఈ నగరం ప్రాస్తశ్యాన్ని ఊహించ వచ్చు. దైవ ప్రవక్త (స) మక్కాను వీడి వెళు తూ ‘హజ్వరా’ ప్రదేశంలో నిలబడి మక్కా నుద్దేశించి ఇలా అన్నారు: ”ఓ మక్కా! అల్లాహ్‌ సాక్షిగా చెబుతున్నాను. నీవు అల్లాహ్‌ భూభాగాలన్నింటిలోకెల్లా అత్యంత మహిమాన్వితమైన నేలవు. భూభాగాలన్నిం టిలోకెల్లా అల్లాహ్‌కు అత్యంత ప్రియ మైన భూభాగానివి. నాకూ నీవు మిక్కి ఇష్టమైన భూభాగానివే. మక్కా వాసులే (అవిశ్వాసు లే)  గనక నన్ను నీ నుండి వెలివేసి ఉండక పోతే నేను ఎన్నటికీ నిన్ను వీడి వెళ్ళేవాడను కాను. (నిన్ను వీడి మరో భూభాగంలో నివా సం ఏర్పచుకునేవాడను కాను)”.  (తిర్మిజీ)
  మహిమాన్వత నగరం మక్కా పురం అంటే అనంత కరుణామయుడైన అల్లాహ్‌ాకు, సర్వలోక కారుణ్యమూర్తి అయిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి ఎంతో ఇష్టం. కాబట్టి మనం కూడా మక్కా నగ రాన్ని, అందులోని ప్రతి ప్రదేశాన్ని ప్రేమిం చాలి, అభిమానించాలి, గౌరవించాలి. స్థాయి, స్థోమత ఉంటే ఆ గృహాన్ని ఉద్దే శ్యించి హజ్జ్‌ చేయాలి. అల్లాహ్‌ ఇలా సెలవి స్తున్నాడు: ”అక్కడికి వెళ్ళే స్థోమత గల వారికి, అ గృహ (యాత్ర) హజ్జ్‌ చేయ డాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవర యినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి)  నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంత మాత్రం లేదు”. (ఆలి ఇమ్రాన్: 97)
 ఈ కారణంగానే దాదాపు ప్రవక్తలు తమ శేష జీవితాన్ని ఈ పట్టణంలో జీవించి కన్ను మూయాలని ఆశ పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి మరింత మంచి సౌక ర్యాలతో బ్రతకటానికి జీవనోపాధిని వెతు క్కుంటూ ప్రపంచ నలుమూలలా వేళతాడు. కానీ మక్కా వెళ్ళే వారు మాత్రం అక్కడే మర ణించాలని, అక్కడ మరణం రావడం తమ భాగ్యమని బయలుదేరతారు. అంటే, భూ ఇతర భాగాలు మనిషిని పదార్థ పూజారిగా, దానవుడిగా మార్చితే, మక్కా పురం మనిషిని పరమాత్మ దాసుడిగా, మనసున్న మనీషిగా తీర్చిదిద్దుతుంది.

Related Post