ఆది దంపతులయిన ఆదమ్ మరియు హవ్వా (అ) స్వర్గ బహిష్కరణకు కారణం – వారు తమ స్వయంపై చేసుకున్న దౌర్జన్యం. ఖాబీల్ దైవ అభిశాపానికి గురవ్వడానికి కారణం – తాను తన సోదరుడయిన హాబీల్పై చేసిన దౌర్జన్యం. నూహ్ (అ) వారి జాతి జల ప్రళయానికి గురవ్వడానికి కారణం – మానవ చరిత్రలో మొది సారి అల్లాహ్ విషయంలో వారు పాల్పడిన షిర్క్ – దౌర్జన్యం. నమ్రూద్ చావు ఒక చిన్నపాటి దోమ వల్ల జరగడానికి కారణం – సత్య నిరాకరణతో పాటు, తాను ప్రవక్త ఇబ్రాహీమ్ (అ)పై జరిపిన దౌర్హన్యం. నియంత ఫిరౌన్ నశించడానికి కారణం – తానే దైవం అన్న అహంకారంతోపాటు ఇస్రాయీల్ ప్రజలపై చేసిన దౌర్జన్యం. ఖారూన్ వినాశనానికి కారణం – ధనం ఉందన్న అహంతో సామాన్య జనంపై చేసిన దౌర్జన్యం. ఆద్ మరియు సమూద్ జాతులు అంతమవ్వడానికి కారణం – దౌర్జన్యం, అబూ జహల్, అబూ లహబ్ విం వారు నశించడానికి కారణం – దౌర్జన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే దౌర్జన్యం చేసేవారు ప్రతి కాలంలోనూ బలం, అధికారం, పేరు-పలుకుబడి గలవారే. అయినా వారికి ప్టిన గతి మాత్రం దుర్గతే. ఇదే దైవ నియమం. ‘న్యాయ పరిపాలన అది అవిశ్వాసులదయినా దేవుని అండదండలు దానుకుంటాయి. దౌర్జన్య పాలన అది ముస్లిములదయినా దానికి దేవుని సహాయ సహకారాలు ఉండవు’ అని ఇమామ్ ఇబ్ను తైమియా (రహ్మ) చెప్పిన మాటలోని ఆంతర్యం ఇదేనేమో!.
”దౌర్జన్యం చెయ్యడం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నిశ్చయంగా నేటి దౌర్జన్యం రేపి ప్రళయ భయంకర చీకట్లుగా మారుతుంది”. (బుఖారీ)
”ఎన్నో పట్టణాలను మేము తుడిచి పెట్టేశాము. ఎందుకంటే అవి దుర్మార్గానికి, దౌర్జన్యానికి ఒడిగ్టాయి. అవి తమ కప్పులపై తల క్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు పాడు పడి ఉన్నాయి. మరెన్నోపటిష్టమయిన ఎత్తయిన కోటలు నిర్మానుష్యంగా ఉన్నాయి”. (అల్ హజ్జ్: 45)
న్యాయం వల్ల నిర్మాణం జరిగితే, దౌర్జన్యం వల్ల విచ్ఛిన్నం చోటు చేసుకుంటుంది. పై ఆయతులో ఇదే విషయం విశద పర్చడం జరిగింది. అరబీలో దౌర్జన్యాన్ని ‘జుల్మ్; అంటారు. భాషా పరంగా ‘జుల్మ్’ అంటే, ‘ఒక వస్తువును దాని చోటు కాని చోట పెట్టడం, షరీయతు గీసిన సరిహద్దు రేఖను దాటడం’అన్నారు కఫవీ (రహ్మ). ‘సమస్త వ్యవహారాల్లో మధ్యే మార్గం నుండి వైదొలగడం, ఒకరి హక్కు విషయంలో ఎక్కువ, తక్కువ చేయడం, ఒకరి సొమ్మును అన్యాయంగా కాజేయడం జుల్మ్’ అన్నారు ఇమామ్ జాహిజ్ (రహ్మ).
దౌర్జన్య స్థాయి:
అ) దౌర్జన్యం చెయ్యడంలో మితిమీరిపోయి సత్యానికి దూరంగా జీవించే వ్యక్తి సత్యం వైపు మరలి రావడం బహు కష్టం. ఆ) దౌర్జన్యానికి వీలయినంత వరకూ దూరంగా ఉంటూ సత్యానికి దగ్గరగా ఉండే వ్యక్తి మానవ దౌర్భల్య కారణంగా ఒకవేళ దౌర్జన్యానికి పాల్పడినా కనువిప్పు కలిగి సత్యం వైపునకు మరలడం అతి సులభం.
దౌర్జన్య రకాలు:
1) దాసునికి మరియు దైవానికి మధ్య చోటు చేసుకునే దౌర్జన్యం: ఈ రకపు దౌర్జన్యంలో ఘోరమయినది, దైవాగ్రహాని కి గురి చేసేది-తిరస్కారం (కుఫ్ర్), నాస్తికత్వం (ఇల్హాద్), బహుదైవ భావన (షిర్క్), కాపట్యం (నిఫాఖ్). అల్లాహ్ ఇలా అన్నాడు:
”అల్లాహ్కు అబద్ధాన్ని అంట గట్టేవాడికన్నా పరమ దుర్మార్గుడు ఎవ డుాండు? ఇలాిం వారంతా తమ ప్రభువు సమక్షంలో హాజరు పరచ బడతారు.”తమ ప్రభువుపై అసత్యాలు కల్పించినవారు వీళ్ళే” అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి! (అలాిం) దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుతుంది”. (హూద్: 18)
2) దాసునికి సృష్టిరాసులకు మధ్య చోటు చేసుకునే దౌర్జన్యం: ”అప కారానికి బదులు అటువిం అపకారామే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు”. (షూరా: 40)
”ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టే, అకారణంగా,సత్యరహితంగా భువిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే (నిందార్హులుగా నిలబెట్టే) మార్గ ముంటుంది. అలాంటి వారి కోసం బాధాకరమయిన శిక్ష ఉంది”. (షూరా: 42)
3) దాసునికి అతని స్వయానికి మధ్య చోటు చేసుకునే దౌర్జన్యం: ”మరి వారిలో కొందరు తమ ఆత్మలపై దౌర్జన్యానికి ఒడిగడుతున్నారు”. (ఫాతిర్: 32)
పై పేర్కొనబడిన మూడు రకాల దౌర్జన్యాలు వాస్తవంగా వ్యక్తి తన స్వయంపై చేసుకునే దౌర్జన్యంగానే ఉంాయి. ఎందుకంటే ఏ దౌర్జన్యా నికయినా పడే శిక్షను అనుభవించాల్సింది వ్యక్తి అయిన తనే గనక.
దౌర్జన్య పరుల రకాలు:
1) అగ్ర శ్రేణి దుర్మార్గుడు: దుర్మార్గుల్లో, దౌర్జన్యపరుల్లో పరమ దుర్మా ర్గుడు నిజ ఆరాధ్యుడయిన అల్లహ్ శాసన పరిధిలోకి రావడానికి ఒప్పుకోని వాడు.”లుఖ్మాన్ తన కుమారినికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: ‘ఓ నా కుమారా! అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించకు, నిస్సందేహంగా అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించడం (షిర్క్ చేయడం) ఘోరమయిన దౌర్జన్యం”. (లుఖ్మాన్: 13)
2) మధ్య స్థాయి దౌర్జన్యపరుడు: ప్రభుత్వంగానీ, రాజుగానీ షరీయతు పరిధిలో ప్రజా జీవన సౌలభ్యం కోసం చేసిన చ్టాన్ని గౌరవించని, పాటించని వాడు. ”ఓ విశ్వాసులారా! అల్లాహ్కు విధేయత చూపండి. మరియు ప్రవక్త (స)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా విధేయత చూపండి. ఆపైన ఏదేని విషయంలో మీ మధ్య వివా దం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త (స) వైపునకు మరల్చండి – మీకు నిజంగా అల్లాహ్పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయడం అవశ్యం)! ఇదే మేలయిన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింకంటే ఉత్తమమైనది”. (అన్నిసా: 59)
3) మైనర్ స్థాయి దౌర్జన్యపరుడు: తన స్వయానికి మేలు చేసే పనుల్ని సయితం వదిలేసి కాలయాపన చేసేవాడు. ప్రజా సంబంధాల విషయం లోగానీ, స్వయం విషయంలోగానీ మధ్యేమార్గ రేఖను దాటేవాడు. ఉత్తమ నడవడికను అలవర్చుకోని వాడు. తనలోని అవలక్షణాలను దూరం చేసు కోలేని వాడు. నిర్ణయాత్మక ఆలోచనకు, నిర్మాణాత్మక పనులకు శ్రీకారం చుట్టని వాడు.