Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

భిన్నత్వంలో ఏకత్వం

ఎంత గొప్పదీ ఆత్మావలోకనం! ఎంత చక్కనయినదీ స్వయం పరిశీ లనం!! పత్రి ఒక్కరూ ఆత్మావలోకనం చేసుకోవాలని ఆ పరమోన్నత పభ్రువే పిలుపునివ్వడం ఆత్మావలోకన విశిష్ఠతను తెలియ జేస్తుంది: ”పత్రి పాణ్రీ రేపటి కోసం తానేం చేసి పంపుకుందో ఆత్మావలోకనం చేసుకోవాలి”. (దివ్యఖుర్‌ఆన్‌-59:18)

భిన్నత్వంలో ఏకత్వం

నిరక్షరాస్యత సమస్యను అధిగమించిన మనం నిరుద్యోగ సమస్యను సయితం అధిమించాలి. శాంతి పతాకం ప్రపంచమంతా రెపరెపలాడాలని కోరుకునేవారిలో మనం తొలివారం అవ్వాలి.

భారత దేశ పౌరులమైన మనము మనకు మనంగా రాజ్యంగానికి సమ ర్పించుకుని 67 యేండ్లు పూర్తయ్యాయి. 68వ గణతంత్ర దిన సంబరాలు ఘనంగా జరుపుకు న్నాము. దేశం బంగరు నేలయితే అందులో సేద్యం చేసే రైతు భారతీయుడు. ఒకనాి భారతం నేటి ఆధునిక భారతంగా రూపొందడానికి రైతు కృషికే అగ్రతాంబూలం. సహజ సిద్ధంగానే పుష్కలమయిన ప్రకృతి ఒనరులతో నిండిన భరత భూమిని ప్రేమగా మన పెద్దలు ‘బంగరు చిలుక’ అని పిలిచేవారు. హిందూ, ముస్లిం, సిక్కు,- అందరూ భాయీ భాయిగా, భాగ్య జీవితానికి బంగారు బాట వేసుకుంటున్న సువర్ణ దశలో ఈస్ట్‌ ఇండియా కంపెని (తెల్ల్లదొరల) డేగ కళ్ళు మన దేశం, దాని అపార సంపదల మీద పడ్డాయి. అప్పటి నుండి మొదలయిన ‘విభజించి పాలించు’ అన్న సూత్రం, మనం సంపూర్ణ స్వరాజ్యన్ని సంపాదించుకుని 67 యేడ్లు గడిచినా ఇంకా మన మధ్యన ఉంది. తెల్ల తోలు తొలిగింది. కానీ, నల్ల తేలు మాత్రం కుడుతూనే ఉంది. సామాజిక అణచివేత, అంటరానితనం, వర్గ, మత, ప్రాంతీయ దురభిమానం నేటికీ జడలు విప్పు తూనే ఉంది. కార్మికులు, కర్షకులపై కార్పోరెట్ ఉక్కుపాదం విషం కక్కుతూనే ఉంది. మహిళా సాధికారత సయితం ఇంకా అందని దాక్ష్ర గానే ఉంది.ఆ కల నెరవేరే మహోజ్వల ఉదయం ఖచ్చితంగా ఒక గణతంత్ర దినోత్సవం నాడు వచ్చి తీరుతుంది-సందేహం లేదు. కానీ, ఆ పర్వ దినం, ఆ ఉజ్వల ఘడియ కోసం ఇంకెన్ని గణతంత్ర దినాలు పడతాయి? అన్నదే ప్రశ్న.

”లక్ష నక్షత్రాలు రాలందే/ ఉజ్వల ఉదయం ప్రభవించదు/ కోటి స్వ గతాలు పోరాడనిదే/ ఉన్నత సమాజం ఆవిర్భవించదు”

అని కవి జ్వాలముఖి అన్నట్లు ఉన్నత సమాజం ఆవిష్కరించ బడాలంటే మన మందరం కలిసికట్టుగా అహరహరం పరిశ్రమించాల్సి ఉంది. మన ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంది. అగ్గిపెట్టె కోసం కూడా పరాయి దేశం మీద ఆధార పడే స్థితి నుండి అణు శక్తిని ఛేదించ గలిగే స్థాయికి చేరుకున్న మనం,మన ముంగిల్లో మానవత్వపు మందారాల తోటల్ని పెంచాలి. అణా కాసుల కోసం అన్యుల యెదుట చేయి చాచే స్థితి నుంచి అగ్రజార్యాలకే నిపుణుల్ని అందజేసే స్థాయికి చేరుకున్న మనం, అడుగు దూరమంతలో ఉన్న ఆప్తుల మంచీచెబ్బర లను సయితం గమనించాలి, పంట కోసం అనేక రకమయిన విత్తనా లను అన్య దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితి నుండి అంతర్జా తీయ స్థాయిలో మన మార్క్‌ట్ను వీస్తీర్ణ పరచుకునే స్థాయికి చేరు కున్న మనం-రైతు కంట కన్నీరుని తుడవ గలగాలి. పేర్వారం జగ న్నాథం కవిత్వీకరించినట్టుగా-

”మానవతను మట్టిలో పారేసి/ మంచి తనాన్ని మరు భూమిలో పాతేసి/ అభ్యుదయం తెస్తామనడం/ ఆకా శాన్ని కోస్తామనడం/ ప్రజా వంచనకు మెత్తని మార్గం/ వాన లేకుండా వట్టి పిడుగులు రాలడం”.

భారత గణతంత్రానికి 67 యేండ్లు అనేది దేశ చరిత్రలో తొలి అడగులే! ఆ తొలి అడుగుతోనే తనదయిన ముద్రను వేసుకున్న దేశం మనది. నిరక్షరాస్యత సమస్యను అధిగమించిన మనం నిరుద్యోగ సమస్యను సయితం అధిమించాలి. శాంతి పతాకం ప్రపంచమంతా రెపరెపలాడాలని కోరుకునేవారిలో మనం తొలివారం అవ్వాలి.

ప్రకృతి నిండా నిత్యం దర్శనమిచ్చే వైవిధ్యమే దానికి అందం. దాన్ని రూపు మాపడం అంటే ప్రకృతిని అంతమొందించడమే. అలాగే భారత దేశానికి అందం ఇక్కడి భిన్నత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రయత్నిం చాల్సింది పోయి అన్నింని ఒకే గదిలో నిర్భంధించా లంటే అది దేశ పతనమేగానీ ప్రగతి ఎంత మాత్రం కాజాలదు.

మనకు మన స్వరాజ్యం, స్వరాష్ట్రం, స్వప్రాంతం, స్వకుటుంబం పట్ల అభిమానం ఉంటుంది, ఉండాలి కూడా. దాంతోపాటే ‘జగమంత కుటుంబం నాది’ అన్న సాత్విక భావన మనలో ఉండాలి. మనిషి భవి ష్యత్తు పట్ల అచంచల విశ్వాసం, సమర రహిత సమాజ నిర్మాణ సంక ల్పం, కారుణ్య దృష్టి, స్నేహ, సౌహాద్రత, కుల-గోత్ర, వర్గ-వర్ణ, మత-ప్రాంత విభేధాలకు అతీతమయిన మానవ ప్రేమ పద్మం సత్య కాంతి వెలుగులో రెక్కలు విప్పాలి. అదే సౌమనస్యానికి ఆయువు పట్టు, వైమనస్యానికి చెంప పెట్టు, అసాంఘీక శక్తులు, నేలబారు స్వభావుల పాలిట గొడ్డలపెట్టు!

శవ రాజకీయాలు ముగియక ముందే శ్మశాన రాజకీయాలు మొదలయి ఒకింత విజయవంతమైన తరుణంలో, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ‘జన హితమే ధర్మం’ అని నమ్మే ముస్లిం రథసారధులకు చేసుకుంటున్న మనవి-ఈనాడు మనం మన యువతను ప్రక్క తోవ్రలు పోకుండా, వికృత నినాదాలకు పభ్రావితం కాకుండా కాపాడుకోవాల్సిన అవస రం ఎంతయినా ఉంది.పరాయి సిద్ధాంతాలకు, ప్రక్క దేశాల కవ్వింపు చర్యలకు మన యువతను మనం దూరంగా ఉంచాలి. అదే సమ యంలో పండిత వర్గం సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంది.

‘ఫతహ్‌ కా ఫత్వా’ పైత్యాలు, యోగి, సాధ్వీ, గిరిరాజ్‌ల అనుచిత వ్యాఖ్యలు వస్తాయి పోతాయి. మనం మాత్రం వారి చదరంగంలో పావులం కాకూడదు. పప్రంచంలో పశ్రాంతంగా జీవితం గుడుతున్న ఉత్తమ పౌరులు భారతీయులు అని నిరూపించుకోవాలి. పూరి గుడి సెలు గల ఊరిలో ఒక గుడిసెకు నిప్పంటుకుంటే ఊరి జనమంతా ఆ మంటల్ని ఆర్పే పయ్రత్నం చేసినట్లే- మనమందరం మత చిచ్చును, రాజకీయ రొచ్చును నిర్మూలించే పయ్రత్నం చేసి, ఆజ్యం పోసేవారి సంఖ్యను పూజ్యం చెయ్యాలి!!

Related Post