Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

మానవ జీవతంపై తౌహీద్‌ ప్రభావం

తౌహీద్‌ ప్రకారం జీవితం గడిపిన వారు ఇహలోకంలో సఫలీకృతులు కావడమే కాక, పరలోకంలో స్వర్గంలో ప్రవేెశిస్తారు. తౌహీద్‌ను త్రోసి పుచ్చినవారు ఐహికంగానూ అప్రతిష్ట పాలవుతారు.

తౌహీద్‌ ప్రకారం జీవితం గడిపిన వారు ఇహలోకంలో సఫలీకృతులు కావడమే కాక, పరలోకంలో స్వర్గంలో ప్రవేెశిస్తారు. తౌహీద్‌ను త్రోసి పుచ్చినవారు ఐహికంగానూ అప్రతిష్ట పాలవుతారు.

తౌ హీద్‌ ఆధారంగానే ఓ వ్యక్తి మోమిన్‌, ముస్లిం అనబడతాడు. తౌహీద్‌ సందేశాన్ని సమస్త మానవాళికి అందజేయడానికి ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలు ప్రభవించారు. తౌహీద్‌ ఆధారంగానే భూమ్యాకాశాల వ్యవస్థ నడుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే- తౌహీద్‌ ప్రకారం జీవితం గడిపిన వారు ఇహలోకంలో సఫలీకృతులు కావడమే కాక, పరలోకంలో స్వర్గంలో ప్రవేెశిస్తారు. తౌహీద్‌ను త్రోసి పుచ్చినవారు ఐహికంగానూ అప్రతిష్ట పాలవుతారు. పరలోకంలో ఘోరంగా విఫలులయి నరకాగ్నికి ఆహుతి అవుతారు. మానవ జీవిత ఇహపరాల సాఫల్యంతో ఇంతగా ముడు పడి ఉన్న తౌహీద్‌ మానవ జీవితంపై చూపే ప్రభావం గురించి, దాని అర్థం, వైశిష్ఠం గురించి సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

తౌహీద్‌ భావార్థం:

”సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, సంరక్షకుడు, జీవన్మరణాలకు స్వామి (రబ్‌) నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ మాత్రమే అని తెలుసుకోవడం. సమస్త లోకాల్లో ఆయన్ను ఏకైక ప్రభువుగా అంగీకరించి, మిథ్యా దైవాలన్నింటిని తిరస్కరించ డాన్ని తౌహీద్‌” అన్నారు అల్లామా జుర్జానీ (ర). (అత్తారీఫాత్‌: 73)

”సకల విధమయినటువంటి ఉపాసనల్ని, ఆరాధనల్ని కేవలం అల్లాహ్‌ా కు మాత్రమే ప్రత్యేకించడం” అన్నారు ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ వహ్హాబ్‌ (ర).
”ఆయన హక్కుల విషయంలో ఆయన్ను ఏకైక దైవంగా అంగీకరిం చడం. ఆయన హుక్కులు మూడు – 1) యాజమాన్యపు హక్కు 2) ఆరాధనా హక్కు 3) నామాలు మరియు గుణగణాలకు సంబంధిం చిన హక్కు” అన్నారు షేక్‌ నాసిరుల్‌ ఉమర్‌ (ర).

అంటే సకల లోకాలకు ఆయనొక్కడే యజమాని అని విశ్వసించడం తోపాటు, సకల ఆరాధనలను, ఉపసనా రీతులను ఆయనొక్కడికే ప్రత్యేకించడంతోపాటు, ఖుర్‌ఆన్‌ మరియు హదీసుల ద్వారా రూఢీ అయిన ఆయన నామాలను, గుణగణాలను ఆయనకు మాత్రమే వర్తింప జేయాలి. ఈ మూడు హక్కుల్లో ఇంకెవ్వరిని హక్కుదారులుగా, సహవర్తులుగా భావించకూడదు.

తౌహీద్‌ వచనం:

”నువ్వు బాగా తెలుసుకో! ”నిశ్చయంగా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ అల్లాహ్‌ా తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు”. (ముహమ్మద్‌: 19)
తౌహీద్‌ ప్రాముఖ్యత: ”మేము ప్రతి సముదాయంలోనూ ఒక ప్రవక్తను ప్రభవింప జేశాము. అతని ద్వారా (ప్రజలారా!) ‘అల్లాహ్‌ ను మాత్రమే ఆరాధించండి. మిథ్యా దైవాలన్నింటికీ దూరంగా జర గండి’ అని బోధ పర్చాము”. (అన్నహ్ల్‌: 36)
”ఇస్లాం ఐదు అంశాల మీద ఆధార పడి ఉంది. వాటిలో మొదటిది: తౌహ్‌ాద్‌” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)
హజ్రత్‌ మఆజ్‌(ర)గారిని యమన్‌ దేశానికి సాగనంపుతూ:”ఓ మఆజ్‌! నువ్వు వెళుతున్నది గ్రంథవహుల వద్దకు. కాబట్టి ముందు వారిని తౌహీద్‌ వైపునకు ఆహ్వానించు” అని హితవు చేశారు ప్రవక్త (స). (బుఖారీ)
తౌహీద్‌ ప్రాశస్త్యం: ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” భావార్థం తెలిసిన స్థితి లో ఎవరికయితే మరణం సంభవిస్తుందో అతను స్వర్గంలో ప్రవేశి స్తాడు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

తౌహీద్‌ ప్రభావం

భావ దారిద్య్రం నుండి కాపాడుతుంది:

”బహుదైవ భావన మనిషిని భావ దాద్య్రానికి గురి చేస్తుంది. బహుదైవ భావాలు గల వ్యక్తి తాను నమ్మే దైవాలను వివిధ రకాల దృష్ట్యానూ, గుణగణాల రీత్యానూ, స్వభావ స్వరూపాల రీత్యానూ, జాతి రీత్యానూ వేరు వేరుగా భావిస్తాడు. అతను దైవాలుగా నమ్మే వాటిలో తనలాంటి మనుషులూ ఉంటారు, పశుపక్ష్యాదులూ ఉంటాయి. చెట్టు, చేమ, రాయ, రప్ప లాంటివీ ఉంటాయి దైవం విషంయలో భ్రాంతికి గురయి ఫలితంగా సాటి ప్రజల్ని సయితం అనేక వర్గాలు, వర్ణాల పేరుతో విడగొడ తాడు. అస్పృశ్యతకు, అంటరానితనానికి ఊతాన్నిస్తాడు. ఓ థలో తన్ను కూడా దైవ స్థానంలో కూర్చొ బెట్టుకుంటాడు. స్వయం సిద్ధాం తాలను దైవ సిద్ధాంతాలుగా నమ్మ బలుకుతాడు. ఈ యదార్థం గురించి తెలియజేస్తూ ప్రవక్త యూసుఫ్‌ (అ) తన జైలు మిత్రులతో ఇలా అన్నారు:”ఓ నా కారాగార సహచరులారా! అనేక మంది విబిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడయిన ఒక్క అల్లాహ్‌ా మేలా? (మీరే చెప్పండి!)”. (యూసుఫ్‌: 39)

ఎందుకంటే, మనిషి ప్రతిష్టింపజేసుకున్న దైవాలు అతను నిలబెట్టు కున్నవే. వాటికి పేర్లు పెట్టింది కూడా తనే. లేని దైవత్వాన్ని ఆపాదిం చింది కూడా తనే. అవి దైవం అన్న ఆధారం సృష్టి మొత్తంలో ఒక్కటి కూడా లేకపోయినా వాటిని దైవాలుగా కొలుస్తున్నది కూడా తనే. జహాంగీరు దర్గాలో పలావులు వండినా, ఉజాలేషా వాకిలి వద్ద కోళ్ళు కోసినా, కస్మూరులో క్యాంపు చేసినా, కాకానీలో ఖవ్వాలీ పాడినా, మస్తాన్‌ వలీ పేరుతో మొక్కుబడులు తీర్చినా, అజ్మీర్‌కెళ్ళి చాదర్‌ కప్పినా-అదంతా అతని స్వయంకృతమే. అంతా అతని భావ దారిద్య్ర ప్రభావమే.
అల్లాహ్‌ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: ”ఒక వ్యక్తి ఉన్నాడు. అతను విరుద్ధ భావాలు గల అనేక మంది భాగస్వాముల క్రింద ఉన్నాడు. మరో వ్యక్తి ఒక్కనికే చెందిన వాడు. వారిద్దరూ సమానులవుతారా? అల్‌హమ్దులిల్లాహ్‌ా. కాని వారిలో చాలా మంది తెలియనివారు”. (అజ్రుమర్‌: 29)

యాదార్థ జీవిగా తీర్చిదిద్దుతుంది:

సాధారణంగా మనిషి కలల లోకాన్ని, కథల్ని ఇష్ట పడినంతగా వాస్తవాన్ని ఇష్ట పడడు. ఈ కారణం గానే తన సృష్టికర్త ఎవరు? ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నది ఎవరు? అని ఆలోచించకుండా, కొందరు తమ ఆరాధ్యుడిని వారే సృష్టించుకుం టే, మరికొందరేమో తమ పూర్వీకుల నోట విన్న కథల్నే నిజాలుగా నమ్మారు. సృష్టి ప్రక్రియలో, సృష్టిలోని చరాచాలకు ఆహారం వొసగ డంలో, ప్రణాళిక రచనలో వారెవ్వరూ భాగస్వాములు కారు అని తెలిసి నా ఊహాజగత్తులో విహరించడానికే ఇష్ట పడతారు. దీనికి భిన్నంగా అల్లాహ్‌ాను తన ఆరాధ్య దైవంగా నమ్మిన వాడు వాస్తవ ప్రపంచంలో జీవిస్తాడు. తన్ను ఇంత అందమయిన ఆకారంలో పుట్టించిన వాడినే కొలుస్తాడు. తన కోసం విశ్వ వ్యస్థను అందుబాటులోకి తెచ్చిన వాడినే ఆరాధిస్తాడు. ”ఆకాశాలను, భూమిన సృష్టించిన వారెవరు? ఆకాశం నుండి మీ కోసం వర్షాన్ని కురింపించిందెవరు? మరి దాని ద్వారా చూపరుల్ని కట్టిపడేసే తోటల్ని ఉత్పన్నం చేసిందెవరు? ఆ తోటల్లోని చెట్లను (శూన్యం నుండి) మొలకెత్తించడం అనేది మీ వల్ల కాని పని. ఏమిటి? అల్లాహ్‌ాతోపాటు మరో పూజ్యనీయుడు ఉన్నాడా? (లేనే లేడు). కానీ ఈ ప్రజలు సత్య నుండి వైదొలిగి పోతున్నారు”. (నమ్ల్‌: 60)
”చెప్పండి! తొలిసారి సృష్టించేసిందెవరు? మళ్ళి దాన్ని మలిసారి చేయగలవాడెవడు? భుమ్యాకాశాల నుండి మీకు ఉపాధిని సమకూర్చే వాడెవడు? ఏమిటీ అల్లాహ్‌తోపాటు (ఈ కార్యనిర్వహణలో) ఇంకొక పూజ్యనీయుడు కూడా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు ఏదయినా ప్రమాణాన్ని తీసుకు రండి” అని ఓ ప్రవక్తా! వారికి చెప్పు’. (నమ్ల్‌: 64)

మంచీచెడుల, ధర్మాధర్మాల విచక్షణను ప్రసాదిస్తుంది:

ఏది నైతికం? ఏది అనైతికం? ఏది ధర్మం? ఏది అధర్మం? దీన్ని నిర్ణయించేది ఎవరు? ఎందుకు నిర్ణయించాలి? ఎవరికేది కావాలో వేరొ కరు ఎందుకు నిర్ణయించాలి? మనకు నైతికత అన్పించేది ఇంకొందరికి అనైతికంగా కని పించవచ్చు కదా? అన్న కన్ఫ్యూజన్‌తో కూడిన ప్రశ్నలు, నిజ ఆరాధ్య దేవుడు ఎవడు? అని తెలుసుకోనంత వరకూ ఉంటాయి. అదే నిజ ఆరాధ్యుడు అల్లాహ్‌ా మాత్రమే అని విశ్వసించే వారికి ఈ సమస్యే లేదు. నేడు విశ్వ వ్యాప్తంగా ఉన్న 170 కోట్ల ముస్లింలకు ఏది హలాల్‌, ఏది హరామ్‌ అన్న కన్ఫ్యూజనే లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) గురించి ఖుర్‌ఆన్‌ ఇలా తెలియజేస్తుంది: ”ఆయన మంచిని చెయ్య మని వారికి ఆదేశిస్తాడు. చెడుల నుండి వారిని వారిస్తాడు. వారి కోసం పరిశుద్ధమయిన వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు. వారిపై అశుద్ధమయిన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు”. (అల్‌ ఆరాఫ్‌: 157)

మనోవాంఛల దాస్యం నుండి కాపాడుతుంది:

పొద్దస్తమానం కోరికల వెనక, ప్రాపంచిక ప్రయోజనాల వెనక పరుగెత్తే పేరాశపరునికి కోరికలు ఎన్ని తీరినా ఇంకా ఐహిక లాలస పెరుగు తూనే ఉంటుంది. ఐహిక లాలస గల వ్యక్తి గురించి తెలియజేస్తూ ప్రవక్త ఇలా అన్నారు: ”ఒకవేళ ఆదం పుత్రునికి బంగారం నిండిన రెండు లోయలు ప్రసాదించబడినా, మూడోదాని కోసం ఎదురు చూస్తుంటాడు. ఆదమ్‌ పత్రుని కడుపును (కాటి) మట్టి తప్ప మరేదీ నింప జాలదు”. (బుఖారీ)
”మేము గనక తలిస్తే ఈ సత్యం వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారము. కాని అతనేమో ప్రపంచం (భూమి) వైపుకే మ్రొగ్గాడు. తన మనోవాంఛలనే అనుసరించ సాగాడు. అందు వల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారయింది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుక బయటకు పెట్టి రొప్పుతూ ఉంటుంది. దాన్ని దాని మానాన వదలి పెట్టినా (నాలుక బైటకు తీసి) రొప్పుతూనే ఉంటుంది. మా ఆయతుల ను త్రోసి పుచ్చిన వారి ఉపమానం ఇలాంటిదే. కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు. బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో”. (అల్‌ ఆరాఫ్‌: 176)
కాంక్షా దాసుడు నిజ దైవాన్ని నమ్మడు, ఆయన ఆదేశాల్ని అనుసరిం చడు. మనో వాంఛల్నే దైవంగా భావిస్తాడు గనక. దీనికి భిన్నంగా నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ను తను విశ్వసించిన వ్యక్తి తన పుట్టుక పర మార్థం గురించి ఆలోచిస్తాడు. ప్రాపంచిక భోగభాగ్యాలకు దూరంగా ఉంటాడు. దాన్ని ఏదోక నాడు నశించి పోయే తాత్కా లిక తటాకంగా మాత్రమే చూస్తాడు, శాశ్వత నివాసంగా, సుఖ సంతోషాల నికేతనంగా భావించడు. ఫలితంగా ఇహం అనే వారిధిని దాటేందుకు సత్కర్మలను నౌకగా చేసుకుని సునాయాసంగా పరలోకానికి చేరుకుంటాడు. వాస్తవ కీర్తిశేషుల జాబితాలో చేరతాడు.
”తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపై వారికే ప్రాధా న్యత ఇస్తారు. వాస్తవానికి తన హృదయ లోభత్వం, స్వార్థప్రియ త్వం నుండి రక్షింప బడినవారే నిజమయిన సాఫల్యవంతులు”. (అల్‌ హష్ర్‌:9)

Related Post