మన ధార్మిక గ్రంధాలు ఏమి బొధిస్తున్నాయి.
ధార్మిక గ్రంధములన్ని సృష్టిరాశులను అంటే భూమిని, సూర్య చంద్రులను, నక్షత్రాలను, మనష్యులను, జంతువులను, చెట్లను, పుట్టలను పూజించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సృష్టి పూజ చేయకండి సృష్టికర్తనే ఆరాధించాలని బొధిస్తున్నాయి. ఉదాహరణకు ధార్మిక గ్రంధములని పరిశీలించండి
ఖుర్ఆన్ వాక్యాల ప్రకారం పరిశీలించండి.
(ఖుర్ ఆన్ 2:21) ఓ మానవులారా, మిమ్ముల్ని, మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువునే ఆరాధించండి.;
(ఖుర్ ఆన్ 41:37) మీరు సూర్యచంద్రులను ఆరాధించకండి. వాటిని సృష్టించిన దేవున్ని ఆరాధించండి.;
(ఖుర్ ఆన్ 37:95) స్వయంగా మీరే చెక్కుకున్న వస్తువులను మీరు పూజిస్తున్నారా. వాస్తవానికి అల్లాహ్యేయే మిమ్ముల్ని సృష్టించాడు ;
(దివ్యఖుర్ఆన్ 16:20) అల్లాహ్ ను విడిచి ప్రజలు వేడుకొంటున్న ఇతర శక్తులు ఏ వస్తువులకు సృష్టికర్తలు కావు. స్వయంగా వారే సృష్టించబడినారు.;
(దివ్యఖుర్ఆన్ 5:72)సర్వశక్తిగల దేవుడికి ఇతరులను బాగ్యస్వాములుగా చేసే వారికీ ఆ దేవుడు స్వర్గాన్ని నిషేధం చేశాడు. వారి నివాసం నరకం.
వేదాల ప్రకారం పరిశీలించండి.
“अन्धः तम प्रविष्यन्ति आसम्भूति मुपासते
ततोभूय ईवते तमोयाव ऊ संभूत्यागम रतः
“అందః తమప్రవిష్యంతి యె ఆసంభూతి ముపాసతే
తతోభూయ ఇవతె తమోయావ్ సంబూత్యాగ్ర రతః
యజుర్వేదం (40:9)
సృష్టిని ఆరాధించే వారు అంధకారానికి (శాశ్వత నరకానికి ) పోతారు.
చేతితో తయారైన బొమ్మలను విగ్రహాలను ఆరాధించే వారు ఇంకా లోతైన అంధకారానికి (నరకానికి) పోతారు.
భగవద్గీత ప్రకారం పరిశీలించండి.
(భగవద్గీత 7:20) తమ యొక్క ప్రక్రుతిచే ప్రేరేపింపబడినవారై విషయాదులందలి కోరికలచే వివేకమునుగోల్పోయి, దేవతారాధన సంబంధమైన ఆయా నియమముల నవలభించి ఇతర దేవతలను ఆరాధించు చున్నారు.
సాయి బాబా నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని ఎప్పుడూ చెప్పలేదు, తాను కూడా స్వయంగా దేవున్నే ఆరాధించాడు ,
“ప్రతి రోజు ఉదయం సాయి బాబా చాలా పెందలకడనే నిద్ర లేస్తారు. అన్నింటి కంటే ముందు నమాజులు ఆచరిస్తారు. అల్లాహ్ నే ప్రార్దించేవారు.
(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 139వ పేజి)
తానూ ఓ దైవదాసుడినేనని సాయి బాబా స్వయంగా చెప్పి ఉన్నారు.
“నేను దేవుని [అల్లాహ్] దాసుణ్ణి. దేవుడు ప్రభువు మరియు యజమాని”
(ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయిబాబా ది మాస్టర్” 228వ పేజి)
బైబిల్ ప్రకారం పరిశీలించండి.
(యిర్మియా 17:5) నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకోనువాడు శాపగ్రస్తుడు.
అందుకే యేసు వారు కూడా కేవలం యెహొవా [అల్లాహ్] నే ప్రార్దించేవారు.
(లూకా : 3:21) ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్దన చేయుచుండగా ఆకాశము తెరవబడి .
(మార్కు 1;35) ఆయన [యేసు] పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే అరణ్య ప్రదేశ్యమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను.
* సర్వశక్తిమంతుడైన నిజదేవున్ని విడిచి అనేక బలహీనతలు గల సృష్టి రాశులను ఆరాధించడం దేవుని దృష్టిలో క్షమించరాని పాపం. ఇదే స్ధితిలో మనషికి మరణం సంభవిస్తే అతడు శాశ్వతమైన నరకాగ్నిలో పడవేయబడతాడు. అక్కడ శాశ్వతంగా ఉంటాడు. *
అందుకే సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి, సృష్టిపూజ చేయకండి.