Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

కోరలు చాచుతున్న కన్స్యూమరిజమ్‌

 

నేలనీ, నేల మీద వృక్ష జాతుల్నీ, జంతురాసుల్నీ, చుట్ట్టూ ఉన్న మట్టిపొరల్ల్లో నిక్షిప్తమయి ఉన్న అనంతమైన సహజ వనరుల్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాకుండా ‘అదనపు విలువలు’ ఊబి లోకి నెడుతున్న కొన్ని ప్రపంచ దేశాలు ప్రజా ధనాన్ని పట్టపగలే కొల్లగొడుతున్నాయి. పర్యావర ణాన్ని వినాశనం చేసే సంపన్న దేశాల సంస్కృతినీ, జీవన విధానాన్నీ, కన్స్యూమరిజాన్ని మూడో ప్రపంచ దేశాల మీద బలవంతాన రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. వినాశకులే విశ్వ శాంతి రక్ష కులుగా డాబులు కొడుతున్నారు. చేతులు నరికి – నోటికి తినిపించి అవసరం, ఆకలి తీర్చేసి నట్టు నమ్మించే బడా బాబు సామ్రాజ్యవాదం హిరోషిమా, నాగసాకిలపై ఎక్కు పెట్టిన ప్రయోగం తో ఎంత జీవ విధ్వంసానికి కారణమైందో చరిత్ర చెబుతోంది. దానికి ముందు రెడ్‌ ఇండియన్ల ఊచకోతతో అక్కడ చెట్టూ చేమా, పిట్టా గుట్టల్నీ, వాగూవంకల్నీ సర్వనాశనం చేసిన ఆనవాలు మన స్మృతి పథం నుంచి చెరిగిపోలేదు.

1962-75లలో వియత్నాంలో ‘ఏజెంట్‌ ఆరెంజ్‌’ ప్రయోగంతో విష రసాయనాల విస్పోటనానికి ఈ నాటికీి అక్కడ మనుషులు ఎలా జన్యు వైకల్యాలకు గురువుతున్నారో కళ్ల ఎదుట ఉన్న సజీవ సాక్ష్యాలు. నేటి అఫ్గనిస్తాన్‌, ఇరాక్‌, ఫలస్తీనా, సిరియాల దుర్గతి, బాధి తుల దురవస్థలు చెప్ప పని లేదు. ఒకవైపు అదుపులేని విధ్వంశకర పారిశ్రామిక విధానంతో ప్రపంచ జీవన వైవి ధ్యాన్ని వినాశనం చేస్తూ, మరో వైపు ఒకే మార్కెట్టు, ఒకే సంస్కృతి అనే విధానంలో భాగంగా ఆంగ్లాన్ని ఏకైక భాషగా నమ్మించి, ప్రపంచ భాషా వైవిధ్యాన్ని తూట్లు పొడుస్తోంది ధనస్వామ్యానికి మించిన ఘనస్వామ్యం లేదని నమ్మ బల కడమేకాక, స్త్రీల వ్యక్తిత్వాలను హరించి, ప్రక్కదారి పట్టించే విష సంస్కృతిని వెర్రి తలలు వేసే స్థాయికి పెంచి పోషిస్తోంది. నవ తరాన్ని నీతికి విలువ, నాతికి వలువ అవసరం గుర్తించలేని విధంగా మారు స్తోంది. మాదక ద్రవ్యాల సేవనా న్ని ప్రోత్సహిస్తూ, సెక్స్‌, హింసమయ మైన చిత్రాలను టీవీలు, అంతర్జాలల ద్వారా వ్యాపింప జేస్తూ, వ్యక్తి త్వాలనుకాక, స్త్త్రీల అందమంతా శరీరపు ఒంపు సొంపుల్ల్లోనే ఉన్నదనే ఆకర్షణను సృష్టించి, అలా ఆకర్షించటమే అసలు స్త్రీ స్వేచ్ఛ, స్వాతం త్రం అనే నీచ సాంస్కృతిక విలువలను అందాల పోటీల చాటున శాసి స్తోంది. ఏకపక్ష ప్రేమను ఆమోదించి తీరాలనే మగ దురహంకారా లను ప్రేరేపిస్తోంది.

”నేరుగా ఎక్కువ రేటును రైతుకిచ్చి కొనుగోలు చేసి, మధ్య దళారులు లేకుండా అతి తక్కువ రేటుకి వినియోగదారుడికి అమ్ముతామ”న్న తీపి మాటలతో చిల్లర వ్యాపారాల్లో ఉక్కు పాదం మోపిన కన్స్యూమరిస్టులు మెక్సికోలో

50/, దక్షిణాఫ్రికాలో 80/, ఇండోనేషియాలో 23/, మలే షియాలో 28/, ఆస్ట్రేలియాలో 90/, చైనాలో 10/ శాతం ఇలాంటి బడా కంపెనీలు చిల్లర వ్యాపారాన్ని కైవసం చేసుకున్నాయి. మొత్తం 50 దేశాల చిల్లర వ్యాపారం 8 కంపెనీల చేతులపై నడుస్తోంది. వీరి వ్యాపారం మొత్తం 52 లక్షల కోట్లు అన్నది విశ్లేషకులు అంచనా. వీరంతా 50 దేశాలలో కల్పిస్తున్న ఉద్యోగాలు 43 లక్షలు మాత్రమే కాగా, మనకు వీరి ద్వారా కోటి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని స్వయంగా దేశ ప్రధానే ప్రకటించడం దేన్ని సూచిస్తుందో ఆలోచనా పరులు అర్థం చేసుకోగలరు.

ఇక్కడ వాల్‌మార్ట్‌ గురించి ఆర్థిక శాస్త్రజ్ఞురాలు ఎమెస్కో బేకర్‌ చెప్పిన మాట గమనార్హం-”వాల్‌ మార్ట్‌ ఉద్యోగాలను సృష్టిస్తుందా? అంటే అవును అన్నది సమాధానం. అది ఉద్యోగాలను ధ్వంసం చేస్తుందా? అంటే కూడా అవును అన్నదే సమాధా నం”.

ఇలా చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేస్తున్నాయి. పెద్ద చేపలు తిమింగిలాలుగా బలిసి పోతున్నాయి. అప్పుడూ ఇప్పుడూ కష్ట పడే వారి కడుపు కొట్టి చాడీలు చెప్పి పబ్బం గడుపుకునే నక్క జిత్తుల దళా రులు మాత్రమే సుఖంగా, సంతోషంగా ఉన్నారు. నిజాయితీగా కష్ట పడేవాడు కష్ట పడుతూనే ఉన్నాడు. కష్టాలకి, కన్నీళ్ళకి, నయ వంచన లకి గురువుతూనే ఉన్నాడు.

‘దొంగ నోట్ల దొంగవోట్ల రాజ్యమొక రాజ్యమా?

లంచగొండులేలేటి పాలనొక పాలనా?’ శ్రీశ్రీ.

వీరి సంస్కృతినే మానవుల్ని క్రూర జంతువుప్రాయులుగా మారుస్తున్న హీన సంస్కృతి అంటాము. కాబట్టి దోపిడి వర్గాల పీడిత ప్రజల సంస్కృతులు ఒకటి కాజాలు. ”రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే. రాళ్లకు పూవుల పరిమిళమెప్పుడు అంటదు అంటదు అంట దులే” అన్నాడు చెరబండరాజు. కాబట్టి రచయి తలూ, ఆలోచనాపరులూ, సమాజ శ్రేయోభి లాషులు ప్రజల పక్షం వహిస్తూ కన్స్యూమరిజంపై ధిక్కార స్వరంతో సాంస్కృతిక కలం యోధులుగా, గళం వీరులుగా సంఘటితంగా నిలువాల్సిన, నినదిం చాల్సిన, నిలదీయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

Related Post