Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

చైతన్య సుధాఝరి రమాజన్‌

కగూడు, గుడ్డ లేకపోయినా మనిషి బత్రకగలడు కానీ, ఆహారపానీయాలు లేకుండా జీవించ లేడు. జీవన మనుగడ సవ్యంగా సాగించ లేడు. అట్టి మౌలికావసరాన్ని సయితం నిర్ణీత వేళ వరకు వదిలి ‘ఆకలి దాహాల’ను భరించి ఉపవాస రూపంలో అల్లాహ్‌కు నజరానా సమర్పించు కుంటాడు ముస్లిం.

కగూడు, గుడ్డ లేకపోయినా మనిషి బత్రకగలడు కానీ, ఆహారపానీయాలు లేకుండా జీవించ లేడు. జీవన మనుగడ సవ్యంగా సాగించ లేడు. అట్టి మౌలికావసరాన్ని సయితం నిర్ణీత వేళ వరకు వదిలి ‘ఆకలి దాహాల’ను భరించి ఉపవాస రూపంలో అల్లాహ్‌కు నజరానా సమర్పించు కుంటాడు ముస్లిం.

రమజాను మాసం వచ్చిందంటే ముస్లిం భక్తజన ఆంతర్యాలు ఆధ్యాత్మిక చైతన్య,ంలో ఓలలాడు తాయి. రజబ్‌ మాసంలో నారు పోసి, నీరు కట్టి, షామాన్‌ మాసంలో కలుపు తీసి, మందు జల్ల్లబడిన భక్తి బీజం రమజాను నెలవంక దర్శనంతో పుష్పిస్తుంది. అది ఫలించి మరో వృక్ష సృజనకు దారి తీస్తుంది. ఈ ధార్మిక జాగృతి అనతి కాలంలో చైనత్య పరాకాష్టకు చేరుకుంటుంది. రాతి వేళ సుభక్తాగ్రేసరుల తరావీహ్‌ా పార్థ్రనలతో, సుస్వరకర్తల ఖుర్‌ఆన్‌ పారాయణాలతో, పభ్రంజనాన్ని తలపించే దానాధర్మాలతో, నిత్య నిర్మల హృదయుల ఉపవాస దీక్షలతో ముస్లిం సమాజంలో దైవభీతిని, నైతిక రీతిని, పరలోక పీత్రిని పెంచుతూ, ముస్లిం సంఘ జీవనాన్ని అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే జీవ నదిలా మలుస్తుంది రమాజన్‌. రమాజను నిత్య చైతన్య సుధాఝరిలో ఓలలాడటం అంటే, ఇస్లాం స్థాయి నుండి, ఈమాన్‌ స్థాయికి, ఈమాన్‌ స్థాయి నుండి ఇహ్సాన్‌ స్థాయికి చేరుకోవడమే. ”తను చూసే కంటినవుతాను, తను వేసే అడుగు నవుతాను, తను వినే చెవినవితాను, తను పట్టుకునే చేయినవుతాను” అని స్వయంగా ఆ మహోన్నత అర్ష్‌కి అధిపతి అయిన అల్లాహ్‌ా సెలవిస్తే దానికి మించిన భాగ్యం ఎముంటుంది చెప్పండి?!
రాత్రి  విశ్రాంతి కోసం మాతమ్రే అన్నది పదార్థ పూజారుల, భౌతికవాదుల అభిపాయ్రం. అయితే ఆ  రాత్రుళ్ళే  దైవానికి మరియు దాసునికి మధ్య అనుసంధానంగా ఉండే ఏకాంత ఘడియలని, ఆత్మ జాగృతికి, ఉన్నతికి, వికాసానికి శుభ వేళలు అన్నది అనంత కరుణామయుడయిన అల్లాహ్‌ మాట:”వారి ప్రక్కలు వారి పడకల నుండి వేరుగా ఉంటాయి. వారు తమ పభ్రువు భయం తోనూ, ఆశతోనూ పార్థ్రిస్తారు”. (అస్సజ్దహ్‌: 16) ఆ వేళ స్వర్గ అధిరోహణకు సువర్ణ సమయం అన్నది అంతిమ దైవపవ్రక్త ముహమ్మద్‌ (స) వారి అర్థవంతమయిన అమృత వాక్కు. ”సలామ్‌ను సర్వవ్యాప్తం చేయండి. అన్నదానాలు చేపట్టండి. బంధుత్వ సంబంధాలను బల పర్చండి. రాతి పజ్రలు నిదిస్త్రుండగా మీరు మేల్కొని పార్థ్రనలు చేయండి. మీ పబ్రువు స్వర్గధామంలో నిక్షేపంగా పవ్రేశించండి”. (తిర్మిజీ, అహ్మద్‌)
కగూడు, గుడ్డ లేకపోయినా మనిషి బత్రకగలడు కానీ, ఆహారపానీయాలు లేకుండా జీవించ లేడు. జీవన మనుగడ సవ్యంగా సాగించ లేడు. అట్టి మౌలికావసరాన్ని సయితం నిర్ణీత వేళ వరకు వదిలి ‘ఆకలి దాహాల’ను భరించి ఉపవాస రూపంలో అల్లాహ్‌ాకు నజరానా సమర్పించు కుంటాడు ముస్లిం. అంతే కాదు, అదుపు తప్పే కోరికల్ని, అనర్థ పవ్రర్తనను, అసభ్య సంభా షణను, జుగ్పుస్స కలిగించే జులాయితనాన్ని, చివరికి ధర్మసమ్మతమయిన సహధర్మచారిణి కలయికను సయితం పరిత్యజించి తనలోని దాస్య బావాన్ని చాటుకుంటాడు. అందుకే అల్లాహ్‌ా అన్నాడు: ”ఉపవాసం నాది. నేనే స్వయంగా దానికి పత్రిఫలాన్ని అనుగహ్రిస్తాను”. (ముత్తఫఖున్‌ అలైహి)
రమజాను మాసంలో ముస్లిం సమాజంలో మొగ్గతొడొగే ఈ ఆచరణ అంతం కాదు. ఆరంభం, మరో అంకుర సృజనకు పార్రంభమే. ఒక ముస్లిం తన ఆదాయంలోంచి ఒక నిర్ణీత భాగాన్ని ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన – నిరుపేదల కొరకు, అభాగ్యజీవుల కొరకు, హృదయాలను ఆకట్టుకోవలసి వారి కొరకు,బానిస ముక్తి కొరకు, దైవమార్గం కొరకు, బాటసారుల కొరకు వెచ్చించాలి. అవసర మయితే రమజాను ఒక్క మాసంలోనే కాక, యేడాది 12 నెలలూ తన జీవిత అవసరాలను త్యాగం చేసి, ఆకలి బాధను భరించి, కటిక దారిదా్యన్ని సయితం సహించి ధర్మసంస్థాపన కోసం పరిశరమించాల్సి వస్తే దానికీ సిద్ధంగా ఉండాలి.
”మీ పభ్రువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి”. (జుమర్‌: 54) అన్న అల్లాహ్‌ పిలుపు విశ్వం మొత్తం వినబడుతూనే ఉంటుంది. అల్లాహ్‌ ఒక్క రమాజను మాసానికి మాత్రమే పభ్రువు కాదు, ఆయన సకల లోకాలకు, సకల సమయాలకు, సకల అవస్థలకూ పభ్రువే అంటూ ముస్లిం సముదాయాన్ని జాగృత పరుస్తూ నిత్య చైతన్య అవస్థలో జీవించేలా, నిజ ఆరాధ్యుని ధ్యాసలోనే శ్వాసించేలా తీర్చి దిద్దుతుంది. అవినీతి, అకమ్రం, అన్యాయం, అధర్మ,ం అనే అడసు త్రొక్కి అడ్డదిడ్డంగా సంపా దించి అద్దాల మేడ కట్టాలనుకున్న ఆలోచన కలిగినప్పుడల్లా – ”ఓ నా దాసుడా! అధర్మ సంపాద అనర్థదాయకం. ధర్మ సంపాదన శుభ సూచకం. తత్ఫలితంగా – నీ మొర ఆలకించ బడుతుంది. నీ అక్కర తీర్చబడుతుంది. నీకహోదా పెంచబడుతుంది, నా పస్రన్నతక నీకు పాప్త్రమవుతుంది” అన్న పిలుపు వినవస్తుంది. ఇలా జీవితపు అన్ని అంగాల్లోనూ, అన్ని రంగాల్లోనూ అల్లాహ్‌ పిలుపు అతన్ని సన్మార్గాన నడుపిస్తూ ఇహపరాల విజేతగా నిలబెడుతుంది.

కాబట్టి రమాజాను మనలో నింపే చైతన్యం యేడాదికి సంబంధించిన ఇతర మాసాల్లో సయితం పత్రిఫలించినప్పుడే, నిరతం తఖ్వావస్థలో మనం జీవించినప్పుడే రమజానులో మనం చేసిన పార్థ్రనలు, ఉపవాసాలు, జాగారాలు, ఖుర్‌ఆన్‌ పారాయణాలు, దానధర్మాలకు సార్థకత సమకూరుతుంది. సార్థక నామధేయుల జాబితాలో మన పేరు చేరుతుంది.

Related Post