Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

జకాత్‌ పూర్వ పరాలు

జకాత్‌ అంటే, శుద్ధత, శుభం, సమృద్ధి అన్న అర్థాలొస్తాయి. షరీ యతు పరిభాషలో జకాత్‌ ఓ ప్రత్యేక సంపదలోని నిర్ణీత భాగం. జకాత్‌ రూపంలో తీయబడే ఈ భాగం ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన ప్రత్యేకమ యిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వ బడుతుంది.

జకాత్‌ అంటే, శుద్ధత, శుభం, సమృద్ధి అన్న అర్థాలొస్తాయి. షరీ యతు పరిభాషలో జకాత్‌ ఓ ప్రత్యేక సంపదలోని నిర్ణీత భాగం. జకాత్‌ రూపంలో తీయబడే ఈ భాగం ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన ప్రత్యేకమ యిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వ బడుతుంది.

”(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధ పరచడానికీ, వారిని తీర్చిదిద్ద డానికీ వారి సంపదల నుండి జకాత్‌ తీసుకో. వారి కోసం ప్రార్థించు”. (తౌబా: 103)

ప్రాపంచిక జీవితం వడ్డించిన విస్తరి కాకపోయినా ఇక్కడ అందరికీ కావాల్సినవన్నీ ఉన్నాయి. ఒక నిరుపేదకు ధనికుడయ్యే అవకాశాలు ఎన్నున్నాయో, ఒక ధనికుడు దరిద్రుడుగా మారేందుకు అన్నే అవకాశా లున్నాయి. అల్లాహ్‌చే పరీక్ష నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ ప్రపం చం అనబడే విస్తరి నుండి మంచివాడు అనుభవిస్తాడు. చెడ్డ వ్యక్తీ ఆస్వాధిస్తాడు. అయితే పరలోకం అట్టిది కాదు. అది వచ్చి తీరుతుంది. సార్వభౌమాధికారి తుది రోజున ప్రజల మధ్య తీర్పు ఇస్తాడు. శిక్షా బహుమానాల చిట్టాలు విప్పుతాడు. కర్మలకు తగ్గట్టు ఫలితాలు వెలు వడుతాయ. నిజమైన శుభాలు, లాభాలు, సుఖాలు, సౌఖ్యాలు పరలో కానివే. వాస్తవమయిన బాధలు, పీడనలు, దుఃఖాలు, శిక్షలు కూడా పరలోకానికి సంబంధించినవే. సుఖాలు, దుఃఖాలు-అవి ఎన్ని రకా లుగా ఉన్నా అంతిమంగా అవన్నీ అనంత అనుగ్రహాలకు నిలయమ యిన స్వర్గసీమ రూపంలోనైనా, మహా భయంకర యాతనల గుండమ యిన నరకకూప రూపంలోనయినా ముందుకొస్తాయి. కాబట్టి మనం ఏది చేసినా అల్లాహ్‌కు భయపడుతూ, ఆయన కృపానుగ్రహాల పట్ల ఆశాభావం కలిగి ఉంటూ చేయాలి. పని-అది ఎలాంటిదయినా పరలోక పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చేయాలి. మనం మన కర్మలతోపాటే అల్లాహ్‌ ముందు హాజరు కావాల్సి ఉందన్ని విషయాన్ని విస్మరించకూడదు. అక్కడ ఆయన సమక్షంలో, ఆయన న్యాయ స్థానం లో మనం చేసిన సత్యాకార్యం రవ్వంత అయినా దాని మనం చూసు కుంటాము. అలాగే ఇసుమంత దుష్కార్యం చేసి ఉన్నా దాన్ని మనం చూసుకుంటాము.

అల్లాహ్‌ ఏకత్వం, దైవదౌత్యం, నమాజు తర్వాత ‘జకాత్‌’ ఇస్లాంలోని మూడవ సూత్రం. పవిత్ర ఖుర్‌ఆన్‌లో ‘నమాజు స్థాపించండి, జకాత్‌ చెల్లించండి’ అన్న జంట పదాలు 70 కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించ బడ్డాయి. అంటే నమాజు మరియు జకాతుకి మధ్య విడదీయరాని అవిభాజ్య సంబంధం ఉందన్న మాట.
జకాత్‌ అంటే, శుద్ధత, శుభం, సమృద్ధి అన్న అర్థాలొస్తాయి. షరీ యతు పరిభాషలో జకాత్‌ ఓ ప్రత్యేక సంపదలోని నిర్ణీత భాగం. జకాత్‌ రూపంలో తీయబడే ఈ భాగం ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన ప్రత్యేకమ యిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వ బడుతుంది. జకాతును ఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త (స) వారి ప్రవచనాల్లో ‘సద్ఖా’ అని కూడా చెప్పడం జరిగింది.

పూర్వ శాస్త్రాల్లో జకాత్‌:

జకాత్‌కు ఉన్నటువంటి అసాధారణ ప్రయోజనాల దృష్ట్యానే పూర్వ ధర్మ శాస్త్రాల్లో సయితం నమాజుతో సమానంగా ప్రాముఖ్యం కల్పించ బడింది. అల్‌ అన్బియా అధ్యాయంలో ప్రవక్త ఇబ్రాహీమ్‌, ప్రవక్త ఇస్హాక్‌, ప్రవక్త యాఖూబ్‌ల (అ) ప్రస్తావన తర్వాత ఇలా అనబడింది: ”మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించడానికి మేము వారిని అధినాయకులుగా తీర్దిదిద్దాము. పుణ్య కార్యాలు చేస్తూ ఉం డాలనీ, నమాజులు స్థాపిస్తూ ఉండాలనీ, జకాత్‌ చెల్లిస్తూ ఉండాలనీ మేము వారికి తాకీదు చేశాము”. (అన్బియా: 73)

అలాగే మర్యమ్‌ సూరాలో ప్రవక్త ఇస్మాయీల్‌ గురించి ఇలా అన బడింది: ”అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాతు గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియ తముడు”. (55)
అదేలాగు ప్రవక్త ఈసా (అ) గురించి ఇలా చెప్పబడింది: ”నేను అల్లాహ్‌ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవం తునిగా చేశాడు. జీవితాంతం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు”. (మర్యం: 30,31)

అల్లాహ్‌ అనుగ్రహానికి అమల సాధనం జకాత్‌:

”మరియు నా కారుణ్యం సమస్త వస్తువులను ఆవరించి ఉంది. నేను దాన్ని భయభక్తులు అవలంబిస్తూ, జకాతు చెల్లిస్తూ, మా ఆయతులను విశ్వసించే వారి పేర తప్పకుండా వ్రాస్తాను”. (ఆరాఫ్‌: 156)

విశ్వాసపు అవిభాజ్యాంశం జకాత్‌:

”విశ్వాసులైన పురుషులు, విశ్వాసు లైన స్త్రీలూ-వారంతా ఒండొకరికి మిత్రులుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌ాకు ఆయన ప్రవక్తకు విధేయులయి ఉంటారు. అల్లాహ్‌ా అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే”. (తౌబా: 71)

ఇహపర విజయానికి సోపానం జకాత్‌:

”వారు గోప్యమయిన విషయాలను విశ్వసిస్తారు. నమాజను నెలకొల్పు తారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు పెడతారు.. ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి సన్మార్గాన ఉన్నవారు. సాఫల్యాన్ని పొందే వారు వీరే”. (బఖరా: 3-5)
ఇందులో విశ్వసించిన వారి సత్పరిణామం సూచించబడింది. వారు విశ్వసించిన మీదట గోళ్లు గిల్లుకుంటూ, దిక్కు చూస్తూ కూర్చోరు. నిత్యం సదాచరణలు చేస్తూ ఉంటారు. అల్లాహ్‌కు భయపడుతూ జీవి స్తారు. విశ్వాస సంస్కరణ పట్ల సదా శ్రద్ధ వహిస్తారు. జకాతును విధి గా చెల్లిస్తారు.

స్వర్గ శిఖర అధిరోహణకు సాధనం జకాత్‌: ”నిశ్చయంగా విశ్వాసులు సఫలీకృతులయ్యారు. వారు ఎలాంటి వారంటే తమ నమాజులలో వారు ఏకాగ్రత, అణకువ కలిగి ఉంటారు. వారు పనికిమాలిన వాటి జోలికి పోరు. వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు….ఇలాంటి వారి వారసత్వమే అసలు వారసత్వం. వారు (స్వర్గపు శిఖర భాగమయిన) ఫిర్‌దౌస్‌ ప్రదేశానికి వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు”. (మోమినూన్‌: 1-11)

సమృద్ధికి, శుభానికి సంకేతం జకాత్‌:

”అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలుంటాయి. ఇదే విధంగా అల్లాహ్‌ా తాను తలచినవారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్‌ా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసిన వాడు”. (బఖరా: 261)

దైవదూతల దీవెనలు పొందే మార్గం జకాత్‌: ‘ప్రతీ రోజు ఇద్దరు దైవ దూతలు దిగి వస్తారు. వారిలో ఒక దూత, ”ఓ అల్లాహ్‌! ఖర్చు పెట్టే వాడిని మరింత ఎక్కు ప్రసాదించు” అని దీవిస్తే, మరో దైవదూత, ”ఓ అల్లాహ్‌! కూడబెట్టుకునే వాడి సంపదను నాశనం చెయ్యి” అని అభి శపిస్తాడు’ అన్నారు ప్రవక్త (స). (మత్తపఖున్‌ అలైహి) ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”అల్లాహ్‌ మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి (సంపూర్ణ) ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఆయన అందరికన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత”. (సబా;39)
ఆర్థిక అభయం జకాత్‌: అల్లాహ్‌ా హదీసె ఖుద్సీలో ఇలా సెలవిచ్చాడు: ”ఓ ఆదం పుత్రుడా! ఖర్చు చెయ్యి. నీపై ఖర్చు చేయబడుతుంది”. (బుఖారీ)

నష్ట రహిత వ్యాపారం జకాత్‌:

”నిశ్చయంగా ఎవరయితే అల్లాహ్‌ా గ్రంథాన్ని పఠిస్తూ, నమాజును నెలకొల్పుతూ, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేస్తారో వారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు. వారికి వారి ప్రతిఫ లాలు (అల్లాహ్‌ా) పూర్తిగా ఇవ్వడానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించడానికిగానూ. నిశ్చయంగా అల్లాహ్‌ా అమితంగా క్షమించేవాడు, అపారంగా సన్మానించేవాడు”. (ఫాతిర్‌: 29)

జకాత్‌ ప్రయోజనాలు:

అల్లాహ్‌ా ధనికులయిన ముస్లింలపై విధిగావించిన జకాత్‌ను పూర్తి చిత్తశుద్ధితో చెల్లించడం వల్ల మూడు ప్రయోజనాలు కలుగుతాయి. 1) దైవ దాసుడు – అల్లాహ్‌ ప్రసన్నతను, ఆయన కారుణ్యాన్ని, ఆయన సామిప్యతను పొందడానికి ఏ విధంగానయితే నమాజులో నిలబడి, మోకరిల్లి, సాష్టాంగ పడి ఆయన సన్నిధానంలో తన దాస్య భావాన్ని, నిస్సహాయతను తన దేహం ద్వారా, ఆత్మ ద్వారా, వాక్కు ద్వారా వ్యక్త పరుస్తాడో, అదే విధంగా తను అల్లాహ్‌ా సన్నిధిలో తన ధనానికి సంబంధించిన నజరానాను జకాత్‌ రూపంలో చెల్లంచుకుని తనదనుకు న్నదేదీ తనది కాదని, అది కేవలం దైవ ప్రసాదితమేనని అతి వినయంగా చాటుకుంటాడు. అదే నమ్మకం, వినయంతో తన ధనాన్ని దైవమార్గంలో దైవం చెప్పిన రీతిలో త్యాగం చేసి ధన్యుడవుతాడు. అలా అతని ఆ ధనం కూడా పుణ్యార్జన సాధనంగా, ఆరాధనగా పరిగణించ బడుతుంది.
2) జకాత్‌లో దాగిన మరో ప్రయోజనం ఏమిటంటే, దీని ద్వారా అగత్యపరులు, అవసరార్థులు, బాధల్లో ఉన్న దైవ దాసులకు సహాయం అందుతుంది.
3) జకాత్‌ వల్ల ‘ధన వ్యామోహం’ నుండి కాపాడ బడతాడు మనిషి. దాని దుష్ప్రభావం నుండి జకాత్‌ మనిషి మనసును పరిశుద్ధ పరు స్తుంది. మానసిక స్వస్థతను కలుగజేస్తుంది. దైవప్రవక్త (స) తన సహ చరులతో ఇలా ప్రశ్నించారు: ”నీళ్ళల్లో నడిచే వ్యక్తి కాళ్ళు తడవకుండా ఉంటాయా?”. దైవప్రవక్తా! ‘తడవకుండా ఎలా ఉంటాయి?’ అన్నారు సహాబా. ”అవును! అదే విధంగా ఐహిక వ్యామోహపరుడు కూడా పాపాల నుండి సురిక్షితంగా ఉండలేడు” అన్నారు.
మరో సందర్భంలో ఆయన ఇలా సెలవిచ్చారు: ”అత్యాశ పరలోకాన్ని విస్మరింపజేస్తుంది. ఈ ప్రపపంచం నిరాటంకంగా ముందుకు దూసు కుపోతున్నది. అటు వైపు నుంచి పరలోకం వేగవంతంగా ఎదురొస్తు న్నది. ఈ రెండింటికీ వాటి వాటి సంతానం ఉంది. కనుక ప్రజలారా! ప్రపంచాన్నే అంటిపెట్టుకుని దాని సంతానంగా మారకండి”. (బైహఖీ)

దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”ఎవరయితే ఒక ఖర్జూరం అంతటి దాన్ని ధర్మసమ్మతమయిన సంపదలోంచి ఖర్చు చేశాడో అల్లాహ్‌ దాన్ని తన కుడి హస్తంతో (ఆయన రెండు హస్తాలు కుడే) స్వీకరించి వృద్ధి పరుస్తాడు. చివరకు అది మహా పర్వతమంతటిదయి పోతుంది”. (బుఖారీ) వేరొక ఉల్లేఖనంలో – ”ప్రతి వ్యక్తి అతని సద్ఖా నీడలో ఉంటాడు, ప్రజల మధ్య ప్రళయ దినాన తీర్పు ఇచ్చేంత వరకు” అని ఉంది. (తబ్రానీ)

జకాత్‌ నిరాకరణ నష్టాలు:

ఎవరయితే దైవమార్గంలో ఇచ్చాడో (తన ప్రభువుకు) భయపడుతున్నాడో, ఇంకా సత్పరిణామాన్బి సత్యమని ధృవ పర్చాడో అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వొసగుతాము. మరెవరయితే పిసినారిగా తయారయ్యాడో, నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిం చాడో, సత్పరిణామాన్ని త్రోసి పుచ్చాడో అతనికి మేము కఠిన (దుర్‌) మార్గపు సామగ్రిని సమకూరుస్తాము”. (లైల్‌: 5-10)

”మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చ రించాను. దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు. వాడు ధిక్కరించాడు. (జకాత్‌ విధి నుండి) ముఖం త్రిప్పుకున్నాడు. అయితే దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు. ఎందు కంటే, అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు”. (లైల్‌: 14-18)

”ఎవరు వెండీ బంగారాలను పోగు చేస్తూ వాటిని అల్లాహ్‌ా మార్గంలో ఖర్చు పెట్టలేదో వారికి బాధాకరమయిన శిక్ష ఉందన్న శుభవార్త విని పించు. ఏ రోజున ఈ ఖజానా నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటి పై, పార్శ్యాలపై, వీపులపై వాత వేయడం జరుగుతుందో అప్పుడు. ”ఇదీ మీరు మీ కోసం సమీకరించుకున్నది. కాబట్టి మీ ఖజానా రుచి చూడండి” అని వారితో అనబడుతుంది. (తౌబా: 34,35)

కలుపుమొక్కల వల్ల పంటకు నష్టమే: దైవప్రవక్త (స) ఇలా ఉపదేశిం చారు: ”ఏ సంపదలోనయితే జకాతు (సద్ఖా) ఎప్పుడు ఎక్కడ కలపబడి నా (అంటే జకాతు చెల్లించకుండా ఏ సంపదయితే ఉంటుందో) అది దాన్ని నశింపజేస్తుంది”. (బుఖారీ)

జకాత్‌ టాక్స్‌ కాదు:

జకాత్‌ ప్రభుత్వాలు విధించే టాక్సు వంటిది కాదు ఒకప్పుడు తగ్గి మరో సమయంలో పెంచడానికి. అది మానవాళి మధ్య అల్లాహ్‌ా ఆర్థిక న్యాయం నిమిత్తం ఖరారు చేసిన విధానం. దాని హక్కు దారుల్ని సయితం ఆయనే నిర్ణయించాడు. వారు-”జకాతు (దానాలు) కేవలం నిరుపేదల కొరకు, అభాగ్య జీవుల కొరకు, వాటి వసూళ్ల కోసం నియమితులైన వారి కొరకు, హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారి కొరకు, మెడలను విడిపించడానికీ, రుణగ్రస్తుల కొరకూ, దైవమార్గం కొరకూ, బాటసారుల కొరకూ వెచ్చించాలి. ఇది అల్లాహ్‌ా తరఫున నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్‌ా మహా జ్ఞాని, మహా వివేకి”. (తౌబా: 60)
దైవప్రవక్త (స) అన్నారు: ”జకాత్‌ వారి ధనికుల నుండి తీసుకోబడు తుంది. వారి నిరుపేదల్లో పంపిణీ చేయబడుతుంది”.

జకాత్‌ మరియు వడ్డీ:

”అల్లాహ్‌ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు”. (బఖరా: 276)
అల్లాహ్‌కు దాసుడు ఇచ్చుకునే రుణం జకాత్‌: ”ఎవరు అల్లాహ్‌కు శ్రేష్ఠ రుణం ఇస్తారో అల్లాహ్‌ వారి ఇబ్బడి ముబ్బడిగా చేసి దాన్ని తిరిగి ప్రసాదిస్తాడు”. (బఖరా:245)

మేలును ఆశించే అందరూ విధిగా చెల్లించాల్సిన విధి జకాత్‌:

”అత్యంత ప్రీతికరమయిన వస్తువులను అల్లాహ్‌ మార్గంలో ఖర్చు పెట్ట నంత వరకూ మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు”.(ఆల్‌ ఇమ్రాన్‌:92)

దారిద్య్ర భయం వద్దు:

”షైతాన్‌ మీకు దారిద్య్రం గురించ భయ పెడతాడు. నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు. కానీ, అల్లాహ్‌ మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్‌ గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు”. (బఖరా:268 )

Related Post