యుద్ధ పిపాసకు ముగింపు ఏది?

Originally posted 2016-10-18 20:11:09.

ఒక దేశంలో జనాభాలో 30 నుండి 40 శాతం వరకు ”యుద్ధ వయస్కులు” ఉన్న ప్పుడు, వారికి ఉద్యోగాలు న్యాయబద్ధంగా లభించనప్పుడు ఈ సమస్య మరింత తీవత్రరమవుతుంది అక్కడి పజ్ర హింసాత్మకమయిన చర్యల వైపు మళ్లుతుంది.

ఒక దేశంలో జనాభాలో 30 నుండి 40 శాతం వరకు ”యుద్ధ వయస్కులు” ఉన్న ప్పుడు, వారికి ఉద్యోగాలు న్యాయబద్ధంగా లభించనప్పుడు ఈ సమస్య మరింత తీవత్రరమవుతుంది అక్కడి పజ్ర హింసాత్మకమయిన చర్యల వైపు మళ్లుతుంది.

”వాస్తవం ఏమిటంటే, మానవుడు అందరికన్నా ఎక్కువగా జగడాలమారి”. (దివ్యఖుర్‌ఆన్‌-18: 52)
మానవుడు స్వభావం సిద్ధంగా తగువులాడుకునే తత్వం కలిగి ఊంటాడు. మానవుడు పేచీకి పెదబాబు లాంటి వాడు. పద్దాక పిడివాదానికి దిగుతాడు. ఈ హింసాత్మక మానసిక స్థితిని అదుపులో ఉంచుకని కారణంగానే మానవ చరిత్రలో యుద్ధాలు చోటు చేసుకున్నాయి. అతను తనలోని అశాంతిని ‘ఇష్టం, ద్వేషం’ అనే రెండు భాగాల్లో విభజించుకుంటాడు. దీనికితోడు తను నమ్మిన సిద్ధాంతం, కనుగొన్న మార్గం ధర్మబద్ధమైనదిగా భావిస్తాడు. పోరాడితే ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందని గట్టి నమ్మకం కూడా కలిగి ఉంటాడు. తాను అనుకన్న సత్యం గెలుస్తుందన్న ధీమా, ఓవర్‌ కాల్ఫిడెన్స్‌ వల్ల మానవ సమాజాన్ని ముక్కలుచెక్కలు చేస్తాడు. మనుషుల్ని విభిన్న ముఠాలుగా చీలుస్తాడు. తర్వాత చోటు చేసుకునే విపరిణామం గురించి ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: ”పత్రి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది”. (దువ్యఖుర్‌ఆన్‌-30: 32)
అంటే మానవునికి మాధవుడు పస్రాదించిన జీవన విధానాన్ని విడనాడి సొంత ఆలోచనలకు, సొంత సిద్ధాంతాలకు పాల్పడిన ప్పుడు ఈ స్థితి ఏర్పడుతుంది. అలా సత్యం ఒకటిగానే విరాజిల్లినా, అసత్యాలు, అధర్మాలు రాజ్యమేలుతాయి. ‘రంగు, వర్ణ, వర్గ, భాష వ్యత్యాసాలు దేవుని సృష్టి సూచనలు’ అని గహ్రిం చని మానవడు – స్వలాభ పేక్షకు పోయి తాను చేసే పోరాటం వల్ల అయ్యే నష్టంకన్నా దాని వలన వచ్చే ప్రయోజనాలే ఎక్కువని భావిస్తాడు. అతను కోరుకునే ఆ ప్రయోజనాలు ఒక్కోసారి మౌలిక ఒనరులకు పరిమితమయితే ,ఒక్కోమారు వంశం, ప్రాంతం, భాష, జాతి, దేశం వరకు విస్తరించి ఉంాయి. అంటే పరాయి వంశం, భాష, పాంతం, జాతి, దేశాలు ఏమయినా పర్వాలేదు కాని; తన వంశం, పాంతం, భాష, జాతి, దేశం లాభాల బాటన పయనించాలని కోరుకోవడం మనిషి పోరానికై పేర్రణగా నిలుస్తుంది. అంతితో అతని ఈ పోరాటం ఆగదు. అధికార కాంక్ష, నాయకత్వ ప్రీతి అతనిలో తిష్ట వేస్తుంది. అది మనిషిని జంతువులకన్నా హీనుడిగా తయారు చేస్తుంది.
‘విశ్వంలో గల సకల చరాచరాల పోషణ భారం అల్లాహ్‌ మీద ఉంటుంది’ అన్న యదార్థాన్ని గహ్రించని మానవుడు తన ప్రదేశం జనాభా పెరిగినకొద్దీ అక్కడి ఒనరుల్లో కొరత ఏర్పడుతుందేమోనని భయ పడతాడు. అందు వల్ల పొరుగు దేశాల, ప్రాంతాల తాల ఒనరులపై ఆధిపత్యం సంపాదించడానికి యుద్ధాన్ని మహాస్త్రంగా తలపోస్తాడు. మనిషిలోని ఈ పశు ప్రవృత్తి – పొరుగు పాంతాల, దేశాల పజ్రల మీద విష పూరిత ప్రయోగాలకు సిద్ధమయ్యేలా చేస్తుంది. అంటు వ్యాధులు, కరువు, అంతర్గత కలహాలను సృష్టించటం ద్వారా అక్కడ జనాభా తగ్గించి వారి వాకు సంబంధించిన ఒనరులు తన ఒడిలో వచ్చి వాలతాయని కుయుక్తులు పన్నుతాడు. కుమతులతో చేతులు కలుపుతాడు.

అదే విధంగా ఒక దేశంలో జనాభాలో 30 నుండి 40 శాతం వరకు ”యుద్ధ వయస్కులు” ఉన్న ప్పుడు, వారికి ఉద్యోగాలు న్యాయబద్ధంగా లభించనప్పుడు ఈ సమస్య మరింత తీవత్రరమవుతుంది అక్కడి పజ్ర హింసాత్మకమయిన చర్యల వైపు మళ్లుతుంది. సాంప్రాదాయేతర లైంగిక సంబంధాల వైపు ఆకర్షితులవుతారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని యుద్ద పణ్రాళికను తయారు చేసుకుాంరు అవకశవాదులు. తమకు పోటీగా లేదా అవరోధంగా ఉన్న వర్గాలను నాశనం చేయాలనే కొందరి బోధన లను పాటించడానికి ఉద్యుక్తులవుతారు. పజ్రల్లో నెలకొని ఉన్న మానసిక పరిస్థితుల కారణంగా, వారి భవిష్యత్తుకు ఏర్పడిన ముప్పును వారు అర్థం చేసుకునే విధానాల కారణంగా యుద్ధాలు చోటు చేసుకుం టాయి. ఇట్టి స్థితిలో ఇరు వర్గాలు ఎదుటి వర్గాన్ని దుష్ట స్వభావులుగా, మానవ మృగాలుగా, మౌఢ్యులు గా, ఉగవ్రాదులుగా, ఉన్మాదులుగా భావిస్తారు, పచ్రాచరం చేస్తారు. తాము చేస్తున్నది ముమ్మాటికీ హేతు బద్ధ మయినదని నమ్మ బలకడానికి విఫల పయ్రత్నం చేస్తారు. ఈ ససందర్భంగా ఆమెరికాలో అత్యున్నత స్థాయి మిలటరీ పురస్కారాలు పొందిన మేజర్‌ జనరల్‌ స్మెడ్లీ బట్లర్‌ చెప్పిన మాట గమనార్హం – ”నేను మిలటరీలో గడిపిన 33 సంవత్సరాలూ బడా వ్యాపారులకు హై క్లాసు గుండాగా గడిపినట్లే, క్లుప్తంగా చెప్పాలంటే నేను పెట్టుబడిదారుల గ్యాంగులో గడిపాను”. అంటే పస్త్రుత యుద్ధాలు పెట్టుబడి దారి వ్యవస్థలో అంతర్గతమైన ఒక సాధనం.

పోతే, యుద్ధాలలో అనాదిగా వస్తున్న ఆయుధాలకు తోడుగా నేటి ఆధునికంలో సాంకేతిక విషయాల పాధ్రాన్యత పెరిగింది. అణ్వస్తాల్రు, రసాయనిక ఆయుధాలు వింవి కొత్త సమస్యలకు దారి తీస్తున్నాయి. ప్రస్తుత కాలంలో యుద్ధాలు అనైతికమైన చర్య, అమానుషమయిన చర్యలన్న అభిప్రాయం బలపడటం మనం గమనించవచ్చు. మరోవైపు దేశ, జాతి రక్షణ కోసం యుద్ధం చేయకపోయినా ప్రతిదాడిగా, ఆత్మ రక్షణ పోరాటంగా పత్రి దేశం యుద్ధానికి సంసిద్ధమయి ఉండాలన్నది మౌలికమయిన అవసరమని భావించబడుతోంది. పత్రి దేశం తన స్థానంలో విధ్వశకర శక్తిగా రూపొందాలని కాంక్షిస్తున్న తరుణంలో లోకశాంతి మాట ఒక సమాధానం లేని ప్రశ్నగానే మిగిలి పోతోంది. మున్ముందు పరిస్థి మరింత దారుణంగా తయారవుతుందన్న భయమూ కలుగుతోంది. ఏది ఏమయినా మనవంతు కృషిగా శాంతి సుస్థిరతల కోసం మన పయ్రత్నం మనం చేస్తూనే ఉండాలి. విశ్వశాంతి, పజ్రా శేయ్రాన్ని కాంక్షిస్తూ ఉండాలి. ‘సర్వేజనా సుఖినోవంతు’ వంటి వాతావరణం నెలకొనాలని ఆ విశ్వ పభ్రువును అవిశ్రాంతంగా వేడుకుంటూనే ఆయన చూపిన పరిష్కార మార్గంలో నడిచేందుకు, మానవాళిని నడిపించేందుకు అవిరళంగా పరిశ్రమిస్తూనే ఉండాలి.

Related Post